Vice Sarpanch
-
‘వారి పక్కన కూర్చోవాలంటేనే అసహ్యమేస్తోంది’
చంద్రగిరి: దళితుడిని మాతో పాటు సమానంగా వేదికపై ఎలా కూర్చోబెడతారు? వారి పక్కన కూర్చోవాలంటేనే అసహ్యం వేస్తుంది.. మరోసారి ఇలా జరిగితే రైతుభరోసా కేంద్రానికి తాళాలు వేస్తానంటూ తెలుగుదేశం మద్దతుదారుడైన ఓ ఉపసర్పంచ్ తన కులపిచ్చిని ఇలా బహిరంగంగా వ్యక్తపరిచిన ఘటన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సొంత పంచాయతీలో శుక్రవారం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి రైతు చైతన్యయాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా బి.కొంగరవారిపల్లి, భీమవరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సర్పంచ్ లక్ష్మీ, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి, బాధితుడు దళిత నేత, ఎంపీటీసీ అభ్యర్థి రాజయ్యలతో పాటు అధికారులు పాల్గొన్నారు. స్థానిక ఉప సర్పంచ్ రాకేష్చౌదరి కార్యక్రమం వద్దకు వచ్చి, హాజరుకాకుండా వెనుదిరిగారు. కార్యక్రమం అంతా సజావుగా సాగి, అధికారులు తిరుగు ప్రయాణమయ్యే సమయంలో రాకేష్చౌదరి వేదిక వద్దకు వచ్చి.. మీరు అధికారులేనా.. ఎవరిని వేదికపైకి కూర్చోబెట్టాలో.. పెట్టకూడదో కూడా తెలియదా?.. ఒక దళితుడిని వేదికపై ఎలా కూర్చోబెడతారంటూ అధికారులపై జులుం ప్రదర్శించాడు. వారి పక్కన మాలాంటి వారు (అగ్రకులాల) కూర్చోవాలంటేనే అసహ్యంగా ఉందంటూ ఆయన ప్రవర్తించిన తీరు అక్కడి అధికారులతో పాటు స్థానిక ప్రజలను విస్మయానికి గురిచేసింది. మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకుంటే సహించేదిలేదని, రైతుభరోసా కేంద్రానికి తాళాలు వేస్తానంటూ అధికారులను హెచ్చరించారు. అనంతరం బాధితుడు రాజయ్య కలుగజేసుకుని దళితులను ఇలా అవమానించి మాట్లాడటం సరికాదని రాకేష్చౌదరికి హితవు పలికారు. అగ్రవర్ణాలతో పాటు దళితులు కూడా ఓటు వేస్తేనే మీరు ఉపసర్పంచ్ అయ్యారని, దళిత జాతిని కించపర్చి మాట్లాడటం సబబు కాదని తెలిపారు. దళితుడైన నేను వేదికపై కూర్చోకూడదని రాజ్యాంగంలో ఉందా అని ఆయన్ను ప్రశ్నించారు. దళితులంటే ముందు నుంచి చిన్నచూపు చూస్తున్నారంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. మరోసారి రాజయ్యపై ఉపసర్పంచ్ అసభ్యకరంగా మాట్లాడటంతో ఆయన తీవ్ర కలత చెందారు. అగ్రకులానికి చెందిన రాకేష్చౌదరి వ్యాఖ్యలతో దళిత నేతలు, కుల సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు దళితజాతిని కించపరిచేలా మాట్లాడిన రాకేష్చౌదరిపై రాజయ్యతో పాటు దళిత సంఘాల నాయకులు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. -
మంచం కింద బాంబు పేల్చారు
తిరుమలగిరి: నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం చింతలపాలెం పంచాయతీ కాంగ్రెస్కు చెందిన ఉప సర్పంచ్ దేపావత్ ధర్మానాయక్ (45) సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పడుకున్న అతని మంచం కింద నాటు బాంబు పేల్చడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రెండో భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. చింతలపాలెం పరిధిలోని నాగార్జునపేట తండాకు చెందిన ధర్మానాయక్.. మొదటి భార్య సావిత్రికి పిల్లలు లేకపోవడంతో ఆమె చెల్లెలు శిరీషను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరి మధ్య వయస్సు భారీగా తేడా ఉండటంతో శిరీష తన భర్తతో సంసారం చేయడానికి అంతగా ఇష్టపడక పోయేది. దీంతో ఇదే తండాకు చెందిన ఆంగోతు రవితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గతేడాది నవంబరులో వీరిద్దరు ఏపీలోని నంద్యాలకు పారిపోయారు. పెద్దలు సర్దిచెప్పి తిరిగి ఇంటికి తీసుకొచ్చినా వారి మధ్య సఖ్యత కుదరలేదు. ఈ క్రమంలో ధర్మానాయక్ సోమవారం రాత్రి తన ఇంట్లో పడుకున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి మంచం కింద బాంబు పెట్టారు. ఒక్కసారిగా అది పేలడంతో అతని శరీరం ఛిద్రమైంది. లక్ష్మీబాంబులకు ఉపయోగించే పాస్పరస్ పదార్థాలను సేకరించారు. -
నల్లగొండలో మరో కాంగ్రెస్ నేత దారుణ హత్య
-
బాలికపై ఉపసర్పంచ్ అత్యాచారయత్నం
సాలిగౌరారం : మైనర్ బాలిక పై ఓ ఉపసర్పంచ్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. సంఘటన వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా సాలిగౌరారం మండలంలోని బైరబోయినబండ గ్రామ ఉపసర్పంచ్ పులిగళ్ల చింతయ్య(40), అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక పై గురువారం అర్థరాత్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో ఆ ఉపసర్పంచ్ పరారయ్యాడు. దీనిపై శుక్రవారం ఉదయం బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. -
కృష్ణాజిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేత హత్య
గొట్టిముక్కల : పాత కక్షలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావును ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు కృష్ణారావు ఇంటిపై దాడి చేసి...అతన్ని నరికి చంపారు. కాగా టీడీపీకి చెందినవారే ఈ హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.