చంద్రబాబు నయవంచకుడు
మండపేట, న్యూస్‌లైన్ : ‘తన కుమారుడు లోకేష్‌బాబును నాయకుడిని చేయడం కోసం గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన జూనియర్ ఎన్టీఆర్‌ను కాదని తనేంటో తనకే తెలియని పవన్‌కల్యాణ్‌ను ప్రచారానికి దింపడం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగజారుడుతనానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే వీవీఎస్ఎస్ చౌదరి విమర్శించారు. మండపేటలో ఆదివారం ఆయన ‘న్యూస్‌లైన్’ తో మాట్లాడారు.
అన్న నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీకి పట్టిన దుస్థితిని ఆయన అభిమానులు జీర్ణించుకోలేరన్నారు. పవన్‌కల్యాణ్‌తో బేరం కుదిరాక బాలకృష్ణకు హిందూపురం టిక్కెట్ ఇచ్చి ప్రచారానికి రాకుం డా చేశారన్నారు. ఇప్పుడు ఉద్రేకంగా ఉపన్యాసాలు ఇస్తున్న పవన్ 2009లో చంద్రబాబుకు ఎందుకు ఎదురుతిరిగారని ప్రశ్నించారు. పిచ్చో డిచేతిలో రాయి ఎటు పడుతుందో ప్రజలే ఆలోచించాలన్నారు. ‘కమ్మ’దనంలో అన్నీ మరిచి పోతే చేదుమాత్రలు మింగాల్సి వస్తుందని హి తవు పలికారు. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వారిని వదిలి కొత్తవారికి, ఫిరాయింపుదారులకు, వెన్నుపోటుదారులకు టిక్కెట్లు ఇవ్వ డం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటేన ని, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు ఈ ఎన్నికల్లో పూర్తిగా బయటపడిందని అన్నారు.
నమ్మిన వారికి న్యాయం చేసిన మహానేత వైఎస్
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన ను నమ్మిన వారికి ఎప్పుడూ న్యాయమే చేశార ని చౌదరి కొనియాడారు. ముఖ్య అనుచరుడైన జక్కంపూడి రామ్మోహనరావు అనారోగ్యంతో బాధ పడుతున్నా మంత్రిగా కొనసాగించిన ఘ నత వైఎస్‌కే దక్కుతుందన్నారు. ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య అప్పట్లోఎన్నికల్లో పోటీకి నిరాసక్తత చూపిస్తే.. ఎమ్మెల్సీగా అయి నా మంత్రి మండలిలో ఉండాలని వైఎస్ చెప్పారన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్‌ను వైఎస్ సొంతమనిషిగా చూశారని, దేవినేని నెహ్రూకు రాజకీయంగా ఎంతో సహకరించారని చెప్పారు.
నమ్మిన వారిని వదలని సిద్ధాంతం వైఎస్‌ది అయితే, నమ్మిన వారిని నట్టేట ముంచే సిద్ధాంతం చంద్రబాబుదని చౌ దరి విమర్శించారు. ‘ఉపయోగించుకుని వదిలేయ్’ అన్న తరహాలో బాబు తీరు ఉంటుందన్నారు. టీడీపీలో సీనియర్లైన కోడెల శివప్రసాదరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి వంటి నేతలకు సులువుగా గెలిచే స్థానాలు కాక క్లిష్టమైన స్థానాలు కేటాయించి చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారన్నారు. లోకేష్ సలహాపై కొత్తగా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి కావాల్సిన సీట్లు కేటాయించడం ఎంత వరకు సబబని చౌదరి ప్రశ్నించారు. పరిటాల రవి ఉన్నంతకాలం రా జకీయాలకు దూరంగా ఉన్న జేసీ దివాకరరెడ్డిని పార్టీలో చేర్చుకుని టిక్కెట్టు ఇవ్వడమంటే చంద్రబాబుకు కావాల్సింది విలువలు కాదని ధనమేనని వ్యాఖ్యానించారు.
టీడీపీకి గత ఎన్నికల్లో పట్టిన గతే..
రాష్ట్రాన్ని విభజించడంలో కాంగ్రెస్ కన్నా ఘో రాతిఘోరంగా వ్యవహరించిన బీజేపీతో చంద్రబాబు జతకట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 2009లో విభజనవాది కేసీఆర్‌తో కలిసినప్పుడు పట్టిన గతే టీడీపీకి ఇప్పుడూ పడుతుందన్నారు. ఈనెల 7న జరగనున్న ఎన్నికలు విశ్వసనీయతకు, కుట్రదారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని చౌదరి అభివర్ణించారు. విలువలకు, విశ్వసనీయతకు నిలువుటద్దమైన వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందన్నారు.