washed out
-
వాగులో కొట్టుకుపోయిన కారు
-
వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన బస్సు
-
వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి : నర్సంపేట
-
Guntur : పీకల వాగులో పడి బాలుడు మృతి
సాక్షి, గుంటూరు : నగరంలో విషాదం చోటుచేసుకుంది. వాగులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. శనివారం గుంటూరు నగరంలో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వర్షం తగ్గిన తర్వాత మృతుడు వెంకటేష్‌తో పాటు మరో బాలుడు ఆడుకోవటానికి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ ప్రమాదవశాత్తు పీకల వాగులో పడి, కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.12 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత బాలుడి శవాన్ని కనుగొన్నారు. వంతెన కింద బాబు మృత దేహాన్ని గుర్తించారు. -
కామారెడ్డి జిల్లా: మంజీరాలో ముగ్గురు గల్లంతు
-
కామారెడ్డిలో విషాదం: మంజీరాలో ముగ్గురు గల్లంతు
కామారెడ్డి: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దర్గా దర్శనానికి వెళ్లిన నలుగురు మంజీరా నదిలో గల్లంతయ్యారు. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. బిచ్కుంద మండలం షెట్లూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్గా దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో వారిలో తల్లి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి నదిలో గల్లందయ్యారు. ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా.. అమ్మాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: ఈ ఐదక్షరాల శాసనం వయసు 2,200 ఏళ్లు -
రెండో రోజు వర్షార్పణం
హోబార్ట్:ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు అడ్డుకున్నాడు. ఆదివారం ఆటకు వర్షం అంతరాయం కల్గించడంతో రెండో రోజు ఆటను రద్దు చేశారు. ఈ రోజు ఆటలో కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ ను నిలిపివేశారు. మరొకవైపు మూడు రోజు కూడా మోస్తరుగా వర్షం పడే అవకాశాలు ఉండగా, నాలుగు, ఐదు రోజుల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 85 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.