అమాంతం గాల్లోకి లేచిపడింది | Burst Water Pipeline Hurls SUV into Air in Mumbai | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 29 2018 1:05 PM | Last Updated on Thu, Mar 29 2018 1:05 PM

Burst Water Pipeline Hurls SUV into Air in Mumbai - Sakshi

సాక్షి, ముంబై : వాహనాలు గాల్లో ఎగరటం సాధారణంగా మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ముంబై వాసులు మాత్రం లైవ్‌లో చూస్తూ ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌ లోడ్‌ చేశారు.

మూడు రోజుల క్రితం బొరివాలి ప్రాంతంలో వాటర్‌ పైప్‌ లీక్‌ అయ్యింది. సాయంత్రం పూట ఈ ఘటన జరగటంతో మోకాళ్ల లోతు నీటిలో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో ఓ బొలెరో వాహనం కింద పైప్‌ లైన్‌ పగిలిపోవటంతో ఆ ఒత్తిడికి అది అమాంతం గాల్లోకి లేచిపడింది. అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యాయి. ఘటనలో ఎవరికీ ఏం కాలేదని తెలుస్తోంది.  

ఇక ఇదేం రోహిత్‌ శెట్టి సినిమాలో సీన్‌ కాదంటూ ఆ వీడియోను కొందరు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement