హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాట్ తగ్గింపు నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి వ్యాపార సంస్థలను ఆకర్షిస్తుందని ఏజీఅండ్‌పీ ప్రథమ్ ఎండీ, సీఈవో అభిలేశ్ గుప్తా తెలిపారు. ఇది తయారీ వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, ఏపీ ఆధారిత కంపెనీలు ఇతర రా ష్ట్రాల్లోని తయారీదారులతో పోటీపడేలా చేస్తుందని అన్నారు.
రాష్ట్రం స్థిర అభివృద్ధిలో సరికొత్త మార్గాన్ని రూపొందించడానికి, సహజ వాయువు ఆధారిత పారిశ్రామిక వృద్ధిలో కొత్త యుగానికి నాంది పలికేందుకు మార్గం సుగమం చేస్తుందని వివరించారు. పారిశ్రామికాభివృద్ధి, వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు. సీఎన్‌జీ, పై ప్డ్ నేచురల్ గ్యాస్ సేవల్లో ఉన్న ఏజీఅండ్‌పీ ప్రథమ్‌కు ఏపీలో 50కిపైగా సీఎన్‌జీ స్టేషన్లు ఉన్నా యి. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌పై (సీఎన్‌జీ) ఏప్రిల్ 1 నుంచి విలువ ఆధారిత పన్నును (వ్యాట్) 24.5 నుంచి 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment