Volunteer in India
-
పాములు.. పశువులకే ఆవాసం
పిచ్చిమొక్కలు.. రొచ్చుదొడ్లు ప్రభుత్వాసుపత్రుల్లో స్వచ్ఛభారత్ తీరు స్వచ్ఛభారత్.. ప్రధాని మోదీ ఎంతో ఘనంగా ప్రారంభించిన పథకం.. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎంతో గొప్పగా దీనిని తలకెత్తుకున్నారు.. అయితే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు.. ఎంతో శుభ్రత పాటించాల్సిన ఆసుపత్రులు కనీసమైన ప్రమాణా లక కూడా నోచుకోవడం లేదు. పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తిలేని వ్యాధిగ్రస్తులు సాంత్వన పొందాల్సిన ఆసుపత్రులు తుప్పలకు, డొంకలకు నిలయాలుగా మారాయి. ఎలుకలు, పాములు అక్కడ విలయతాండవం చేస్తున్నాయి. పారిశుధ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విశాఖపట్నం: రోగులుండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాములు, పశువులు తిష్ట వేస్తున్నాయి. రోగుల పక్కల (బెడ్ల) పై కుక్కలు పడకేస్తున్నాయి. ఈ ఆసుపత్రుల ఆవరణలు అడవులను తలపించేలా పిచ్చిమొక్కలతో బలిసి ఉంటున్నాయి. చాలా చోట్ల ప్రహరీ గోడలు కూడా లేకపోవడంతో మేత కోసం పశువులు చొరబడుతున్నాయి. దట్టంగా ఉండడంతో విషసర్పాలు, కీటకాలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఏడాదికోసారి కూడా తుప్పలను తొలగించడం లేదు. ప్రభుత్వం స్వచ్ఛభారత్ అంటూ చేసే హడావుడి ఒకట్రెండు రోజులకే పరిమితమవుతోంది. ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్వచ్ఛ భారత్ అపహాస్యమవుతోంది. మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక అవి దుర్గంధం వెదజల్లుతున్నాయి. రోజుల తరబడి పేరుకుపోయిన చెత్త, చెదారాలను తొలగించడం లేదు. చాలాచోట్ల నీటి సదుపాయం కూడా లేదు. అక్కడక్కడ మంచినీటి సదుపాయం ఉన్నా అక్కడ అపారిశుధ్యంతో తాగే పరిస్థితి లేదు. నీటి సరఫరా చేసే ట్యాంకులను శుభ్రం చేయాలన్న ధ్యాసే ఉండడం లేదు. పేద రోగులు దిక్కులేని పరిస్థితుల్లో ముక్కుమూసుకుని వైద్యం చేయించుకుంటున్నారు. ఆరోగ్యం బాగుపడాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పే ప్రభుత్వమే సాక్షాత్తూ ప్రభుత్వాసుపత్రుల్లో వాటి పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో 85 పీహెచ్‌సీలు, 13 సీహెచ్‌సీలు, ఒక ఏరియా ఆస్పత్రి, 24 గంటలు నడిచే పీహెచ్‌సీలు 35 ఉన్నాయి. వీటిలో మూడొంతులకు పైగా ప్రభుత్వాసుపత్రులు పిచ్చిమొక్కలతో ‘కళకళలాడుతున్నాయి’. వాటిలో పాములు, విష పురుగులు ఆవాసాలేర్పరచుకుంటున్నాయి. ఆసుపత్రుల్లోని రోగులుండే గదుల్లోకి చొరబడి భయకంపితులను చేస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో నెలకొన్న దుర్భర పరిస్థితులపై సాక్షి బృందం విజిట్‌లో వెలుగు చూసినవి కొన్ని.. ► ఈనెల 27న ఆదివారం సబ్బవరం పీహెచ్సీ ప్రసూతి వార్డులోకి భారీ పొడపాము ప్రవేశించింది. అక్కడ ఉన్న పిల్లిని కాటేసింది. అదృష్టవశాత్తూ వార్డులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్టయింది. స్థానికులు ఆ పామును చంపేశారు. ఈ పీహెచ్సీలో పిచ్చిమొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి. ►ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు పీహెచ్సీ పరిసరాల్లోనూ తుప్పలు పెరిగిపోయాయి. తరచూ అక్కడ పాములు సంచరిస్తున్నాయి. పైగా ఈ భవనం శిథిలస్థితికి చేరుకుని కూలడానికి సిద్ధంగా ఉంది. ► చోడవరం ఆస్పత్రి చెత్తకుప్పలు, నిర్వహణ లేని మరుగుదొడ్లు దుర్గంధం వెద జల్లుతున్నాయి. మరుగుదొడ్లలోనే రక్తపు గుడ్డలు, దూది వంటివి వేస్తున్నారు. పిచ్చి మొక్కలూ బలిసిపోయి పాములకు ఆవాసంగా మారడంతో అవి వార్డుల్లోకి తరచూ వస్తున్నాయి. దీంతో అక్కడ సిబ్బంది, రోగులు బితుకుబితుకుమంటూ గడుపుతున్నారు. ►రావికమతం పీహెచ్సీలో తుప్పలు, డొంకలు పెరిగిపోయి ఉన్నాయి. అక్కడ కూడా పాములు సంచరిస్తున్నాయి. రోగులు, వారి బంధువులను భయకంపితులను చేస్తున్నాయి. ►పెందుర్తి పీహెచ్సీలో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. పారిశుధ్య పనివారికి జీతాలు చెల్లించక నిర్వహణ పట్టించుకోవడం లేదు. దీంతో రోగులు ముక్కుమూసుకుని వైద్యం చేయించుకుంటున్నారు. ►భీమిలి మండలం రేవిడి పీహెచ్సీలో హుద్‌హుద్ తుపానుకు కూలిన చెట్లను ఇప్పటికీ తొలగించలేదు. దీంతో ఆస్పత్రిలో పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ►భీమిలి పీహెచ్సీలో పిచ్చిమొక్కలు పెరిగి పశువులు, కుక్కలకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ►నక్కపల్లి, నాతవరం ఆసుపత్రుల్లో స్వచ్ఛభారత్ మచ్చుకైనా కానరావడం లేదు. మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. ►నర్సీపట్నం ప్రభుత్వాస్పత్రిలో స్వచ్ఛభారత్ మూన్నాళ్ల ముచ్చటే అ యింది. పారిశుధ్య నిర్వహణకు తగినంత మంది సిబ్బంది లేరు. ఆస్పత్రి ప్రాంగణం దుర్గంధం వెదజల్లుతోంది. పిచ్చిమొక్కలు అడవుల్లా పెరిగి పాములు, విష కీటకాలకు ఆవాసాలుగా మారాయి. -
ఇరు రాష్ట్రాల్లో వరంగల్ టాప్
స్వచ్ఛ భారత్‌లో పట్టణాలకు ర్యాంకుల కేటాయింపు న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్‌లో ఇరు రాష్ట్రాల్లో వరంగల్ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా జనాభా ఉన్న 476 పట్టణాలు, నగరాల్లో వ్యర్థాల తరలింపు ఆధారంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ర్యాంకులు కేటాయించింది. మొదటి 100 స్థానాల్లో 5 తెలుగు పట్టణాలు, నగరాలు మాత్రమే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వరంగల్ 33వ స్థానంలో నిలిచింది. నిజామాబాద్ 82, హైదరాబాద్ 275వ స్థానానికి పరిమితమయ్యాయి. కాగా, ఏపీలోని విజయనగరం 58 స్థానంలో, నర్సరావుపేట 59, గుంటూరు 70వ స్థానంలో నిలిచాయి. తెలంగాణ నగరాలు: వరంగల్ (33), నిజామాబాద్ (82), రామగుండం (142), మిర్యాలగూడ (169), సికింద్రాబాద్ (191), మహబూబ్‌నగర్ (230), కరీంనగర్ (259), గ్రేటర్ హైదరాబాద్ (275), సూర్యాపేట (283), ఖమ్మం (308), ఆదిలాబాద్ (349). ఏపీ నగరాలు: విజయనగరం (58), నర్సరావుపేట (59), గుంటూరు (70), తిరుపతి (137), ఆదోనీ (148),, నెల్లూరు (156), శ్రీకాకుళం (157), తెనాలి (166), అనంతపురం (181), చిలకలూరిపేట (187), ప్రొద్దుటూరు (198), మదనపల్లి (200), వైజాగ్ (205), కడప (211), ధర్మవరం (224), రాజమండ్రి (228), తాడిపత్రి (239), ఏలూరు (249), విజయవాడ (266, కాకినాడ (300), మచిలీపట్నం (301), గుంతకల్లు (322), కర్నూలు (330), భీమవరం (342), తాడేపల్లి గూడెం (352), నంద్యాల (354), ఒంగోలు (357), చిత్తూరు (367), గుడివాడ (450), హిందూపురం (457). -
నిలోఫర్‌లో పోలీసుల ‘స్వచ్ఛ భారత్’
నాంపల్లి: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పోలీసులు భుజానెత్తుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై దృషి ్టసారించారు. లాఠీలు, తుపాకులు పక్కన పెట్టి సామాజిక సృహా కోసం పనిచేశారు. గురువారం రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో స్వచ్ఛ భారత్‌ను చేపట్టారు. మధ్య మండలం డీసీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు భగ భగ మంటున్న ఎండను కూడా లెక్క చేయకుండా స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నారు. చేయి చేయి కలిపి ఆసుపత్రిలో పేరుకుపోయిన చెత్తను ఊడ్చేశారు. ఏడాదంతా ఊడిస్తేగా తరలిపోని చెత్తను ఒకే రోజు పోలీసులు ఎత్తిపోశారు. నిలోఫర్ ఆసుపత్రి చుట్టూ ఉన్న అపరిశుభ్రతను తొలగించారు. నాలుగు బృందాలుగా విడిపోయి పనిచేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రాంమోహన్‌రావు, సైపాబాద్ ఏసీపీ సురేందర్‌రెడ్డి, నాంపల్లి ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, సైపాబాద్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్ రావు, రాంగోపాల్‌పేట్ ఇన్స్పెక్టర్ గంగారెడ్డి ఎస్సైలు సత్యనారాయణ, నిపుణ్ పాల్గొన్నారు. 18 లారీల చెత్త తరలింపు... స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిలోఫర్ ఆస్పత్రిని శుభ్రం చేసిన పోలీసులు మొత్తం 18 లారీల చెత్తను బయటకు తరలించారు. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం నిలోఫర్ వైద్య శాలను ఎంపిక చేసుకున్న మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి స్వచ్ఛంద సంస్థలతో పాటు విద్యార్థులు, ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని భాగస్వాముల్ని చేసుకున్నారు. దాదాపు వారం రోజుల ముందు నుంచీ ప్రణాళిక సిద్ధం చేసుకుని గురువారం ఉదయం 10 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించి, మధ్యాహ్నం 2 గంటలకు ముగించారు. ‘స్వచ్ఛ్ భారత్’లో భాగంగా అధికారులు ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. శుభ్రపరిచిన ప్రాంతాల్లో మళ్లీ చెత్త పేరుకుపోకుండా చూసే చర్యల్లో భాగంగా మరో రెండు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో చెట్లు నాటాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. -
పనులు చేస్తేనే పన్నులు చెల్లిస్తారు
సొంతగా వనరుల సేకరణపై దృష్టిపెట్టండి శ్వేతపత్రాలు విడుదల చేయండి ‘స్వచ్ఛ భారత్’ వర్క్‌షాప్‌లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజయవాడ సెంట్రల్ : పనులు సరిగా చేస్తే ప్రజలు పన్నులు సక్రమంగా చెల్లిస్తారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. సొంత వనరుల సేకరణపై మున్సిపల్ యంత్రాంగం దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్రస్థాయి స్వచ్ఛ భారత్ వర్క్‌షాపును శనివారం నగరంలోని ఒక హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పారు. ఆదాయ వనరులను ప్రజలకు తెలియజేసి ఆర్థిక పరిపుష్టికి సహకారం కోరాలని సూచించారు. ప్రజల ఆలోచనల్లో మార్పు చోటు చేసుకుంటుందన్నారు. ఎక్కువ సౌకర్యాలు కావాలని కోరుకున్నప్పుడు పన్నుల భారాలు తప్పవని పేర్కొన్నారు. విద్యుత్, నీరు, గృహ వసతి పేదలకు కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు చెప్పి పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా వారిని నడిపించగలిగినవాడే నిజమైన నాయకుడన్నారు. స్వచ్ఛభారత్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పట్టణాలు, నగరాల్లో హోటళ్లు, ఆస్పత్రులు, ప్రైవేటు సంస్థల నుంచి వెలువడే చెత్తను ఆయా సంస్థలే పరిష్కరించుకొనే విధంగా నిబంధనలను కఠినతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. పారిశుధ్యం, చెత్త తొలగింపులో ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సి ఉందన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ నుంచి కేంద్రం వ్యక్తిగత టాయ్లెట్ల నిర్మాణానికి రూ.4 వేలు ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,333 అందజేస్తుందని, కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా రెండు శాతం సొమ్మును చెల్లించాలని కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్‌ను సొంతబిడ్డలా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మరుగుదొడ్లు రాష్ట్ర మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో ఐదు లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. కేంద్రం అందించే రూ.4 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.11 వేలు అందిస్తోందన్నారు. పట్టణాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరాయిస్తోందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ డెరైక్టర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ వాణీమోహన్, నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ డెరైక్టర్ అనిమేష్ భార్తి, సెంటర్ పబ్లిక్ హెల్త్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఆర్గనైజేషన్ జాయింట్ అడ్వయిజర్ వీకే చౌరాసియా, డెప్యూటీ సలహాదారు రోహిత్ కక్కుర్, ఉపాధ్యక్షుడు సుమన్ చహర్, రాంకీ ఎన్విరాన్ ఇంజినీర్స్ సంస్థ జాతీయ ప్రతినిధి ఆర్.మోహనరావు, 13 జిల్లాలకు చెందిన 99 మంది మున్సిపల్ కమిషనర్లు, 47 మంది మేయర్లు, చైర్పర్సన్లు హాజరయ్యారు. మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
రైనా ‘స్వచ్ఛ భారత్’
ఘజియాబాద్: ప్రధాని మోదీ పిలుపు మేరకు ‘స్వచ్ఛ భారత్’లో పాల్గొంటున్న ప్రముఖులలో ఇప్పుడు భారత క్రికెటర్ సురేశ్ రైనా కూడా చేరాడు. బుధవారం రైనా తన స్వస్థలం ఘజియాబాద్‌లో స్థానికులు, చిన్నారులతో కలిపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడడు. రైనా పేరును స్వయంగా మోదీనే ప్రతిపాదించడం విశేషం. ‘స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశభక్తికి ప్రతీక. శుభ్రత అనేది మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఇది కలగా మిగిలిపోకూడదు. నా వంతుగా సవాల్‌ను పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది’ అని రైనా వ్యాఖ్యానించాడు. స్వచ్ఛ భారత్ కొనసాగింపు కోసం సహచర యూపీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా, ఆర్పీ సింగ్‌లతో పాటు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, హాకీ ఆటగాడు శ్రీజేశ్, సోనూ నిగం, శ్రేయా ఘోషల్, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ల పేర్లను రైనా ప్రతిపాదించాడు. -
స్వచ్ఛ భారత్‌లో గుత్తా జ్వాల
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల మంగళవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకుంది. ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించింది. అలాగే స్టేడియం ఆవరణలో ఉన్న వాణిజ్య దుకాణదారులు తమ చెత్తను రోడ్డుపై వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరింది. అపరిశుభ్ర వాతావరణంతో క్రీడాకారుల ఆరోగ్యానికి హాని కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ప్రతీరోజు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్ సిబ్బంది, స్వీపర్ల ప్రయోజనాలను ప్రభుత్వం నెరవేర్చాలని జ్వాల విజ్ఞప్తి చేసింది. ఈసందర్భంగా స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని ఎంపీ కల్వకుంట్ల కవిత, అశ్విని, దీపికా పదుకొనె, ఆమిర్ ఖాన్, ఓజా, నితిన్ పేర్లను ఆమె నామినేట్ చేసింది. -
‘స్వచ్ఛ భారత్’కు నేడే శ్రీకారం
ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఐదేళ్లలో దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం రాజ్‌పథ్ మార్గంలో రిపబ్లిక్ డే తరహా భద్రతా ఏర్పాట్లు ‘స్వచ్ఛతా ప్రతిజ్ఞ’ చేయనున్న 31 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే భద్రతా ఏర్పాట్లను పోలిన అసాధారణ భద్రత నడుమ ప్రధాని నరేంద్ర మోదీ తన మదిలో మెదిలిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని ఇండియా గేట్/రాజ్‌పథ్ మార్గం లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా చేపట్టనున్న ఈ కార్యక్రమంలో మోదీ స్వయంగా చీపురుపట్టనున్నారు. పరిశుభ్రతను జాతీయ ఉద్యమంగా చేపట్టాలని ప్రజలకు పిలుపునివ్వనున్నారు. ఈ సందర్భంగా నడక పోటీని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి భద్రతాపరంగా ఎటువంటి అవరోధాలు ఎదురుకారాదన్న ఉద్దేశంతో భద్రతా దళాలు ఉపరితలం నుంచి గగనతలం వరకూ పహారా కాయనున్నాయి. ఢిల్లీ నగరాన్ని బుధవారమే తమ అధీనంలోకి తీసుకున్నాయి. రాజ్‌పథ్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మధ్యాహ్నం 1 గంటకల్లా ఖాళీ చేయించి మూసేశాయి. కార్యక్రమం జరిగేంత సేపూ జాతీయ భద్రతా దళానికి చెందిన స్నైపర్లు (షార్ప్ షూటర్లు) ప్రభుత్వ భవనాలపై గస్తీ కాస్తారు. ఎన్ఎస్జీకితోడు పారామిలిటరీ, ఢిల్లీ పోలీసు కమాండోలు యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ తుపాకులు, మొబైల్ బృందాలతో అనుక్షణం కాపలా కాస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు 5 వేల మంది స్కూలు విద్యార్థులతోపాటు ప్రభుత్వాధికారులు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు, కాలేజీల విద్యార్థులు పాల్గొంటారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు మోదీ రాజ్‌ఘాట్‌లోని గాంధీజీ సమాధి వద్ద నివాళులర్పించి ఆ తర్వాత దళిత కాలనీని సందర్శిస్తారు. స్వచ్ఛభారత్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రులంతా చీపుర్లు పట్టారు. 31 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రతిజ్ఞ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా దాదాపు 31 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పరిశుభ్ర భారతావని లక్ష్యం కోసం పాటుపడతామని ప్రమాణం చేస్తారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ఉద్యోగుల చేత అధికారులు ‘స్వచ్ఛతా శపథ్’ (పరిశుభ్రత ప్రతిజ్ఞ) చేయించ నున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఉద్యోగుల చేత ‘నార్త్ బ్లాక్’ ఆవరణలో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులను కేంద్రం కోరింది. మరోవైపు ‘స్వచ్ఛ భారత్’ ఉద్యమాన్ని జాతీయ ఆకాంక్షగా చేపట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛ విద్యాలయ ప్రచార పుస్తకం విడుదల స్కూలు ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు విద్యార్థులు పాటించాల్సిన పద్ధతులను వివరించే స్వచ్ఛ భారత్-స్వచ్ఛ విద్యాలయ ప్రచార పుస్తకాన్ని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. స్వచ్ఛమైన మంచినీరు, పరిశుభ్రమైన టాయ్లెట్ల కోసం ఆచరించాల్సిన విషయాలను ఇందులో పొందుపరిచారు. మరోవైపు స్వచ్ఛ భారత్ ప్రచారంలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థలైన కోల్ ఇండియా, ఎన్టీపీసీ ఏడాది వ్యవధిలో 50 వేల టాయ్లెట్లను నిర్మించనున్నాయి. ఇది ప్రజా ఉద్యమం: వెంకయ్య నాయుడు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చేపట్టనున్న స్వచ్ఛ్ భారత్ అభియాన్ కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఓ ప్రజా ఉద్యమంగా చేయడమే తమ ఉద్దేశమని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ మన ఇళ్లలో, పరిసరాల్లో, కార్యాలయాల్లో పరిశుభ్రత కోసం వారానికి2 గంటలు కేటాయిద్దామన్న ప్రతిజ్ఞను ప్రధాని మోదీ ప్రజలతో చేయిస్తారన్నారు. పరిశుభ్రతతోనే అభివృద్ధి: అశోక్ గజపతి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంద ని పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నా రు. దేశం, రాష్ట్రం, పురపాలక సంఘాలు, గ్రామాలను శుభ్రం చేసుకుంటుంటే దేశమంతా శుభ్రంగా ఉంటుందన్నారు.