Vietnamese man
-
విపరీతమైన తలనొప్పి అనడంతో స్కాన్ చేసి చూడగా..విస్తుపోయిన వైద్యులు!
కొన్ని ఘటనలు చాలా ఆశ్చర్యకరంగా అంతు చిక్కని మిస్టరీల్లా ఉంటాయి. ఏదైన వస్తువులను చిన్నపిల్లలు అయితే తెలియక మింగడం లేదా చెవుల్లోనూ, ముక్కులోనూ పెట్టుకోవడం జరుగుతుంది. అదే పెద్ద వాళ్ల శరీరాల్లో అలాంటి చిన్న వస్తువులు కనిపిస్తే ఇదేలా సాధ్యం అనిపిస్తుంది. ఇక్కడొక వ్యక్తి విషయంలో అలానే జరిగింది. స్కాన్ చేసి చూసిన వైద్యులు కూడా విస్తుపోయారు వియత్నాంకు చెందిన ఓ వ్యక్తి విపరీతమైన తలనొప్పితో గత ఐదు నెలలుగా బాధపడుతున్నాడు. పలు వైద్య పరీక్షలు నిర్వహించి అతడు టెన్షన్‌కి సంబంధించిన న్యూమోసెఫాలస్తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు డాక్టర్లు. ఈ అరుదైన న్యూరోలాజికల్ పరిస్థితి కాస్త ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు. నివారించేందుకు చికిత్సలో భాగంగా రోగి శరీర స్థితి గురించి క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. ఆ క్రమంలోనే సిటీస్కాన్లు నిర్వహించగా బ్రెయిన్లో ఉన్న ఆ వస్తువుని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు వైద్యులు. రెండు చాప్‌స్టిక్‌లు అతని మెదడులో ఇరుక్కుని ఉన్నట్లు గుర్తించారు. అసలు అవి మెదడు వరకు ఎలా చేరాయనేది వైద్యులకు ఓ మిస్టరీలా అనిపించింది. ఆ పేషెంట్‌కి కూడా ఈ విషయం చెప్పగా.. ఐదు నెలల క్రితం జరిగిన ఘటనను గుర్తు తెచ్చుకుంటూ..ఓ రోజు రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ జరిగిన గొడవలో ముఖంపై ఏదో వస్తువుతో గుచ్చినట్లు గుర్తు.. కానీ అది జరిగే చాలారోజులు అయ్యిందని చెప్పాడు. ఐతే అప్పుడు తనకు ఎలాంటి సమస్య, ఇబ్బంది గానీ అనిపించలేదని చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. దీంతో వైద్యులు పేపెంట్ ముక్కుని పరిశీలించగా..చాప్‌స్టిక్ గుచ్చిన గుర్తులు కనిపించడంతో ముక్కు ద్వారానే ఈ చాప్‌స్టిక్‌లు మెదడులోకి వెళ్లాయని నిర్థారణకు వచ్చారు. అదృష్టవశాత్తు ఆ పేషెంట్‌కి ఎండోస్కోపిక్ శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు ఆ చాప్ స్టిక్‌లను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దయచేసి మీపై ఏదైనా దాడి జరిగినప్పుడూ పెద్ద దెబ్బలేం తగలలేదని నిర్లక్ష్యం చెయ్యొద్దని సూచిస్తున్నారు వైద్యులు. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) -
బంగారంలో బప్పీ లహరిని మించిపోయాడు.. శరీరంపై 2 కిలోలు, కారు, బైక్ అన్నీ..
బప్పీలహిరి.. సంగీతమే కాదు.. ఆయన ఆహార్యమూ స్పెషలే.. ముఖ్యంగా బంగారం. అది తనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందన్నది ఆయన నమ్మకం.. ఈ చిత్రంలోని వియత్నాంవాసి ట్రాన్డక్లాయ్ అయితే.. దాన్ని మరింత ఎక్కువ నమ్ముతాడు.. అందుకే ఎప్పుడూ తన శరీరం మీద రెండు కిలోలకు తక్కువ కాకుండా ఇలా గోల్డ్ ఉంచుకుంటాడు. అదొక్కటేనా.. తన కారు, బైక్ అన్నీ గోల్డ్ ప్లేటింగ్ చేయించేశాడు.. దాని వల్ల లోకల్‌గా పాపులర్ కూడా అయ్యాడు. ఇంత బంగారం ఉంది.. ఏం చేస్తాడు అనేదేగా మీ డౌట్.. వియత్నాంలో దక్షిణ అమెరికా బల్లులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు.. వాటిని తెచ్చి.. అమ్మడమే మనోడి పని. చదవండి: "భార్యలను కొట్టండి" భర్తలకు సలహలిచ్చిన మహిళా డిప్యూటి మంత్రి! -
భార్య చేతిలో భర్తకు ఊహించని మరణం
ఆలుమగల మధ్య జరిగిన గొడవలో భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోయిన ఘటన వియత్నాంలో కలకలం రేపింది. పట్టుకోనిరాని చోట పట్టుకోవడంతో మగడు మృతి చెందాడు. అతడి వృషణాలను భార్య అదిమి పట్టుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు లీ కిమ్ ఖాయ్గా గుర్తించారు. బయటికి నుంచి ఇంటికి తిరిగొచ్చిన లీ కిమ్ తలుపు గడియ పెట్టివుండడం గమనించాడు. తలుపును గట్టిగా బాదినా అతడి భార్య పాన్ థీ కిమ్ చుయొంగ్, ఇద్దరు కూతుళ్లు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన లీ కిమ్ చేతి రంపంతో భార్యపై దాడి చేశాడు. విచక్షణారహితంగా ఆమెను కొట్టాడు. భర్త నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు అతడి వృషణాలను పట్టుకుంది. అక్కడితో ఊరుకోకుండా భర్తను కిందపడేసి అతడి పొట్టపై కూర్చుని కదలకుండా చేసింది. అతడు వాంతులు చేసుకున్నా పట్టించుకోలేదు. అరుపులు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి పరుగెత్తికొచ్చి చుయొంగ్ చేతిలోంచి భర్తను విడిపించారు. అపస్మారక స్థితిలో పడివున్న అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అయితే గతంలోనూ పలుమార్లు లీ కిమ్ తనను కొట్టాడని చుయొంగ్ వెల్లడించింది. హెచ్చరించేందుకే అతడి సున్నితావయవాలను పట్టుకున్నానని, ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆమె వాపోయింది.