Vatal Nagaraj
-
వివాదంపై స్పందించిన రాజమౌళి
చెన్నై: కన్నడిగులపై తమిళ నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కర్ణాటకలో బాహుబలి-2 సినిమాను అడ్డుకుంటామని ప్రకటించడంపై దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. ఈ వివాదాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకురావడం సమంజసం కాదని 'ఇండియాటుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 'దాదాపు ఐదేళ్లుగా సత్యరాజ్ తో కలిసి పనిచేస్తున్నా. ఇతరులను బాధ పెట్టేవిధంగా ఆయన నడుచుకోవడం నేనింతవరకు చూడలేదు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన వీడియోల గురించి విచారించాం. అవి తొమ్మిదేళ్ల క్రితం నాటివని తెలిసింది. దీని తర్వాత ఆయన నటించిన 30 సినిమాలు కర్ణాటకలో విడుదలయ్యాయి. బాహుబలి: ది బిగినింగ్ కూడా అందులో ఒకటి. అప్పుడు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ సమయంలో వివాదం చేయడం కరెక్ట్ కాద'ని రాజమౌళి అన్నారు. దగ్గుబాటి రానా మాట్లాడుతూ... 'సత్యరాజ్ 10 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలవి. బాహుబలి మొదటి భాగం కర్ణాటకలో కూడా విడుదలై అందరి అభిమానాన్ని సంపాదించింది. ఘన విజయాన్ని అందుకుంది. వివాదాన్ని మళ్లీ తెరపైకి ప్రచారం పొందాలని కొందరు భావిస్తున్నార'ని అన్నారు. కావేరి నదీ జలాల వివాదం నేపథ్యంలో కన్నడిగులపై సత్యరాజ్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని, ఆయన క్షమాపణ చెప్పేవరకు బాహుబలి-2 సినిమాను విడుదలకానీయబోమని వటల్ నాగరాజ్ అనే కార్యకర్త హెచ్చరించారు. -
గాడిదలకు అవార్డులు!
బెంగళూరు: కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విభిన్న రంగాల్లో విశేష ప్రతిభా పాటవాలను కనబరిచిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చే అవార్డులను సైతం రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అందజేస్తున్నారని వాటాళ్ పార్టీ అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ ఆరోపిస్తూన్నారు. అవార్డుల ప్రకటన విషయంలో ప్రభుత్వ వైఖరికి ఆయన వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వాటాళ్ నాగరాజ్ గాడిదలకు అవార్డులను అందజేసి తన నిరసనను తెలియజేశారు. -
కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటు తగదు
కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం సాక్షి, బెంగళూరు: కావేరీ నీటి పంపిణీ విషయమై నిర్వహణా మండలి ఏర్పాటు చేయాలనే కేంద్రం నిర్ణయంపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. నీటి నిర్వహణ మండలిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెబుతూ కన్నడ చళువళి వాటాల్ పార్టీ అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ ఆధ్వర్యంలో రాజ్‌కుమార్ అభిమానుల సంఘం అధ్యక్షుడు సా.రా.గోవిందు తదితరులు శనివారం ఆందోళన నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. వాటాళ్ నాగరాజు మాట్లాడుతూతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒత్తిళ్లకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తలొగ్గడం సమంజసంగా లేదని విమర్శించారు. నీటి నిర్వహణా మండలి ఏర్పాటైతే కావేరితో పాటు రాష్ట్రంలోని ఇతర జలాశయాలు కూడా మండలి పరిధిలోకి వెళ్తాయని, తద్వారా కర్ణాటకకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వేళ కేంద్రం నీటి నిర్వహణ మండలి ఏర్పాటుకు ముందుకు వెళ్తే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులందరూ రాజీనామాలు చేసి కన్నడ సంస్థల ఆధ్వర్యంలో కర్ణాటక బంద్, జైల్ భరో వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నీటి ని ర్వహణా మండలి ఏర్పాటు చేయకుండా నరేంద్ర మోడీపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అఖిల పక్ష సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయిం చడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.