Weather Radar
-
స్పైస్‌జెట్‌కు ఏమైంది?.. రాడార్ సమస్యతో వెనక్కి వచ్చిన కార్గో విమానం
కోల్‌కతా: గతకొన్ని రోజులుగా విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఘటనలతో.. స్పైస్‌జెట్‌కు ఏమైంది అనే ప్రశ్నలు ప్రతిఒక్కరిలోనూ లేవనెత్తుతున్నాయి. గడిచిన మూడు వారాల వ్యవధిలో 8 స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు వెలుగు చూశాయి. ఒక్క మంగళవారం రోజే రెండు విమానల్లో భద్రత సమస్యలు ఏర్పడి అత్యవసర ల్యాండింగ్ చేయగా.. తాజాగా కల్‌కతా నుంచి చైనా బయలుదేరిన స్పైస్‌జెట్ కార్గో విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. స్పైస్‌జెట్ బోయింగ్ 737 కార్గో విమానం జూలై అయిదో తేదీన కోల్‌కతా నుంచి ఛాంగ్‌క్వింగ్ వెళ్లాల్సి ఉంది. కోల్‌కతా నుంచి టేకాఫ్ అయిన తరువాత విమనాంలో వాతావరణ రాడార్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి కోల్‌కతాకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కతాలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. చదవండి: ముంబైలో మరో స్పైస్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. గత 17 రోజుల్లో ఏడు ఘటనలు కాగా ఈ ఘటన కంటే ముందు ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని దారి మళ్లించి కరాచి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. స్పైస్‌జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతోనే కరాచికి మళ్లించారు. అంతేగాక గుజరాత్‌లోని కాండ్లా నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ పగలడంతో ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. -
ముందస్తు హెచ్చరికలతో ప్రాణనష్టం తగ్గింది: జైపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ: పై-లీన్ తుఫాన్‌పై వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల వల్లనే పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు. తుఫాన్ బారిన పడకుండా 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం కురుస్తుందని ముందే చెప్పామని, కానీ శాఖల మధ్య సమన్వయం లోపించడంతో భారీ నష్టం సంభవించిందన్నారు. శాస్త్ర పరిశోధనకు 11, 12వ ప్రణాళికల్లో అధిక నిధులు ఇచ్చామని తెలిపారు. వెదర్ రాడార్ కోసం రూ. 715 కోట్లు వెచ్చించామన్నారు. వెదర్ రాడార్‌తో రైతులకెంతో మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పై-లీన్ తుఫాన్ కారణంగా ఒడిశాలో 25 మంది మృతి చెందగా భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాపై పై-లీన్ ప్రభావం ఎక్కువగా పడింది.