చంద్రుడి ఉపరితలంపై నీరు..! | New Study Challenges Previous Conclusions About Water on the Moon | Sakshi
Sakshi News home page

చంద్రుడి ఉపరితలంపై నీరు..!

Published Mon, Feb 26 2018 3:39 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

New Study Challenges Previous Conclusions About Water on the Moon - Sakshi

వాషింగ్టన్‌: చందమామపై అధిక మొత్తంలో నీరు ఉందని నాసా శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో అంచనావేశారు. ఈ నీరు ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా చంద్రుడి ఉపరితలమంతా విస్తరించి ఉందని చెబుతున్నారు. చంద్రుడిపై పరిశోధనలకు భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌–1 పంపిన సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయం చెప్పారు. ఈ పరిశోధన ఫలితాలు అక్కడి నీటిని ఒక వనరుగా వాడుకునేందుకు చేయాల్సిన పరిశోధనలకు సహకరిస్తాయని అమెరికాలోని స్పేస్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సీనియర్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌ జోషువా బాండ్‌ఫీల్డ్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement