అప్రమత్తమైన యంత్రాంగం
- ఆర్డీఓలతో మాట్లాడిన డీఆర్వో సురేంద్రకరణ్
- అధికారులు స్థానికంగా ఉండాలని ఆదేశం
హన్మకొండ అర్బన్ : హుదూద్ తుపాన్ ప్రభావం జిల్లాపై సోమవారం ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి సమాచారం అందడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని స్థారుుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆర్డీఓలు, తహసీల్దార్లకు డీఆర్వో సురేంద్రకరణ్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
తహసీల్దార్లు ఇతర సిబ్బంది స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ తుపాన్‌పై అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. కలెక్టరేట్‌తోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో తుపాన్ సమాచారం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు శనివారం నుంచి 24 గంటలు పనిచేస్తాయని.. అవసరాన్ని బట్టి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని... ముందస్తుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని ఆదేశించారు. ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.
నగరంలో రెండో రోజు 40,299 దరఖాస్తులు
వరంగల్ అర్బన్: వరంగల్ ట్రైసిటీ పరిధిలో వివిధ సంక్షేమ పథకాల కోసం అదివారం 42,292 దరఖాస్తులు వచ్చాయని బల్దియా అడిషనల్ కమిషనర్ నలుపరాజు శంకర్ తెలిపారు. రెండో రోజు పింఛన్ల కోసం 11,199. ఆహార భద్రత కార్డులకు 23,279, సర్టిఫికెట్ల కోసం 5,814 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు.
సెలవులు రద్దు చేశాం
తుపాన్ కారణంగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు జిల్లాలో అన్ని స్థాయిల ఉద్యోగులకు సెలవులు రద్దుచేశాం. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించాం. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే ఎవరైనా సరే.. చేసినా కఠిన చర్యలు తప్పవు. ఉద్యోగులు తప్పనిసపరి వెళ్లాల్సి వస్తే... ముందస్తుగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి.
- సురేంద్రకరణ్, డీఆర్వో