vennapusa ravindra reddy
-
కూటమి పాలనలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల దుర్వినియోగం’
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో యథేచ్ఛగా ఎన్ఆర్ఈజీఎస్ నిధుల దుర్వినియోగం జరుగుతోందని, గ్రామాల్లో సర్పంచ్ల తీర్మానం లేకుండానే పనులకు ఆమోదం లభిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆక్షేపించారు.ఎన్ఆర్ఈజీఎస్ నిధులను కూటమి పార్టీ నేతలు తమ సొంత నిర్మాణాలకు వాడుకుంటున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆరోపించారు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు వేసినట్లు చెప్పారు. కూటమి నేతలకు దమ్ముంటే, ఉపాధి హామీ నిధుల వినియోగంపై చర్చకు రావాలని రవీంద్రారెడ్డి సవాల్ చేశారు.వెన్నపూస రవీంద్రారెడ్డి ఇంకా ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం తన ఏడు నెలల పాలనలో రాష్ట్రానికి గుండెకాయ లాంటి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించి గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఎంపీపీకి పంపితే, వారు జిల్లా పరిషత్‌కి పంపితే జిల్లా పరిషత్ అధికారులు కలెక్టర్‌కు పంపడం అనేది నిబంధన. కానీ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి అధికార పార్టీ ఎమ్మల్యేలు చెప్పిన వారికే పనులు కేటాయిస్తున్నారు. చివరకు ఉపాధి హమీ పథకంలో పని చేసే దాదాపు 12 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను తెచ్చుకుంటున్నారు.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రతి పంచాయతీకి రూ.10 వేలు ఇస్తామని ఆర్బాటంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, ఒక్క పంచాయతీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌కు కూడా రూ.1800 కోట్లు ఇస్తే, అది వారి ఘనత అన్నట్లు సీఎం, డిప్యూటీ సీఎం నిసిగ్గుగా ప్రచారం చేసుకున్నారు. వారికి నిజంగా గ్రామాల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధుల్లో అదనంగా ఒక్క రూపాయైనా తెచ్చారా?ఇదీ చదవండి: ఇదీ వాస్తవం.. గణాంకాలతో సహా వివరించిన మార్గాని భరత్ గ్రామాల్లో సర్పంచ్ల తీర్మానం లేకుండా ఎమ్మెల్యేల సిఫార్సులతో ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. అలా స్థానిక సంస్థల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల విషయంలో తమ వైఖరి ఏమిటో ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాలి.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ప్రతి గ్రామంలో దాదాపు రూ.2 కోట్ల వరకు వెచ్చించి సచివాయాలు, హెల్త్ సెంటర్లు, ఆర్బీకేలు, మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టడం జరిగింది. అలా గ్రామాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించి సంపద సృష్టించాం. టీడీపీ కూటమి పాలనలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల దుర్వినియోగంపై మూడు జిల్లాల పరిధిలో జరిగిన పనులకు సంబంధించి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాం’’ అని వెన్నపూస రవీంద్రారెడ్డి వివరించారు. -
'ఓట్ల లెక్కింపులో అక్రమాలు చూపినా ఆర్ఓ పట్టించుకోలేదు'
అనంతపురం క్రైం: ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, వాటిని సాక్ష్యాలతో సహా చూపించినా రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ), కలెక్టర్ నాగలక్ష్మి పట్టించుకోలేదని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావడం దేనికి సంకేతం అని ప్రశి్నంచారు. పైగా వారు తమకు పడ్డ ఓట్లను సైతం తగ్గించి చూపించారని మండిపడ్డారు. ఆదివారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రంలో కళ్ల ముందు జరిగిన అన్యాయాన్ని చూసి చాలా బాధేసిందన్నారు. ‘కౌంటింగ్ నిర్వహణలో కలెక్టర్, ఎస్పీ పూర్తిగా వైఫల్యం చెందారు. టీడీపీకి అనైతికంగా మద్దతుగా నిలి్చన వీరిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, టీడీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ ప్రొద్దుటూరు ఇన్చార్జ్ ప్రవీణ్, కమలాపురం ఇన్చార్జ్ నరసింహారెడ్డి, పులివెందులకు చెందిన పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆలం నరసానాయుడు, వడ్డే మురళీ, సరిపూటి రమణ.. ఇలా పది మందికిపైగా టీడీపీ ముఖ్య నేతలు ఏజెంట్లుగా కూర్చున్నప్పటికీ ఆర్ఓ పట్టించుకోలేదు. వీరు కౌంటింగ్ హాల్లోని ప్రతి టేబుల్ వద్దకు వెళ్లి ప్రభావం చూపేలా వ్యవహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కౌంటింగ్ హాలులో పదుల సంఖ్యలో, పరిసర ప్రాంతాల్లో వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తిష్ట వేసినా ఎస్పీ ఫక్కీరప్ప ప్రేక్షక పాత్ర పోషించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ► మాజీ సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే కలెక్టర్ నాగలక్షి్మ, ఎస్పీ ఫక్కీరప్పలు ఏవిధంగా మాట్లాడారు? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయాన్ని మరచిపోయారా? ► కౌంటింగ్ హాల్లో టేబుల్ నంబర్ 19లో ఓ అధికారి టీడీపీ అభ్యర్థివి 44, మా పార్టీవి ఆరు ఓట్లు కట్టకట్టి ఒకే దానిలో వేశారు. దీనిపై మా ఏజెంట్ ఫిర్యాదు చేయగా అసలు నిజం వెలుగు చూసింది. ► అదే అధికారి 3, 4, 5 రౌండ్లలోనూ ఉన్నాడని ఫిర్యాదు చేస్తే తనకేం సంబంధం లేదని రిటర్నింగ్ అధికారి చెప్పడమేంటి? అక్రమాలు జరిగినప్పుడు విచారణ చేయకపోతే ఆర్ఓగా ఎందుకున్నట్లు? మరో అధికారి.. తమవి 70 ఓట్లు ఉంటే ఆ కట్టపై 50 అని రాశారు. టీడీపీవి 30 ఉంటే 50 అని నమోదు చేశారు. ► ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు గల్లంతైనట్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్ పట్టించుకోలేదు. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో నైతిక విజయం మాదే. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. చదవండి: ‘స్కిల్’ సూత్రధారి బాబే -
‘ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్సీపీదే’
సాక్షి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. రీకౌంటింగ్ చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. కౌంటింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్ ఓట్లు టీడీపీ ఖాతాలో వేశారని నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘాలనికి వైఎస్సార్సీపీ లేఖ రాసింది. ఈ సందర్బంగా వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్సీపీదే. కౌంటింగ్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తాం. ఓట్ల తారుమారుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. తొలి రెండు రౌండ్లు నాకు మోజారిటీ వచ్చింది. ఇండిపెండెంట్ అభ్యర్థి తరఫున టీడీపీ సీనియర్ నేతలు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండటం అనైతికం. వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్ ఓట్లు టీడీపీ ఖాతాలో వేశారు. ఈ సందర్బంగా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పందన రాలేదు. 10 రౌండ్లలో మాకు మెజార్టీ వచ్చిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య మాట్లాడుతూ.. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయి. వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్ ఓట్లు టీడీపీ ఖాతాలో వేశారని పదేపదే ఫిర్యాదు చేసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు. కౌంటింగ్ కేంద్రంలో జరిగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు. వైఎస్సార్సీపీ ఓట్లను టీడీపీ ఖాతాలో జమ చేసినా అధికారులు పట్టించుకోలేదు. వెంటనే రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసిన రవీంద్రా రెడ్డి
-
ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తా: వెన్నపూస రవి
-
Graduates MLC: పట్టం కట్టేదెవరికి.. పాఠం కలిసొచ్చేదెవరికి?
రాయలసీమ పశ్చిమ నియోజకవర్గానికి జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టంలో తొలి అంకం ముగిసింది. గత నెల 30న తుది ఓటరు జాబితా ఖరారైంది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రధాన పారీ్టలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థులతో పాటు ఆశావహులు ప్రచారపర్వంపై దృష్టి సారించారు. ఆరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ఓటర్లతో సమావేశమవుతున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. – సాక్షి ప్రతినిధి కర్నూలు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, కత్తి నరసింహారెడ్డిల పదవీకాలం మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వీటి భర్తీకి ఉపక్రమించింది. ఇప్పటికే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులు వెన్నపూస రవీంద్రారెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులు విస్తృత ప్రచారంలో తలమునకలవుతున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులతో.. యూనియన్ల వారీగా, శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కోరుతున్నారు. పట్టభద్రుల కోటాలో 3,28,807 ఓట్లు నమోదయ్యాయి. గత ఎన్నికల్లో 2.52లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే గతంతో పోలిస్తే 76వేల ఓట్లు అధికం. పెరిగిన ఓట్లు ప్రభుత్వ పనితీరును, గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులపై ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులతో పాటు ‘అనంత’ నుంచి పోటీ చేస్తోన్న బీసీ నాగరాజు మధ్య ప్రధాన పోటీ ఉండే అకాశం ఉంది. వీరితో పాటు బోరంపల్లి ఆంజనేయులు, గైబున్నీసా, బోయ నాగరాజు, పట్టుపోగుల పవన్ కుమార్‌తో పాటు పలువురు పోటీలో ఉన్నా, పోటీ మాత్రం ఆ ముగ్గురి మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది. వెన్నపూస రవీంద్రారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు తనయుడు కావడం సానుకూలాంశం. రాంగోపాల్‌రెడ్డి పులివెందుల నియోజవకర్గ వాసి. ఎవ్వరికీ తెలియని వ్యక్తి! రవీంద్రారెడ్డి అభ్యరి్థత్వాన్ని ఆరు జిల్లాలలోని 26మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇన్చార్జీలు ఏకగ్రీవంగా సమర్థించారు. బాధ్యత తీసుకుని గెలుపునకు కృషి చేస్తున్నారు. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల ఓడిపోయామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘోర పరాభావం తప్పదని, పోటీ వద్దని టీడీపీ ఇన్చార్జీలు భావించారు. గత ఎన్నికల్లో ప్రతిపక్ష పారీ్టగా వైఎస్సార్సీపీ ఉండి ఎమ్మెల్సీ గెలిచిందని, ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండి కనీసం పోటీ చేయకుంటే ఆ ప్రభావం కేడర్‌పై బలంగా పడుతుందని నామమాత్రపు పోటీకి సిద్ధమైంది. పోటీకి అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో రాంగోపాల్‌రెడ్డిని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో తెలిసిందే. అక్కడ టీడీపీకి ఎలాంటి విజయాలు లేవు. అలాంటి నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నిలపడం చూస్తే ఈ ఎన్నికలను టీడీపీ ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థమవుతోంది. రవీంద్రారెడ్డి 28 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి తరచూ సమావేశాలు నిర్వహించి ఓటర్లను కలుస్తున్నారు. రాంగోపాల్‌రెడ్డి చంద్రబాబు పర్యటనలో మినహా ఎక్కడా కనిపించని పరిస్థితి. వైఎస్సార్సీపీ అభ్యర్థికి అనుకూల అంశాలు ►సచివాలయాల ఏర్పాటుతో వేలాది నిరుద్యోగులకు సర్కారు కొలువులు. ►ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు పర్మనెంట్ చేయడం. ►పోలీస్రిక్రూట్మెంట్ ద్వారా 6,900 పైగా ఉద్యోగాల భర్తీకి చర్యలు. ►అభ్యర్థుల వినతి మేరకు వయస్సు సడలింపు నిర్ణయం. ►న్యాయశాఖ పరిధిలో 3వేలకుపైగా ఉద్యోగాల భర్తీ ►గ్రూప్–1 నోటిఫికేషన్‌కు చర్యలు. ►వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీలన్నీ భర్తీకి నిర్ణయం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలోనూ త్రిముఖ పోరే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో 27,716 ఓట్లు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఈ ఓట్లు కూడా పెరిగాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డితో పాటు బీజేపీ నేత ఒంటేరు శ్రీనివాసరెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు పోటీ చేస్తున్నారు. కత్తి, ఒంటేరు, రామచంద్రారెడ్డి మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. కత్తి ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘానికి చెందిన వ్యక్తి. ఉపాధ్యాయ ఎన్నికల్లో యూనియన్లు ప్రధానపాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక్కడ అభ్యర్థి గెలుపోటములను యూనియన్లే ప్రభావితం చేయనున్నాయి. దీంతో అభ్యర్థులంతా యూనియన్ల నేతలు, సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం
సాక్షిప్రతినిధి కర్నూలు: రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం నుంచి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, టీడీపీ ప్రకటించాయి. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి తనయుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ తరఫున భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి బరిలో నిలవనున్నారు. వామపక్షపార్టీలు శనివారం తమ అభ్యర్థిని ప్రకటించనున్నాయి. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా మరికొందరు పోటీ చేయనున్నారు. వీరంతా ఇప్పటికే మూడు జిల్లాలలోని ఎమ్మెల్యేలు, కీలక నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. ప్రత్యేక సమావేశాలు రాయలసీమ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి కొనసాగుతున్నారు. 2023 మార్చికి ఈయన పదవీకాలం ముగుస్తుంది. ఈ క్రమంలో ఈ స్థానం భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేయనుంది. నోటిఫికేషన్ తర్వాత ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఆపై ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన రాజకీయపార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులు ఖరారైన వారితో పాటు బరిలో నిలవాలనుకుంటున్న స్వతంత్రులు కర్నూలుతో పాటు అనంతపురం, వైఎస్సార్ జిల్లాలలో జోరుగా తిరుగుతున్నారు. ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇతర ఉద్యోగులతో కూడా యూనియన్ల వారీగా, శాఖల వారీగా కలిసి మద్దతు కోరుతున్నారు. నామమాత్రపు పోటీ టీడీపీ తరఫున బరిలో దిగుతున్న రామగోపాల్‌రెడ్డి పులివెందుల నియోజకవర్గవాసి. ద్వితీయశ్రేణి నాయకుడు కావడంతో మూడు జిల్లాల్లో ఎవ్వరికీ పరిచయం లేదు. పైగా మూడు జిల్లాలలోని 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వైఎస్సార్ జిల్లాతో పాటు కర్నూలులోనూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరు. కేవలం హిందూపురం, ఉరవకొండలో మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా ఉంటుంది. టీడీపీ తరఫున బరిలో ఉన్నా పెద్ద ప్రభావం ఉండకపోవచ్చని, వైఎస్సార్సీపీ అభ్యర్థికే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పోటీలో సీపీఐ, సీపీఎం అభ్యర్థులు సీపీఐ తరఫున వైఎస్సార్ జిల్లా నుంచి ఈశ్వరయ్య బరిలోకి దిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కూడా ఈయన పోటీ చేసి ఓడిపోయారు. ఈ దఫా కూడా బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారు. అలాగే సీపీఎం తరఫున అనంతపురం నుంచి రాంభూపాల్‌రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నెల 23న సీపీఎం దీనిపై సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనుంది. గత ఎన్నికల్లో సీపీఎం తరఫున గేయానంద్ పోటీ చేశారు. అనారోగ్య కారణాలతో ఈయన ఈ దఫా బరిలో ఉండటం లేదు. ఈ క్రమంలోనే రాంభూపాల్‌ను బరిలోకి దింపేయోచనలో ఆపార్టీ ఉంది. ముఖ్య నేతలతో మంతనాలు రవీంద్రారెడ్డితో పాటు రామగోపాల్‌రెడ్డి ఇప్పటికే రాయలసీమలోని ముఖ్య నేతలను కలిశారు. మూడు జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలను రవీంద్రారెడ్డి స్వయంగా కలిసి మద్దతు కోరారు. ఉపాధ్యాయులు, ఎన్జీవో సంఘాలతో కూడా రవి కలిశారు. వీరంతా రవికి సానుకూలంగా స్పందించారు. అలాగే రామగోపాల్‌రెడ్డి టీడీపీ ఇన్‌చార్జ్‌లను కలిశారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి బాగోలేదని, పోటీ వద్దన్నా పార్టీ వినలేదని, పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీకి దూరంగా ఉంటే గౌరవంగా ఉంటుందని వైఎస్సార్ జిల్లాలోని ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు రామగోపాల్రెడ్డితోనే అన్నారు. దీన్నిబట్టే టీడీపీ నేతలు ఈ ఎన్నికల్లో ఏమేరకు పనిచేస్తారు? ఎలాంటి ప్రభావం ఉండబోతోందనేది ఇట్టే తెలుస్తోంది. గెలుపు నల్లేరుమీద నడకే! వెన్నపూస రవీంద్రారెడ్డి, రామగోపాల్‌రెడ్డి వైఎస్సార్సీపీ, టీడీపీ తరఫున బరిలో నిలవనున్నారు. అలాగే అనంతపురం జిల్లా నుంచి పోతుల నాగరాజు, బోరంపల్లి ఆంజనేయులు, వైఎస్సార్ జిల్లా నుంచి బ్లడ్ టూ లివ్ వ్యవస్థాపకుడు పట్టుపోగుల పవన్‌కుమార్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వెన్నపూస రవీంద్రారెడ్డి అనంతపురం జిల్లా వాసి కాగా, భూమిరెడ్డి వైఎస్సార్ జిల్లాకు చెందిన వారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కావడం వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రధాన బలంగా ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆపై జరిగిన స్థానిక, పుర పోరులో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ప్రజల్లో ఆపార్టీకి ఉన్న ఆదరణతో అలాంటి ఫలితాలు వచ్చాయి. పైగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి చరిత్రలో ఎన్నడూ లేనవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 1.35 లక్షల ఉద్యోగాలు కల్పించింది. వేలాదిమంది పట్టభద్రులు ప్రభుత్వ కొలువులు సాధించి, జీవితాల్లో స్థిరపడ్డారు. ప్రొబిషన్ పూర్తయిన ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. మూడు జిల్లాలలో 30 వేలమంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వానికి సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. వెన్నపూస రవీంద్రారెడ్డి తండ్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఉద్యోగుల కోసం సుదీర్ఘంగా పోరాడిన వ్యక్తి. రాయలసీమలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రవీంద్రారెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం నల్లేరుమీద నడకే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పెరగనున్న ఓటర్ల సంఖ్య గత ఎన్నికల్లో పట్టభద్రుల కోటాలో 2.53 లక్షలమంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఓటు హక్కు, నమోదుపై పట్టభద్రుల్లో మరింత చైతన్యం పెరగడమే ఇందుకు కారణం. మూడు జిల్లాల్లో 90 వేలకు తక్కువ లేకుండా కొత్త ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. -
స్థానిక సంస్థలు నిర్వీర్యం
- బడ్జెట్లో తీవ్ర అన్యాయం - జెడ్పీ ప్రతిపక్ష నేత వెన్నపూస రవీంద్రరెడ్డి అనంతపురం : రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత వెన్నపూస రవీంద్రరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపుల్లో స్థానిక సంస్థలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. జిల్లాకు వచ్చే రూ.9 కోట్లు ఏ మాత్రం చాలవన్నారు. జిల్లాలో జెడ్పీ కింద ఐదారు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయని, ఈ నిధులు వాటి నిర్వహణకే సరిపోవన్నారు. మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అనంత లాంటి కరువు జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన విషయాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. జెడ్పీకి నిధులు కేటాయించాలని 8 సార్లు తీర్మానాలు చేసినా పట్టించుకోలేదన్నారు. నిధుల లేమితో కనీసం సమావేశంలో తాగునీటి బాటిళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మూడేళ్లుగా నిధులు కేటాయించకుండా జెడ్పీటీసీ, ఎంపీసీటీలను నిర్వీర్యం చేసిందన్నారు. అలాంటప్పుడు ఈ వ్యవస్థలను కొనసాగించడం కన్నా రద్దు చేస్తేనే బాగుంటుందన్నారు. అనంతపురం మండల ఎంపీటీసీ ఫ్లోర్ లీడర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, దీపక్‌రెడ్డి కనీసం గొంతు విప్పడం లేదన్నారు. వారు ఏ ఒక్కచోటైనా మండల సమావేశాల్లో పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. సర్పంచుల సంఘం నాయకుడు లోకనాథరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందన్నారు. నీటి ఎద్దడిని అధిగమించేందుకు వినియోగించాల్సిన కేంద్రం నిధులను చంద్రన్నబాటకు ఖర్చు చేస్తూ నీటిఎద్దడి తలెత్తేలా చేస్తున్నారని విమర్శించారు.