ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై జానారెడ్డి సీరియస్!
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడంపై సీఎల్పీ నేత జానారెడ్డి సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని జానారెడ్డి తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద విఠల్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని జానా అన్నారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ టీఆర్‌ఎస్ అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జానారెడ్డి అన్నారు.