టీఆర్ఎస్లో చేరిన ఆదిలాబాద్ జిల్లా ముథోల్ శాసనసభ్యుడు విఠల్‌రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది.
హైదరాబాద్ : టీఆర్ఎస్లో చేరిన ఆదిలాబాద్ జిల్లా ముథోల్ శాసనసభ్యుడు విఠల్‌రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి ఈరోజు సాయంత్రం స్పీకర్కు ఫిర్యాదు చేయనున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద విఠల్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు జానారెడ్డి కోరనున్నారు.