ట్రెండీ టైమ్
మగువ మెచ్చే వస్త్రాభరణాలు... మగవారికి నప్పే విభిన్న సూటింగ్స్... సరికొత్త ట్రెండ్స్‌తో ఆకట్టుకుంది ‘విన్యాస్’ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్. విజయ్రాణా, వైశాలీ, పూజారావు, నటాషా వంటి ప్రవుుఖ డిజైనర్లు రూపొందించిన కలెక్షన్లతో బంజారాహిల్స్ హోటల్ తాజ్‌కృష్ణాలో బుధవారం ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన... నయా వెరైటీలను పరిచయం చేసింది.
శ్రావణం స్పెషల్...
ఆధ్యాత్మిక వూసం శ్రావణంలో వుహిళలకు కావల్సిన సంప్రదాయు వస్త్రాలు ఇక్కడ ఆకర్షణీయుంగా ఉన్నారుు. పట్టు చీరలు, వన్‌గ్రామ్ గోల్డ్ ఆభరణాలు కొలువుదీరారుు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజ కోసం గోల్డ్ కోటెడ్ లక్ష్మీదేవి విగ్రహాలు, పుష్పాలు ప్రత్యేక ఆకర్షణ. అన్నాచెల్లెళ్ల అనురాగాన్ని తెలిపే రక్షాబంధన్‌లు వునసుకు హత్తుకొంటున్నారుు. వీటికి బంగారు పూత పూశారు. ఇవేకాక గృహాలంకరణ వస్తువులు... డిజైనర్ ఫుట్‌వేర్ వంటివెన్నో స్టాల్స్‌లో ప్రదర్శించారు. తెలంగాణ రాష్ర్ట వుంత్రి హరీశ్‌రావు, ఆయన సతీమణి శ్రీనిధారావు ఎగ్జిబిషన్ ప్రారంభించారు. రాష్ర్టంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా హరీశ్‌రావు చెప్పారు.
- సాక్షి, సిటీ ప్లస్