Village Revenue Assistant
-
వీఆర్ఏలకు శుభవార్త
సాక్షి, అమరావతి : విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లకు డీఏ పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో వీఆర్ఏలకు రూ.300 ఉన్న డీఏను చంద్రబాబు ప్రభుత్వం రద్దుచేయడంతో దీన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) సీఎంను కలిసి కోరగా తక్షణం సానుకూలంగా స్పందించినట్లు ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన ఫైల్ సర్క్యులేట్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించడమే కాక అందులో డీఏను రూ.300 నుంచి రూ.500కు పెంచుతూ సీఎం సంతకం చేసినట్లు తెలిపారు. డీఏను పునరుద్ధరించడంతోపాటు దానిని పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడంపట్ల వీఆర్ఏలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ నిర్ణయంవల్ల సుమారు 20,000 మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక వీరికి డీఏ మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర రెవెన్యూ శాఖాధికారులకు ఏపీజీఈఎఫ్ తరఫున వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు వీఆర్ఏలకు గతంలో కేవలం రూ.300గా ఉన్న డీఏను నేడు రూ.500కు పెంచే ఫైలును ఆమోదించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి పక్షాన బొప్పరాజు, పలిశెట్టి దామోదర్‌రావు, చేబ్రోలు కృష్ణమూర్తిలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఈ సమస్యపై ముఖ్యమంత్రికి సిఫార్సు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. గత ప్రభుత్వం వీఆర్ఏల డీఏను రద్దుచేస్తే ఈ ప్రభుత్వం పునరుద్ధరించడమే కాక.. రూ.300 నుంచి రూ.500కు పెంచడంపై ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వాసా దివాకర్, ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలనాయుడులు కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లకు పేస్కేల్‌ను వర్తింపజేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది ఉద్యోగులు రెవెన్యూ శాఖలో వీఆర్ఏలుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని తెలిపారు. -
42 రోజుల సమ్మె.. 20 మంది వీఆర్ఏల మృతి.. సీఎం సారూ జర చూడు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ కొన్నిరోజులుగా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లు చేస్తున్న సమ్మె.. కొందరి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. 42 రోజుల సమ్మె కాలంలో దాదాపు 20 మంది వీఆర్ఏలు వివిధ కారణాలతో మరణించారు. వీరిలో పలువురు ఉద్యోగం క్రమబద్ధీకరణ కాదన్న మనస్తాపంతో గుండెపోటు కారణంగా ప్రాణాలు విడిచారని, మిగిలిన వారు దురదృష్టవశాత్తూ అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల్లో మరణించారని వీఆర్ఏలు చెబుతున్నారు. డిమాండ్లు సాధనకోసం సమ్మెకు దిగిన వీఆర్ఏలకు తోటి ఉద్యోగుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా తాము వెనకడుగు వేసేది లేదని, డిమాండ్లు నెరవేర్చుకునేదాకా సమ్మె విరమించబోమని వీఆర్ఏల రాష్ట్ర సంఘం స్పష్టం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 22,245 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరిలో 19,345 మంది నిజాం కాలంలో పనిచేసినవారినుంచి వా రసత్వంగా వచ్చిన ఉద్యోగాలు నిర్వహిస్తుండగా.. మిగిలిన 2,900 మంది ఉమ్మడి రా ష్ట్రంలో అప్పటి ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్‌గా నియుక్తులయ్యా రు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించి, పేస్కేలు, ఆరోగ్య బీమా, పింఛన్, పదోన్నతులు.. తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. సమ్మె ఎందుకు? సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఈ ఏడాది జూలై 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా తమకు పేస్కేలు అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే తమలో పీహెచ్‌డీలు, పీజీలు, ఎంటెక్, బీటెక్ వంటి ఉన్నత చదువులు ఉన్న వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 2016లో వీరికి పదోన్నతి కల్పించాల్సి ఉన్నా.. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా అది వాయిదాపడింది. అనంతరం 10 జిల్లాలు 33 అయ్యాయి. 42 రెవెన్యూ డివిజన్ల సంఖ్య 73కు చేరింది. మండలాలు 466 నుంచి 594 అయ్యాయి. ఈ పెంపునకు సరిపడా కొత్తగా వీఆర్ఏలను రిక్రూట్ చేయలేదు. పైగా ఇటీవల ధరణిని ప్రవేశపెట్టే సమయంలో దాదాపు 5,500 మంది వీఆర్వోలను తొలగించారు. దాంతో వారి పని కూడా వీరే చేయాల్సి వస్తోంది. దీంతో తమకు కనీస హక్కులు అమలు కావడం లేదన్న ఆందోళనలో ఉన్న వారంతా సమ్మెకు దిగారు. ఒక్కొక్క ప్రాణం గాలిలో.. సమ్మె మొదలైన తరువాత దాదాపు 20 మందికిపైగానే వీఆర్ఏలు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మందికి మనస్తాపంవల్ల గుండెపోటు రావడంతోనే మృతి చెందారని అంటున్నారు. 2015 నుంచి చూసుకుంటే ఈ సంఖ్య 100 మంది వరకు ఉంటుందని సమాచారం. ప్రభుత్వమే బాధ్యత వహించాలి మా తండ్రి తాళ్లపెల్లి పెద్దన్న నెలరోజులుగా సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించకపోయేసరికి.. పేస్కేల్ రాదనే మనోవేదనతో ప్రాణాలు విడిచారు. మా కుటుంబ పెద్దదిక్కును కోల్పోయాం. అనారోగ్యంతో ఉన్న మాతండ్రికి హెల్త్ కార్డులేక మెరుగైన వైద్యం అందించలేకపోయాం. నా తండ్రి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – తాళ్లపెల్లి భీమయ్య బాధిత కుటుంబాలను ఆదుకోవాలి ముఖ్యమంత్రి మమ్మల్ని ఆదుకుంటానని పలుమార్లు అసెంబ్లీలో చెప్పినా ఆ మాటలు నెరవేరలేదు. దీంతో ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో వీఆర్ఏలు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. – బాపుదేవ్, వీఆర్ఏ రాష్ట్ర సహాధ్యక్షుడు -
వీఆర్ఏలకు పేస్కేల్ అమలు అంశం: కామారెడ్డి వీఆర్ఏ ఆత్మహత్య
సాక్షి, కామారెడ్డి: తమ డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజులుగా నిర్విరామ నిరసన కార్యక్రమాలకు దిగారు తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏలు). ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు శాసనసభలో ప్రకటించినట్టుగా పేస్కేల్ అమలు చేయాలని కోరుతున్నారు. ఈక్రమంలో వీఆర్ఏల పోరాటంలో చురుకుగా పాల్గొన్న నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన వీఆర్ఏ అశోక్ తనువుచాలించాడు. పేస్కేల్ అమలు చేస్తారో లేదోనని మనస్తాపానికి గురైన అశోక్ బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. గ్రామంలోని చెరువుకట్ట వద్ద వీఆర్ఏ అశోక్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న వీఆర్ఏలు అశోక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. (చదవండి: మామ బాగా రిచ్..స్నేహితులను ఉసిగొల్పి దోపిడీ చేయించిన అల్లుడు) -
వీఆర్ఏల వివరాలు మరోసారి.. తహసీల్దార్లకు సీసీఎల్ఏ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) వివరాలను ప్రభుత్వం మరోసారి సేకరిస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 22 వేల మందికిపైగా వీఆర్ఏలు 19 రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరాలను సేకరించాలని నిర్ణయించడం గమనార్హం. వీఆర్ఏల ప్రధాన డిమాండ్ అయిన పేస్కేల్ అంశాన్ని తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలోనే యుద్ధప్రాతిపదికన వారి వివరాలను పంపాలని తహసీల్దార్లకు సీసీఎల్ఏ నుంచి ఆదేశం వచ్చిందని, అందుకే ఈ వివరాలను సేకరిస్తోందని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీఆర్ఏలకు పేస్కేల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. గౌరవ వేతనంపై నియమితులైన వీఆర్ఏలందరికీ పేస్కేల్ ఇవ్వడం సాధ్యం కాదని, డిగ్రీ విద్యార్హత ఉన్న వారికి మాత్రమే పేస్కేల్ ఇచ్చి వారిని రెవెన్యూలో కొనసాగించాలని, మిగిలిన వారికి గౌరవ వేతనాన్ని యథాతథంగా ఉంచి రెవెన్యూతోపాటు ఇతర విభాగాల్లో వినియోగించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ అంశాలివే..: వీఆర్ఏల వివరాలను పంపాలంటూ సీసీఎల్ఏ నుంచి వివిధ అంశాలతో కూడిన ఫార్మాట్ మళ్లీ తహసీల్దార్లకు అందింది. గతంలోనూ ఈ వివరాలను సేకరించినప్పటికీ అన్ని జిల్లాల నుంచి సమగ్ర సమాచారం అందలేదని, ఈ నేపథ్యంలోనే మళ్లీ కలెక్టర్ల నుంచి వివరాలు తీసుకుంటున్నారని తహసీల్దార్లు చెబుతున్నారు. వీఆర్ఏల పేరు, పనిచేస్తున్న గ్రామం, మండలం, తండ్రి పేరు, కులం, విద్యార్హత, అపాయింట్మెంట్ తేదీ, ఎలా నియమితులయ్యారు, పుట్టిన తేదీ, ప్రస్తుత వయసు, క్రమశిక్షణ చర్యలు ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా?, వీఆర్ఏ మొబైల్ నంబర్ వివరాలను ప్రభుత్వం మళ్లీ తీసుకుంటోంది. చదవండి: (Munugode- TRS Party: మంచి బట్టలు తొడిగినా ఓర్వలేడు.. ఆయనకు టికెట్టా!) -
వీఆర్వో పోస్టులకు 13 లక్షల దరఖాస్తులు
1,650 పోస్టులు.. 13 లక్షల దరఖాస్తులు వీఆర్ఏలకు 62,277 మంది దరఖాస్తు వచ్చే నెల 2న రాత పరీక్షలు సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ఈ పోస్టులకు దరఖాస్తుల సమర్పణకు గడువు ముగిసింది. ఈ పోస్టులకు 14,51,728 లక్షల మంది ఫీజు చెల్లించగా.. 14,08,998 మంది దరఖాస్తులను సమర్పించారు. 1,650 వీఆర్వో, 4,305 వీఆర్ఏ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 1,650 వీఆర్వో పోస్టులకు 13,08,916 మంది.. 4,305 వీఆర్ఏ పోస్టులకు 62,277 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో డిగ్రీ, పీజీలు చేసిన వారు ఎక్కువగానే ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పోస్టులకు ఫిబ్రవరి 2న రాత పరీక్షలు నిర్వహించ నున్నారు. 2వ తేదీ ఉదయం వీఆర్వోలకు, మధ్యాహ్నం వీఆర్ఏలకు పరీక్షలు జరగనున్నాయి. కాగా, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఏపీపీఎస్సీ చైర్మన్‌ను రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ఆదేశించారు. -
117 వీఆర్వో, 282 వీఆర్ఏ పోస్టుల భర్తీకి చర్యలు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో 117 గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), 282 గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ మేరకు శనివారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. మీ సేవ కేంద్రాల్లో 10 రూపాయలు చెల్లించి దరఖాస్తు ఫారం పొందే అవకాశం కల్పించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 150 రూపాయలు, ఇతర అభ్యర్థులు 300 రూపాయల పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఫిబ్రవరి 2వ తేదీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. వీఆర్వో పోస్టులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, వీఆర్ఏ పోస్టులకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ రెండు పరీక్షలు రాయాలనుకున్న అభ్యర్థులు ఒకేసారి ఫీజు చెల్లిస్తే ఒకే పరీక్ష కేంద్రంలో రాసే వెసులుబాటు కల్పించారు. వీఆర్వో పోస్టుకు ఇంటర్మీడియెట్, వీఆర్ఏ పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వీఆర్వో పోస్టులకు జిల్లాను, వీఆర్ఏ పోస్టులకు మండలాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. రాత పరీక్షను 100 మార్కులకు నిర్వహించనున్నారు. 60 మార్కులు జనరల్, 30 మార్కులు అర్ధమెటిక్స్, 10 మార్కులు లాజికల్ స్కిల్స్‌కు సంబంధించిప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్షలను జిల్లా కేంద్రమైన ఒంగోలులో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంచనాలకు మించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే డివిజనల్ కేంద్రాల్లో కూడా పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. జిల్లాలో భర్తీ చేయనున్న వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల వివరాలను కేటగిరీల వారీగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ విజయకుమార్ వెల్లడించారు. 117 వీఆర్వో పోస్టుల్లో 78 జనరల్, 39 ఉమెన్‌కు కేటాయించారు. 282 వీఆర్ఏ పోస్టుల్లో 134 జనరల్, 148 ఉమెన్‌కు కేటాయించారు. 29న వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు మోడల్ టెస్ట్ వీఆర్వో, వీఆర్ఏ రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఒంగోలులోని శివాలయం వద్దగల శృతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ ఉచిత అవగాహన సదస్సు, మోడల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డెరైక్టర్ వీ మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ టెస్ట్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ఉచితంగా కోచింగ్ ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 99511 61139, 97056 56125 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. వీఆర్వో పోస్టులు 117 ఓసీ జనరల్ 34 ఉమెన్ 19 ఎస్సీ జనరల్ 12 ఉమెన్ 6 ఎస్టీ జనరల్ 4 ఉమెన్ 2 బీసీ ఏ జనరల్ 5 ఉమెన్ 3 బీసీ బీ జనరల్ 1 ఉమెన్ -- బీసీ సీ జనరల్ 1 ఉమెన్ -- బీసీ డీ జనరల్ 7 ఉమెన్ 2 బీసీ ఈ జనరల్ 4 ఉమెన్ 1 పీహెచ్సీ వీహెచ్ జనరల్ 1 హెచ్‌హెచ్ ఉమెన్ 1 ఓహెచ్ జనరల్ 1 ఎక్స్‌సర్వీస్‌మన్ 2 వీఆర్ఏ పోస్టులు 282 ఓసీ జనరల్ 70 ఉమెన్ 30 ఎస్సీ జనరల్ 31 ఉమెన్ 5 ఎస్టీ జనరల్ 1 ఉమెన్ 5 బీసీ ఏ జనరల్ 4 ఉమెన్ 24 బీసీ బీ జనరల్ 1 ఉమెన్ 19 బీసీ సీ జనరల్ 11 ఉమెన్ -- బీసీ డీ జనరల్ -- ఉమెన్ 6 బీసీ ఈ జనరల్ -- ఉమెన్ 6 పీహెచ్సీ జనరల్ 33 ఎక్స్‌సర్వీస్‌మెన్ 16