water resource
-
యూరోపా యాత్రకు లైన్‌క్లియర్!
అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమైంది... గురుగ్రహ ఉపగ్రహం యూరోపాపైకి నాసా ప్రయోగించనున్న... యూరోపా క్లిప్పర్ ప్రాజెక్టుకు గ్రీన్‌లైట్ పడింది. ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్‌పై 2024లో క్లిప్పర్ యూరోపా చుట్టూ చక్కర్లు కొట్టనుంది. సముద్రాలతో నిండిన ఆ ఉపగ్రహంపై జీవం ఉందా? లేదా తెలుసుకోవడమే లక్ష్యం! భూమికి ఆవల మనిషి జీవించేందుకు అనువైన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? అన్నది తెలుసుకునేందుకు చాలాకాలంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సౌర కుటుంబానికి ఆవల వేల సంఖ్యలో గ్రహాలను ఇప్పటికే గుర్తించినప్పటికీ ఈ ఎక్సోప్లానెట్లలో జీవం ఆనవాళ్లు కానీ.. జీవించేందుకు అనువైన పరిస్థితులు కానీ ఇప్పటివరకూ గుర్తించ లేదు. సూర్యుడికి (ఇతర గ్రహ వ్యవస్థల్లోనైతే మాతృ నక్షత్రం) తగినంత దూరంలో ఉండటం.. భూమితో సరిపోలేలా రాళ్లు రప్పలతో, నీళ్లతో ఉండటం జీవం ఉండేందుకు అత్యవసరమన్నది శాస్త్రవేత్తల అంచనా. ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రాంతాన్ని గోల్డీలాక్స్ జోన్ అని పిలుస్తుంటారు. సౌర కుటుంబంలోని గురు గ్రహానికి ఉన్న నాలుగు ఉపగ్రహాల్లో ఒకటైన యూరోపా కొంచెం అటు ఇటుగా ఈ గోల్డీలాక్స్ జోన్లోనే ఉంది. పైగా ఆ ఉపగ్రహంలో మహా సముద్రాలు ఉన్నాయని చాలా కాలంగా తెలుసు. ఈ నేపథ్యంలోనే యూరోపా చుట్టూ చక్కర్లు కొడుతూ దాన్ని మరింత నిశితంగా పరిశీలించేందుకు జరుగుతున్న యూరోపా క్లిప్పర్ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆ వివరాలు... 1610లో గెలీలియో గురుగ్రహం వైపు తన దుర్భిణిని మళ్లించి చూసినప్పుడు అతడికి గ్రహంతోపాటు వెలుగులు చిమ్ముతున్న నాలుగు చుక్కల్లాంటివి కనిపించాయి. గురుగ్రహానికి ఉన్న 67 ఉపగ్రహాల్లో అతిపెద్దవైన నాలుగు ఉపగ్రహాలివి. వీటిల్లో అతి చిన్నది యూరోపా! నాసా ప్రయోగించనున్న యూరోపా క్లిప్పర్ కంటే ముందు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2022లోనే జూపిటర్ ఐసీమూన్ ఎక్స్‌ప్లోరర్ లేదా జ్యూస్ పేరుతో ఓ పరిశోధక నౌకను యూరోపా పైకి ప్రయోగించనుంది. భవిష్యత్తులో అణుశక్తితో నడిచే జలాంతర్గాములను యూరోపాలోని సముద్రాల్లో ప్రయాణించేలా చేసి ఆ ఉపగ్రహం గురించి మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకూ ప్రణాళికలు ఉన్నాయి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇచ్చిన మాట ప్రకారం నీటి వాట తీసుకుంటున్నాం: మంత్రి అనిల్
-
చంద్రుడి ఉపరితలంపై నీరు..!
వాషింగ్టన్: చందమామపై అధిక మొత్తంలో నీరు ఉందని నాసా శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో అంచనావేశారు. ఈ నీరు ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా చంద్రుడి ఉపరితలమంతా విస్తరించి ఉందని చెబుతున్నారు. చంద్రుడిపై పరిశోధనలకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్–1 పంపిన సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయం చెప్పారు. ఈ పరిశోధన ఫలితాలు అక్కడి నీటిని ఒక వనరుగా వాడుకునేందుకు చేయాల్సిన పరిశోధనలకు సహకరిస్తాయని అమెరికాలోని స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ జోషువా బాండ్ఫీల్డ్ వివరించారు. -
బండపై నీటి ఊట
ఖాజిపల్లిలోని కాళభైరవుడి ఆలయం సమీపంలో వింత మెదక్: ఓ ఆలయం పక్కన గల రాతిబండలోంచి నీరు ఉబికి వస్తోంది. ఈ వింత మెదక్ మండలం ఖాజిపల్లిలోని శ్రీ కాళభైరవ ఆలయం పక్కన మంగళవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాజశేఖర్ (హైకోర్టు న్యాయవాది)కు గ్రామశివారులో కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో 2010లో సుమారు రూ.20లక్షలు వెచ్చించి శ్రీ కాళభైరవ ఆలయాన్ని నిర్మించారు. యేటా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంతంలో అష్టభైరవ ఆలయం నిర్మించేందుకు కొన్ని రోజులుగా భూమిని చదును చేస్తున్నారు. అక్కడక్కడ పెద్ద పెద్ద బండరాళ్లు ఉండటంతో వాటిని పగుల గొడుతున్నారు. ఈనెల 5న ఓ పెద్ద బండరాయిని పగులగొట్టేందుకు దాని చుట్టూ 4అడుగుల గొయ్యి తవ్వి పగులగొట్టారు. దీంతో ఆ రాయి నుంచి నీరు ఉబికి వస్తోంది. దీంతో సింగిల్‌ఫేస్ మోటర్ ద్వారా నీటిని తొలగించినా నిరంతరంగా నీరు వస్తూనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులతోపాటు ఇరుగు పొరుగు గ్రామాల ప్రజలు తరలివచ్చి ఈ వింతను తిలకిస్తున్నారు. ఇది సాక్షాత్తు కాళభైరవుడి మహిమేనంటూ భక్తితో కొలుస్తున్నారు. -
సీఈ బాధ్యతల స్వీకరణ
కర్నూలు సిటీ: జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు చీఫ్ ఇంజనీర్‌గా సి.నారాయణ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు సీఈగా పని చేస్తున్న చిట్టిబాబు గత నెల 31న పదవి విరమణ కావడంతో హైదరాబాదులో చీఫ్ టెక్నికల్ అధికారిగా పని చేస్తున్న నారాయణ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రాజెక్ట్సు సీఈగా నియమించింది. ఈయన స్వస్థలం చిత్తూరు జిల్లా. ఈ మేరకు ఆయన బాధ్యతలు తీసుకునేందుకు ఆఫీస్‌కు రాగా సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం...పుష్కర పనుల పరిశీలనకు శ్రీశైలం వెళ్లారు. -
ఈ ఎడారిలో నీటికి కొదవ లేదు!
జైసల్మీర్: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తోంటే.. రాజస్థాన్ లోని థార్ ఎడారిలో మాత్రం 2 నుంచి 3 అడుగుల లోతు గుంటను తవ్వితే నీరు బయటకు వస్తోంది. జైసల్మీర్ కు సమీపంలోని షాఘర్ బల్జ్ ప్రాంతంలో ఈ పరిస్థితే కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్న ఒయాసిసలో ఎక్కడ తవ్విన 2 నుంచి 3 అడుగుల్లోపే నీరు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నీరు అంతరించిపోయిన సరస్వతి నదివేనని అంటున్నారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్లకు ఈ నీరు కొన్ని సంవత్సరాలుగా దాహార్తి తీరుస్తోందని చెప్తున్నారు. ఏ సీజన్ లోనైనా ఇక్కడ నీరు లభిస్తోందనీ, ఉదయం ఒకసారి గుంటను తవ్వి నీరు తొడుకుంటే సాయంతానికి తిరిగి నీరు ఊరుతోందని తెలిపారు. ఎంతో శుభ్రతతో లభ్యమయ్యే ఈ నీరు మినరల్ వాటర్ కంటే బావుంటాయని చెప్పారు. నీరు లభించే ప్రాంతమంతా వృక్షసంపదతో కళకళలాడుతుంటుందని తెలిపారు. ఒయాసిస్ కింద ఏదో జీవనది ప్రయాణిస్తుండటం మూలానే ఇలా జరుగుతోందని అంటున్నారు. బోర్డర్ లో ఉండే ఖారా, నల్కా, ఝలారియా, రోహ్ తోష్, వీర్ హిల్, కిర్వాలీ, సొంగమ్ లకు పైపులైన్ల ద్వారా ఇక్కడి నుంచి నీటి సరఫరా జరుగుతుందని బీఎస్ఎఫ్ అధికారి దిల్ బాగ్ సింగ్ తెలిపారు. సీనియర్ గ్రౌండ్ వాటర్ సైంటిస్ట్ డా.నారాయణ్ దాస్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో భూమి కింద నీటి వనరులు అధికంగా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ఇక్కడ నీటి వినియోగం చాలా తక్కువగా ఉండటం కూడా ఇక్కడి వాసులకు కలిసి వస్తోందని అన్నారు. -
నీటి వనరులపై చిన్నచూపు
మర్పల్లి, న్యూస్‌లైన్: ప్రభుత్వం చిన్ననీటి వనరులపై చిన్నచూపు ప్రదర్శిస్తోంది. దీంతో మండలంలోని చెరువుల్లో, కుంటల్లో పుష్కలంగా నీరు ఉన్నా రైతులకు ప్రయోజనం లేకుండాపోతోంది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. కాగా కొన్ని చెరువులు నాసిరకంగా నిర్మాణ పనులు చేపట్టటంతో నీరు లేక కళాహీనంగా దర్శనమిస్తున్నాయి. చెరువులు పూడిక మట్టితో నిండి ఉన్నాయి. మరికొన్ని చెరువుల్లో పిచ్చిమొక్కలు పెరగడంతో పూర్తిస్థాయిలో నీరు చేరటం లేదు. దీంతో ఆయకట్టు భూములకు సాగు నీరందే పరిస్థితి లేకుండాపోతోంది. సరిపడా అందని సాగునీరు మండలంలో 11 చెరువులు, 22 కుంటలు ఉన్నాయి. వీటి లోఅతిపెద్ధ ప్రాజెక్టు కొంషేట్పల్లి. కొంషేట్పల్లి ప్రాజెక్టు కలుపుకోని మండలంలో చెరువుల కింద 4,100 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ 500 ఎకరాలకు మించి సాగునీరు అందించిన దాఖలు లేవు. కొంషేట్పల్లి ప్రాజెక్టు కింద ఖరీఫ్ సాగుగా 1,250 ఎకరాలు, రబీలో 250 ఎకరాలకు సాగునీరు అందించాలి. కానీ ఏనాడూ పూర్తిస్థాయిలో సాగునీరు అందించిన దాఖలు లేవు. ప్రాజెక్టు తూముల నుంచి నీరు వృథాగా పోతోంది. కొంషేట్పల్లి ప్రాజెక్టు కుడి కాల్వ తూము పాడై నాలుగేళ్లవుతుఆన్న ఇంతవరకు మరమ్మతులకు నోచుకోవడంలేదు. దీంతో నీరు వృథాగా పోతోంది. కుడి, ఎడమ కాల్వలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. దీంతో నీరు ముందుకు వెళ్లని పరిస్థితి. కాల్వలు మరమ్మతులకు నోచుకోకపోవటంతో ప్రాజెక్టు చివరి ప్రాంతంలోని ఆయకట్టుకు నీరందడంలేదు. చెరువుల దుస్థితి చెప్పతరమా.. కొంషేట్పల్లి ప్రాజెక్టు పరిస్థితి ఇలా ఉంటే ఇక చెరువులు మరీ అధ్వానంగా ఉన్నాయి. పంచలింగాల చెరువుద్వారా రబీలో 480 ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. కానీ 100 ఎకరాలకు మించి సాగు కావటంలేదని ఆయకట్టుదారులు అంటున్నారు. చెరువు నుంచి వృథాగా పోతున్న నీటిని తప్పనిసరి పరిస్థితుల్లో ఆయిల్ ఇంజిన్ల ద్వారా నీటిని తోడుకోని పంటలకు నీరందిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రావులపల్లి చెరువు కింద 329 ఎకరాల ఆయకట్టుదారులకు నీరు అందించాల్సి ఉండగా ఏనాడూ 50 ఎకరాలకు మించి రబీ సాగు కావటంలేదని ఆయకట్టుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్‌ఖోడ చెరువు కింద ఉన్న 568 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాలి. కానీ ఏనాడూ కాల్వల ద్వారా నీరు అందించిన దాఖలు లేవు. కల్ఖోడలో కుడి కాల్వ నిర్మాణ పనులు చేపట్టలేదు. ఎడమ కాల్వ నిర్మించినా ఇంతవరకు దానిలోకి నీరు వదలలేదు. మరమ్మతుల పేరుతో మాత్రం ఇప్పటివరకు మూడుసార్లు పనులు చేపట్టి నిధులు కాజేశారు. ఇక పిల్లిగుండ్ల, నర్సాపూర్, ఘనాపూర్, పట్లూర్, వీర్లపల్లి, సిరిపురం, తిమ్మాపూర్, కొంషేట్పల్లి పాత చెరువుల పనులు నాసిరకంగా చేపట్టడంతో తూముల నుంచి నీరు వృథాగా పోతోందని ఆయా గ్రామాల ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని 22 కుంటలు పూడిక తీతతో నిండిపోయి నిరుపయోగంగా మారాయి.