vote for crore case
-
ఓటుకు కోట్లు కేసు: రేవంత్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
-
కీలక పరిణామం; బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. చంద్రబాబు సమక్షంలోనే ఒప్పందం కుదిరిందని స్పష్టం చేశాడు. స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు ఇస్తామని అడ్వాన్స్‌గా రూ.50లక్షలు ఇస్తానని.. చంద్రబాబు తనతో చెప్పారని పేర్కొన్నాడు. టీడీపీ మాజీ నేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి నోట్లకట్టలతో కనిపించిన వీడియో, ఈ కేసుకు సంబంధించి పలు ఆడియో రికార్డులను సైతం ఈడీ ముందు ధృవీకరించాడు. అదే విధంగా ఓట్లుకు కేసు విషయంలో తనకేమీ కాకుండా, ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని చంద్రబాబు తనయుడు నారా లోకేష్ హామీ ఇచ్చారని, వెంటనే విజయవాడకు వెళ్లిపోవాలని తనకు సలహా ఇచ్చినట్లు మత్తయ్య ఈడీకి చెప్పాడు.(చదవండి: ‘ఓటుకు కోట్లు’ కేసులో కీలక పరిణామం) ఈ మేరకు.. ‘‘నేను చాలాకాలంగా చంద్రబాబుకు తెలుసు. టీడీపీకి అనుకూలంగా పనిచేశాను. పలు సందర్భాలలో చంద్రబాబును కలిశాను. అయితే 2015 మహానాడు సందర్భంగా చంద్రబాబు, రేవంత్‌రెడ్డి నన్ను కలవాలనుకుంటున్నారని.. జిమ్మీబాబు నాకు చెప్పాడు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. కీలకమైన విషయం మాట్లాడటానికి వాళ్లిద్దరు నన్ను రమ్మన్నారు. దీంతో హిమాయత్‌సాగర్‌లో జరుగుతున్న మహానాడుకు వెళ్లాను. జిమ్మీబాబు నన్ను చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లాడు. మహానాడు జరుగుతుండగానే చంద్రబాబునాయుడిని కలిశాను. అక్కడే ఆయన సమక్షంలోనే రేవంత్‌రెడ్డి నాతో ఈ డీల్ మాట్లాడారు. స్టీఫెన్సన్ టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేవిధంగా ఒప్పించే బాధ్యత నాకు అప్పజెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే.. స్టీఫెన్సన్కు రూ.5కోట్లు ఇస్తామని చంద్రబాబు సమక్షంలో రేవంత్‌రెడ్డి చెప్పారు. ఓటింగ్‌కు గైర్హాజరైతే రూ.3కోట్లు ఇస్తామని చెప్పమన్నారు. ఈ ఒప్పందం కుదిరిస్తే నాకు రూ.50లక్షలు ఇస్తామని చంద్రబాబు సమక్షంలో రేవంత్ చెప్పాడు. డీల్‌కు స్టీఫెన్సన్ ఒప్పుకుంటే.. ముందుగా రూ.50లక్షలు అడ్వాన్స్ ఇస్తామని చంద్రబాబే చెప్పారు. ఈ విషయంలో నేను వెళ్లి స్టీఫెన్‌సెన్‌తో మాట్లాడాలని నాకు చెప్పారు. అతడిని ఒప్పిస్తే నన్ను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నేను వెళ్లి స్టీఫెన్‌సన్‌తో చర్చించాను. వాళ్లిద్దరు ఆఫర్ చేసిన డీల్ గురించి స్టీఫెన్సన్కు చెప్పాను, అయితే తాను రేవంత్‌రెడ్డితో నేరుగా కలుస్తానని స్టీఫెన్సన్ నాతో చెప్పారు. ఈ విషయం రేవంత్‌రెడ్డికి చెప్పాలని సెబాస్టియన్‌కు చెప్పాను. చంద్రబాబు ఆదేశాలతో రేవంత్‌రెడ్డి డబ్బులతో స్టీఫెన్సన్ దగ్గరు వెళ్లారు. ఆ తరువాత రేవంత్‌రెడ్డి నేరుగా వెళ్లి స్టీఫెన్సన్కు బ్యాగులో డబ్బులు ఇచ్చారు. రేవంత్‌రెడ్డి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్హాండెడ్గా అరెస్టు చేశారు. రేవంత్‌రెడ్డి అరెస్టు అయిన రెండో రోజు రహస్యంగా బంజారాహిల్స్‌లోని టీడీపీ కార్యాలయానికి వెళ్లాను. హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్‌ను కలిశాను. నీకేమీ కాదని ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడకు వెళ్లిపొమ్మని నాకు సూచించారు’’ అని మత్తయ్య తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
ఓటుకు కోట్లు కేసు: కేసీఆర్, డీజీపీ కీలక భేటీ
-
ఓటుకు కోట్లు కేసులో కీలక మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఓటుకు కోట్లు ప్రధాన కేసుకు ఈ తాజా పిల్‌ని జత చేయాలని ధర్మాసనం సోమవారం ఆదేశించింది. విచారణ తేదీలను సుప్రీంకోర్టు త్వరలో ఖరారు చేయనుంది. కాగా ఇప్పటికే ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ప్రధాన పిటిషన్ పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఓటుకు కోట్లు వ్యవహారం జరిగి రెండున్నర సంవత్సరాలు అయినా.. తదుపరి పరిణామాల నేపథ్యంలో విచారణలో జాప్యం చోటుచేసుకుందని, తెలంగాణ ఏసీబీ దర్యాప్తు నిష్పక్షపాతంగా చేయడం లేదని మొదటి ఛార్జిషీట్‌కు రెండో చార్జిషీట్‌కు వ్యత్యాసం ఉందని ఎమ్మెల్యే ఆర్కే తన పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయస్థానం తాజా ఆదేశాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారని, అయితే ఈ కేసు విచారణ ముందుకు జరగకుండా ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆడియో టేపుల్లో మాట్లాడింది చంద్రబాబేనని రుజువైందని, ఆయన పాత్ర బయటపడాలంటే సీబీఐ విచారణ జరగాలన్నారు. మరోవైపు ఎమ్మెల్యే ఆర్కే న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ దర్యాప్తు సరిగా చేయడం లేదన్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని, నిష్పక్షపాత దర్యాప్తు కోసం సీబీఐ విచారణ జరగాలని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ వేసినట్లు చెప్పారు. -
'పది నిమిషాలంటే.. రెండున్నర గంటలా'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాల్లోని చివరి రోజు ప్రతిష్టంభన నెలకొంది. దేశంలో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కుంభకోణం వ్యవహారం ఈ ప్రతిష్టంభనకు కారణమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి కేవలం ఐదు రోజులు మాత్రమే శాసన సభ సమావేశాలు జరపాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ, ఈ ఐదు రోజుల్లో ఏనాడు కూడా ప్రభుత్వం ప్రతి పక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పిన పరిస్థితి కనిపించలేదు. ఆఖరికి చివరి రోజు కూడా బాధ్యతా రహితంగానే ప్రభుత్వం వ్యవహరించినట్లు ప్రతిపక్ష సభ్యులు ఆగ్రమం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కీలకమైన ఓటుకు కోటు కేసుపై చర్చ జరగాలని దీనిపై చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో మొత్తం రెండుసార్లు సమావేశం వాయిదా పడింది. ఇందులో రెండోసారి పదినిమిషాలు వాయిదా అని చెప్పిన స్పీకర్ కోడెల శివప్రసాద్.. రెండున్నర గంటల తర్వాతగానీ సమావేశం తిరిగి ప్రారంభించలేకపోయారు. ప్రారంభించిన కొన్ని క్షణాల్లోనే నిరవదిక వాయిదా వేశారు. ఫలితంగా పలువురు నేతలు పది నిమిషాలు అంటే రెండున్నర గంటలని అర్ధమా అని ప్రశ్నిస్తున్నారు. తాము లాబీల్లో టీలు, కాఫీలు తాగేందుకు రాలేదని, ప్రజాసమస్యలపై చర్చించేందుకు వచ్చామని అన్నారు. ఓ వ్యక్తికి(ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు) సంబంధించిన అంశాన్ని(ఓటుకు కోట్లు) మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి అంటగట్టి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, ఏ అంశంపై చర్చ లేవనెత్తారో ఆ చర్చకు సంబంధించిన వ్యక్తి(ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు) చివరి రోజు అసలు సభలోనే అడుగుపెట్టకుండా కేవలం ఛాంబర్‌కే పరిమితమవడం ఆయన బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అని పెదవివిరుస్తున్నారు. చివరకు రెండున్నరగంటల అనంతరం సమావేశం ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షం లేవనెత్తిన అంశానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకుండానే స్పీకర్ నేరుగా అసెంబ్లీని నిరవధిక వాయిదా వేయడం చూస్తుంటే ఆయన ఏకపక్షంగా వ్యవహరించారని స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు. సభా గౌరవాన్ని కాపాడాల్సిన స్పీకర్ తమ మనోభావాలను కించపరిచినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసినందువల్లే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుకు కోట్లు కేసులో సమాధానం చెప్పకుండా తప్పించుకొని సభను నిరవదిక వాయిదా వేయించారని ఆరోపించారు.