ఎస్వీయూలో 9 నుంచి వెబ్ కౌన్సెలింగ్
తొలిసారిగా పీజీ అడ్మిషన్లలో అమలు
తిరుపతి సిటీ: శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో పీజీ కోర్సుల ప్రవేశానికి తొలిసారిగా వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ఇంజనీరింగ్, ఎంబీఎ, ఎంసీఏ, లా, మెడికల్, బీఈడీ కోర్సులకు పరిమితమైన వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఎస్వీయూలో తొలిసారిగా పీజీ కోర్సులకు సైతం ప్రవేశపెట్టా రు. ఈనెల 9వ తేది నుంచి 13వ తేది వరకు ఎస్వీయూ డైరక్టరేట్ ఆడ్మిషన్ల కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు.
సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన మరుసటి రోజు నుంచి అభ్యర్థులు ఆన్లైన్లో లాగిన్అయ్యి తమకు కావాల్సిన కోర్సులను వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థులు వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఎస్వీయూ అధికారులు సీట్లను కేటాయిస్తారు.
సర్టిఫికెట్ల పరిశీలన ఇలా..
9వ తేదీన కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులు, 10న కామర్స్, 11న మ్యా థమెటిక్స్, స్టాటిస్టిక్స్, బాటనీ, కంప్యూటర్ సైన్స్,12న జూవాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంగ్లీష్, జనరల్ టెస్ట్, ఆక్వాకల్చరల్ సబ్జెక్టులు, 13న బయో కెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, ఎడ్యుకేషన్, తెలు గు, హిస్టరీ, సైకాలజీ, జీయాలజీ, సోషియల్ వర్క్, ఎకానమిక్స్, ఆంత్రోపాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, హిందీ, సీప్ స్టడీస్, ఫెర్మామింగ్ ఆర్ట్స్, సంస్కృతం, సోషియాలజీ, తమిళ్, ఉర్దూ, వైరాల జీ, ఉమెన్ స్టడీస్, టూరిజం సబ్జెక్టుల అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్లను మొదటి విడతలోనే పరిశీలించి సీట్లను కేటాయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.