Vedha Nilayam
-
వేదనిలయంలోకి దీపక్
సాక్షి, చెన్నై: పోయెస్‌గార్డెన్‌లోని దివంగత సీఎం జయలలిత నివాసం వేద నిలయంలోకి వెళ్లేందుకు ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్ మంగళవారం ప్రయత్నించారు. ఆయన్ను అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. చివరకు పక్కనే ఉన్న మరో భవనంలోకి వెళ్లి కాసేపు కూర్చుని బయటకు వచ్చేశారు. పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత నివాసం వేదనిలయంను స్మారకమందిరంగా మార్నేందుకు ప్రభుత్వం కసరత్తుల వేగాన్ని పెంచిన విషయం తెలిసిందే. ఇందు కోసం సీఎం నేతృత్వంలో ఓ ట్రస్ట్ సైతం ఏర్పడింది. అదే సమయంలో జయలలిత ఆస్తులకు ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్, కుమార్తె దీప వారసులుగా కోర్టు ప్రకటించింది. దీంతో వేదనిలయంపై తమకు హక్కులు ఉన్నట్టు దీప, దీపక్ పేర్కొంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం మధ్యాహ్నం దీపక్ హఠాత్తుగా పోయెస్గార్డెన్లోకి వచ్చారు. అక్కడి వేదనిలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే, పోలీసులు ఆయన్ను లోనికి అనుమతించలేదు. చివరకు తన వద్ద కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, లోనికి అనుమతించాలని పట్టుబట్టారు. అయితే, పోలీసులు ఏ మాత్రం తగ్గలేదు. ఆ ఉత్తర్వుల కాపీని పరిశీలించి మౌనంగానే ఉండిపోయారు. లోనికి ఎవర్నీ అనుమతించే అధికారం తమకు లేదని భద్రతా సిబ్బంది స్పష్టం చేశారు. అర్థం చేసుకోవాలని దీపక్‌కు సూచించారు. చివరకు వేదనిలయం పక్కనే ఉన్న పాత కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు పోలీసులు అంగీకరించడంతో కాసేపులోపల కూర్చుని బయటకు దీపక్ వచ్చేశారు. అనంతరం కారులో ఆయన వెళ్లిపోయారు. జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే చరిత్రలో నిలిచిపోయేలా 'అమ్మ' స్మారకం -
వారిద్దరూ అమ్మ వారసులే
సాక్షి చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివాదం కోర్టు తీర్పుతో ఒక కొలిక్కి వచ్చింది. కొంత ప్రభుత్వానికి మిగిలినది జయ అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్‌కు చెందేలా బుధవారం తీర్పు చెప్పింది. ఈ పంపకాలపై 8 వారాల్లోగా బదులు పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత తమిళనాడు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. పలుసార్లు అన్నాడీఎంకేను అధికారపీఠంలో కూర్చొనబెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అదే స్థాయిలో భారీ ఎత్తున ఆస్తులను సైతం కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనధికారికంగా వేలాది కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జయలలితకు చెన్నై పోయెస్‌గార్డెన్‌లో బంగ్లా, కొడైకెనాల్లో ఎస్టేట్, హైదరాబాద్‌లో ద్రాక్షతోట రూ.913 కోట్ల విలువైన ఆస్తులున్నాయని అధికారిక సమాచారం. (రక్త సంబంధీకులు వారసులు కారా? ) 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది నెలల్లోనే ఆమె అస్వస్థకు గురై అనూహ్యమైన రీతిలో అదే ఏడాది డిసెంబర్ 5నఅకస్మాత్తుగా కన్నుమూశారు. వివాహం చేసుకోకుండా ఆధ్యంతం కుమారిగానే జీవించినందున ఆమె కూడబెట్టిన కోట్లాది రూపాయల ఆస్తులకు వారసులు ఎవరనే అంశంపై పెద్ద చర్చనీయాంశమైంది. జయ మరణించిన తరువాత ఆదాయపు పన్నుశాఖాధికారులు జయ నివాసం పోయెగార్డెన్‌లో తనిఖీలు చేసినపుడు ఆస్తి పంపకాలు చేసినట్లు ఎలాంటి పత్రాలు దొరకలేదు. జయ రక్త సంబం«దీకులుగా ఆమె అన్న జయకుమార్ కుమార్తె దీప, కుమారుడు దీపక్ మాత్రమే ఉన్నారు. అయితే జయతో వారికి సత్సంబంధాలు, పోయెస్‌గార్డెన్ ఇంటికి రాకపోకలు లేనందున ఆస్తులు వివాదంలో చిక్కుకున్నాయి. జయ ఆస్తికి, రాజకీయాలకు సైతం తామే వారసులమని దీప గళమెత్తినా చట్టబద్ధత లేకుండా పోయింది. పోయెగార్డెన్‌లో ఇంటిని జయస్మారక మందిరంగా మార్చాలని అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (స్మారక మందిరంగా జయలలిత నివాసం) అత్త (జయలలిత) ఆస్తులపై ఏకపక్ష నిర్ణయం తీసుకునే అధికారం అన్నాడీఎంకే ప్రభుత్వానికి లేదని దీప అభ్యంతరం పలికింది. జయ ఆస్తులపై తమకు తెలియకుండా ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు వీల్లేదని గట్టిగా అడ్డుతగిలింది. ఈ పరిస్థితిలో జయ ఆస్తుల పర్యవేక్షణకు ప్రయివేటు నిర్వాహకుడిని నియమించాల్సిందిగా కోరుతూ అన్నాడీఎంకే నేత పుహళేంది, జానకిరామన్ అనే మరో వ్యక్తి మద్రాసు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. జయలలిత అన్న కుమారుడు దీపక్, కుమార్తె దీపను ఈ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. జయ చట్టపూర్వక వారసులమైన తమను నిర్వాహకులుగా నియమించాలని వారిద్దరూ కోర్టుకు విన్నవించుకున్నారు. జయ ఆస్తిపన్ను బకాయి ఉన్నారంటూ ఆదాయపు పన్నుశాఖ కొంత ఆస్తిని గతంలోనే జప్తుచేసి ఉంది. చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసం ‘వేద నిలయం’ను జయ స్మారకమందిరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అత్యవసర చట్టం తీసుకొచ్చింది. జయ ఆస్తులపై దాఖలైన పిటిషన్లపై వాదోపవాదాలు ముగియగా తీర్పు తేదీని ప్రకటించకుండా న్యాయమూర్తులు ఈ కేసును వాయిదావేశారు. జయ ఆస్తులపై సిఫార్సులతో తీర్పు: ఇదిలా ఉండగా, జయలలిత ఆస్తుల వివాదానికి సంబంధించి కొన్ని సిఫార్సులతో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు కృపాకరన్, అబ్దుల్ ఖుద్దూస్ బుధవారం తీర్పును ప్రకటించారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘పోయెస్‌గార్డెన్‌లోని ఇంటినంతా స్మారకమండపంగా మార్చాల్సిన అవసరం లేదు, కొంతభాగాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్‌గా చేయవచ్చు. ఈ సిఫార్సులను ప్రభుత్వం పరిశీలించి స్మారక మండపంపై నిర్ణయం తీసుకోవాలి. ప్రయివేటు ఆస్తుల కొనుగోలుపై ప్రజల హృదయాల్లో అనేక సందేహాలుంటాయి. అందుకే జయ ఆస్తుల నిర్వహణకు ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలి. ఆ ట్రస్ట్‌లో దీప, దీపక్‌లను సభ్యులుగా చేర్చాలి. వీరిద్దరికీ ప్రభుత్వం 24 గంటలపాటూ సాయుధ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలి. జయ ఆస్తుల్లోని కొంత భాగాన్ని అమ్మివేసి ఆ సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేయాలి. డిపాజిట్‌పై వచ్చే ఆదాయం నుంచి దీప, దీపక్లకయ్యే పోలీసు బందోబస్తు ఖర్చుకు వినియోగించాలి. రెండో తరం వారసులుగా జయ అన్న కుమార్తె, కుమారునికి జయ ఆస్తిపై హక్కు ఉంటుంది. ఈ సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని 8 వారాల్లోగా కోర్టులో బదులు పిటిషన్ దాఖలు చేయాల’ని వారు తీర్పులో పేర్కొన్నారు. జయ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తూ నిర్వాహక అధికారిని నియమించుకునే అవకాశాన్ని కలి్పంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు కొట్టివేశారు. అన్నింటికి వారసులం: దీప దివంగత సీఎం, తన మేనత్త ఆస్తులకే కాదు ఆమె ఆశయాలు, లక్ష్యాలకు వారసులం తాను, తన సోదరుడు దీపక్ అని దీప వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మీడియా ముందుకు బుధవారం సాయంత్రం దీప వచ్చారు. కోర్టు ఇచ్చిన సూచనల్లో తమను వారసులుగా పేర్కొనడం ఆనందంగా ఉందన్నారు. తాను, తన సోదరుడు ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామని తెలిపారు. పారంపర్య ఆస్తులే కాదు, మేనత్త ఆస్తులకు తామిద్దరం వారసులమని, ఆమె ఆశయ సాధన, లక్ష్యాల్లోను వారసులంగా ఉంటామన్నారు. -
రక్త సంబంధీకులు వారసులు కారా?
సాక్షి, చెన్నై : వేద నిలయాన్ని స్మారక మందిరంగా మారుస్తూ తీసుకొచ్చిన ప్రత్యేక చట్టాన్ని దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీప తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ఇంటిని కబ్జాచేయడమే కాదు, అందులో ఉన్న వస్తువుల్ని కొల్లగొట్టేందుకు అన్నాడీఎంకే పాలకులు సిద్ధమయ్యారని ఆరోపించారు. పోయెస్‌గార్డెన్‌లోని దివంగత సీఎం జయలలితకు చెందిన వేదనిలయాన్ని స్మారక మందిరంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పనులకు గాను సీఎం నేతృత్వంలో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. గవర్నర్ ఆమోదంతో ఈ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ఆగమేఘాలపై చట్టం ఏంటి? ఈ పరిస్థితుల్లో జయలలిత మేన కోడలు దీప ఆదివారం ఆడియో రూపంలో స్పందించారు. జయలలితతో తనది రక్త సంబంధం అన్న విషయాన్ని ఈ పాలకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఆమెకు తాను మేన కోడలు అని, మేనత్త మరణంతో తాను రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. అయితే, రాజకీయ కుట్రలు, వెన్నంటి ఉన్న వారి రూపంలో అందులో నుంచి బయటకు రాక తప్పలేదన్నారు. ప్రస్తుతం కరోనా తాండవం రాష్ట్రంలో మరీ ఎక్కువగా ఉందని గుర్తు చేస్తూ, ఈ సమయంలో ఆగమేఘాల మీద తన మేనత్త ఇంటిని కబ్జా చేయడానికి చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఈ పాలకులకు ఎందుకు వచ్చినట్టు అని ప్రశ్నించారు. కేవలం వేద నిలయాన్ని కబ్జా చేయడం, అక్కడున్న అన్ని రకాల వస్తువుల్ని అపహరించడం, కొల్లగొట్టడం లక్ష్యంగా ఈ పాలకుల చర్యలు ఉన్నాయని ఆరోపించారు. జయలలిత ఆస్తులకు ఎవరైనా వారసులు అని నిరూపించుకుని రానివ్వండి తదుపరి చూసుకుందామని న్యాయ మంత్రి సీవీ షణ్ముగం ఓ వ్యాఖ్య చేశారని గుర్తు చేశారు. రక్త సంబంధీకులు వారసులు కాలేరా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన మేనత్త మరణం గురించిన వివరాల్ని నిగ్గు తేల్చలేని పరిస్థితుల్లో ఈ పాలకులు ఉన్నారని ధ్వజమెత్తారు. చనిపోయిన తన మేనత్తను మళ్లీ తీసుకు రాగలరా అని ప్రశ్నిస్తూ, వేదనిలయం తమ పూర్వీకుల సొత్తు అని దాని జోలికి వెళ్లడం మంచిది కాదని హెచ్చరించారు. -
జయలలిత ఇల్లు ఇప్పుడు ఎలా మారబోతోంది?
తమిళనాట రాజకీయాల్లో ధీరవనితగా నిలిచి అసువులు బాసిన జయలలితకు అమ్మంటే అమితమైన ప్రేమ. ఆ ప్రేమతో తల్లి వేదవల్లి పేరుని తన ఇంటికి పెట్టుకున్నారు. చెన్నై నడిమధ్యన పోయస్ గార్డెన్లో ఉండే తన నివాసాన్ని వేదనిలయంగా మార్చారు. అయితే జయలలిత మరణ అనంతరం ఈ ఇల్లు ఎవరికి చెందుతుందా? అని పలువాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఇంటికి తామెంటే తాము వారసులమని కొంతమంది లైన్లోకి వస్తున్నారు. దీంతో పోయస్ గార్డెన్‌లోని వేదనిలయాన్ని జయలలిత స్మారకమందిరంగా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ నిలయాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని జయలలిత స్మారకమందిరంగా మార్చేందుకే టీఎన్‌సీసీ(తమిళనాడు కాంగ్రెస్ కమిటీ) కూడా మొగ్గుచూపింది. జయలలిత వాడిన వస్తువులను ప్రజలు తిలకించేందుకు అనుమతి ఇవ్వాలని కూడా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఎస్. తిరునవుక్కరసర్ కోరారు. జయలలిత అనారోగ్య వార్త, మరణ వార్త విని 77 మంది మృతిచెందారని ఆయన చెప్పారు. వారందరికీ ఆయన సంతాపం తెలిపారు. పుదేచ్చెరిలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న అన్నాడీఎంకే, ఈ కేంద్రపాలిత ప్రాంతంలో జయలలిత జీవిత కాల సైజులో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వి. నారాయణస్వామికి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి కేబినెట్ భేటీ కానున్నట్టు నారాయణస్వామి చెప్పినట్టు అన్నాడీఎంకే వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం జయలలిత నివాసంలో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమె స్నేహితురాలు శశికళ, ఆమె బంధువులు నివసిస్తున్నారు.