Vittal reddy
-
30 ఏళ్లుగా అదే రుచి..
సాక్షి, భైంసా(ముథోల్) : భైంసాలో ఇప్పటికీ గడ్డెన్న ఆఫీసుగా చెప్పుకునే ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి వచ్చే కార్యకర్తలకు ఆనవాయితీగా అటుకులు, పేలాలే టిఫిన్‌గా అందించడం కొనసాగుతోంది. ముథోల్ గడ్డపై చెరగని ముద్ర వేసుకున్న గడ్డెన్న కాకా వారసత్వం కొనసాగుతోంది. దివంగత గడ్డెన్న ఆరుసార్లు రికార్డు స్థాయిలో ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. గడ్డెన్న బతికున్నంతకాలం ఇక్కడి వారంతా కాకా అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆయన ఉన్న ప్రతిరోజు ఇక్కడికి వచ్చే కార్యకర్తలందరికీ అల్పాహారాలు తినిపించి, యోగక్షేమాలు తెలుసుకుని పంపేవారు. సలీం చేతిలో.. సలీం.. ఈ పేరు ముథోల్ నియోజకవర్గంలో అందరికీ చూపరిరిచితం. దివంగత గడ్డెన్న మన మధ్యలేక పదిహేనేళ్ల కాలం గడుస్తోంది. గడ్డెన్న బతికున్నంతకాలం అక్కడికి వచ్చేవారికి ఆయన వంట మనిషి సలీం అటుకులు, పేలాలు తాళింపు వేసి సిద్ధంగా ఉంచేవారు. తన వద్దకు వచ్చిన అనుకూలురైనా, వ్యతిరేకులైనా ఉదయం వేళ వస్తే టిఫిన్, రాత్రి వేళ వస్తే భోజనం చేయించి పెట్టేవారు. ముథోల్ నియోజకవర్గ ప్రజలు గడ్డెన్న కాకా అభిమానులు పట్టణానికి ఏ పని కోసం వచ్చినా ఇక్కడి గడ్డెన్న కాకా ఆఫీసులో టిఫిన్ చేసి వెళ్లేవారు. 2004 ఏప్రిల్ 20న గడ్డెన్న కాకా మరణ అనంతరం ఆయన కుమారులు విఠల్‌రెడ్డి, సూర్యంరెడ్డిలు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 30 ఏళ్లుగా.. ముప్పయ్యేళ్లుగా అప్పుడు, ఇçప్పుడు అదే సలీం వంట మనిషిగా ఉన్నారు. గడ్డెన్న కాకా బతికున్న సమయంలోనూ విఠల్‌రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనూ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినప్పడు సలీ మే వంట మనిషిగా ఉన్నాడు. ముప్పయ్యేళ్ల నుంచి ఒకే రుచితో అటుకులు, పేలాలు అల్పాహారాన్ని తయారు చేసి పెడుతున్నాడు. కాకా అభిమానులు ఆయన కార్యకర్తలు సలీం చేతి అటుకులు, పేలాలుతినేందుకే ఇష్టపడుతుం టా రు. రుచికరమైన అటుకులు, పేలాలు తినేం దు కు గడ్డెన్న కాకా ఆఫీసుకు వస్తుంటారు. అప్ప ట్లో గడ్డెన్న వద్ద ఇప్పట్లో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి వద్ద వంట మనిషిగా పని చేస్తున్న సలీం ఎలాం టి అహంభావం లేకుండా సదాసీదాగా ఉంటాడు. ఇప్పటికీ ఆ కుటుంబమే.. ఈ కుటుంబం వద్దే పనిచేయాలని అనిపిస్తుంది. గడ్డెన్న సాబ్ జమానా నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. ఎంతోమంది పిల్లలు అప్పట్లో తండ్రులతో కలిసి ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడంతా రాజకీయ నాయకులుగా ఎదిగి మండల స్థాయి పదవులు చేస్తున్నారు. గడ్డెన్న కాకా దివంగతులయ్యాక విఠల్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా నేను వంటమనిషిగానే ఉన్నాను. వంటమనిషిలా కాకుండా కుటుంబ సభ్యునిగా చూసుకునే గడ్డిగారి ఆత్మీయతను ఎప్పటికీ మర్చిపోలేను. ఎన్నిరోజులైనా ఇక్కడే వంటమనిషిగా కొనసాగుతాను. – సలీం, వంటమనిషి -
కొంపముంచే ‘క్రాస్ ఓటింగ్’
సాక్షి, భైంసా : నేరుగా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే క్రాస్ ఓటింగ్ ఒక్కోసారి సత్ఫలితాలనిచ్చినా.. కొంప ముంచే అవకాశాలే ఎక్కువ! నచ్చిన నాయకున్ని గెలిపించాలనే తాపత్రయంలో లెక్క గానీ తప్పితే.. ఆ నాయకుడు మరో ఐదేళ్ల దాకా పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సిందే! 2009 ఎన్నికలప్పుడు ముథోల్ నియోజకవర్గంలో ఈ విషయమే తేటతెల్లమైంది! 2009 ఎన్నికల్లో ముథోల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేణుగోపాలాచారి, కాంగ్రెస్ అభ్యర్థిగా బోస్లే నారాయణరావు పటేల్, ప్రజారాజ్యం అభ్యర్థిగా విఠల్‌రెడ్డి శాసనసభ బరిలో దిగారు. అప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడంతో లోక్‌సభ స్థానం టీడీపీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్, ప్రజారాజ్యం అభ్యర్థిగా నాగోరావు పోటీలో ఉన్నారు. అయితే, టీడీపీ నుంచి పోటీ చేసిన రాథోడ్ రమేశ్ సామాజికవర్గీయుల్లో చాలా మంది విఠల్‌రెడ్డి మద్దతుదారులు. విఠల్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్టు రాకపోవడంతో అంతా కలిసి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. అప్పుడు తన సామాజికవర్గం ఓట్ల కోసం రాథోడ్ రమేశ్ ప్రజారాజ్యం పార్టీలో చేరిన విఠల్‌రెడ్డి మద్దతుదారుల సాయం కోసం అభ్యర్థించారు. ఇందులో భాగంగా వారిని ఎమ్మెల్యే స్థానానికి ఎవరికి ఓటేసినా.. ఎంపీ స్థానానికి మాత్రం తనకే ఓటేయాలని మాట తీసుకున్నట్లు సమాచారం! దీంతో టీడీపీ నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన సముద్రాల వేణుగోపాలాచారికి కష్టమొచ్చింది. రాథోడ్ రమేశ్ కూడా అంతా సాఫీగానే జరుగుంతుందని అనుకున్నారు. కానీ, క్రాస్ ఓటింగ్ జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. తమ సామాజికవర్గ నాయకుడిని ఎంపీగా గెలిపించాలన్న ఆలోచనలో ఓటు వేసేటప్పుడు చాలా మంది ఓటర్లు పొరపాటుపడ్డారు. ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్‌రెడ్డికి అనుకుని వేసిన ఓటు ఎంపీ అభ్యర్థి నాగోరావుకు.. ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేశ్‌కు అనుకున్న ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాలాచారికి పడ్డాయి. ఫలితాలు వచ్చే వరకు ఈ విషయం ఎవరికీ తెలియరాలేదు. గెలుపు తమదేనని ప్రజారాజ్యం పార్టీ అప్పట్లో ధీమాగా ఉంది. కానీ, కౌంటింగ్ రోజున అసలు విషయం తేలిపోయింది. 16 మే 2014న ఆదిలాబాద్‌లో ఓట్ల లెక్కింపు జరిగింది. ఆ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు జరిగాయి. ముథోల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విఠల్‌రెడ్డి 183 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ముథోల్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి నాగోరావుకు 6,114 ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎక్కువగా వచ్చాయి. దీంతో ఒకరు గెలుస్తారనుకుంటే ఇంకొకరు గెలిచారు. ఇలా క్రాస్ ఓటింగ్ ఆనాడు తీవ్ర ప్రభావం చూపింది. -
సచివాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం
మంత్రి ఇంద్రకరణ్, విఠల్‌రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని సిృబ్లాక్ ఎదుట ఓ రైతు శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దేవన్న (37)కు ప్రభుత్వం చెరువు పక్కన గతంలో మూడెకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలో ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమం కింద మామిడి, జామ చెట్లు పెంచుకుంటున్నాడు. చెరువు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దేవన్న కొంత భూమి ని కోల్పోయాడు. భూమికి బదులు భూమి ఇప్పించాలంటూ కొన్నాళ్ళుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం భార్య లలిత, ఇద్దరు పిల్లలతో కలసి సచివాలయం వద్దకు వచ్చాడు. మంత్రి హరీశ్‌రావును కలవాలని భావించాడు. మూడేళ్ళుగా అధికారుల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగటం లేదంటూ సూసైడ్ నోట్ రాశారు.‘నా చావుకు కారణం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జాయింట్ కలెక్టర్ శివ లింగయ్య’అని అందులో పేర్కొన్నారు. తనకు తిండి, నీరు, ఉపాధి లేకుండా చేసి వేధిస్తున్నారంటూ ఆరోపించాడు. దళితులకు న్యాయం చేయాలని సీఎంను వేడుకున్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు కూడా లేఖ రాశాడు. ప్రజారాజ్యం పార్టీ కోసం నా జీవితం మొత్తం నాశనం చేసుకున్నానని పార్టీ కోసం పని చేసిన పుణ్యానికి నా తండ్రిని, కొడుకుని పోగొట్టుకున్నానని పేర్కొన్నాడు. నేను చనిపోయిన తర్వాత నా భార్య బిడ్డలను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్‌ను కోరారు. టాయిలెట్ క్లీనర్ తాగిన దేవయ్యను పోలీసులు మాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించారు. దేవయ్య పరిస్థి«తి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. -
చైతన్యపురిలో టీఆర్ఎస్ కార్పొరేటర్ హంగామ
-
చైతన్యపురిలో టీఆర్ఎస్ కార్పొరేటర్ హంగామ
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నేత ఒకరు నానా హంగామా చేశారు. ఇల్లుకట్టుకోవాలంటే డబ్బు ఇవ్వాలంటూ చైతన్యపురిలో టీఆర్ఎస్ కార్పొరేటర్ విఠల్‌రెడ్డి హల్చల్ చేశారు. ఓ ఇంటి యజమాని ఇల్లు కట్టుకోవాలనుకోగా అలా చేయాలంటే తనకు రూ.10లక్షలు ఇవ్వాలంటూ ఇంటి యజమానిపై కార్పొరేటర్ విఠల్ రెడ్డి గత కొంతకాలంగా ఒత్తిడి చేశారు. అందుకు అతడు నిరాకరించి డబ్బు ఇవ్వకపోవడంతో అతడి ఇంటిపై దాడి చేశారు. ఇంటి నిర్మాణం కోసం వచ్చిన కార్మికులపై 30మంది అనుచరులతో కలిసి విఠల్ రెడ్డి దాడి చేశారు. -
చెరువుల పునరుద్ధరణ ఉద్యమంలా సాగాలి
జిన్నారం: చెరువుల పునరుద్ధరణ ప్రజా ఉద్యమంలా సాగాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా చెరువులకు పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందుకోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులను కూడా ఇస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆదివారం జిన్నారం మండలంలోని గుమ్మడిదల గ్రామంలో స్థానిక సీపీఐ నాయకులు ఏర్పాటు చేసిన విఠల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని హరీష్‌రావు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, విఠల్‌రెడ్డి భౌతికంగా దూరమైనా ఆయన చేసిన సేవలతో నేటికీ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారన్నారు. పేదలకూ భూమి దక్కాలని విఠల్‌రెడ్డి చేసిన పోరాటం మరువలేనిదన్నారు. టీఆర్ఎస్ సర్కార్ కూడా అలాంటి మహానేతల బాటలోనే నడుస్తోందన్నారు. ఈ క్రమంలోనే దళిత, గిరిజన కుటుంబాలకు మూడెకరాల సాగుభూమిని ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ‘మన ఊరు- మన చెరువు’ అనే నినాదంతో గ్రామాల్లోని చెరువులకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇందుకోసం తగిన నిధులను కూడా వెచ్చిస్తున్నామన్నారు. పూడికతీసి...పొలంలో వేసి గత ప్రభుత్వాలు చెరువుల్లోని పూడిక తీయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్నారు. దీంతో చెరువులన్నీ పూర్తిగా పూడికతో నిండిపోయి ఉనికి కోల్పోయాయన్నారు. అందువల్లే వాటిని పునరుద్ధరించేందుకు సర్కార్ సిద్ధమైందన్నారు. చెరువుల నుంచి తీసిన మట్టిని ఆయా గ్రామాల్లోని రైతుల పంట పొలాలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెరువుల మట్టి పంట పొలాలకు వాడటం వల్ల, రసాయన ఎరువుల వాడకం తగ్గుదలతో పాటు, దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భూ సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నేతల సలహాలను తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం సీఎంతో మాట్లాడి ఓ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీపీఐతో తమకు భావసారూప్యత ఉందన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర, నర్సాపూర్‌లలో కూడా విఠల్‌రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విఠల్‌రెడ్డి మూడో వర్ధంతిలోపు విగ్రహాలను ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం చాడా వెంకట్‌రెడ్డి, నారాయణలు మాట్లాడుతూ, పేదవాడికి భూమి హక్కు అనే నినాదంతో ముందుకెళ్లిన నేత విఠల్‌రెడ్డి అన్నారు. అలాంటి నేత వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పవన్‌కుమార్, రవీందర్‌రెడ్డి, చంద్రారెడ్డి, వెంకటేశంగౌడ్, బాల్‌రెడ్డి, ఇందెల సురేందర్‌రెడ్డి, మురళీయాదవ్, గౌరీశంకర్‌గౌడ్, నరేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, స్వేచ్ఛారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు కూడా విఠల్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. -
ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిపై వేటు వేయాలని ఫిర్యాదు
హైదరాబాద్ : టీఆర్ఎస్లో చేరిన ఆదిలాబాద్ జిల్లా ముథోల్ శాసనసభ్యుడు విఠల్‌రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి ఈరోజు సాయంత్రం స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద విఠల్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు జానారెడ్డి కోరనున్నారు. -
ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై జానారెడ్డి సీరియస్!
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడంపై సీఎల్పీ నేత జానారెడ్డి సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని జానారెడ్డి తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద విఠల్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని జానా అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ టీఆర్ఎస్ అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జానారెడ్డి అన్నారు. -
టీఆర్ఎస్లోకి ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిక సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఆదిలాబాద్ జిల్లా ముథోల్ శాసనసభ్యుడు విఠల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా వేసుకోనున్నారు. ఆయనతోపాటు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ ఎంపీటీసీ, జడ్పీటీసీలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ నుంచి మరిన్ని వలసలుంటాయని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేరేందుకు రహస్య మంతనాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. వీరిలో ఒకరు మహబూబ్‌నగర్, మరొకరు ఖమ్మం జిల్లాకు చెందినవారని తెలుస్తోంది. అలంపూర్ ఎమ్మెల్యే వి.సంపత్ టీఆర్ఎస్లో చేరతారని ఇప్పటికే బాగా ప్రచారం జరిగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన సందర్భంగా అలంపూర్ జోగులాంబ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలకు సంపత్ హాజరుకావడం దీనికి బలం చేకూరుస్తోంది. సంపత్ మాత్రం తాను కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది.