Warehouseman
-
గోదాంలకు స్థలం కొరత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థలం కొరత గోదాంల నిర్మాణానికి అడ్డంకిగా మారింది. జిల్లా, మహానగర అవసరాల మేరకు గిడ్డంకులు నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినా నిర్దేశిత ప్రాంతాల్లో భూమి లభించడం లేదు. మహానగర శివార్లలోని మండల కేంద్రాల్లో గిడ్డంకులు నిర్మించేందుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఇటీవల జిల్లా యంత్రాంగాన్ని ప్రతిపాదనలు అడిగింది. దీంతో ఆయా మండలాల్లో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు రెవెన్యూ అధికారుల సహకారంతో క్షేత్రస్థాయిలో పర్యటించి స్థల లభ్యత వివరాలు సేకరించారు. ఒక్కో గోదాం నిర్మాణానికి కనీసం ఐదెకరాల భూమి అవసరం. అలాగే గోదాంల వద్దకు వాహనాలు రాకపోకలు జరిపేందుకు వీలుగా రోడ్డు మార్గం అనువుగా ఉండాలి. ఇటువంటి అనుకూలత కోసం రోజుల తరబడి జల్లెడబట్టినా పూర్తిస్థాయిలో స్థలాలు లభించలేదు. ఐదు మండల కేంద్రాల్లో స్థల లభ్యత ఉండగా.. మిగిలిన ఆరు మండలాల్లో కొరత ఉంది. ఐదు చోట్ల భూమి గుర్తింపు.. జిల్లా మార్కెటింగ్ శాఖ పరిధిలో మొత్తం 75,600 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 28 గిడ్డంకులు ఉన్నాయి. జిల్లా, మహానగర జనాభా అవసరాలకు ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. జనాభాకు సరిపడ వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావసర సరుకులు నిల్వ చేసేందుకు భారీ సామర్థ్యం గల గిడ్డంకులు అవసరం. వీటి నిర్మాణానికి నగరంలో స్థలం కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లా పరిసర ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో నిర్మించాలని భావించారు. ఈ క్రమంలో నాబార్డు నిధులతో జిల్లాలో 11 గోదాంలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాలని మార్కెటింగ్ శాఖ జిల్లా యంత్రాంగాన్ని కోరింది. ఒక్కో గోదాం సామర్థ్యం 5వేల మెట్రిక్ టన్నులు. ఒక్కో గిడ్డంగి నిర్మాణానికి ఐదెకరాల స్థలం అవసరం. వీటి కోసం అన్వేషించగా అబ్దుల్లాపూర్‌మెట్, నందిగామ, శంషాబాద్, కడ్తాల్, చౌదరిగూడలో మాత్రమే స్థలం అందుబాటులో ఉన్నట్లు తేలింది. ఈ మేరకు జిల్లా మార్కెటింగ్ శాఖ నివేదిక జిల్లా కలెక్టర్‌కు పంపించింది. సాధ్యాసాధ్యాలపై ఇంజనీరింగ్ విభాగం రిపోర్ట్‌ని నాబార్డ్‌కు అందజేసింది. గోదాం పరిసర ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం? ఏయే పంటలు అధికంగా సాగవుతున్నాయి? దిగుబడి అంచనా? ఎంతమంది రైతులకు మేలు చేకూరుతుంది? తదితర అంశాలపై మరోసారి నాబార్డ్ ప్రతినిధులు అధ్యయనం చేయనున్నారు. వాళ్లు సానుకూలత వ్యక్తం చేస్తే జిల్లా కలెక్టర్ భూమి కేటాయించనున్నారు. తద్వారా ఈ ఐదు గిడ్డంగులు జిల్లాకు మంజూరై నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఆ ఆరు వెనక్కి..! మహానగర శివారు ప్రాంతాల్లో గిడ్డంగుల నిర్మాణానికి స్థల లేమి అడ్డంకిగా మారింది. గండిపేట, బాలాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మాడ్గుల, షాద్‌నగర్ ప్రాంతాల్లో స్థల కొరత ఉంది. దీంతో గిడ్డంగుల నిర్మాణం ఇక్కడ సాధ్యం కాదన్న అభిప్రాయానికి మార్కెటింగ్ శాఖ వచ్చింది. ఫలితంగా ఆ ఆరు గిడ్డంగులు జిల్లా నుంచి చేజారిపోయినట్లే. వాటిని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాయాదేవి తెలిపారు. -
‘హిందూస్థాన్’ గోదాంలో అర్ధరాత్రి చోరీ
నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని హిందూస్థాన్ లివర్ లిమిటెడ్ సంస్థకు చెందిన గోదాంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. సుమారు రూ. 46 వేల విలువైన సరుకును అపహరించారు. అయితే ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు సరుకును తీసుకెళుతున్న వాహనాన్ని వెంబడించడంతో దొంగలు వాహనాన్ని వదలి పారిపోయారు. ఎస్ఐ గోపీనాథ్ కథనం మేరకు.. హిందూస్థాన్ గోదాం షెటర్‌ను గడ్డపారతో పైకి లేపి దొంగలు లోనికి ప్రవేశించారు. అంతకు ముందే షెటర్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాను పనిచేయకుండా చేశారు. దొంగలు తమతో తెచ్చుకున్న బొలెరో వాహనంలో సబ్బులు, ఇతర సామగ్రిని నింపుకుంటుండగా యజమాని గౌరయ్యగుప్తా గమనించి అక్కడకు పరుగెత్తుకొస్తుండగా గమనించిన దొంగలు అతనిపై రాళ్లు రువ్వుతూ వాహనంతో అక్కడి నుంచి ఉడాయించారు. ఈ విషయాన్ని వెంటనే వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు తమ వాహనంలో బయలుదేరి దొంగల వాహనాన్ని వెంబడించారు. ఈ మధ్యలో జిన్నారం మండలం బంతపల్లి వద్ద ఉన్న పోలీసు చెక్‌పోస్టు ఇన్చార్జ్ ఏఎస్ఐ రాంచందర్‌రావుకు సమాచారం అందించారు. ఆయన కూడా సిబ్బందితో వాహనాన్ని వెంబడించడంతో దొంగలు జిన్నారం మండలం అన్నా రం సమీపంలో వాహనాన్ని వదిలి పారిపోయారు. చోరీ చేసిన వాహనంలోనే చోరీకి.. హిందూస్తాన్ లివర్ లిమిటెడ్‌లో చోరీకి దొంగలు వినియోగించిన వాహనం కూడా చోరీ చేసిందే కావడం గమనార్హం. ఈ వాహనం రంగారెడ్డి జిల్లా ధారూర్ గ్రామానికి చెందిన రాంరెడ్డిది పోలీసులు గుర్తించారు. గత నెల 29 రాత్రి బొలెరోలో కూరగాయలు నింపుకొని రాంరెడ్డి డ్రైవర్ పాషా వికారాబాద్ న్యూగంజ్ మార్కెట్‌కు తీసుకువచ్చాడు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు పాషా వద్దకు వచ్చి తమది మెదక్ జిల్లా సదాశివపేట పట్టణమని, ఇల్లు ఖాళీ చేస్తున్నామని వాహనం అద్దెకు కావాలని అడిగారు. దీంతో డ్రైవర్ పాషా వారితో కలిసి బయలుదేరాడు. మార్గంమధ్యలో డ్రైవర్‌ను బెదిరించి వాహనాన్ని ఆ ఇద్దరూ చోరీ చేశారు. ఈ మేరకు వికారాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఇదే వాహనంతో గోదాంలో దొంగలు చోరీకి యత్నించారు. -
‘హిందూస్థాన్’ గోదాంలో చోరీ
నర్సాపూర్ : పట్టణంలోని హిందూస్థాన్ లివర్ లిమిటెడ్ సంస్థకు చెందిన గోదాంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. సుమారు రూ. 46 వేలు విలువైన సరుకును అపహరించారు. అయితే సమాచారాన్ని అందుకున్న పోలీసులు సరుకును తీసుకెళుతున్న వాహనాన్ని వెంబడించడంతో దొంగలు వాహనాన్ని వదలి పారిపోయారు. ఎస్ఐ గోపీనాథ్ కథనం మేరకు.. హిందూస్థాన్ గోదాం షెర్టర్ను దొంగలు గడ్డపారతో పైకి లేపి లోనికి ప్రవేశించారు. అంతకు ముందు షెట్టర్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాను దొంగలు పనిచేయకుండా చేశారు. దొంగలు తమతో తెచ్చుకున్న బొలెరో వాహనంలో సబ్బులు, ఇతర సామగ్రిని నింపుకుంటుండగా యజమాని గౌరయ్యగుప్తా గమనించాడు. దీంతో దగ్గరలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఉన్న వాచ్‌మన్‌తో కలిసి అక్కడి వస్తుండడగా గమనించిన దొంగలు వారిపై రాళ్లు రువ్వుతూ వాహనంతో అక్కడి నుంచి ఉడాయించారు. విషయాన్ని గౌరయ్య గుప్త పోలీసుల దృష్టికి తీసుకురావడంతో వారు దొంగల వాహనాన్ని వెంబడించారు. ఈ మధ్యలో జిన్నారం మండలం బంతపల్లి వద్ద ఉన్న పోలీసు చెక్‌పోస్టు ఇన్చార్జ్ ఏఎస్ఐ రాంచందర్‌రావుకు సమాచారం అందించారు. ఆయన కూడా సిబ్బందితో వాహనాన్ని వెంబడించడంతో దొంగలు జిన్నారం మండలం అన్నారం సమీపంలో వాహనాన్ని వదిలి పారిపోయారు. దీంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దొంగలు వాడిన వాహనం సైతం చోరీ చేసుకువచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ వాహనం రంగారెడ్డి జిల్లా దారూర్ గ్రామానికి చెందిన రాంరెడ్డికి చెందినదిగా గుర్తించామన్నారు. కాగా రామిరెడ్డి తన వాహనంలో గత నెల 29 రాత్రి కూరగాయలు నింపుకుని వికారాబాద్ న్యూగంజ్ మార్కెట్‌కు తీసుకువచ్చాడు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ పాషా వద్దకు వచ్చి తమది మెదక్ జిల్లా సదాశివపేట పట్టణమని, ఇల్లు ఖాళీ చేస్తున్నామని, సామాన్లు వేసుకుపోయేందుకు వాహనం అద్దెకు కావాలని అడిగారు. దీంతో డ్రైవర్ పాషా వారితో కలిసి బయలుదేరాడు. మార్గమధ్యలో డ్రైవర్‌ను బెదిరించి వాహనాన్ని ఆ ఇద్దరూ చోరీ చేశారు. ఈ మేరకు వికారాబాద్‌లో కేసు నమోదైందని ఎస్ఐ తెలిపారు. -
ఆకాశంలో మబ్బులు.. గుండెల్లో గుబులు
రైతన్నకు తప్పని తిప్పలు - వెంటాడుతున్న వరుణుడు - ముందుకు సాగని కొనుగోళ్లు - సిద్దిపేటలో నిలిచిన బీట్ - ఉన్న ధాన్యానికే అధికారుల అనుమతి - వాతావరణ శాఖ హెచ్చరికలతో అలర్ట్ సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: ఆకాశంలో మబ్బులు.. అన్నదాతకు గుబులు రేపుతున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోళ్లకు ప్రతిబంధకంగా మారుతోంది. మూడు రోజలుగా అడపాద డప చిరుజల్లులు కురుస్తుండటంతో సిద్దిపేట మార్కెట్ యార్డు అధికారులు గురువారం మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. అయితే బుధవారం నాటికే యార్డుకు వేలాది క్వింటాళ్ల ధాన్యం రావడం.. మరోవైపు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటుండటంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొనడమేకాక, కొనుగోళ్ల ప్రక్రియ అగమ్యగోచరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... సిద్దిపేట మార్కెట్ యార్డుకు జిల్లా నుంచే కాక ప్రతియేటా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన సమీప గ్రామాల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తరలిస్తుంటారు. రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం అధికారికంగా కొనుగోలు కేంద్రాలను నేటికీ ప్రారంభించలేదు. అయినప్పటికీ సిద్దిపేట మార్కెట్ యార్డ్‌లోని లెసైన్స్ వ్యాపారులు ఈనెల మూడు నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రతి రోజూ యార్డుకు ధాన్యం పోటెత్తుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులతో రైతులు ముందుజాగ్రత్తగా కల్లాల్లోంచే నేరుగా ధాన్యాన్ని యార్డ్‌కు తరలిస్తున్నారు. రోజూ సుమారు 10 క్వింటాళ్ల ధాన్యం బీట్ నిమిత్తం యార్డుకు వస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం సుమారు 13 వేల క్వింటాళ్ల ధాన్యం వచ్చింది. యార్డులోని షెడ్లతో పాటు ఆరు బయట ధాన్యాన్ని రాశులుగా పోశారు. కాగా కురుస్తున్న చిరు జల్లుల నేపథ్యంలో యార్డులోని ధాన్యానికి సరిపడా టార్పాలిన్ల పంపిణీలో మార్కెట్ అధికారులు వైఫల్యం చెందారనే ఆరోపణలున్నాయి. మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తృతంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన.. అటు రైతుల్లో.. ఇటు మార్కెట్ యార్డు అధికారుల్లో వణుకు పుట్టించిందనే చెప్పాలి. యార్డులో పెద్ద ఎత్తున ధాన్యం రాశులు ఉండడం, వాటి బీట్ నిర్వహణ అధికారులకు తలకు మించిన భారంగా మారడంతో ముందు జాగ్రత్తంగా గురువారం సిద్దిపేట మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించారు. అన్నదాతలు ధాన్యాన్ని తీసుకురావద్దని బహిరంగ ప్రకటన చేశారు. దీంతో యార్డ్‌లో ఉన్న 13 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని రాత్రంతా బీట్ నిర్వహించి, త్వరితగతిన గోదాంలకు తరలించారు. ఈ క్రమంలో గురువారం క్రయవిక్రయాలు లేక సిద్దిపేట మార్కెట్ యార్డు వెలవెల బోయింది.