Water distibution
-
కృష్ణా బోర్డు కేటాయింపులు
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో కనీస నీటి మట్టాలకు ఎగువన అందుబాటులో ఉన్న జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 84, తెలంగాణకు 140 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. వరద వచ్చిన రోజుల్లో వినియోగించుకున్న నీటిని లెక్కలోకి తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేసిన ప్రతిపాదనపై మరోసారి చర్చిద్దామని సూచిం చింది. బోర్డు వర్కింగ్ మాన్యువల్ (కార్యనిర్వాహక నియమావళి)ని కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశంలో చర్చించితుది నిర్ణయం తీసుకుందామని కృష్ణా బోర్డు చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. హైదరాబాద్‌లోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా అధ్యక్షతన బోర్డు గురువారం సమావేశమైంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటిదాకా ఏపీ 511, తెలంగాణ 159 టీఎంసీలు వినియోగించుకున్నాయని బోర్డు సభ్య కార్యదర్శి ఎ. పరమేశం వివరించారు.. దీనిపై ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ స్పందిస్తూ.. ఈ ఏడాది శ్రీశైలానికి కృష్ణా నది నుంచి ఎనిమిది దఫాలుగా భారీగా వరద ప్రవాహం రావడంవల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది 800 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశామన్నారు. సముద్రంలో కలుస్తున్న వరద జలాలను వినియోగించుకున్నామని.. వాటిని లెక్కలోకి తీసుకోవద్దని బోర్డుకు వి/æ్ఞప్తి చేశారు. ఈ అంశంపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోలేమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తెలిపారు. ఈ నెల 13న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉండే అవకాశం ఉందని.. అప్పుడు వారిరువురూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. కనీస నీటి మట్టాలకు ఎగువన 233 టీఎంసీలు.. కాగా, రబీలో సాగు, వేసవిలో తాగునీటి అవసరాలకు 98 టీఎంసీలు కేటాయించాలని ఏపీ, 157 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ సర్కార్ చేసిన ప్రతిపాదనలపై బోర్డు చర్చించింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 66, తెలంగాణకు 34 శాతం చొప్పున కేటాయిస్తూ కేంద్రం చేసిన తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే ఈ ఏడాది నీటి కేటాయింపులు చేస్తామని బోర్డు స్పష్టంచేసింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కనీస నీటి మట్టాలకు ఎగువన ప్రస్తుతం 233 టీఎంసీల నీరు ఉందని.. ఆవిరి నష్టాలు తీసివేయగా మిగిలిన 224 టీఎంసీల్లో ఏపీకి 84, తెలంగాణకు 140 టీఎంసీలను బోర్డు కేటాయించింది. ఇదిలా ఉంటే.. రెండో దశలో టెలీమీటర్ల ఏర్పాటుకు అవసరమైన నిధులను బోర్డుకు విడుదల చేసేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించాయి. ఈ సమావేశంలో ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ మురళీనాథ్‌రెడ్డి, ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ సర్కార్ తరఫున ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి పంపిణీలో మాటలు తప్ప చేతలు లేవు..!
సాక్షి, తెర్లాం(శ్రీకాకుళం): సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తోటపల్లి ప్రధాన కుడి కాలువ కింద ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు పిల్ల కాలువను మాత్రం ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. పిల్ల కాలువలు మంజూరయ్యాయని, వాటిని తవ్వేందుకు రైతుల నుంచి భూములు సేకరిస్తున్నామని అధికారులు పదేపదే చెప్పడమే మిగులుతుందే తప్ప ఇప్పటివరకు పిల్ల కాలువల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో వేలాది ఎకరాల భూములు బీడు భూములుగా మారుతున్నాయి’. ఇదీ పరిస్థితి.. నియోజకవర్గంలోని తెర్లాం, బాడంగి, బొబ్బిలి మండలాలను కలుపుతూ తోటపల్లి ప్రధాన కుడికాలువను నిర్మించారు. ఈ కాలువ కింద సుమారు 30 వేల ఎకరాల వరకు మూడు మండలాలకు చెందిన భూములు ఉన్నాయి. వీటిలో తెర్లాం మండలంలోని తోటపల్లి ప్రధాన కుడి కాలువ కింద 10 వేల ఎకరాల భూములు ఉండగా, కేవలం మూడు పిల్ల కాలువల ద్వారా 4 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. మిగిలిన భూములకు చుక్క సాగునీరు కూడా అందడం లేదని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అంతంతమాత్రంగా పిల్ల కాలువల నిర్మాణం... నియోజకవర్గంలోని బొబ్బిలి, బాడంగి, తెర్లాం మండలాల మీదుగా వెళ్తున్న తోటపల్లి ప్రధాన కుడి కాలువకు సంబంధించి బొబ్బిలి, బాడంగి మండలాలకు సంబంధించి ఇంతవరకు పిల్ల కాలువలను ఏర్పాటు చేయలేదు. తెర్లాం మండలంలో 27 కిలో మీటర్ల పరిధిలో తోటపల్లి ప్రధాన కుడికాలువ ఉండగా కేవలం మూడు పిల్లకాలువలను ఏర్పాటు చేసి, 4వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. తమ పొలాల మీదుగా, గ్రామాల మీదుగా తోటపల్లి ప్రధాన కుడికాలువ ఉన్నా తమకు ఎటువంటి ప్రయోజనం లేకపోతుందని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాటలు తప్ప చేతల్లేవ్.. తోటపల్లి ప్రధాన కుడి కాలువ కింద ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు పిల్ల కాలువలు ఏర్పాటు చేస్తామని సంబంధిత అధికారులు పదేపదే ప్రకటిస్తున్నా, అది కార్యరూపం దాల్చడంలేదు. బొబ్బిలి, తెర్లాం మండలాల్లో కొత్తగా పిల్ల కాలువల ఏర్పాటుకు అవసరమైన భూములు సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నా ఎటువంటి ఫలితం లేదని రైతులు అంటున్నారు. ఇబ్బంది పడుతున్నాం.. తమ గ్రామం మీదుగా తోటపల్లి ప్రధాన కుడికాలువ వెళ్తోంది. మా గ్రామానికి పక్క గ్రామం వరకు పిల్ల కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. మా గ్రామానికి చుక్క నీరు కూడా రావడంలేదు. దీంతో తమ భూములన్నీ బీడు భూములుగా మారుతున్నాయి. పిల్ల కాలువల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. –జమ్మల పెంటయ్య, రైతు, సతివాడ, తెర్లాం మండలం. అధికారుల దృష్టికి తీసుకువెళతా.. తోటపల్లి ప్రధాన కుడి కాలువ నుంచి పిల్ల కాలువల ఏర్పాటుకు భూసేకరణ చేయాల్సి ఉంది. తోటపల్లి ఫేజ్–1కు సంబంధించి పిల్ల కాలువలు ఎక్కడెక్కడ ప్రతిపాదనలు చేశారో తెలియదు. ఫేజ్–2కు సంబంధించి పిల్ల కాలువ నిర్మాణ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతా. – దొర, తోటపల్లి ప్రాజెక్టు ఫేజ్–2 ఏఈ, తెర్లాం. -
జల వివాదాల్లో సమన్వయం పాటించండి
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు జైరాం సూచన శాంతిభద్రతల్లో సీఎంను భాగస్వామిని చేస్తాం సాక్షి, న్యూఢిల్లీ: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని, సమన్వయంతో రెండు రాష్ట్రాలు ప్రగతి సాధించాలని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తెలంగాణ ప్రాంత మంత్రులకు ఉద్బోధించారు. ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు ప్రజలుగా కలసే ఉండాలని ఆకాంక్షించారు. చిన్నచిన్న తగాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ముఖ్యంగా నదీజలాల విషయంలో రాష్ట్రాల మధ్య సమన్వయం మిక్కిలి అవసరమని, ఇరు ప్రాంతాలు ఈ విషయంలో నదీ జలాల బోర్డులకు సహకారం అందించాలని కోరారు. శనివారం మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత కా్రంగెస్ మంత్రులు జానారెడ్డి, సునీతారెడ్డి, గీతారెడ్డి, ప్రసాద్‌కుమార్, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాజయ్య, విప్ ఆరేపల్లి మోహన్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జైరాంను ఆయన నివాసంలో కలిసి తెలంగాణ ఏర్పాటుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జైరాం పలు కీ లక సూచనలు నేతలకు చేసినట్లు తెలిసింది. ఆయన చెప్పిన అంశాలు.. కొత్తగా ఏర్పడే రాష్ట్రంతో సమన్వయం అవసరం. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని ఓపికతో పరిష్కరించుకోండి. నదీ జలాల సమస్యలను పెద్దవి చేయకుండా సమన్వయంతో వ్యవహరించండి. తెలంగాణలోని సీమాంధ్రులకు ఎలాంటి అభద్రత ఉండదని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశాన్ని మేమూ పరిశీలిస్తున్నాం. ఆ అధికారాల్ని పూర్తిగా గవర్నర్‌కే కట్టబెట్టకుండా తెలంగాణ సీఎంకు, అక్కడి ప్రభుత్వానికి తగిన భాగస్వామ్యం కల్పిస్తాం.