the weather department
-
మరో ముప్పు
► తరుముకొస్తున్న అల్పపీడనం ► అండమాన్ వద్ద అల్పపీడన ద్రోణి సాక్షి ప్రతినిధి, చెన్నై: వర్దా తుపాన్ విలయం నుంచి రాష్ట్రం ఇంకా తేరుకోక ముందే మరో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతం అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి తమిళనాడువైపు కదులుతున్నట్లు చెన్నై వాతావరణశాఖ హెచ్చరించింది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు సహజంగా అక్టోబర్ 20వ తేదీన ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈశాన్య రుతుపవనాలు సాగుతున్నా నవంబరులో తగినంతగా వర్షాలు పడలేదు. ఈశాన్య రుతుపవనాలు ఆరంభమైన తొలిరోజుల్లో బంగాళాఖాతంలో గియాండి తుపాన్ ఏర్పడింది. ఈ తుపాన్ వల్ల తమిళనాడులో వర్షాలు పడలేదు. ఆ తరువాత నడా తుపాన్ కారైక్కాల్ సమీపంలో తీరం దాటినపుడు కడలూరు, నాగపట్టినం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇదిలా ఉండగా, ఈనెల 10వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తుపాన్ 12వ తేదీన చెన్న నగరాన్ని నేరుగా తాకింది. చెన్నైలో 119 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తుపాన్ తీరం దాటేపుడు గంటకు 130–140 కీలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరాన్ని, శివార్లను దారుణంగా కుదిపేసింది. సగటున డిసెంబరులో 191 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం రెండు వారాల్లో 329 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మళ్లీ ముప్పు: ఇదిలా ఉండగా, రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ఈశాన్య రుతుపవనాల కాలం మరో 15 రోజుల్లో ముగుస్తున్న దశలో భారీ వర్షాలు పడతాయని అంచనా. ప్రస్తుతం బంగాళాఖాతంలో అండమాన్ దీవుల సమీపంలో ఒక అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేణా బలపడి ఈశాన్యం నుంచి వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే అంచనా ప్రకారం అల్పపీడన ద్రోణి రాష్ట్ర తీరాన్ని తాకిన పక్షంలో భారీ వర్షాలు కుదిపేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
చల్లబడ్డ తెలంగాణ
* ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు * వారంపాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం * హైదరాబాద్‌లో పలు చోట్ల తేలికపాటి జల్లులు * స్వైన్‌ఫ్లూ విజృభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్యులు * గాంధీలో 28 పాజిటివ్ కేసుల నమోదు సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, ఆదివారం వాతావరణం చల్లబడింది. ఎండ సెగతో ఉక్కిరిబిక్కిరవుతున్న వారు పలుచోట్ల చిరుజల్లులతో ఉపశమనం పొందారు. వాతావరణంలో ఏర్పడిన వెస్ట్రన్ డిస్టర్బెన్స్ కారణంగా తెలంగాణ నుంచి రాయలసీమ వరకు ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలలో రాగల 48 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ద్రోణి ప్రభావం మరో వారం రోజులపాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త సీతారాం ‘సాక్షి’కి తెలిపారు. ఈ వారంరోజులు అధిక ఉష్ణోగ్రతల నుంచి స్వల్ప ఉపశమనం ఉంటుందని, తరువాత గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో ఆదివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. గరిష్టంగా 27.7 డిగ్రీలు, కనిష్టంగా 18.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ 66 శాతంగా నమోదైంది. స్వైన్‌ఫ్లూ టై: వాతావరణంలో తేమ శాతం బాగా పెర గడం, గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో స్వైన్‌ఫ్లూ వైరస్ హెచ్1ఎన్1 విజృంభించే అవకాశాలుండడం ఆందోళన కలిగిస్తోంది. ముందుజాగ్రత్తలు తీసుకోకుంటే అనర్థాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. ఆదివారం గాంధీ ఆస్పత్రిలో 28 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వీరిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని వైద్యులు తెలిపారు. మరో 35 స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. -
అప్రమత్తమైన యంత్రాంగం
ఆర్డీఓలతో మాట్లాడిన డీఆర్వో సురేంద్రకరణ్ అధికారులు స్థానికంగా ఉండాలని ఆదేశం హన్మకొండ అర్బన్ : హుదూద్ తుపాన్ ప్రభావం జిల్లాపై సోమవారం ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి సమాచారం అందడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని స్థారుుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆర్డీఓలు, తహసీల్దార్లకు డీఆర్వో సురేంద్రకరణ్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్లు ఇతర సిబ్బంది స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ తుపాన్‌పై అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. కలెక్టరేట్‌తోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో తుపాన్ సమాచారం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు శనివారం నుంచి 24 గంటలు పనిచేస్తాయని.. అవసరాన్ని బట్టి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని... ముందస్తుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని ఆదేశించారు. ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. నగరంలో రెండో రోజు 40,299 దరఖాస్తులు వరంగల్ అర్బన్: వరంగల్ ట్రైసిటీ పరిధిలో వివిధ సంక్షేమ పథకాల కోసం అదివారం 42,292 దరఖాస్తులు వచ్చాయని బల్దియా అడిషనల్ కమిషనర్ నలుపరాజు శంకర్ తెలిపారు. రెండో రోజు పింఛన్ల కోసం 11,199. ఆహార భద్రత కార్డులకు 23,279, సర్టిఫికెట్ల కోసం 5,814 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. సెలవులు రద్దు చేశాం తుపాన్ కారణంగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు జిల్లాలో అన్ని స్థాయిల ఉద్యోగులకు సెలవులు రద్దుచేశాం. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించాం. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే ఎవరైనా సరే.. చేసినా కఠిన చర్యలు తప్పవు. ఉద్యోగులు తప్పనిసపరి వెళ్లాల్సి వస్తే... ముందస్తుగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. - సురేంద్రకరణ్, డీఆర్వో