
సాక్షి, గుంటూరు : నగరంలో విషాదం చోటుచేసుకుంది. వాగులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. శనివారం గుంటూరు నగరంలో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వర్షం తగ్గిన తర్వాత మృతుడు వెంకటేష్‌తో పాటు మరో బాలుడు ఆడుకోవటానికి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ ప్రమాదవశాత్తు పీకల వాగులో పడి, కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.12 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత బాలుడి శవాన్ని కనుగొన్నారు. వంతెన కింద బాబు మృత దేహాన్ని గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment