Visakhapatnam Municipal Corporation
-
ప్లానింగ్‌లో ప్రకంపనలు
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో మూకుమ్మడి బదిలీలు ఒకేసారి 22 మందికి స్థానచలనం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి 11 మంది బదిలీ జీవీఎంసీ చరిత్రలో ఇంత భారీ బదిలీలు ఇదే తొలిసారి విశాఖపట్నం : అడుగడుగునా అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ అవినీతికి చిరునామాగా మారిన మహావిశాఖ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో మూకుమ్మడి బదిలీలు ప్రకంపనలు రేపుతున్నాయి. రికార్డు స్థాయిలో ఇక్కడ పని చేస్తున్న అధికారులకు స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో డిప్యూటీ సిటీ ప్లానర్‌తో సహా ఏసీపీ, టీపీవో, టీపీఎస్, తదితర అధికారులు సహా ఏకంగా 22 మందిని వివిధ మున్సిపాలిటీలకు బదిలీ చేశారు. టౌన్‌ప్లానింగ్ చరిత్రలో ఇంతమందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే తొలిసారి. కాగా వీరి స్థానంలో 11 మందిని వివిధ మున్సిపాలిటీల నుంచి బదిలీపై జీవీఎంసీలో నియమించారు. జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ అంటే అదో అవినీతి గని అన్న ముద్ర పడిపోయింది. ఈ విభాగంలో పైస్థాయి నుంచి కింద స్థాయి వరకు ఎవరిస్థాయిలో వారు అక్రమకట్టడాలను ప్రోత్సహిస్తూ రెండు చేతూలా దండుకుంటున్నారనే ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. ఈ విభాగంలో పనిచేసి కోట్లు గడించిన వారు ఇటీవల ఏసీబీకి చిక్కిన విషయమూ తెలిసిందే. ఈ విభాగాన్ని ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. చీఫ్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్(సీటీపీవో) వెంకటరత్నాన్ని కూడా రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ కు కేటాయిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయనకు ఇంకా రిలీవింగ్ ఆర్డర్ రాలేదు. రేపో మాపో రిలీవింగ్ ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయి. కాగా డిప్యూటీ సిటీ ప్లానర్‌గా పనిచేస్తున్న పి.ప్రదీవ్కుమార్ను గుంటూరు బదిలీ చేయగా ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. ముగ్గురు అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్స్‌తో పాటు ఆరుగురు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, ఆరుగురు టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్లు, ఆరుగురు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ ర్సీర్లపై కూడా బదిలీ వేటు పడింది. వారి స్థానంలో వివిధ మున్సిపాలిటీల నుంచి ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు టీపీవోలు, ఇద్దరు టీపీబీవోలు, ఐదుగురు టీపీఎస్‌లను ఇక్కడికి బదిలీ చేశారు. తాజా బదిలీలతో ఖాళీ అయిన డీసీపీతో సహా నాలుగు టీపీవో, ఒక టీపీఎస్, నాలుగు టీపీబీవో పోస్టుల్లో ఎవర్ని నియమించలేదు. -
ఎందుకో.. ‘మహా’ మక్కువ!
ఇతర శాఖల అధికారులకది కామధేనువు కాసులు కురిపించే కల్పతరువు అందుకే జీవీఎంసీపై ఇతర శాఖల అధికారుల మోజు ఇక్కడికి రావడానికి హోదా తగ్గించుకునేందుకైనా సిద్ధం క్యూ కడుతున్న అన్ని శాఖల అధికారులు అదిపురపాలకశాఖలోని ఒక సంస్థ. కానీ ఇప్పుడు దాదాపు అన్ని శాఖల అధికారుల దృష్టి దానిపైనే ఉంది. ఏమైనా సరే.. ఎలా అయినా సరే.. ఒక్కసారి ఆ సంస్థలోకి డిప్యుటేషన్ మీద వెళ్లాల్సిందే!.. అని పలు శాఖల అధికారులు తెగ ఆరాటపడిపోతున్నారు. ఎంతగా తాపత్రయ పడుతున్నా రంటే.. కొందరు ప్రస్తుత తమ స్థాయికితగని పోస్టు అయినా సరే.. ఓకే అంటున్నారు. ఇంత మందిని.. అంతగా ఆకర్షిస్తున్న ఆ సంస్థ.. దాని ప్రత్యేకతలేమిటయ్యా.. అంటే.. అదే మహావిశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ).. కాసులు కురిపించే కామధేనువులాంటి ఈ సంస్థలో కనీసం ఒక ఏడాదైనా పని చేస్తే.. కరువు తీరిపో తుందన్న భావన ఇతర శాఖల అధికారులది. అయితే అలా వచ్చిన వారు ఇక్కడే తిష్ట వేసేస్తున్నారు. విశాఖపట్నం: పురపాలక శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బందికే కాదు.. ఇతర శాఖలకు చెందిన వారికి కూడా జీవీఎంసీ కల్పతరువుగా మారుతోంది. ఇక్కడ పని చేసేందుకు ఇతర శాఖల అధికారులు తెగ ఉబలాటపడుతున్నారు. ఏళ్ల తరబడి తిష్టవేసి అందిన కాడికి దండుకుంటూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. జీవీఎంసీలో పనిచేసేందుకు మాతృశాఖకు చెందిన వారి కంటే ఇతర శాఖలకు చెందిన వారే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ పరిస్థితి ఏదో ఒక డిపార్టుమెంట్‌కు పరిమితం కాదు. దాదాపు అన్ని శాఖలకు చెందిన వారు జీవీఎంసీకి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ సెక్షన్లో పనిచేసేందుకు పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగాలకు చెందినవారు పైరవీలకు పాల్పడుతున్నారు. చివరికి హోదాను సైతం తగ్గించుకునేందుకు వెనుకాడటం లేదు. జీవీఎంసీలో వందల కోట్ల విలువైన పనులు జరుగుతుండడం.. ప్రతి పనిలోనూ ఓ పక్క పర్సంటేజీలు.. మరో పక్క భారీగా ముడుపులు అందే అవకాశం ఉండడంతో ఇక్కడ కొద్దికాలమైనా పని చేసే అవకాశం కోసం ఆరాటపడుతున్నవారు.. తీరా ఆ అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడే పాతుకుపోతున్నారు. అబ్బే పిల్లల చదువులు, వైద్యం కోసమే! ఇతర శాఖల కంటే జీవీఎంసీలోనే పనిచేసేందుకు ఎందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రశ్నిస్తే.. విశాఖలో ఉన్న విద్య, వైద్య సౌకర్యాల కోసమేనని కొందరు సమర్థించుకుంటున్నారు. కానీ వాస్తవం అది కాదన్నది బహిరంగ రహస్యం. అదే వాస్తవమైతే.. నగరంలో ఇంకా చాలా శాఖలు, విభాగాలు ఉన్నా.. ఒక్క జీవీఎంసీకే ఎందుకు క్యూ కడతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటువంటి వారందరికీ జీవీఎంసీ కామధేనువులా కన్పిస్తోంది. పిండుకున్న వాడికి పిండుకున్నంత అన్నట్టుగా ఇక్కడి పరిస్థితి ఉంది. ఈ కారణంగానే ఇక్కడ పనిచేసేందుకు ఇతర శాఖల అధికారులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఇక్కడ తిష్ట వేసిన అధికారులను పరిశీలిస్తే.. పంచాయతీరాజ్ శాఖ నుంచి డిప్యుటేషన్‌పై కుమార్ రాజు, కృష్ణకుమార్, వెంకట్రావు, బాలాజీలు జీవీఎంసీకి వచ్చారు. కుమార్రాజు, కృష్ణకుమార్‌లు నాలుగైదేళ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. వెంకట్రావు వచ్చి మూడేళ్లు దాటి పోయింది. ఇటీవలే డిప్యుటేషన్‌పై వచ్చిన బాలాజీ కీలకమైన టీఎస్ఆర్ వాటర్ వర్క్స్ ఏఈగా బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్‌లో డిప్యుటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హోదాలో పనిచేస్తుండగా, తమ హోదాను తగ్గించుకుని ఏఈలుగా ఇక్కడ పనిచేసేందుకు వస్తున్నారు. వీరే కాదు.. జీవీఎంసీ రెవెన్యూ, పబ్లిక్‌హెల్త్, ఎడ్యుకేషన్, యూసీడీ, యూజీడీ విభాగాల్లో కూడా ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన పనిచేస్తున్న వారు లెక్కకు మించే ఉన్నారు. జోనల్ కమిషనర్‌గా చక్రధరరావు తాజాగా డిప్యుటేషన్‌పై మరో అధికారి ఇక్కడకు వస్తున్నారు. జిల్లా స్థాయి అధికారిగా పనిచేస్తున్న ఆయన ఇక్కడ జోనల్ కమిషనర్‌గా పని చేసేందుకు వస్తుండటం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వి.చక్రధరరావును జీవీఎంసీలో జోనల్ కమిషనర్‌గా బదిలీపై నియమించారు. ఈయన మాతృశాఖ సాంఘిక సంక్షేమ శాఖ. ఈయన గతంలో డిప్యుటేషన్‌పై తూర్పుగోదావరి జిల్లా ఆర్వీఎం(సర్వశిక్ష అభియాన్) పీవోగా పనిచేశారు. అక్కడ పనిచేసినంత కాలం ఈయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దుస్తుల కొనుగోలు, అదనపు తరగతి గదుల నిర్మాణంలో సుమారు రూ.5 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు విజిలెన్స్ విచారణలో సైతం గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం జిల్లా స్థాయి అధికారిగా పనిచేస్తున్న చక్రధరరావు ఇక్కడ ఒక జోన్‌కు కమిషనర్‌గా పనిచేసేందుకు వస్తున్నారు. ఏడాది పాటు ఈయన డిప్యుటేషన్‌కు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికాల వలవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా ఇతర శాఖల అధికారులు ఇక్కడ పనిచేయడానికి క్యూ కడుతుండడం చూస్తుంటే జీవీఎంసీ కామధేనువనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. -
జీవీఎంసీ బడ్జెట్.. సైజ్ భారీ!
2016-17 బడ్జెట్ రూ.2500-రూ.3000 కోట్లమధ్య ఉండే అవకాశం కనీసం 20 శాతం వృద్ధి అంచనాతో అధికారుల కసరత్తు కేంద్ర పథకాలు, పన్ను ఆదాయం పెరుగుతుందని అంచనా తుదిరూపు ఇచ్చేందుకు నేడు కీ లక భేటీ ఎన్నికల దృష్ట్యా టీడీపీకి మేలు చేకూర్చేలా కేటాయింపులు? విశాఖపట్నం : స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) వార్షిక బడ్జెట్‌ను కూడా అదేస్థాయిలో రూపొందించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ కోణం కూడా అంతర్లీనంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి రాష్ట్రానికి అనధికార రాజధానిగా ఉన్న విశాఖలో పాగా వేయాలని అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఈ ఏడాదిలోనే జీవీఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతోంది. ఈ లోగా భారీ బడ్జెట్ కేటాయింపులతో ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకు అనుగణంగానే 20 శాతం పెంపుదలతో సుమారు రూ.2700 కోట్లతో అంచనా బడ్జెట్ ప్రవేశపెట్టాలని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు జీవీఎంసీలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం కీలక భేటీ జరగనుంది. 20 శాతం వృద్ధి అంచనా ఆదాయం వృద్ధి రేటు 20 శాతం ఉందని చెబుతున్న అధికారులు ఆ మేరకు 2016-17 ఆర్థిక సంవత్సరానికి జీవీఎంసీ బడ్జెట్‌ను పెంచాలని దాదాపు నిర్ణయించారు. 2014-15లో రూ. 1701 కోట్లుగా ఉన్న నగరపాలక సంస్థ ఆదాయం 2015-16లో రూ.2194 కోట్లకు పెరిగింది. 2016-17లో ఈ మొత్తం రూ.2700 కోట్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం వృద్ధి రేటు కనీసం 20 శాతం(రూ.600 కోట్ల మేరకు) పెరగవచ్చని అంటున్నారు. కాగా గత ఏడాది రూ.200 కోట్ల మిగులు బడ్జెట్ ఆమోదించగా.. ఈ ఏడాది కనీసం రూ.300 కోట్ల మిగులు ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కలకు కేంద్ర పథకాల ద్వారా అందే నిధులు ఊతమిస్తున్నాయి. స్మార్ట్ సిటీ కింద కేంద్రం నుంచి తొలి ఏడాది రూ.100 కోట్లు వస్తాయని, అలాగే అమృత్ పథకం కింద రూ.139 కోట్లు, స్వచ్ఛ భారత్‌కు రూ.140 కోట్లు, ఐఎఫ్ఆర్కు రూ.90 కోట్లు, విపత్తుల నిర్వహణ కింద మరో రూ.100 కోట్లు అందుతాయని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. ఇతర ఆదాయాల్లోనూ వృద్ధి కొత్త పన్నుల అసెస్మెంట్, నాన్అసెస్మెంట్, అనధికార నిర్మాణాలు, నీటి పన్ను, అడ్వర్టైజ్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, కల్యాణ మండపాలు, లీజు రెన్యువల్స్, ట్రేడ్ లెసైన్సుల ద్వారా గత ఏడాది కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంటింటి సర్వే ద్వారా అండర్ అసెస్మెంట్, నాన్అసెస్మెంట్ భవనాలు, నిర్మాణాలను గుర్తించి పన్నులు విధించడం ద్వారా అదనపు ఆదాయం సమకూరినట్టుగా చెబుతున్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ , ప్రభుత్వ స్థలాలల్లోని కట్టడాల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన జీవో 296 ద్వారా భారీగా ఆదాయం ఆర్జించవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే శాఖలవారీగా అందిన అంచనాలకు తుదిమెరుగులు దిద్దేందుకు జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం కీలక సమావేశం జరుగనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో శాఖల వారీగా ఆదాయ అంచనాలపై ఈ సమావేశంలో చర్చించి బడ్జెట్ అంచనాలు ఖరారు చేస్తారు. ఇప్పటికే బడ్జెట్ రూపకల్పనలో జాప్యం జరిగినట్టుగా చెబతున్నారు. సాధారణంగా నవంబర్ 10లోగా స్టాండింగ్ కమిటీకి బడ్జెట్ సమర్పించాల్సి ఉంది. డిసెంబర్ 10 నాటికి జీవీఎంసీ ఆమోదం పొందిన తర్వాత కౌన్సిల్ లేదా స్పెషల్ ఆఫీసర్ ఆమోదంతో ప్రభుత్వానికి ఫిబ్రవరి 25 కల్లా సమర్పించాలి. మార్చి 1లోగా రాష్ర్ట ప్రభుత్వంతో ఆమోదింపజేయాలి. ఇలా అయితేనే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు అందుతాయి. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు రూ.2500 కోట్ల నుంచి రూ.3వేల కోట్ల మధ్య ఉంటాయని, మంగళవారంనాటి భేటీలో తుదిరూపునిచ్చి ప్రభుత్వామోదానికి పంపిస్తామని జీవీఎంసీ ఏడీసీ(ఫైనాన్స్) వర్మ ‘సాక్షి’కి తెలిపారు. -
కొత్త ప్రాజెక్టులకు ప్రాధాన్యం
జీవీఎంసీ బడ్జెట్ తయారు ఖర్చు రూ. 2010 కోట్లు మిగులు బడ్జెట్ రూ. 100 కోట్లు ఇంజినీరింగ్‌కే అగ్రస్థానం విశాఖపట్నం సిటీ : మహా విశాఖ నగర పాలక సంస్థ భారీ అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించింది. రూ. 2110 కోట్ల మొత్తంతో 2015-16 సంవత్సర బడ్జెట్‌ను తయారు చేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు రూ.174 కోట్ల అంచనాలను పెంచింది. అందులోనూ రూ. 100 కోట్ల మిగులు బడ్జెట్‌తో జీవీఎంసీ పనులు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. గతంతో పోల్చుకుంటే కొత్త ఇంజనీరింగ్ ప్రాజెక్టులకే పెద్ద పీట వేస్తోంది. స్మార్ట్ సిటీ అభివృద్దికి తగ్గట్టుగానే కొత్త బడ్జెట్ రూపకల్పన చేశారు. ప్రాజెక్టుల కోసం రూ. 15 కోట్లే కేటాయించినా నాలుగో వంతు ఇంజినీరింగ్ పనులకే కేటాయించారు. వర్కింగ్ బ్యాలెన్స్‌గా రూ. 100 కోట్ల నికర మొత్తాన్ని వుంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. రూ. 2110 కోట్ల ఆదాయం వస్తుంటే అందులో రూ.2010 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేసింది. ఇంజనీరింగ్ విభాగానికి కేటాయించిన రూ. 570 కోట్లలో కొత్తగా నిర్మించే ప్రాజెక్టులకు రూ.415 కోట్లు కేటాయించారు. పాత ఇంజనీరింగ్ పనుల నిర్వహణకు రూ. 154 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. కొత్త పన్నులు లేనట్టే..! ఏప్రిల్ నుంచీ అమల్లోకి వచ్చే బడ్జెట్లో కొత్త పన్నుల భారం వుండకపోవచ్చని తెలిసింది. కొత్త ప్రాజెక్టులు వస్తున్నందున ఆదాయం కాస్త పెరిగే ఛాన్స్ వుందంటున్నారు. కౌన్సెల్ లేనందున ఈ బడ్జెట్ నివేదిక పట్టుకుని పట్టణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎ. గిరధర్ వద్దకు వెళ్లి బడ్జెట్‌ను ఆమోదించుకుని తేవడం ఒక్కటే మిగిలి వుంది. జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్కుమార్తోబాటు ఫైనాన్స్ అధికారుల బృందం ఈ మేరకు హైదరాబాద్ వెళ్లి ఆమోదింపజేసుకుని రావాల్సి వుంది. -
మేయర్ పీఠాన్ని సాధిద్దాం
సీతమ్మధార : రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని, మేయర్ పీఠాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడానికి ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కోరారు. అక్కయ్యపాలెం షాదీఖానాలో సోమవారం ఉదయం వైఎస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారం కోల్పోయినా ప్రజలు, పార్టీ కార్యకర్తల సహకారంతో ప్రతిపక్ష నాయకుడి హోదాను పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్మోహనరెడ్డి జిల్లాలో ఆరురోజులు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారన్నారు. తుపానులో మృతి చెందినవారి కుటుంబానికి పార్టీపరంగా రూ.50 వేల వంతున నష్టపరిహారం అందించామన్నారు. తైనాల విజయకుమార్ మాట్లాడుతూ పార్టీలో జరిగిన ప్రతి చిన్నపొరపాటును కార్యకర్తలు, నాయకులు భూతద్దంలో చూసేకంటే దానిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటే పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అవుతుందన్నారు. నియోజకవర్గంలోని వార్డు ముఖ్యనాయకులు, ప్రతి కార్యకర్త జీవీఎంసీ ఎన్నికలలో ఎక్కువ మంది కార్పొరేటర్లను గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. త్వరలో వార్డు కమిటీలు, అనుబంధ సంఘాలు, బూత్‌స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం పార్టీ కార్యకలాపాలు, బలోపేతం వంటి విషయాలపై ముఖ్యనాయకులు, కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకుడు ఫరూఖీ, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, మాజీ కార్పొరేటర్లు జి.వి.రమణి, పామేటి బాబ్జీ, మువ్వల పోలారావు, సేనాపతి అప్పారావు, ఎ.వి.ఎస్.నాయుడు, కల్చరల్ విభాగం కన్వీనర్ రాధ, సనపల చంద్రమౌళి, షబ్నం అఫ్రోజ్, వివిధ వార్డుల ముఖ్యనాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -

మరీ ఇంత శత్రుత్వమా!
ఆరోగ్యమిత్రలకు అడుగడుగునా అన్యాయమే అరకొర వేతనాలు కానరాని ఈఎస్ఐ కార్డులు పీఎఫ్ అనుమానమే పట్టించుకోని అధికారులు విశాఖపట్నం,న్యూస్‌లైన్ : తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం కోసం నిరీక్షించే పేదలకు వారు నిజంగా ఆరోగ్య మిత్రలే.. ఆపద్బంధువులే. అయితే వారు మాత్రం తమ జీవితాలకు సంబంధించి ఎంతో శత్రుత్వాన్ని ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో సమన్వయకర్తలుగా పని చేస్తున్న ఆరోగ్యమిత్రలు ఉద్యోగాలకు, వేతనాలకు సంబంధించి అనేక సమస్యల నడుమ పని చేస్తున్నారు. విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని డిస్పెన్సరీలు, జిల్లాలోని ఆరోగ్యకేంద్రాల్లో 105 మందిఆరోగ్యమిత్రలు 2007 నుంచి పనిచేస్తున్నారు. రోగుల ఆరోగ్యం గురించి పట్టించుకునే తమ బాగోగుల గురించి ఆలోచించేవారే కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది సమన్వయకర్తలు, కలెక్టర్లకు మొర పెట్టుకున్నా తమ సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయని అంటున్నారు. ఔట్సోర్సింగ్ సంస్థ శ్రమ దోపిడీ చేస్తున్నా ఇటు జిల్లాయంత్రాంగం గాని, అటు కార్మిక శాఖగాని పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. మొదట్లో వీరి వేతనం రూ.3,900 కాగా, తరువాత రూ.2,500కి తగ్గించేశారు. 2012 నుంచి కటింగ్‌లు పోనూ రూ.4,600 వంతున చెల్లిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఈ వేతనాలతో ఎలా బతకాలో అర్ధం కావడం లేదని వీరు గగ్గోలు పెడుతున్నారు. విధులివీ ఆరోగ్యమిత్రలు డిస్పెన్సరీలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విధులు నిర్వహిస్తారు. ఆరోగ్యశ్రీ సేవల కోసం రోగులకు ఆస్పత్రులను సిఫార్సు చేస్తారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫీల్డ్ వర్క్ చేస్తారు. ఒక్కో ఆరోగ్యమిత్ర రెండు నుంచి మూడు వార్డులలో సేవలందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ చికిత్సల తరువాత ఏడాది కాలం వరకు రోగుల బాగోలను వీరే చూసుకోవాల్సి వుంటుంది. సమస్యలివీ పీఎఫ్, ఈఎస్ఐ మొత్తాలు మినహాయిస్తున్నా సంబంధిత సంస్థలకు ఈ మొత్తాలుమ చేస్తున్నారో లేదోనన్న సందేహం ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా కనీసం ఈఎస్ఐ కార్డులు కూడా అందించని యాజమాన్యం అందరికీ ఆరోగ్య సేవల కోసం పనిచేస్తున్న వీరి ఆరోగ్యానికి కనీస రక్షణ శూన్యం ఆందోళనలే మిగులు ప్రస్తుతం వీరంతా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ (హైదరాబాద్) సంస్థ కింద ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. కలెక్టర్, ఆరోగ్యశ్రీ సమన్వయకర్తలు మారినప్పుడల్లా తమ బాధలు వెళ్లబోసుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. 2011లో తమకు టీఏ బిల్లుకింద నెలకు రూ.వెయ్యి ఇస్తామన్నారని, అది కార్యరూపం దాల్చలేదని అంటున్నారు.