అమెరికాలో భారతీయుడి హత్య
వాషింగ్టన్ : అమెరికాలో దోపిడీ దొంగల చేతిలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్ లోని ఏఎమ్–పీఎమ్ అనే గ్యాస్ స్టేషన్ లో క్లర్క్‌గా పనిచేస్తున్న విక్రమ్ జర్యాల్(26)పై సాయుధులైన ఇద్దరు ముసుగు దొంగలు కాల్పులు జరిపి హత్య చేశారు.
గురువారం దోపిడీకి పాల్పడిన దొంగలు... ఆ తర్వాత విక్రమ్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గాయపడిన విక్రమ్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాకు చెందిన విక్రమ్ నెల క్రితమే అమెరికాకు వెళ్లాడు.
My heartfelt condolences on your brother's tragic death. I am asking @IndianEmbassyUS to provide all help and assistance. https://t.co/e30cHGYEJE
— Sushma Swaraj (@SushmaSwaraj) 7 April 2017