మంచినీటి పైప్లైన్ పనులకు శ్రీకారం | water pipeline works started in gayatrinagar | Sakshi
Sakshi News home page

మంచినీటి పైప్లైన్ పనులకు శ్రీకారం

Published Mon, Dec 19 2016 4:28 PM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

మంచినీటి పైప్లైన్ పనులకు శ్రీకారం

మంచినీటి పైప్లైన్ పనులకు శ్రీకారం

అనేక సంవత్సరాలుగా హయత్నగర్ పరిధిలోని గాయత్రినగర్ ప్రాంత వాసులు ఎదురుచూస్తున్న మంచినీటి పైపులైను పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక కార్పొరేటర్ సామా తిరుమలరెడ్డి, టీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ చార్జి ఎం. రామ్మోహన్ గౌడ్ స్వయంగా వచ్చి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. దాంతోపాటు సోమవారం నుంచే పనులు కూడా ప్రారంభించారు. 
 
హయత్ నగర్ ప్రాంతంలోని మొత్తం 18 కాలనీలకు మంచినీళ్లు ఇచ్చేందుకు పనులు మంజూరయ్యాయని, ఈ కాలనీ రూపురేఖలు మార్చేందుకు అందరి సహకారం అవసరమని ఈ సందర్భంగా కార్పొరేటర్ తిరుమలరెడ్డి అన్నారు. గాయత్రినగర్ కు వచ్చే మార్గమైన కుమ్మరికుంట చెరువు కట్టమీద లైట్లు లేకపోవడం, అటూ ఇటూ కంపచెట్లు ఉండటంతో ఈ సమస్యను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే కట్ట మీద 14-15 లైట్లు మంజూరు చేశారని, రాబోయే 15 రోజుల్లో అవన్నీ కూడా ఏర్పాటుచేస్తారని ఆయన వివరించారు. ఇక ఔట్ లెట్ లేకపోవడం వల్లే ఈ కాలనీకి ప్రస్తుతం డ్రైనేజి కనెక్షన్ ఇవ్వలేకపోతున్నామని, త్వరలోనే అది కూడా ఏర్పాటుచేయించి దీన్ని నెంబర్ వన్ కాలనీగా రూపొందిస్తామని చెప్పారు. డివిజన్ పరిధిలో మొత్తం 770 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరైనట్లు కూడా ఆయన తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement