Vishal Mishra
-
ఖరీదైన కారు కొన్న ఆర్ఆర్ఆర్ సింగర్.. ఎన్ని కోట్లంటే?
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్లో రిలీజైన యానిమల్ దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలో కనిపించింది. అయితే ఈ చిత్రంలోని పెహేలే భీ మే, కబీర్ సింగ్ కైసే హువా అనే పాటలను ఆలపించారు ప్రముఖ సింగర్ విశాల్ మిశ్రా. తాజాగా అతను ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఆధునాతన సౌకర్యాలున్న లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ కారును సొంతం చేసుకున్నారు. ఈ కారు ధర దాదాపు రూ.3.50 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. సింగర్ విశాల్ గతంలో యోధా , సత్యప్రేమ్ కి కథ, చోర్ నికల్ కే భాగే, ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ నాటు నాటు సాంగ్ పాడారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన రాబోయే చిత్రం బడే మియాన్ చోటే మియాన్లో పాటలను ఆలపించారు. ఈ చిత్రంలో మానుషి చిల్లర్, అలయ ఎఫ్, సోనాక్షి సిన్హా, రోనిత్ బోస్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఏప్రిల్ 11, 2024న థియేటర్లలో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Vishal Mishra (@vishalmishraofficial) -
ఆర్ఆర్ఆర్ అప్డేట్ : స్టూడియోలో మ్యాజిక్ జరిగిందట
విజువల్స్ పరంగా మాత్రమే కాదు... మ్యూజిక్ పరంగా కూడా స్పెషల్ కేర్ తీసుకుంటుంటారు దర్శకుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) విషయంలోనూ ఇదే ఫాలో అవుతున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ విశాల్ మిశ్రాతో పాట పాడించారట రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’ సంగీత దర్శకుడు కీరవాణి, రాజమౌళితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు విశాల్ మిశ్రా. ‘‘ఆర్ఆర్ఆర్’ కోసం స్టూడియోలో మేం మ్యాజిక్ చేశాం. కమింగ్ సూన్’’ అని పేర్కొన్నారు విశాల్. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఈ ఏడాది అక్టోబరు 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. We made magic today at the studio 🎶 R.R.R coming soon ❤️ @ssrajamouli @RRRMovie #mmkeeravani #vishalmishra #bestcompany pic.twitter.com/ENU5Mwvoo0 — Vishal Mishra (@VishalMMishra) April 10, 2021 -
ఛోటా షకీల్ నుంచి బెదిరింపు కాల్స్!
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడిభుజంగా వ్యవహరించే ఛోటా షకీల్ నుంచి బాలీవుడ్ దర్శకుడు, నిర్మాతలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై రైటర్ కమ్ డైరెక్టర్ విశాల్ మిశ్రా, నిర్మాత వినోద్ రమణి మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఛోటా షకీల్ ఆఫీస్ నుంచి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఢిల్లీ డీసీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదుచేశారు. తాము తీసిన మూవీలో కొన్ని సీన్లు డిలీట్ చేయాలని, లేనిపక్షంలో విడుదల చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారని వారు తెలిపారు. డీసీపీ బీకే సింగ్ కథనం ప్రకారం.. బాలీవుడ్ లేటెస్ట్ మూవీ 'కాఫీ విత్ డి' ప్రమోషన్ ఈవెంట్స్ ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ మూవీలో దావూద్ ఇబ్రహీంపై జోకులు ఉన్న సీన్లు, అతడ్ని చెడుకోణంలో చిత్రీకరించిన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని ఖచ్చితంగా తొలగించాలని, లేకపోతే మూవీనే విడుదల చేయవద్దని ఛోటా షకీల్ ఆఫీస్ నుంచి తమకు కాల్స్ వచ్చాయిన వారు ఫిర్యాదుచేశారు. తమకు ముంబైతో సబంధంలేని కారణంగా ఢిల్లీలో ఫిర్యాదు చేస్తున్నట్లు డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెప్పారు. మొదట వారికి ఢిల్లీ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత దుబాయ్ నుంచి కాల్స్ చేసి తాము చెప్పింది చేస్తారా లేదా అని హెచ్చరించారు. సునీల్ గ్రోవర్ (కపిల్ శర్మ షో ఫేమ్) అనే జర్నలిస్టు దావూద్ ఇబ్రహీంను ఇంటర్వ్యూ చేసే సీన్లు ఈ మూవీలో ఉన్నాయి. ఇవే సమస్యకు దారితీశానని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేశామని, విచారణ చేపట్టనున్నట్లు డీసీపీ వివరించారు.