Vijaykant
-
మల్లగుల్లాలు
సాక్షి, చెన్నై: ఉప ఎన్నికల బరిలో అభ్యర్థుల్ని నిలబెడదామా, వద్దా? అని మక్కల్ ఇయక్కం ఓ వైపు, తమిళ మానిల కాంగ్రెస్, డీఎండీకేలు మరో వైపు వేర్వేరుగా మల్లగుల్లాలు పడుతున్నాయి. మిత్రుల మధ్య భిన్న వాదనల నేపథ్యంలో మక్కల్ ఇయక్కం కన్వీనర్ ఎండీఎంకే నేత వైగో పార్టీ నేతల అభిప్రాయాల సేకరణలో పడ్డారు. చివరకు ఏకాభిప్రాయం కుదిరేలా చేశారు. ఇక, తాను సోమవారం నిర్ణయాన్ని ప్రకటిస్తాన ని తమిళ మానిల కాం గ్రెస్ నేత వాసన్ వ్యాఖ్యానించారు. డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ మాత్రం మౌనంగానే ఉన్నా రు. రాష్ర్టంలో వాయిదా పడ్డ తం జావూరు, అరవకురిచ్చిలతో పాటు శీనివేల్ మరణంతో ఖాళీగా ఉన్న తిరుప్పర గుండ్రం స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలి సిందే. ఇప్పటికే అన్నాడీఎంకే, డీఎంకేలు తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. అన్నాడీఎంకే అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. అయితే, అరవకురిచ్చి అన్నాడీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీకి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ల మోత మోగుతున్న దృష్ట్యా, ఉత్కంఠ తప్పడం లేదు. సెంథిల్ బాలాజీని ఢీకొట్టేందుకు రేసులో ఉన్న డీఎంకే అభ్యర్థి కేసీ పళనిస్వామికి వ్యతిరేకంగా కూడా కోర్టుల్ని ఆశ్రయించేందుకు పలువురు సిద్ధం అవుతుండడం గమనార్హం. ఇక, మిగిలిన అభ్యర్థులు తమకు ఎలాంటి చిక్కులు ఉండబోదన్నట్టుగా ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇక, తిరుప్పరగుండ్రం డీఎంకే అభ్యర్థి శరవణన్‌కు ఆ పార్టీ బహిష్కృత నేత అళగిరి రూపంలో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు కారణం మరో అభ్యర్థి దొరకలేదా..? అని డీఎంకేను అవహేళన చేస్తూ అళగిరి వారసుడు దయానిధి అళగిరి ట్విట్టర్లో స్పందించి ఉండడం ఆలోచించ దగ్గ విషయమే. అన్నాడీఎంకే, డీఎంకేలు రేసులో దిగడంతో, ఇక తామూ దిగుదామా వద్దా అన్న యోచనలో గత ఎన్నికల్లో ఆరుగురిగా ముందుకు సాగి, ఇప్పుడు నలుగురికి పరిమితమైన మక్కల్ ఇయక్కం మల్లగుల్లాలు పడుతున్నది. భిన్న వాదనలు : అసెంబ్లీ ఎన్నికల్లో ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ, డీఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్‌లు ఒకే వేదికగా ప్రజా సంక్షేమ కూటమి అంటూ ప్రజల్లోకి వెళ్లి డిపాజిట్లనే కాదు, ఓటు బ్యాంక్‌నూ కోల్పోయిన విషయం తెలిసిందే. ఫలితాల తారుమారుతో ఆరుగురిలో, చివరకు నలుగురుగా మిగిలారు. ప్రస్తుతం మక్కల్ ఇయక్కంగా ముందుకు సాగుతున్న ఆ నలుగురిలో ఉప ఎన్నికలు విభేదాల్ని సృష్టించేనా అన్న ప్రశ్నను తెర మీదకు తెచ్చింది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు ఆ ఇయక్కంలో సాగుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఉప రేసులో తమ అభ్యర్థులను బరిలో దించాలా, వద్దా అన్న విషయంలో ఆ ఇయక్కం నేతల మధ్య భిన్న వాదనలు బయలు దేరాయి. సీపీఎం, సీపీఐ ఓ వాదన విన్పిస్తుంటే, వీసీకే, ఎండీఎంకేలు వేర్వేరుగా తమ తమ వాదనలు విన్పించే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఈ వాదనలు ఏమిటో అన్నది గోప్యంగా సాగుతున్నా, రేసులో తాము ఉండాలా, వద్దా అని తేల్చుకునేందుకు ఆ కూటమి కన్వీనర్, ఎండీఎంకే నేత వైగో సిద్ధమయ్యారు. శనివారం ఎగ్మూర్‌లోని ఎండీఎంకే కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ వర్గాల అభిప్రాయాల్ని సేకరించారు. అయితే, ఎన్నికలకు దూరంగా ఉంటే మంచిదన్న సూచనను పలువురు ఇచ్చినా, తుది నిర్ణయం ఇయక్కం నేతల ఏకాభిప్రాయంతో సాధ్యం అన్న విషయాన్ని పరిగణించి ముందుకు సాగే పనిలో పడ్డారు. చివరకు ఆ నలుగురూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఉప ఎన్నిక ప్రజా స్వామ్యబద్ధంగా జరిగే అవకాశాలు లేని దృష్ట్యా, ఇక, ఆ ఎన్నికలకు తాము దూరం అని ప్రకటించేశారు. వాసన్, కెప్టెన్ ఎటో: అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురం అంటూ పయనం సాగించి, ఘోర పరాభావంతో ఇక తమ దారి తమదే అని బయటకు వచ్చిన నేతల్లో డీఎండీకే అధినేత విజయకాంత్ ఒకరు. మరొకరు తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్. స్థానిక ఎన్నికల నినాదంతో డీఎంకేకు దగ్గరయ్యేందుకు జీకే వాసన్ తీవ్రంగానే ప్రయత్నించినా, అందుకు తగ్గ మార్గం లభించలేదు. ఇక, ఉప ఎన్నికల ద్వారా సత్తా చాటుకుందామా, వద్దా అన్న డైలమాలో ఉన్నారు. తమ ప్రతినిధి ఒక్కరైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని కాంక్షిస్తున్న జీకే వాసన్, ఉప ఎన్నికల ద్వారా రేసులో తానే స్వయంగా దిగితే ఎలా ఉంటుందో అన్న పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఏదేని తిరకాసు ఎదురైన పక్షంలో రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావం తప్పదన్న విషయాన్ని పరిగణించి, ఆచీతూచీ అడుగులు వేయడానికి నిర్ణయించారు. ఉప రేసులో ఉండాలా వద్దా అన్నది సోమవారానికి తేల్చేస్తానని మీడియా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించి, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరబాటుకు పాతాళంలోకి నెట్టబడ్డ విజయకాంత్, ఇంకా తన మౌనాన్ని వీడనట్టుంది. ఉప ఎన్నికల రేసులో ఉండాలా, వద్దా అన్న సందిగ్ధంలో విజయకాంత్ ఉన్నా, ఆ కేడర్ మాత్రం కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. విజయకాంత్‌కు సొంత జిల్లా మదురై అన్న విషయం తెలిసిందే. ఆ జిల్లా పరిధిలో ఉన్న తిరుప్పరగుండ్రం నియోజకవర్గంలో ఆయనకు బలం కూడా ఉందని, ఈ దృష్ట్యా, ఆయన ఈ ఉపఎన్నికల్ని సద్వినియోగం చేసుకుని రేసులో దిగాలని కాంక్షించే కేడర్ ఎక్కువే. 2006లో తానొక్కడినే అసెంబ్లీ మెట్లు ఎక్కి, తదుపరి ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించిన విజయకాంత్, ఈ ఎన్నికల ద్వారా మళ్లీ పార్టీ తరఫున తానొక్కడే అడుగు పెట్టి, మళ్లీ అందలం ఎక్కే రీతిలో కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధం కావాలని సూచించే నాయకులు డీఎండీకేలో ఉండడం గమనార్హం. అయితే, కెప్టెన్ తుది నిర్ణయం ఏమిటో అన్నది ఆ పార్టీ వర్గాలకే అంతు చిక్కదు. -
విజయ్ కాంత్ కు మరో గండం!
చెన్నై: కుంటి కుక్కపై కొబ్బరి బొండం పడినట్టుగా తయారైంది డీఎండీకే నేత విజయ్ కాంత్ పరిస్థితి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన 'కెప్టెన్' పార్టీకి మరో గండం పొంచివుంది. ఆయన పార్టీ గుర్తింపు రద్దయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన విజయ్ కాంత్ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సంక్షేమ కూటమి(పీడబ్ల్యూపీ)తో జట్టు కట్టిన ఆయన ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఆయన కూడా ఓటమి పాలయ్యారు. డీఎండీకే పార్టీకి కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే కనీసం 6 శాతం ఓట్లు కలిగివుండాలి. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన డీఎండీకే 29 సీట్లు దక్కించుకుంది. ఈసారి పరిస్థితి తారుమారైంది. డీఎండీకేతో పొత్తుకు డీఎంకే ప్రయత్నించినా ఫలించలేదు. కరుణానిధితో 'కెప్టెన్' చేతులు కలిపితే ఫలితాలు మరోలా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఓటమి గల కారణాలను సమీక్షించుకుంటామని, తమ పరాజయానికి మనీ పవర్ ప్రధాన కారణంగా భావిస్తున్నామని మాజీ ఎంపీ కె. ధనరాజు తెలిపారు. -
తమిళనాట చతుర్ముఖ పోరు?
అన్నా డీఎంకే - డీఎంకేల మధ్య ప్రధాన పోరాటం జయ సర్కారు అధికారం నిలుపుకునే అవకాశం చిరకాలంగా తమిళనాడులో ప్రాంతీయ పార్టీల రాజ్యమే కొనసాగుతోంది. అయితే.. 1977-88 మధ్య ఎంజీఆర్ 11 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ తర్వాతి ఎన్నికల్లో గెలవలేదు. ఈసారి మాత్రం జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే సర్కారు అధికారం నిలుపుకుంటుందని సర్వేలు చెప్తున్నాయి. అయితే ఎన్నికల పోరాటంలో మాత్రం అన్నా డీఎంకే, డీఎంకేలతో పాటు.. డీఎండీకే, పీఎంకేలతో కూడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ ఒంటరిగా బరిలోకి దిగాల్సిన పరిస్థితి. దీంతో.. ఎన్నికల్లో చతుర్ముఖ పోరాటం సాగనుంది. జయకు మంచి ప్రజాదరణ అధికార అన్నా డీఎంకే కొన్ని చిన్న పార్టీలతో జట్టు కట్టి పోటీ చేస్తోంది. మొత్తం 234 స్థానాల్లో ఏడు స్థానాలను జయలలిత తన మిత్రపక్షాలకు కేటాయించారు. ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ గల నేత ఆమె. అమ్మ పేరుతో జయ అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లో ఆమె ప్రతిష్టను పెంపొందించాయి. గత రెండు విడతల పాలనలో ఆమెపై ఎటువంటి తీవ్ర అవినీతి ఆరోపణలూ రాకపోవటం మరో సానుకూలాంశం. అయితే.. పాత అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లి రావటం, ఇటీవలి వరదల్లో ప్రభుత్వ వైఫల్యం, సంక్షేమ పథకాలు అందరికీ అందకపోవటం వంటి అంశాలు.. అధికార పక్షం గెలుపును అంత సులువు చేయబోవని భావిస్తున్నారు. కోలుకోని కరుణానిధి గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కుదేలైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ.. కరుణానిధి సారథ్యంలోని డీఎంకే అవినీతి ఆరోపణలు కుటుంబ కలహాలతో ఇంకా కోలుకోలేదు. కాంగ్రెస్‌తో కలిసి ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. రెండేళ్ల కిందట శ్రీలంక తమిళుల అంశంపై విడిపోయిన ఈ రెండు పార్టీలూ మళ్లీ ఈ ఎన్నికల్లో చేతులు కలిపాయి. 92 ఏళ్ల వయసున్న కరుణానిధి వృద్ధాప్యంలోనూ రాజకీయ చతురుతతో ముందుకు వెళుతున్నారు. డీఎండీకే వంటి ఇతర పార్టీలను కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే జయకు కరుణ గట్టి పోటీ ఇవ్వగలరు. విజయ్‌కాంత్‌కు డిమాండ్ ఇక రాజకీయ నాయకుడిగా మారిన మరో ప్రముఖ నటుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కెప్టెన్ విజయ్‌కాంత్.. ఆయన పార్టీ డీఎండీకే కూడా ఈ ఎన్నికల్లో గణనీయ ప్రభావం చూపుతుందని అంచనా. వన్నియార్ సామాజికవర్గం ప్రధాన ఓటు బ్యాంకుగా గల డీఎండీకే.. తొలిసారి 2006లో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి పది శాతం ఓట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 39 స్థానాల్లోనూ పోటీచేసి మరింత మెరుగైన ఓట్ల వాటా సాధించింది. గత ఎన్నికల్లో అన్నా డీఎంకేతో కలిసి పోటీ చేసిన డీఎండీకే 29 సీట్లు గెలుచుకుంది. అనంతరం ఆ పార్టీతో వేరుపడి అధికారిక గుర్తింపు గల ప్రతిపక్షంగా కొనసాగుతోంది. ఈ పార్టీ సాధిస్తున్న ఓట్ల శాతం ఇతర పార్టీలను అమితంగా ఆకర్షిస్తోంది. తమిళనాట గట్టి పాగా వేసేందుకు డీఎండీకేతో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన తమతో చేయి కలుపుతారని డీఎంకే ఆశిస్తోంది. అయితే విజయ్‌కాంత్.. వామపక్షాలు, ఎండీఎంకే తదితర పార్టీలతో జట్టుకట్టి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ పేరుతో ఒక కూటమిగా బరిలోకి దిగుతున్నారు. ఈ ఫ్రంట్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌కాంత్‌ను ప్రకటించింది. మరోవైపు విజయ్‌కాంత్ ప్రభావాన్ని అడ్డుకునేందుకు అధికార అన్నా డీఎంకే 40 మంది వరకూ వన్నియార్ సామాజిక వర్గ అభ్యర్థులను బరిలోకి దించుతోంది. ఇక ఫ్రంట్‌లో చేరాలన్న విజయ్‌కాంత్ నిర్ణయాన్ని పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతికూల పరిణామాలతో పాటు.. విజయ్‌కాంత్ వ్యవహార శైలి కూడా వివాదాస్పదంగా మారింది. ఇటీవలే తనను చుట్టుముట్టిన జర్నలిస్టులపైకి ఆగ్రహంగా చేయి ఎత్తి కొట్టబోవటం వంటి ఉదంతాలు ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ ఒంటరి పోరాటం డీఎండీకే, వైకోలతో జట్టుకట్టి ఎన్నికల బరిలోకి దిగాలని ఆశించిన బీజేపీ.. చివరికి ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితి. పొత్తుకు డీఎండీకే నిరాకరించగా.. బీజేపీతో దోస్తీకి ఎండీఎంకే నేత వైకో గుడ్‌బై చెప్పారు. అనంతరం డీఎండీకేతో కలిసి ఎన్నికల బరిలోకి దిగారు.