తూకాల్లో కనికట్టు!
హిందూపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా బియ్యం వ్యాపారుల మాయూజాలంతో ప్రజలు మోసపోతున్నారు. ఫైన్ క్వాలిటీ పేరుతో మధ్య రకం బియ్యం అంటగడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. 25 కిలోలు, 50 కిలోల బస్తాల్లో ఒకటి నుంచి మూడు కి లోల వరకు నొక్కేస్తున్నారు. ఈ విషయం తెలిసినా తూనికలు, కొలతల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బియ్యం, బేడలను వ్యాపారులు 25 కేజీలు, 50 కేజీల బస్తాల్లో విక్రయాలు సాగిస్తున్నారు.
25 కేజీల బస్తాకొంటే అందులో ఉండే బియ్యం 23.5 కేజీలు మాత్రమే. 50 కేజీల బస్తాలో 47 కేజీల బియ్యం ఉంటున్నారుు. ఇదేమని ప్రశ్నిస్తే అది అంతే.. ఆ ప్యాకెట్లు మేం తెరిచి.. తిరిగి కుట్లు వేయలేదు.. మిషన్తో కుట్టేసివుంది కదా అని వ్యాపారులు దబారుుస్తున్నారు. మోసపోతున్నామని తెలిసినా వినియోగదారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
జిల్లాలో పెద్ద రైస్ మిల్లులు 98 దాకా ఉన్నాయి. ప్రతిఏటా సీజన్లో ప్రతిరోజూ సుమారు 2 వేల క్వింటాళ్ల వరకు బియ్యం బస్తాలను జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు కర్ణాటకకు తరలిస్తుంటారు. వీటితో పాటు కర్నూలు జిల్లా నుంచి కూడా దాదాపు వెయ్యి క్వింటాళ్ల బియ్యం జిల్లాకు వస్తారుు. జిల్లాలో 900 మందికి పైగా బియ్యం వ్యాపారులున్నారు. ఇందులో హిందూపురంలోనే సుమారు 28 మంది వ్యాపారులున్నారు.
హిందూపురం పట్టణంలో ప్రతిరోజు దాదాపు 200 క్వింటాళ్ల వరకు బియ్యం వ్యాపారం సాగుతోంది. అనంతపురంలో 300-400 క్వింటాళ్ల బియ్యం ప్రతిరోజూ అమ్ముడవుతున్నారుు. ఇంత భారీ ఎత్తున బియ్యం క్రయవిక్రయూలు సాగుతుండడాన్ని వ్యాపారులు అవకాశంగా తీసుకున్నారు. బియ్యం బస్తా కొనుకోలు చేసిన వారు నమ్మకంతో ఇంటికి తీసుకెళ్తారు. బస్తాపైన 25 కిలోలు అని రాసి ఉంటుంది. అరుుతే తూకం వేసి చూస్తే మాత్రం 23.5 కిలోలు మాత్రమే ఉంటున్నాయని వినియోగదారులు లబోదిబోమంటున్నారు.
కొందరు వినియోగదారులు తూనికలు, కొలతల శాఖాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. అప్పుడప్పుడు మొక్కుబడిగా తనిఖీలకు వస్తున్నట్లు ముందే సూచించి.. ఆనక దుకాణాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా మూడు నాలుగు రోజుల్లో అధికారులు తనిఖీలకు వస్తున్నారని అసోసియేషన్ నేతలు దుకాణాల వారికి సూచించారు. ఈ కొద్ది రోజులు తూకం సరిగ్గా ఉండేట్లు చూసుకోవాలని జాగ్రత్తలు చెబుతున్నట్లు తెలిసింది.
ప్యాకింగ్లోనే మాయూజాలం..
వ్యాపారులు విక్రయస్తున్న 25, 50 కేజీల బస్తాల బియ్యం ప్యాకెట్లు.. వ్యాపారుల ముందస్తు సూచనల మేరకు ప్యాక్ చేస్తున్నట్లు సమాచారం. చాలా మంది వ్యాపారులు ప్యాకెట్లలో ఎన్ని కిలోల బియ్యం ఉండాలో ముందే చెబుతున్నారు. పాతిక కిలోల బ్యాగులో కనీసం కిలో నుంచి రెండు కిలోలు, 50 కిలోల బ్యాగులో రెండు నుంచి నాలుగు కిలోలు తక్కువగా ప్యాక్ చేరుుస్తున్నారని తెలిసింది. మిల్లర్లు సైతం వారి వ్యాపారం కోసం కిక్కురుమనకుండా వ్యాపారులు చెప్పినట్లు చేస్తున్నారు. పైగా అనుమతికి మించి పెద్ద పరిమాణంలో బస్తాలు నిల్వ చేసుకున్నప్పటికీ అడిగే అధికారే కరువయ్యూరు.
తూకాల్లో తక్కువ ఉంటే కేసులు తప్పవు : కె.ఎస్ రాజు, తూనికలు కొలతల శాఖాధికారి బియ్యం ప్యాకెట్ల తూకాల్లో తక్కువ ఇస్తున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందాయి. సరిచేసుకోవాలని అసోసియేషన్ వారికి హెచ్చరించాము. అకస్మాత్తుగా తనిఖీలు చేస్తాం. తూకాల్లో వ్యత్యాసం ఉంటే చర్యలు తప్పవు.