పదో రోజూ ఫలించని గాలింపు
మండీ: హిమచల్‌ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన 17 మంది విద్యార్థుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలు మంగళవారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. పదో రోజూ ఫలితం శూన్యం. రోజంతా గాలించినా ఒక్క మృతదేహం కూడా దొరకలేదు. మరోవైపు ముందుగా వచ్చిన రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలు గాలింపు చర్యలకు సవాల్ గా మారాయి.
గల్లంతైన విద్యార్థుల కోసం పదిరోజులుగా అణువణువునా గాలించినా ఫలితం లేకపోయింది. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. అత్యాధునిక రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, నావికా దళానికి చెందిన సైడ్ స్కాన్ సోనార్ పరికరం ఉపయోగించి గాలింపు జరిపినా విద్యార్థుల మృతదేహాల జాడ తెలియలేదు. హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది ఈ నెల 8న బియాస్ నదిలో గల్లంతైన సంగతి తెలిసిందే.