vietnam war
-
Napalm girl: మానని గాయంతో ఇప్పటికీ నరకం అనుభవిస్తోంది
తెలిసీ తెలియని వయసు.. తోటి చిన్నారులతో ఆడిపాడే సమయంలోనే కొండంత కష్టం వచ్చి పడింది. ఒక యుద్ధం.. ఆమె జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేయడమే కాదు.. ఐదు దశాబ్దాల తర్వాత మానని గాయాలతో ఆమెకు నిత్య నరకం చూపిస్తోంది కూడా. వియత్నాం వార్ ద్వారా చరిత్రలో నిలిచిన పోయిన నాపామ్ గర్ల్ కథ(వ్యథ) ఇది.. తొమ్మిదేళ్ల ఆ చిన్నారి.. ఇంటి పక్కన స్నేహితులతో సరదాగా ఆడుకుంటోంది. పారిపోండి.. పరిగెత్తండి అంటూ మిలిటరీ దుస్తుల్లో ఉన్న కొందరి హెచ్చరికలు వాళ్ల చెవినపడ్డాయి. అంతా కలిసి పరుగులు తీశారు. ఇంతలో వాళ్లు ఉన్న ప్రాంతంలో ఓ బాంబు పైనుంచి వచ్చి పడింది. మిగతా పిల్లలంతా ఏడుస్తూ తలోదిక్కు పారిపోతుంటే.. ఆ చిన్నారి మాత్రం దుస్తులు మంటల్లో కాలిపోయి.. బట్టల్లేకుండా రోదిస్తూ గాయాలతో రోడ్డు వెంట పరుగులు తీసింది. జూన్ 8, 1972.. టే నిహ్ ప్రావిన్స్ ట్రాంగ్ బ్యాంగ్ వద్ద జరిగిన ఈ ఘటన.. ఒక ఐకానిక్ ఫొటో ద్వారా చరిత్రలో నిలిచిపోయింది. నాపామ్ గర్ల్.. సుప్రసిద్ధ ఫొటో. వియత్నాం యుద్ధంలో అమెరికా ఫైటర్ జెట్లు నాపామ్ బాంబులు సంధించడంతో.. కాలిన గాయాలతో బట్టలు లేకుండా వీధుల వెంట పరిగెత్తింది ఆ చిన్నారి. వీపు, భుజానికి తీవ్ర గాయాలు అయ్యాయి ఆమెకి. అయితే ఆ గాయాలకు యాభై ఏళ్ల తర్వాత చికిత్స అందుకుంటోంది. నాపామ్ గర్ల్ అసలు పేరు కిమ్ ఫుసీ ఫాన్ టి. గత ఏడాదిగా ఆమె ఆస్పత్రిలోనే.. పదిహేడు సర్జరీల ద్వారా ట్రీట్మెంట్ అందుకుంది. కానీ, ఆమె గాయాలు మానాలంటే.. మరో పదేళ్లపాటు కూడా ఆమెకి మరిన్ని సర్జరీలు అవసరం. అంటే.. ఆమె ఈ నరకం మరిన్ని సంవత్సరాలు తప్పదన్నమాట. ఫాన్ తి.. పుట్టింది ఏప్రిల్ 6, 1963లో. ఆ ఘటన తర్వాత ఆమె జీవితం.. వివాదాలు, ఆంక్షల నడుమే నడుస్తోంది. చేసేది లేకచివరికి.. ఆమె తన భర్తతో పాటు 1992లో కెనడాకు ఆశ్రయం మీద వెళ్లారు. 2015లో ఆమె ఫ్లోరిడాకు చెందిన డాక్టర్ జిల్ వాయిబెల్‌ను కలసుకుంది. ఆమె కథ తెలిసిన వాయ్‌బెల్ ఉచితంగా చికిత్స అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం మియామిలో కిమ్ ఫుసీ ఫాన్ తి.. చివరి దశ చికిత్స అందుకుంటోంది. ఇప్పుడు తాను వియత్నాం యుద్ధ బాధితురాలిని కాదని, తనకు ఇద్దరు బిడ్డలు.. మనవరాళ్లు ఉన్నారని, తనను ఇప్పుడు నాపామ్ గర్ల్ అని పిలవొద్దని.. శాంతి స్థాపన కోసం పాడుపడుతున్న ఒక ఉద్యమకారణిని అని చెప్తోందామె. వియత్నాం-అమెరికన్ ఫొటోగ్రాఫర్ నిక్ ఉట్ అనే ఫొటో జర్నలిస్ట్.. నాపామ్ గర్ల్ ఫొటోకు గానూ ఫులిట్జర్ అందుకున్నారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆ ఫొటోపై పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. అయితే.. ఉట్ మాత్రం ఆ ఫొటో వియత్నాం యుద్ధానికి సిసలైన నిదర్శనమని ప్రకటించారు. -
41 ఏళ్లుగా అడవిలోనే.. స్త్రీలంటే ఎవరో తెలియదు
హనోయి/వియాత్నం: కరోనా కారణంగా మనం కొద్ది రోజులపాటు ఇంటికి పరిమితం కావడానికి చాలా కష్టపడ్డం. చుట్టూ మనవారు నలుగరు ఉన్నప్పటికి.. బందీలుగా ఫీలయ్యాం. అలాంటిది ఓ వ్యక్తి దాదాపు 41 ఏళ్లుగా నాగరిక సమాజానికి దూరంగా అడవిలోనే ఉంటూ.. అక్కడ దొరికేవి తింటూ.. బతికాడు. ఊహ తెలిసిన నాటి నుంచి కేవలం అన్న, తండ్రిని మాత్రమే చూడటంతో అసలు లోకంలో ఆడవారు ఉంటారనే విషయమే అతడికి తెలియదు. ఇక వారిలో శృంగార వాంఛలు అసలు లేనేలేవు అంటే తప్పక ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం ఈ రియల్ టార్జాన్ లైఫ్ స్టోరీ నెట్టింటో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. వియాత్నంకు చెందిన హో వాన్ లాంగ్ చాలా చిన్నతనంలో అతడవిలోకి వెళ్లాడు. 1972నాటి వియాత్నం యుద్ధం వల్ల అతడి జీవితం ఇలా మారిపోయింది. ఈ యుద్ధంలో అతడి తల్లి, ఇద్దరు తోబుట్టువులు మరణించారు. హో వాన్ లాంగ్, అతడి తండ్రి, సోదరుడు మాత్రం యుద్ధ సమయంలో తప్పించుకుని అడవిలోకి వెళ్లారు. మనిషి కనిపించిన ప్రతి సారి వారు అడవిలో మరింత లోపలికి పయనం చేశారు. అలా నాగరిక సమాజానికి పూర్తిగా దూరం అయ్యారు. అక్కడే జీవిస్తూ.. అడవిలో దొరికే పండ్లు, తేనే, చిన్న చిన్న జంతువులను వేటాడి తింటూ కాలం గడిపారు. ఈ నలభై ఏళ్లలో ఈ ముగ్గురు తండ్రికొడుకులు కేవలం ఐదుగురు మానవులను మాత్రమే చూశారు. ఎలా వెలుగులోకి వచ్చారంటే.. ఇలా అడవిలో జీవనం సాగిస్తున్న వీరిని 2015లో అల్వారో సెరెజో అనే ఫోటోగ్రాఫర్ గుర్తించి.. అడవి నుంచి వారిని బయటకు తీసుకువచ్చాడు. అక్కడే సమీపంలో ఉన్న ఓ గ్రామంలో వారిని ఉంచాడు. ఈ సందర్భంగా అల్వారో మాట్లాడుతూ.. ‘‘మనుషులను చూసిన ప్రతి సారి వీరు అడవిలో మరింత దూరం వెళ్లేవారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటేంటే వీరికి లోకంలో స్త్రీలు ఉంటారని తెలియదు. ఇప్పుడిప్పుడే వారిని గుర్తించగలుగుతున్నారు. కానీ నేటికి స్త్రీ, పురుషుల మధ్య తేడా ఏంటో వీరికి తెలియదు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే వీరిలో శృంగారవాంఛలు అసలు లేవు. ఇక హోవాన్ లాంగ్ తండ్రి నేటికి కూడా వియాత్నం యుద్ధం ముగియలేదు అనుకుంటున్నాడు’’ అన్నాడు. మంచి, చెడు తేడా తెలియదు.. ‘‘హో వాన్ లాంగ్‌కు మంచి, చెడు తేడా తెలియదు. వేటాడటంలో దిట్టం. ఎవరినైనా కొట్టమంటే.. చచ్చేవరకు కొడతాడు. చంపమని ఆదేశిస్తే.. వెంటాడి వేటాడుతాడు. తప్ప మంచి, చెడు తెలియదు. ఎందుకంటే అతడి ఏళ్లుగా అడవిలో ఉండటం వల్ల హోవాన్ లాంగ్ మెదడు చిన్న పిల్లల మాదిరిగానే ఉంటుంది. ఇప్పుడిప్పిడే హో వాన్ లాంగ్ నాగరిక జీవితానికి అలవాటు పడుతున్నాడు. తొలి ఏడాది వీరిని పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఇక్కడి వాతావరణంలో ఉండే బాక్టీరియా, వైరస్ల దాడికి తట్టుకోలేకపోయారు. ఇక్కడి రణగొణ ధ్వనులు వీరికి నచ్చడం లేదు. కాకపోతే జంతువులు మనుషులతో స్నేహంగా ఉండటం వారిని ఆశ్చర్యానకి గురి చేస్తుంది’’ అన్నాడు అల్వారో. చదవండి: 16 ఏళ్లుగా భార్య శవంతో బెడ్‌పై... -
వియత్నాం యుద్ధాన్ని మించి..
వాషింగ్టన్: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్ అమెరికాలో వియత్నాం యుద్ధం కంటే ఎక్కువ మందిని బలితీసుకుంది. అమెరికాలో పదిలక్షలకుపైగా కోవిడ్ కేసులు ఉండగా, ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60వేలు దాటింది. ఇది ఇరవై ఏళ్లపాటు వియత్నాంతో జరిగిన యుద్ధంలో మరణించిన సైనికుల సంఖ్య కంటే ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. 1955లో మొదలైన వియత్నాం యుద్ధం 1975లో ముగియగా 58,220 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు.. పదిలక్షల కంటే ఎక్కువమంది కరోనా బాధితులున్న తొలిదేశంగానూ అమెరికా ఓ రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 32 లక్షలకు చేరువలో ఉంది. ‘బాధితులు ఆత్మశాంతి కోసం, ఆప్తులను కోల్పోయి శోక సంద్రంలో ఉన్న వారి బంధు మిత్రుల కోసం మా ప్రార్థనలు కొనసాగుతాయి. ఇలాంటిది ఎప్పుడూ లేదు. ఇది అందరి కష్టం. ఈ కష్టం నుంచి త్వరలోనే మరింత బలంగా బయటపడతాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రపంచంలో ఏ దేశమూ చేయనంత పెద్ద సంఖ్యలో తాము కరోనా పరీక్షలు నిర్వహించామని, నిపుణుల సలహా మేరకు ఇది జరిగిందని కాకపోతే అప్పుడప్పుడూ నిపుణులు తప్పులు చేస్తారని ట్రంప్ అన్నారు. దేశాన్ని, సరిహద్దులను మూసివేస్తామని నిపుణులెవరూ ఊహించలేదని ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగవ త్రైమాసికాల్లో అమెరికా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్డౌన్ ఎత్తివేత ఎలా జరగాలన్న అంశంపై ప్రభుత్వం ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. మాస్టర్‌కార్డ్ సీఈవో, భారతీయ సంతతికి చెందిన అజయ్ బంగా, టండన్ కేపిటల్ అసోసియేట్స్‌కు చెందిన చంద్రిక టండన్, హోటల్స్ అసోసియేషన్ సీఈవో విజయ్ దండపాణిలు ఈ బృందం సభ్యులుగా నియమితులయ్యారు. 184 దేశాలు నరకం అనుభవించాయి చైనా కరోనా వైరస్‌ను ఆదిలోనే అదుపు చేసి ఉంటే 184 ప్రపంచదేశాలు నరకం అనుభవించాల్సిన దుస్థితి తప్పేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఖనిజాలు, తయారీ రంగం కోసం చైనాపై ఆధారపడకూడదని పలువురు అమెరికన్ పార్లమెంటు సభ్యులు అభిప్రాయపడుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వ్యూహాత్మకంగా అవసరమైన పలు ఖనిజాల విషయంలో అమెరికా అమెరికా చైనాపై ఆధారపడుతూండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశంపై ఆధారపడటం, దేశాన్ని బలహీన పరుస్తుందని అమెరికా భావిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా పలువురు రాజకీయ నేతలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుతున్నారు. -
వియత్నాం వార్‌కు మించి కరోనా మృతులు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో కరోనా వైరస్ బారిన పడి బుధవారం మధ్యాహ్నంకు 58,964 మంది మరణించారు. 20 ఏళ్లపాటు వియత్నాంతో చేసిన యుద్ధంలో 58,220 మంది అమెరికన్లు చనిపోగా, అంతకన్నా ఎక్కువగా మూడు నెలల కాలంలోనే కరోనా వైరస్ బారిన పడి అమెరికన్లు మరణించారు. 1968 నాటి వియత్నాం యుద్ధంలో ప్రతి లక్ష మందిలో 8.5 మంది అమెరికన్లు మరణించగా, కరోనా వైరస్ బారిన పడి ప్రతి లక్ష మందిలో 17.6 మంది మరణించారు. 1968, జనవరి 31వ తేదీన అత్యధికంగా 246 మంది మరణించారు. ఆ సంవత్సరంలో అత్యధికంగా 16,899 మంది మరణించారు. అమెరికాలో ఏప్రిల్ 28వ తేదీ నాటికే కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య 10,36,657కు చేరుకుంది. వియత్నాం యుద్ధంలో ఎక్కువ మంది చనిపోతుండడంతో ఆ యుద్ధం నుంచి తప్పుకోవాలంటూ యుద్ధానికి వ్యతిరేకంగా వేలాది మంది అమెరికన్లు నిరసన ప్రదర్శనలు జరిపారు. ఇప్పుడు కరోనా బారిన పడి అంతకన్నా ఎక్కువ మంది మరణించినప్పటికీ లాక్డౌన్, సామాజిక దూరం లాంటి ఆంక్షలను ఎత్తివేయాలంటూ అమెరికన్లు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు జరపుతున్నారు. 2017-18 సంవత్సరంలో ఎనిమిది నెలల కాలంలో ఇన్‌ఫ్లూయెంజా దాడి చేయడంతో 61 వేల మంది మరణించారని ‘సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్స్ అండ్ ప్రివేన్షన్’ వెల్లడించింది. కరోనా మృతుల సంఖ్య ఆ సంఖ్యను కూడా దాటుతుందని సులభంగానే గ్రహించవచ్చు. ఆగస్టు నెలాఖరు నాటికి కరోనా మృతుల సంఖ్య దాదాపు 75 వేలకు చేరుకుంటుందని వైద్యులు అంచనా వేశారు.(కరోనా.. అధ్యక్ష ఎన్నికలపై అమెరికన్ల మనోగతం!) -
విమర్శలతో దిగొచ్చిన ఫేస్బుక్
న్యూయార్క్ : నాపలామ్ బాలిక ఫోటోగ్రాఫ్ తొలగింపుపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వెనక్కి తగ్గింది. తనపై వచ్చిన పలు విమర్శలతో ఫేస్బుక్ యూటర్న్ తీసుకుని, తొలగించిన ఆ ఫోటోను తిరిగి పోస్టు చేయడానికి అంగీకరించింది. 1972లో వియత్నాం యుద్ధ సమయంలో నాపలమ్‌పై దాడి జరుగుతున్నప్పుడు ఓ చిన్నారి ఏడుస్తూ నగ్నంగా పరుగెట్టుకుంటూ వెళ్తున్న ఫోటో ఫేస్బుక్లో పోస్టు అయింది. యుద్ధ తీవ్రతను తెలుపుతూ నాపలమ్ దాడికి సంబంధించిన ఈ ఫోటోను పులిట్జర్ బహుమతి గ్రహీత, నార్వే ఫోటోగ్రాఫర్ నిక్ అట్ తన ఫేస్బుక్లో పోస్టుచేశారు. అయితే ఈ ఫోటో తన నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఫేస్బుక్ తొలగించింది. ఇదే ఫోటోను నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్బెర్గ్ కూడా పోస్టుచేశారు. కానీ దాని కూడా ఫేస్బుక్ తొలగించింది. దీంతో సర్వత్రా తీవ్ర చర్చనీయాంశమై, ఫేస్బుక్ పలు విమర్శలకు గురైంది. చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించే ఈ ఫోటోను తొలగించడంపై పలువురు మండిపడ్డారు. ఫేస్బుక్ తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు నార్వే అతిపెద్ద న్యూస్ పేపర్ ఎడిటర్ బహిరంగ లేఖ రాశారు. దీంతో తనపై వస్తున్న విమర్శలతో ఫేస్బుక్ దిగొచ్చింది. నగ్నంగా ఉన్న బాలిక ఫోటో తమ నియమ నిబంధనలకు ఉల్లంఘిస్తుందనే నేపథ్యంలోనే తొలగించామని ఫేస్బుక్ తన ప్రకటనలో తెలిపింది. తన నిర్ణయాన్ని మార్చుకుని చిన్నారి ఫొటోను షేర్ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్టు పేర్కొంది.చరిత్రను పరిశీలించి, విశ్వవ్యాప్తంగా ఈ ఫొటోకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించినట్టు తెలిపింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న గొప్ప ఛాయాచిత్రమని కొనియాడింది.తొలగించిన చోటే దానిని తిరిగి పోస్టు చేయనున్నట్టు ప్రకటించింది. అయితే కొంత సమయం కావాలని ఫేస్బుక్ అభ్యర్థించింది. తమ విధానాలను మెరుగుపరుచుకుంటామని, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు తోడ్పడతామని, తమ కమ్యూనిటీ రక్షణకు దోహదం చేస్తామని తెలిపింది. అయితే ఫేస్బుక్ తన నిర్ణయాన్ని మార్చుకున్నందుకు ప్రధాని సోల్బెర్గ్ సంతోషం వ్యక్తం చేశారు. -
గోలియత్‌ను ఎత్తి పడేసిన వేలెడంత వియత్నాం
40 ఏళ్ల క్రితం ఈ రోజు - విజయవాడ ‘విశాలాంధ్ర’ డైలీ ఆఫీసు. ఆ రోజుల్లో టీవీ కంప్యూటర్ నెట్ లేవు. మా న్యూస్ డస్క్ దగ్గర టెన్షన్. పాతికేళ్లు హోరాహోరీగా సాగిన వియత్నాం యుద్ధం క్లైమాక్స్ కొచ్చింది. టీవీ ప్రింటర్ల చుట్టూ కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతున్నాం. రోల్ అవుతున్న న్యూస్ బైట్స్‌ని చింపుకొస్తున్నాం. ‘‘వియత్నమీస్ ఆర్మీ టాంకులు దక్షిణానికొస్తున్నా యా? ఎక్కడున్నాయి. అమెరికన్ బాంబింగ్ ఎక్కడ జరుగుతోంది?’’ మా ఎడిటర్ సి. రాఘవాచారి ఆత్రంగా అడుగుతున్నారు. ‘‘క్వాంగ్రీటీ, దానాంద్, హువే సిటీల మీద కార్పెట్ బాంబింగ్ జరుగుతోంది. సైగాన్ గురించి న్యూస్ లేదు’’ మేం చెప్పాం. అంతకుముందు బంగ్లాదేశ్ యుద్ధ కాలంలో ఒక్క సప్తమ నౌకాదళం మన మద్రాసు, విశాఖ పక్క నుంచి పైకి బెంగాల్ వేపు కదుల్తుందంటేనే ఠారుకు చచ్చాం. అలాటిది మన కేరళ కంటే కొంచెం పెద్దగా ఉండే బుల్లి వియత్నాంను ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక శక్తి చుట్టు ముడుతుందంటే గుండెలు అవిసిపోవూ. ఇది పాతికేళ్లు గా డేవిడ్‌కీ గొలియత్కీ మధ్య సాగుతున్న పోరు. మొదట నాటు తుపాకులూ, విమానాలు కూల్చే గన్స్ తప్ప పెద్దగా ఏమీలేని దక్షిణ వియత్నాం విముక్తి సైన్యం కొద్ది కాలంగా అధునాతనమైన ట్యాంకులూ, మెషీన్ గన్స్‌ని రష్యా ఇవ్వగా తెచ్చుకుంది. అచ్చు కేరళ లాగా, కోనసీమ, గోవాల్లాగా కొబ్బరి చెట్లూ, అరటి తోపులూ వరి పొలాలతో మన ఊరు లాగే పచ్చగా మెరిసే వియ త్నాం బొగ్గులా తయారయింది. ‘‘ఒరేయ్ మీరు రాతి యుగంలోకెళ్లే వరకూ బాంబింగ్ చేస్తాం’’ అని ఒక అమె రికన్ జనరల్ వార్నింగ్ ఇచ్చినంత పనీ జరిగింది. దురా క్రమణ చేసినప్పుడల్లా అక్కడ ప్రజాస్వామ్యాన్నీ, ఎల క్షన్లనీ తెచ్చి పెడతామని చెప్పడం అమెరికాకి ఓ ఫ్యాషన బుల్ మంత్రం. దాంతోనే ఓ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా రివాజు. అప్పటికి ఈ కీలు బొమ్మ పాలన సైగాన్ని దాటి దేశంలో ఒక్క ఇంచికి మించింది లేదు. ప్రజలంతా విముక్తి సేన వెంటే. కొద్ది మంది తైనాతీలు తప్ప. మరి ఓటమి సూటిగా కళ్లలోకి తేరిపార చూస్తున్నందువల్ల అమెరికాకి పిచ్చెత్తి ఒక నాటు ఆటంబాంబు వేసినట్టు అన్ని నగరాలనూ, పట్నాలనీ ధ్వంసం చేసేస్తే? అంత సీన్లేదు. చాలా కష్టం. ఎందుకంటే ఒక్క యుద్ధ రంగంలోనే కాదు ప్రపం చమంతటా దౌత్య రంగంలో కూడా వియత్నాం ప్రజాభి ప్రాయాన్ని పోగేసింది. అప్పటికే 58 వేల మంది అమెరి కన్ సైనికుల శవపేటికలు అమెరికాకు వరసగా చేరాయి. ఒక్కో కాఫిన్ తీసుకోవడానికొచ్చే కుటుంబాలన్నీ ఈ యుద్ధం ఇక వద్దని వీధుల్లోకొచ్చి ప్రదర్శనలు చేస్తున్నా యి. హాలీవుడ్లో ఎక్కువ మంది స్టార్స్, వైట్ హౌస్ ముందుకు వేనకు వేలు ప్రజల్తో వచ్చి యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల్లో పిడికిళ్లు బిగిస్తున్నారు. ప్యారిస్ శాంతి చర్చ ల్లో కేసింగర్ లాంటి కొమ్ములు తిరిగిన శకుని వాదాలను, ఊరూ పేరూ లేని మేడమ్ బిన్ (దక్షిణ వియత్నాం తాత్కాలిక విప్లవ ప్రభుత్వ విదేశాంగ మంత్రి) పచ్చి అబద్ధాలని ప్రపంచ వేదిక మీద నిరూపించింది. ఆ రోజుల్లో ఆవిడ ఢిల్లీ వస్తే ఘనంగా పౌర సన్మానం జరి గింది. వేదిక మీద ఇందిరా గాంధీ లేచి నడిచి వచ్చి మేడమ్ బిన్ను ఆప్యాయంగా కౌగలించుకుంది. అమెరి కాకి ఒళ్లు మండింది. ఆ పాతికేళ్లూ అది ఒట్టి యుద్ధంగా సాగలేదు. అమె రికన్ సాహిత్యం - కథ, నవల, కవితల్లోకీ, నాటకాల్లోకీ వియత్నాం నేరుగా దూసుకొచ్చి కూచుంది. అమెరికా, లాటిన్ అమెరికా చర్చిలలో ఆదివారం అయిందంటే లిబ రేషన్ థియాలజిస్టుల సెర్మన్ల నిండా వియత్నామే. మమ్మల్ని, దున్నల్లాగా, కబేళాకి తోల్తారా అంటూ ‘‘లుఫె లో సోల్జర్’’ అని బాబ్ మార్లే వచ్చి జమైకాలో పాడిన పాట ప్రపంచమంతా మళ్లీ మళ్లీ మారుమోగింది. అప్పు డు కలకత్తా వీధుల్లో ప్రెసిడెన్సీ కాలేజీ స్టూడెంట్స్‌తో కలసి, దేశమంతటి నుంచి పోగైన మేమంతా ప్రదర్శ నలు చేశాం. గావుకేకలు పెట్టి ఎస్ప్లనేట్ సెంటర్లో నినా దాలిచ్చాం. ‘‘ఆమ్ర నామ్ తూమ్ర శామ్’’ ఒక్కడు అరిస్తే ‘వియత్నామ్, వియత్నామ్’ వేల గొంతులందుకున్నా యి. ‘‘ఏ గంగా మీకాంగ్ ఏకీ హై’’ ఒకరు మొదలెడితే ‘‘భూలోమత్ భూలోమత్’’ అంటూ మైదానం దద్దరిల్లిం ది. ఇక్కడే కాదు అమెరికన్ నల్లజాతుల పౌర హక్కుల ఉద్యమాలకు వియత్నాం పతాకమయింది. ఆఫ్రికాలో వరసగా విముక్తి అవుతున్న దేశాలకు స్వేచ్ఛా నినాద మైంది. యూరోపియన్ రాక్ బాండ్స్, బీటిల్స్, బీట్నిక్, రోలింగ్ స్టోన్స్ పాటలకు పల్లవి అయింది. వియత్నాం కోసం ప్రపంచ ప్రజ అంతా ఒక్కటయింది. అమెరికా ఒంటరిదయింది. అయినా హిట్లర్‌కి ఓటమి ఖాయమని తెలిసినప్పటికీ మాస్కోని బాంబ్ చేయమని వందలాది విమానాలకు పదే పదే ఆర్డర్లిచ్చినట్టుగా అమెరికా కూడా ఆర్డర్లిచ్చింది. గంటల తరబడి సస్పెన్స్‌తో ఎదురు చూస్తున్న మా ముందు టెలిప్రింటర్లు టక టకమంటూ రొద చేశాయి. గుండెలు పట్టుకు చూశాం. ఎ.పి, ఎ.ఎఫ్.పి. వార్తా సం స్థల కబురు. సైగాన్లోకి విముక్తి సేన టాంకులు దూసు కొచ్చాయి. అయిపోయింది. అర్థమయిపోయింది ఇరవ య్యవ శతాబ్దపు సుదీర్ఘ యుద్ధంలో వియత్నాం బక్క రైతు బందిపోటు డేగ రెక్కలు తెగనరికాడు. కాసేపట్లోనే మళ్లీ వార్తలు. దుర్భేద్యమైన అమెరికన్ రాయబార కార్యాలయం గేట్లను వియత్నాం టాంకులు గుద్దుకుంటూ, ముక్కలు చెక్కలు చేసుకుంటూ ముందు కెళ్లాయి. పై అంతస్థు మీదికి చేరిన అమెరికన్ సైనికులూ, ఎంబసీ స్టాఫ్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని దిక్కులు చూస్తున్నారు. అమెరికన్ హెలికాప్టర్లు పైన చక్కర్లు కొడుతూ కిందికి తాళ్లనిచ్చెనలు జారవిడుస్తున్నాయి. అందిన వాళ్లు అంది పుచ్చుకుని ఎగబాకి హెలికాప్టర్లలో కూచుంటున్నారు. లాటిన్ అమెరికా లాంటి ఖండాలనే గుప్పెట్లో బిగించిన మహా సామ్రాజ్యానికి ఏం గతి పట్టింది? ఎంత సిగ్గు చేటు? ఇంతా చేసి సప్త సముద్రాల అవతల బుల్లి వియత్నాం పెరట్లో కుక్క చావు చావాల్సి వచ్చింది. ఆసియా అంతా పులకరించింది. ప్రపంచం పలవరించింది. మా మొహాలన్నీ విప్పారాయి. అందరూ చిరున వ్వులు రువ్వుతున్నారు. న్యూస్ ఎడిటర్ టీలు ఆర్డర్ చేశారు. అందరం సిగరెట్లు వెలిగించాం. మొహాలు వెలిగిపోతున్నాయి ‘పతాక శీర్షిక’ ఏం పెట్టాలి? ‘బాక్స్ ఐటమ్’లు ఏం రాయాలి? చకచకా రాసేశాం. మర్నాడు అమెరికన్ పత్రికలన్నీ ‘సైగాన్ పతనం’ అని ‘సైగాన్ సరెండర్స్ టు రెడ్స్’ అని బ్యానర్ పెట్టా యి. మా బ్యానర్ ‘సైగాన్ విముక్తి’ అని. నిజానికి పతనమైంది అమెరికా. (వియత్నాంలో అమెరికా ఓటమికి నేటికి 40 ఏళ్లు) (వ్యాసకర్త ప్రముఖ కార్టూనిస్టు మొబైల్: 77028 41384)