Water pipeline
-
Hyderabad: ఓఆర్ఆర్.. రింగ్‌మెయిన్.. మెట్రో..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ అభివృద్ధి ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ చక్కర్లు కొడుతోంది. పలు కీలక ప్రాజెక్టులు, ప్రతిపాదనలు.. సర్కారు ప్రణాళికలు ఈ రహదారి కేంద్రంగానే సాగుతున్నాయి. మహా నగరానికి మణిహారంలా 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ నగరం నలుమూలలకు కృష్ణా, గోదావరి జలాలను కొరత లేకుండా సరఫరా చేసేందుకు భారీ తాగునీటి పైపులైన్ ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. తాజాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎక్స్‌ప్రెస్ మెట్రో మార్గం ఏర్పాటుకు పునాది రాయి వేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఔటర్ చుట్టూ మెట్రో ప్రతిపాదన చేయడంతో ఈ అంశం సైతం సర్వత్రా చర్చనీయాంశమైంది. పైపులైన్ ఏర్పాటు ఇలా.. గ్రేటర్‌కు మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ జలహారం ఏర్పాటు పనుల్లో ఇప్పటికే సుమారు 48 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. మరో 110 కి.మీ మార్గంలో పనులు చేపట్టాల్సి ఉంది. పనుల పూర్తికి రూ.4,725 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసింది. ప్రస్తుతం నగరానికి ఎల్లంపల్లి (గోదావరి), కృష్ణా జలాలను సరఫరా చేస్తున్నారు. ఈ జలాలను నగరం చుట్టూ మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ 3,000 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ పైప్‌లైన్ ఏర్పాటు చేసి వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేయాలి. దీంతో నగరం నలుమూలలకు కొరత లేకుండా తాగునీటిని సరఫరా చేయవచ్చు. గతంలో పూర్తిచేసిన 48 కి.మీటర్లకు అదనంగా మరో 110 కి.మీ మార్గంలో పనులు చేపట్టాల్సి ఉంది. జలాల నిల్వకు వీలుగా రెండు భారీ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను సైతం నిర్మించాల్సి ఉంటుంది. వీటిలో కృష్ణా, గోదావరి జలాలను నిల్వ చేయాలి. ఔటర్‌కు మెట్రో హారం.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ మెట్రో మార్గం దాదాపు 20 కిలోమీటర్ల మేర ఔటర్‌కు ఆనుకొనే వెళ్లనుంది. ఇక ఓఆర్ఆర్ లోపల కీలక ప్రాంతాలను అనుసంధానిస్తూ ఔటర్ చుట్టూ మెట్రో మార్గం ఏర్పాటు చేసిన పక్షంలో ఓఆర్ఆర్ లోపలున్న 190 గ్రామాలు, 30కి పైగా నగరపాలక సంస్థలకు కనెక్టివిటీ పెరగడంతో పాటు ఐటీ, బీపీఓ, కేపీఓ, ఫారా>్మ, బయోటెక్,తయారీ రంగం, లాజిస్టిక్స్, హార్డ్‌వేర్, ఏవియేషన్ తదితర రంగాల సత్వర, సమగ్ర అభివృద్ధికి బాటలు పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అభివృద్ధిలో మహానగరం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుండడంతో ఔటర్ రింగ్‌రోడ్డు వరకు పలు అభివృద్ధి ప్రాజెక్టులు, రియలీ్ట, నిర్మాణ రంగ ప్రాజెక్టులు విస్తరించిన నేపథ్యంలో మెట్రో కనెక్టివిటీ ఆయా ప్రాంతాలకు అత్యావశ్యకమని విశ్లేషిస్తున్నారు. చదవండి: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ కుంభకోణం? -
Photo Feature: ఐడియా అదిరింది సారు...
ఇవి నిర్మల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పశువులు. రోడ్డుపై విచ్చలవిడిగా తిరుగుతూ కనిపించే పశువులపై మున్సిపల్ సిబ్బంది ఎంసీఎన్ అని రాస్తారు. దీంతో వాటిని సదరు పశువుల యజమానులు మళ్లీ రోడ్లపైకి వదలకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ అవే పశువులు మళ్లీ రోడ్డుపై కనిపిస్తే వాటిని కార్పొరేషన్ సిబ్బంది పట్టుకుని గోశాలకు తరలిస్తారు లేదా అడవిలో వదిలేస్తారు. గేదెలు, మేకల వంటివి రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ ప్రయాణికులకు ఆటంకం కలిగించడంతోపాటు ప్రమాదాలకు కూడా కారణమవుతున్న నేపథ్యంలో వీటికి చెక్ చెప్పేందుకు నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ ఇలా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్. అవ్వకెంత కష్టం.. చేతితో చిల్లిగవ్వలేదు.. ఉన్న ఒక్క కొడుకు బతుకుతెరువు కోసం వెళ్లి వేరే ఊరిలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కాసిపేట మండలంలోని లక్ష్మీపూర్‌లో ఉంటున్న కన్న కూతురును చూడాలనిపించింది ఈ అవ్వకు. అయితే, ప్రయాణానికి డబ్బులు లేవు.. కానీ కూతురును చూడాలనే కోరిక ముందు ఇదేమీ కష్టం అనిపించలేదు. దీంతో ఇలా కాలినడకన నెత్తిన బట్టలమూటతో బయలుదేరి వెళ్తూ సాక్షి కెమెరాకు కనిపించింది. – సాక్షి ఫోటోగ్రాఫర్, మంచిర్యాల వినూత్న యంత్రం.. పనిలో వేగం జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి చెందిన రైతు ముత్తినేని సత్యం పవర్ వీడర్ యంత్రానికి మార్పులు చేర్పులు చేసి మరింత సులభంగా సాగు పనులు చేస్తుండడం ఇతర రైతులను ఆకట్టుకుంటోంది. పత్తి, మిరప పంటల సాగు చేసే సత్యం రూ.55 వేలతో పవర్ వీడర్ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. స్వతహాగా మెకానిక్ అయిన ఆయన యంత్రానికి కొన్ని మార్పులు చేశాడు. నడుస్తూ పనిచేయాల్సిన పవర్ వీడర్‌ను బైక్‌లా మార్చేందుకు ముందు భాగంలో మూడో చక్రాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి తోడు వెనుక భాగంలో ట్రాక్టర్ మాదిరి గొర్రు పైకి.. కిందకు లేపేలా బిగించాడు. దీంతో ఎన్ని ఎకరాలైనా సరే.. కూర్చుని మరీ పత్తి, మిరప తోటలో గుంటుక తీయడం, కలుపు తీయడం సులభమవుతోందని తెలిపాడు. పత్తి, మిరప, కూరగాయల సాగు చేసే రైతులకు ఈ యంత్రం ఉపయోగకరంగా ఉంటుందని సత్యం వెల్లడించాడు. ఉప్పొంగిన ‘భగీరథ’ మహబూబ్‌నగర్ మండలంలోని మన్యం కొండ స్టేజీకి సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ వాల్వ్ నుంచి గురువారం నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారీ ఎత్తున నీరు లీకేజీ కావడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. దీనిపై మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణను వివరణ కోరగా.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి, మహబూబ్‌నగర్ మండలం రాంరెడ్డి గూడెంలోని వాల్వులు కొంత కాలంగా లీక్ అవుతున్నాయని, వాటికి మరమ్మతు చేయడానికి వీలుగా మన్యంకొండ వద్ద నీరు విడిచామని తెలిపారు. నీరు మొత్తం ఖాళీ అయితేనే వాల్వు మరమ్మతు చేయడానికి వీలవుతుందని, నీరు ఖాళీ అయ్యాక తాను వాల్వ్‌లను పరిశీలించి లీకేజీలను సరిచేయించానని ఆయన వివరించారు. – జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) -
అన్నదాతల భగీరథ యత్నం
సాక్షి, చీరాలటౌన్ (ప్రకాశం): ఆరుగాలం కష్టించి పండించిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. చేతికి అందివచ్చే పంటలకు కావాల్సిన ఆఖరి తడి కోసం తంటాలు పడుతున్నారు. మినుము పంటలు సాగుచేసిన రైతులు తమ పంటలు కాపాడుకోవడానికి డీజిల్ ఇంజన్లను వినియోగిస్తున్నారు. వివరాల్లోకెళితే.. మండలంలోని గవినివారిపాలెం, పిట్టువారిపాలెం గ్రామాల్లోని రైతులు మినుము పంటలను 75 ఎకరాల్లో సాగు చేశారు. మరో నెల రోజుల సమయంలో పంట చేతికివచ్చే సమయంలో మినుము పంటకు కావాల్సిన నీటిని సిమెంట్ కాలువ నుంచి డీజిల్ ఇంజన్లు ద్వారా పైపులతో సరఫరా చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులకు కావాల్సిన నీటిని అందించడంతో అధికారులు, ప్రభుత్వం విఫలం కావడంతో డీజిల్ ఇంజన్లతో ఎకరానికి రూ.3వేలు ఖర్చు చేసి పంటలకు నీరు అందిస్తున్నామన్నారు. పంట చేతికందే సమయంలో కూడా నీటి కోసం తాము కష్టాలను అనుభవిస్తున్నామని రైతులు వాపోతున్నారు. సిమెంట్ కాలువల నుంచి డీజిల్ ఇంజన్లుతో నీటిని పైపుల ద్వారా పంట భూములకు తరలిస్తున్నారు. ప్రతిఏటా పంటల సాగుచేసే సమయంలో తాము సాగునీటి కోసం భగీరథ యత్నాలు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. -
అమాంతం గాల్లోకి లేచిపడింది
సాక్షి, ముంబై : వాహనాలు గాల్లో ఎగరటం సాధారణంగా మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ముంబై వాసులు మాత్రం లైవ్‌లో చూస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. మూడు రోజుల క్రితం బొరివాలి ప్రాంతంలో వాటర్ పైప్ లీక్ అయ్యింది. సాయంత్రం పూట ఈ ఘటన జరగటంతో మోకాళ్ల లోతు నీటిలో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో ఓ బొలెరో వాహనం కింద పైప్ లైన్ పగిలిపోవటంతో ఆ ఒత్తిడికి అది అమాంతం గాల్లోకి లేచిపడింది. అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యాయి. ఘటనలో ఎవరికీ ఏం కాలేదని తెలుస్తోంది. ఇక ఇదేం రోహిత్ శెట్టి సినిమాలో సీన్ కాదంటూ ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. -
అమాంతం గాల్లోకి లేచిపడింది
-
కల్తీ క‘మాల్’
ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ తుంగలో.. నిబంధనలకు విరుద్ధంగా నూనె ప్యాకెట్లు, డబ్బాల తయారీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లు ఆస్పత్రుల పాలవుతున్న అమాయక జనం పక్క చిత్రంలోని వైద్యం పొందుతున్న కూలీలు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు. వీరు కామారెడ్డిలో తాగునీటి పైప్‌లైన్ పనులు చేస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ కూలీలు శనివారం స్థానికంగా ఉండే ఓ షాపులో వంట నూనె ప్యాకెట్‌ను కొనుగోలు చేసి వంట చేసుకున్నారు. తీరా ఆ నూనె కల్తీది కావడంతో ఈ ఆహారం తిన్న కూలీలు, ఆ కుటుంబంలోని చిన్న, పెద్ద అంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు చేసుకున్నారు. కనీసం ఆస్పత్రికి వెళ్లి వైద్యం కూడా చేయించుకోలేక ఇంట్లోనే పడి ఉన్న ఆ నిరుపేద కూలీలను రెవెన్యూ ఉన్నతాధికారులే ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడారు. సంబంధిత వ్యాపారులపై కేసులు పెట్టారు. కల్తీ నూనె మాఫియా ఆగడాలకు ఇదొక మచ్చుతునక. నిజామాబాద్ : కల్తీ నూనె మాఫియా రెచ్చిపోతోంది. వంట నూనెలను కల్తీ చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కామారెడ్డి కేంద్రంగా ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఆరోగ్యానికి హానికరమైన నూనెలను కల్తీ చేసి రూ.కోట్లు గడిస్తోంది. వంట నూనెల తయారీ, విక్రయాల్లో అడుగడుగునా నిబంధనలను తుంగలో తొక్కుతోంది. నిత్యం రూ.కోట్లలో అక్రమదందా సాగుతున్నా సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వెనుక పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నూనెలను వినియోగిస్తున్న అమాయక ప్రజలు వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు. ఆయిల్ తయారీకి అనుమతుల్లేవు.. వంట నూనెలను తయారు చేయాలంటే గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుంచి లైసెన్సులు తీసుకోవాలి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఏ ఒక్క ప్లాంటుకు కూడా ఫుడ్స్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుంచి లైసెన్సులు మంజూరు చేయలేదు. కేవలం వంట నూనెలను ప్యాకింగ్ చేసుకునేందుకు మాత్రమే 23 ప్లాంట్లకు లైసెన్సులిచ్చారు. కానీ కామారెడ్డి, నిజామాబాద్‌లో నూనెలను మిక్సింగ్ చేస్తున్నారు. అత్యధికంగా నూనె దందా కామారెడ్డి కేంద్రంగా సాగుతోంది. ప్యాకెట్లలో ప్రమాణాలు గాలికి.. రూ.కోట్లలో నూనె దందా చేస్తున్న అక్రమార్కులు అడుగడుగునా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఎఫ్ఎస్ఎస్ఏ (ఫుడ్ సేఫ్టీ స్టాండరŠడ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) మార్గదర్శకాలను గాలికొదిలేస్తుండటంతో అమాయక ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా తయారైంది. l వంట నూనెను ప్యాకెట్లుగా తయారు చేస్తున్న అక్రమార్కులు ఆ ప్యాకెట్లపై ఎలాంటి వివరాలు ఉంచడం లేదు. ఆ ప్యాకెట్లో ఏయే రకాల నూనెలు కలిపారు. నూనె తయారు చేసిన సంస్థ వివరాలు, ప్యాకింగ్ చేసిన తేదీ.. ప్లాంటు వివరాలు.. కలిపిన ఇతర రసాయనాలు వంటి పూర్తి వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను ప్యాకెట్లపై ముద్రించాలి. కానీ.. ఇవేవీ పాటించకుండా మామూలు పాలిథిన్ కవర్లలో నూనెను ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఇటీవల కామారెడ్డిలో కూలీలు అస్వస్థతకు గురైన ఘటన ఈ కల్తీ దందాకు అద్దం పడుతోంది. ఈ వివరాలేవి లేని నూనె ప్యాకెట్‌ను కొనుగోలు చేసి వినియోగించడంతో అమాయక ప్రజల ప్రాణాల మీదికి వస్తోంది. ♦ నిబంధనల ప్రకారం వ్యాపారులు లూజ్ ఆయిల్ అమ్మరాదు. య«థేచ్ఛగా లూజ్ ఆయిల్ విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పలుచోట్ల లూజ్ ఆయిల్‌ను విక్రయిస్తున్నారు. చౌకబారు నూనెలను కలిపి రూ.కోట్లు దండుకుంటున్నారు. ♦ పామోలివ్, పత్తిగింజల నూనె అత్యంత చౌకగా లభిస్తుంది. పత్తి నుంచి వేరు చేసిన గింజలతో తయారైన ఈ నూనెలను ఆదిలాబాద్, భైంసా వంటి జిన్నింగ్ ఆయిల్ మిల్లుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేసుకుంటున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్యాంకర్లలో తెప్పించుకుంటున్నారు. ఈ చౌక నూనెల్లో అధిక ధర ఉండే పల్లీ నూనె, పొద్దుతిరుగుడు నూనెలను నామమాత్రంగా కలిపి ప్యాకెట్లు చేస్తున్నారు. ఈ ప్యాకెట్లపై మాత్రం అందంగా, కంటికి ఇంపుగా కనపడే పల్లీలు, పొద్దుతిరుగుడు గింజలను ముద్రించి ఇది స్వచ్ఛమైన పల్లీ నూనె, పొద్దు తిరుగుడు నూనె అంటూ అమాయక ప్రజల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. అమాయక ప్రజలు ప్యాకెట్ మీద ఇంగ్లిష్‌లో ఉన్న డిక్లరేషన్‌ను చదివే అవగాహనæ లేకపోవడంతో బొమ్మను చూసి ఇదే పల్లీ, పొద్దుతిరుగుడు నూనె అని మోసపోతున్నారు. ♦ కేవలం ప్యాకెట్లలోనే కాదు, డబ్బాల్లోనూ ఈ నూనెను ప్యాకింగ్ చేస్తున్నారు. అలాగే 15 కేజీలు ఉండే ఈ ఆయిల్ డబ్బాలను కూడా ఇక్కడి నుంచే ఇతర జిల్లాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ఈ దందా రూ.కోట్లలో సాగుతోంది. -
మంచినీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం
అనేక సంవత్సరాలుగా హయత్‌నగర్ పరిధిలోని గాయత్రినగర్ ప్రాంత వాసులు ఎదురుచూస్తున్న మంచినీటి పైపులైను పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక కార్పొరేటర్ సామా తిరుమలరెడ్డి, టీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ చార్జి ఎం. రామ్మోహన్ గౌడ్ స్వయంగా వచ్చి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. దాంతోపాటు సోమవారం నుంచే పనులు కూడా ప్రారంభించారు. హయత్ నగర్ ప్రాంతంలోని మొత్తం 18 కాలనీలకు మంచినీళ్లు ఇచ్చేందుకు పనులు మంజూరయ్యాయని, ఈ కాలనీ రూపురేఖలు మార్చేందుకు అందరి సహకారం అవసరమని ఈ సందర్భంగా కార్పొరేటర్ తిరుమలరెడ్డి అన్నారు. గాయత్రినగర్ కు వచ్చే మార్గమైన కుమ్మరికుంట చెరువు కట్టమీద లైట్లు లేకపోవడం, అటూ ఇటూ కంపచెట్లు ఉండటంతో ఈ సమస్యను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే కట్ట మీద 14-15 లైట్లు మంజూరు చేశారని, రాబోయే 15 రోజుల్లో అవన్నీ కూడా ఏర్పాటుచేస్తారని ఆయన వివరించారు. ఇక ఔట్ లెట్ లేకపోవడం వల్లే ఈ కాలనీకి ప్రస్తుతం డ్రైనేజి కనెక్షన్ ఇవ్వలేకపోతున్నామని, త్వరలోనే అది కూడా ఏర్పాటుచేయించి దీన్ని నెంబర్ వన్ కాలనీగా రూపొందిస్తామని చెప్పారు. డివిజన్ పరిధిలో మొత్తం 770 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరైనట్లు కూడా ఆయన తెలిపారు. -
ఆకాశానికి ఎగిరిన గంగ
-
మంత్రి ప్రారంభించిన మరుక్షణమే పగిలిన పైపులైన్
నాసిరకం పనులపై అమాత్యుని ఆగ్రహం విజిలెన్స విచారణకు ఆదేశం.. ? ఉప్పల్ : మంచినీటి పైపులైన్ ప్రారంభించిన వెంటనే.. పైపులైన్ పగలడంతో అమాత్యులు, అధికారులు అవాక్కయ్యారు. ఈ సంఘటన ఉప్పల్ సర్కిల్ పరిధిలోని ఉప్పల్ హిల్స్, కురుమానగర్, లక్ష్మీనర్సింహాకాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. రూ.3 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన మంచినీటి సరఫరా పైపులైన్‌ను మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. వెంటనే పైపులైన్ పగిలి పెద్దఎత్తున ఫౌంటెన్‌ను తలపించేలా నీరు పైకి ఎగిసింది. దీంతో నీటికోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వందలాదిమంది స్థానికులు, అప్పుడే ప్రారంభించిన మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జలమండలి అధికారులు ఆశ్చర్యపోయారు. ఇవేమీ పనులంటూ ముక్కున వేలేసుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో వేసిన పైపులైన్‌ను పగలడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి అంతటికి కారణం నాసిరకం పనులేనని అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే కాంట్రాక్టర్ నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని స్థానికులు ఆరోపించారు. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పైపులైన్ నాణ్యతపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. విజిలెన్స విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అరుుతే ఈ సంఘటనకు అవాక్కరుున జలమండలి అధికారులు తమ తప్పును సరిదిద్దుకునేందుకు పాత పైపులైన్లు పగిలిపోయాయని మంత్రికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. -
పైప్‌లైన్ లీక్,ఎగసిపడుతోన్న నీరు
-
అడిగేదెవరు.. ఆపేదెవరు!
మాస్టర్ ప్లాన్ పనుల్లో ఇష్టారాజ్యం నిబంధనలకు నీళ్లొదిలిన కాంట్రాక్టర్ నాసిరకంగా భూగర్భ డ్రెయినేజి, తాగునీటి పైపులైన్ పనులు ఎక్కడా అడ్డుకోలేని అధికారులు బదిలీలకు ముందు రోజు హడావుడిగా రూ.4.07 కోట్లు మంజూరు సూపర్ చెక్ లేకుండానే బిల్లుల చెల్లింపు మాస్టర్ ప్లాన్.. పేరుకు తగినట్లే పనుల్లోనూ అవినీతి పద్ధతిగా సాగుతోంది. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చినా.. గడువులోపు పనులు పూర్తి చేయకపోయినా.. చర్యలు తీసుకోవాల్సింది పోయి బిల్లులు చేసి ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడా.. ఏ స్థాయిలోనూ ఈ కాంట్రాక్టు సంస్థను ఇదేమని ప్రశ్నించకపోవడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. నాలుగు రోజుల వ్యవధి.. రూ.4.07 కోట్ల బిల్లు.. ఒకే రోజు ఏఈలు, డీఈ, ఈఈ, ఈఓ సంతకాలు.. అదే రోజు ఆడిట్ కార్యాలయంలోనూ ఆమోద ముద్ర పడటం చూస్తే.. ఈ సంస్థ ఎంత చాకచక్యంగా పనులు చక్కబెడుతుందో తెలుస్తోంది. దేవుని సన్నిధిలో పనులు చేయడమంటే.. అంతో ఇంతో భయం సహజం. శ్రీశైల క్షేత్రంలో మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ.137 కోట్ల వ్యయంతో చేపడుతున్న తొలి విడత పనులను పరిశీలిస్తే కాంట్రాక్టర్‌కు ఆ భయమనేది లేదనే విషయం ఇట్టే అర్థమవుతుంది. తాగునీటి సరఫరా పైపులైన్లు, భూగర్భ డ్రెయినేజి, పిలిగ్రిమ్ షెడ్లు, పుష్కరిణి తదితర పనుల్లో నాణ్యత మచ్చుకైనా కనిపించదు. అభివృద్ధి మాటున జరుగుతున్న దోపిడీకి ఇక్కడి అధికారులు కూడా వంత పాడుతుండటం గమనార్హం. కొన్ని చోట్ల పనులు పూర్తి కాకుండానే లక్షలాది రూపాయలను కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇక మంచినీటి సరఫరా పైపు లైన్ పనులు అవినీతికి పరాకాష్టగా చెప్పవచ్చు. వాస్తవానికి పైపులైన్ ఏర్పాటుకు తవ్వకం పూర్తయ్యాక ఆ మార్గంలో ఎక్కడా ఎగుడుదిగుడు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత కాంక్రీట్‌తో సమాంతరంగా 18 అంగుళాల వెడల్పుతో బెడ్డింగ్ వేయాలి. అనంతరం పైపులను అమర్చి ఇరువైపులా మెత్తటి గ్రావెల్ నింపాలి. శ్రీశైలంలో చేపడుతున్న పనుల్లో ఈ ప్రక్రియకు నీళ్లొదిలారు. పైపులైన్ కింద భూమిని చదును చేయకపోగా.. కాంక్రీట్ బెడ్డింగ్ వేయడం కూడా విస్మరించారు. పైపులను రాళ్లు ఆధారంగా ముందుకు తీసుకెళ్లడం.. వీటి కింద ఫ్లైయాష్(కంకర పొడి) చల్లి చేతులు దులుపుకున్నారు. సూపర్ చెక్ ఎక్కడ? వాస్తవానికి ఈ పనులన్నింటినీ ఇంజినీరింగ్ అధికారులు, క్వాలిటీ కంట్రోల్ అధికారులు కచ్చితంగా పరిశీలించాలి. అలాంటిది పనులను పర్యవేక్షిస్తున్న ఏఈలు కూడా ఎక్కడా అభ్యంతరం చెప్పకపోవడంతో కాంట్రాక్టర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. కనీసం బిల్లుల చెల్లింపు సమయానికి ముందు పనుల్లో నాణ్యతను పరిశీలించాల్సి ఉంది. ఇంజినీరింగ్ ఉన్నతాధికారి స్వయంగా ఈ పనులన్నింటినీ క్షేత్రస్థాయిలో పర్యటించి సూపర్ చెక్ చేయాలి. మ్యాన్ హోల్స్‌లో నీరు పోసి పక్కనే ఉన్న మ్యాన్‌హోల్స్ వరకు సాఫీగా ప్రవాహం ఉందా అన్నది పరిశీలించాలి. కానీ, భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సరఫరా పైపులైను పనుల్లో కళ్లు మూసుకుని బిల్లులు చేయడం గమనార్హం. హడావుడిగా రూ.కోట్ల చెల్లింపులు నాణ్యత లేని పనులకు ఆలయ అధికారులు హడావుడిగా ఎందుకు బిల్లులు చేస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. శివాజీ రాజా గోపురం పనుల్లోనూ చేయని పనులకు ముందస్తుగా సుమారు రూ.60 లక్షలు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సరఫరా పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు విషయంలోనూ అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల జరిగిన బదిలీల్లో దేవస్థానానికి చెందిన 26 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ జాబితాలో ఇంజినీరింగ్ ఉన్నతాధికారి, అధికారుల పేర్లు ఉండటంతో.. కాంట్రాక్టర్ తెలివి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అధికారులు కుమ్మక్కవడంతో ఏకంగా నాలుగు రోజుల వ్యవధిలో రూ.4.07 కోట్లకు సంబంధించిన బిల్లు పాసవడం చూస్తే.. దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది. -
వాటర్ ఫౌంటేన్‌లా ఎగిసిపడుతున్న మాంచినీరు