Wages Act
-
గల్ఫ్ కార్మికులకు అన్యాయం... పత్తాలేని కొత్త సర్క్యులర్
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల గల్ఫ్ కార్మికుల కష్టాలు ఇంకా తీరలేదు. వేతనాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన తాజా సర్క్యులర్‌ను క్షేత్రస్థాయికి చేరలేదు. దీంతో వలస జీవులు ఇంకా శ్రమ దోపిడికి గురవుతూనే ఉన్నారు. వేతనాలు తగ్గిస్తూ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలను (మినిమం రెఫరల్ వేజెస్) ను 30 నుండి 50 శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం 2020 సెప్టెంబర్ లో రెండు సర్క్యులర్లను జారీ చేసింది. అయితే ఈ రెండు సర్క్యులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కార్మికులు, గల్ఫ్ సంఘాలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పాత జీతమే ఇవ్వాలంటూ.. నలువైపుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, కోర్టు కేసుల నేపథ్యంలో పాత వేతనాల కొనసాగింపు డిమాండును కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు జులై 22, 29 తేదీలలో రాజ్య సభలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ప్రకటించారు. కనీస వేతనాలను తగ్గిస్తూ సెప్టెంబర్ లో జారీ చేసిన సర్క్యులర్లను ఉపసంహరించుకుంటున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు పాత వేతనాలను కొనసాగించాలని నిర్ణయిస్తూ... జులై 15న ఉత్తర్వులను జారీ చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది జులై 28న తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. సమస్య పరిష్కారం అయినందున మంద భీంరెడ్డి వేసిన 'పిల్' ను ముగిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జరగని న్యాయం పాత వేతనాలే కొనసాగించాలంటూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ కనీసం ఇ-మైగ్రేట్ పోర్టల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీ వెబ్ సైట్లో కూడా కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు లిఖిత పూర్వకంగా కనిపించకపోవడం కార్మికులకు శాపంగా మారగా కంపెనీలకు వరమైంది. గతంలో వేతనాలు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌నే చూపెడుడుతూ తక్కువ జీతం చెల్లిస్తూ శ్రమ దోపిడి చేస్తున్నాయి. ఎంబసీకి విజ్ఞప్తి పాత వేతనాలను కొనసాగించే ఆ సర్క్యులర్ని ఇ-మైగ్రేట్ పోర్టల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీ వెబ్ సైట్ లలో అందుబాటులో ఉంచలేదని, వెంటనే ఈ సర్క్యులర్ ప్రజలు అందుబాటులో ఉంచాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ అధ్యక్షులు మంద భీంరెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి ఇ-మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. -
త్వరలో పెరగనున్న కంపెనీల పీఎఫ్ కేటాయింపులు
నాలుగు కొత్త లేబర్ కోడ్స్ త్వరలో అమలులోకి రానున్నాయి. గతంలో వాయిదా వేసిన నాలుగు లేబర్ కోడ్స్ అమలును తిరిగి తీసుకొనిరావడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నాలుగు లేబర్ కోడ్స్ వాయిదా పడటానికి ప్రధాన కారణం వీటి అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడమే అని కేంద్రం ప్రకటించింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాలను ఆయా రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ చట్టాలను ఆమోదించాయి. ప్రస్తుత సమాచార ప్రకారం.. ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఒడిశా, పంజాబ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు మాత్రమే వీటిని ఆమోదించాయి. దేశంలో ఇప్పటి వరకు అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను కలిపి నాలుగు లేబర్ కోడ్లగా తీసుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది. సామాజిక భద్రతకు సంబంధించిన సోషల్ సెక్యురిటీ కోడ్, ఉద్యోగుల భద్రత, ఆరోగ్యానికి సంబంధించిన ఆక్యుపెషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లను పార్లమెంట్ 2020లో ఆమోదించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్రం గతంలో పేర్కొంది. అయితే.. వేజ్ కోడ్ మాత్రం ఉద్యోగుల్లో పెద్ద చర్చకు దారితీసింది. కొత్త నిబంధన ప్రకారం.. మొత్తం శాలరీలో మూలవేతనం కనీసం 50 శాతంగా ఉండాలి. దీంతో.. ఉద్యోగుల భవిష్యనిధికి కేటాయించే మొత్తం పెరగడంతో పాటూ కొన్ని వర్గాల వారికి ట్యాక్స్ భారం పెరిగి చేతికి అందే మొత్తంలో కోత పడుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. చదవండి: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ -
ఫీల్డ్ అసిస్టెంట్లపై అధికారుల కొరడా
సాక్షి, శంకరపట్నం: చెరువులు, కుంటల్లో ఫిష్‌పాండ్ పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. మండలం లోని 24 గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో ఫిష్ పాండ్, ఎస్సారెస్పీ కాలువ పూడితక తీత, హరిత హారంలో మొక్కల పెంపకం, పంట కాలువల త వ్వకం, కిచెన్షెడ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు పనులుచేశారు. మండలంలో11వేల పైచిలుకు జాబ్‌కార్డులు ఉన్నాయి. జాబ్‌కార్డులలో 26 వేలవరకు కూలీలు ఈ పథకంలో పనులు చేస్తున్నారు. 2017 ఆగస్టు నుంచి ఏడాదిలో చేపట్టిన పనులపై సోషల్ఆడిట్ నిర్వహించారు. ఫిబ్రవరి 18న సామాజిక తనిఖీ ప్రజావేదిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ ప్రజావేదికలో మండలంలో ఎక్కువ మొత్తంలో కూలీల కు అదనపు వేతనాలు చెల్లింపులు చేశారని నివేది క ఇచ్చారు. వెలుగులోకి అక్రమాలు.. ఫిష్‌పాండ్ నిర్మాణాల్లో కూలీలు చేసిన పనికి అద నంగా వేతనాలు చెల్లించేటట్లు కొలతలు తీశారని తేలింది. మండలంలోని కరీంపేట, కొత్తగట్టు, లింగాపూర్,రాజాపూర్, చింతలపల్లె, ధర్మారం, మెట్‌పెల్లి గ్రామల ఫీల్డ్‌అసిస్టెంట్లపై ఆరోపణలు రావడంతో సస్పెన్సన్ చేసినట్లు డీఆర్డీవో వెంకటేశ్వర్రావు ఆదేశాలు జారీచేశారు. మండలవ్యాప్తంగా రూ.15,95,844 చేసిన పనుల కంటే అత్యధికంగా కూలీలకు వేతనాలు చెల్లించినట్లు సోషల్ ఆడిట్లో వివరాలు వెల్లడయ్యాయి. కూలీల చేత పనులు చేయించాల్సిన ఫీల్డ్అసిస్టెంట్లు చేయని ప నులకు రూ. లక్షల్లో వేతనాలు చెల్లించడానికి కారుకులయ్యారని తేలింది. అత్యధికంగా కరీంపేటలో రూ.7.32 లక్షలు, చింతలపల్లెలో రూ.2.41 లక్షలు మెట్పల్లిలో రూ.1.13లక్షలు, కొత్తగట్టులో రూ.1. 10 లక్షలు, రాజాపూర్ రూ.32వేలు, లింగాపూర్ రూ.26వేలు అదనంగా కూలీలకు చెల్లించినట్లు తే లింది. మెట్పల్లి ఫీల్డ్అసిస్టెంట్ స్రవంతి భర్త మధు ఉపాధిహామీ పనులు చేయకున్నా పనులు చేసినట్లు రూ.19వేల వేతనం చెల్లింపులు చేసినందుకు గతనెల 18న సస్పెన్సన్ చేసిన విషయం విధిత మే. ఉపాధిహామీ పథకంలో అక్రమలు వెలుగు చూడడంతో కరీంపేట ఫీల్డ్అసిస్టెంట్ సల్మా, కొత్తగట్టు ఫీల్డ్అసిస్టెంట్ కలీషా, చింతలపల్లె చంద్రమౌళి, లింగాపూర్ ఫీల్డ్అసిస్టెంట్ రవి, ధర్మారం ఫీల్డ్అసిస్టెంట్ శంకర్, రాజాపూర్ ఫీల్డ్అసిస్టెంట్ ప్రభాకర్‌ను సస్పెన్సన్ చేస్తూ డీఆర్డీవో ఆదేశాలు జారీచేయడం సంచలనం కలిగించింది. రూ.15 లక్షల రికవరీ.. ఉపాధిహామీ పథకంలో కూలీలకు అదనంగా వేతనాలు చెల్లింపులు చేయడానికి కారణమైన ఫీల్డ్అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, జేఈల నుంచి రూ. 15,95,844 రికవరీ చేసేందుకు నోటీసులు జారీచేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే సస్పెన్సన్‌కు గురైన ఫీల్డ్అసిస్టెంట్లు 14 రోజుల్లో వివరణ ఇవ్వా లని డీఆర్డీవో జారీచేసిన మెమోలో సమాచారం అందించారు. -
కంపెనీల కుమ్మక్కు వల్లే..
హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రారంభ స్థాయి ఇంజనీర్ల వేతనాలు తక్కువగా ఉంచేందుకు కుమ్మక్కయ్యాయని ఐటీ నిపుణుడు, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో టి.వి.మోహన్‌దాస్ పాయ్ విమర్శించారు. వేతనాలకు సంబంధించి దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో పాయ్ ఏకీభవించారు. ఐటీ పరిశ్రమలో గత ఏడేళ్లుగా ఫ్రెషర్స్ (ప్రారంభ స్థాయి ఉద్యోగులు) వేతనాలు ఏమాత్రం పెరగలేదని మూర్తి ఆరోపించారు. అదే సమయంలో సీనియర్ స్థాయిల్లోని ఉద్యోగుల జీతాలు మాత్రం పలు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. సప్లై ఎక్కువ.. ఇదే కంపెనీలకు వరం.. ‘దేశంలో ఇంజనీర్లు ఎక్కువగా ఉన్నారు. ఏటా కొత్తగా వస్తున్న వారి సంఖ్యా ఎక్కువే ఉంది. ఇదే అంశాన్ని ఐటీ కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఈ విధానం సరైంది కాదు’ అని పాయ్ పేర్కొన్నారు. ‘పెద్ద కంపెనీలు కుమ్మక్కయ్యాయి. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. ఒకరితోనొకరు మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు వేతనాలు పెంచొద్దనే అంగీకారానికి వస్తారు’ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రారంభ స్థాయి ఉద్యోగుల వేతనాలు పెంచకూడదనే విషయాన్ని పరస్పరం మాట్లాడుకుంటాయనే విషయం తనకు తెలుసన్నారు. ఏడేళ్లలో సగం తగ్గిన జీతాలు! ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. గత ఏడేళ్లలో ఐటీ పరిశ్రమలోని ఫ్రెషర్స్ వేతనాలు 50 శాతం మేర పడిపోయాయని పాయ్ వివరించారు. అందుకే తొలి ఐదేళ్లలో వలసలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ప్రారంభ స్థాయి ఉద్యోగుల వేతనాలు అక్కడక్కడే ఉన్నందున మంచి టాలెంట్ ఉన్న వారు ఐటీ పరిశ్రమలోకి రావడం లేదని తెలిపారు. ‘ప్రముఖ ఐటీ కంపెనీలు మెరుగైన వేతనాలివ్వాలి. ఉన్నత స్థాయి ఉద్యోగులకు అధిక జీతాలివ్వకుండా చూసుకోవచ్చు. మధ్యస్థాయిలో మరింత వేతనాలివ్వాలి. సర్దుబాటు నేర్చుకోవాలి. ప్రారంభ స్థాయి ఉద్యోగుల వేతనాలను పెంచకుండా ఉండటం నైతికంగా తప్పు’ అన్నారాయన. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలు ఫ్రెషర్స్‌కు మంచి జీతాలు ఇవ్వడానికి ముందడుగు వేయాలన్నారు. మెరుగైన వేతనం ఇవ్వాలి.. ‘ఫ్రెషర్స్ మెరుగైన వేతనం పొందలేకపోవడం చాలా నిరుత్సాహపరుస్తోంది. ఏం చేద్దాం? ఇంజనీర్లు ఎక్కువగా ఉంటున్నారు. వారు చదువులేమో నేరుగా మంచి ఉద్యోగం దక్కించుకోవడానికి సరిపోవడం లేదు. వారికి శిక్షణ అవసరమౌతోంది. ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్ శిక్షణ కోసం చాలా డబ్బుల్ని ఖర్చు చేస్తున్నాయి. ఈ పరిస్థితి కొత్తేమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే’ అని పాయ్ వివరించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి కనక వారికి మెరుగైన వేతనాలివ్వాలని అభిప్రాయపడ్డారు. -
త్వరలో వేతన చట్టం సవరణ: కేంద్ర మంత్రి
హైదరాబాద్: సంస్థలు, వ్యాపారవేత్తలు తమ ఉద్యోగుల వేతనాలను చెక్కులు లేదా ఆన్లైన్లో చెల్లించడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇందుకోసం త్వరలో వేతన చట్టానికి సవరణ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉద్యోగుల వేతనాలను నగదు రూపంలో చెల్లిస్తున్నారని, అయితే ఇందులో ఉద్యోగి మోసానికి గురవుతున్నాడని వివరించారు. లెక్కల్లో చూపే వేతనానికి, చెల్లించే అసలు మొత్తానికి తేడా ఉంటోందని, దీనిపై కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. మనీ ట్రాన్సాక్షన్లలో పారదర్శకత సాధించటంతోపాటు మోసానికి తావులేకుండా కొత్త విధానం తేనున్నట్లు ఆయన చెప్పారు. ఈ విధానం అమలులోకి వస్తే ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు బ్యాంకు అకౌంట్ల ద్వారానే జరుగుతాయని చెప్పారు. ఈ సవరణతోపాటు మెటెర్నిటీ బెనిఫిట్, ఉద్యోగుల పరిహార చట్టాలను కూడా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే చేయనున్నట్లు వెల్లడించారు.