'చవకబారు ప్రచారం కోసం వెంపర్లాడుతున్నాడు'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పై కేంద్ర మంత్రి వి. నారాయణ స్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చవకబారు ప్రచారం కోసమే కేజ్రివాల్ వెంపర్లాడుతున్నారని.. అందులో భాగంగానే జనలోక్ పాల్ బిల్లు కోసం పట్టుపడుతున్నారని ఆయన విమర్శించారు.
కేంద్రమంత్రా లేక రాష్ట్ర మంత్రా అనే విషయాన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలి.
నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆయన హితవు పలికారు. అరవింద్ కేజ్రివాల్ చవకబారు ప్రచారం మానుకొని.. ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని నారాయణస్వామి సూచించారు.