ముఖ్యమంత్రికి షాకిచ్చిన కిరణ్ బేడి
పుదుచ్చేరి: ఢిల్లీలో మొన్నటివరకు మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్- సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య బాహాటంగా ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహా పరిస్థితి మరో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పునరావృతం అవుతుందా? అంటే పరిస్థితులు ఔననే సంకేతాలు ఇస్తున్నాయి.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఆ ప్రాంత ముఖ్యమంత్రి వీ నారాయణస్వామికి తాజ్ షాక్ ఇచ్చారు. ఆయన జారీచేసిన ఆదేశాలను రద్దు చేశారు. అధికారిక కార్యకలాపాల కోసం సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధం విధిస్తూ సీఎం నారాయణస్వామి ఆదేశాలు జారీచేయగా.. ఆ ఆదేశాలు చెల్లవంటూ కిరణ్ బేడీ స్పష్టం చేశారు. సీఎం నారాయణస్వామిది కాంగ్రెస్ పార్టీ కాగా.. బీజేపీ కిరణ్బేడిని లెఫ్టినెంట్ గవర్నర్గా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.