WGC
-
పసిడి డిమాండ్‌కు కరోనా కాటు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 సంక్షోభం, ఆకాశాన్నంటిన ధరలతో పసిడికి డిమాండ్ భారీగా పడిపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020 సంవత్సరంలో దేశీయంగా పుత్తడి డిమాండ్ 25 ఏళ్ల కనిష్టానికి క్షీణించింది. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజీసీ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2020 క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 25 సంవత్సరాల కనిష్టానికి చేరింది. (అన్ని ఆభరణాలకూ హాల్‌మార్క్ అమలయ్యేనా?) 2019లో 690.4 టన్నులతో పోలిస్తే ఇది 446 టన్నులకు పడిపోయింది. 1995లో 462 టన్నుల వద్ద డిమాండ్ చివరిసారిగా పెరిగిందని డబ్ల్యుజీసీ ఇండియా పీఆర్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం వెల్లడించారు. డబ్ల్యుజీసీ డేటా ప్రకారం మొత్తం ఆభరణాల డిమాండ్ 2019 లో 544.6 టన్నులతో పోలిస్తే భారతదేశంలో (సమీక్షించిన కాలంలో) 42 శాతం పడి 315.9 టన్నులుగా ఉంది. 2020 లో ఆభరణాల డిమాండ్ 22 శాతం తగ్గింది. విలువ పరంగా ఇది రూ. 133.260 కోట్లు. కరోనా సంక్షోభం, లాక్డౌన్ ఆంక్షలకు తోడు, బంగారం ఆల్ టైం ధరల నేపథ్యంలో 2020 లో భారతదేశ బంగారం డిమాండ్ మూడో వంతు పడిపోయింది. అయితే విలువ పరంగా చూసినప్పుడు ఈ డ్రాప్ గణనీయంగా తక్కువగా ఉంది. అయితే లాక్డౌన్ ఆంక్షల సడలింపు, పండుగ సీజన్‌నే పథ్యంలో బంగారానికి డిసెంబర్ త్రైమాసికం ఆశలను రేకెత్తించింది. 2020 డిసెంబర్ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 137.3 టన్నులకు పెరిగింది. ఈకాలంలో పెట్టుబడులుకూడా 8 శాతం పెరిగి 48.9 టన్నులకు చేరుకుంది. 2020 డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 186.2 టన్నులుగా ఉంది, ఇది అంతకుముందు 2019 లో (194.3 టన్నులు) పోలిస్తే 4 శాతం తగ్గింది. విలువ పరంగా, డిమాండ్ 26 శాతం పెరిగి రూ .82.790 కోట్ల రూపాయలుగా ఉంది. గ్లోబల్ వ్యూ 2020నాటికి, ప్రపంచ డిమాండ్ 3,759.6 టన్నులతో 14శాతం తగ్గింది. 2020లో వినియోగదారుల డిమాండ్ బలహీనపడటం వెనుక కీలకమైన కారణం కరోనా మహమ్మారేని డబ్ల్యుజీసీ తెలిపింది. 2009 తరువాత గ్లోబల్‌గా మొదటిసారి వార్షిక ప్రాతిపదికన పసిడి డిమాండ్ 4వేల టన్నుల మార్క్ కంటే దిగువకు పడి పోయింది. అయితే 2021వ సంవత్సరం బంగారానికి మంచి సంవత్సరంగా ఉండనుందని సోమసుందరం అభిప్రాయపడ్డారు. గ్లోబల్ మార్కెట్లు కోవిడ్-19 ఆర్ధిక సంక్షోభ ప్రభావానికి ఇంకా పూర్తిగా గురి కాలేదు. ఆ తర్వాత, ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడంతో డిమాండ్ ప్రభావితమవుతుందని అంచనా వేశారు. -
కరోనా సెగ : పసిడి డిమాండ్ ఢమాల్!
సాక్షి, ముంబై: బంగారం డిమాండ్ జూలై-సెప్టెంబర్ మధ్య ఇటు భారత్‌లో అటు ప్రపంచవ్యాప్తంగా భారీగా పడిపోయింది. కరోనా మహమ్మారి దీనికి ప్రధాన కారణం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక ప్రకారం, జూలై-సెప్టెంబర్ మధ్య భారత్‌లో డిమాండ్ 30 శాతం పడిపోతే, ప్రపంచవ్యాప్తంగా ఈ క్షీణత 19 శాతంగా ఉంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ పసిడి డిమాండ్ పరిమాణంలో 123.9 టన్నుల (2019 సెప్టెంబర్) నుంచి 86.6 టన్నులకు పడిపోయింది. ఇక విలువ రూపంలో చూస్తే, పసిడి డిమాండ్ 4 శాతం పడిపోయి రూ.41,300 కోట్ల నుంచి రూ.39,510 కోట్లకు తగ్గింది. ఆభరణాల డిమాండ్, పరిమాణంలో 48 శాతం క్షీణించి 101.6 టన్నుల నుంచి 52.8 టన్నులకు చేరింది. విలువలో చూస్తే, 29 శాతం పడిపోయి, రూ.33,850 కోట్ల నుంచి రూ.24,100 కోట్లకు దిగింది. మొత్తం రీసైకిల్డ్ గోల్డ్ పరిమాణం 14 శాతం ఎగసి 36.5 టన్నులకు 41.5 టన్నులకు చేరింది. యల్లో మెటల్ అధిక ధరలూ దీనికి కారణం. పెట్టుబడుల డిమాండ్ అప్... ఇక పెట్టుబడుల విషయంలో (పరిమాణం) మాత్రం డిమాండ్ 22.3 టన్నుల నుంచి 33.8 టన్నులకు ఎగసింది. విలువలో చూస్తే, 107 శాతం పెరిగి రూ.7,450 కోట్ల నుంచి రూ.15,410 కోట్లకు ఎగసింది. ప్రపంచ డిమాండ్ 892.3 టన్నులు : ప్రపంచ వ్యాప్తంగా పసిడి డిమండ్‌ను సెప్టెంబర్ త్రైమాసికంలో పరిశీలిస్తే, 2019 ఇదే కాలంతో పోల్చితే పరిమాణంలో 19 శాతం పతనమైంది. 1,100.2 టన్నుల నుంచి 892.3 టన్నులకు డిమాండ్ పడిపోయింది. అయితే పెట్టుబడుల డిమాండ్ మాత్రం 21 శాతం పెరిగి 494.6 టన్నులకు చేరింది. ఆభరణాలకు డిమాండ్ 29 శాతం పడిపోయి 333 టన్నులుగా నమోదయ్యింది. సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాది కాలానికి చూస్తే, ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ హోల్డింగ్స్ విలువ ఏకంగా 1,003.3 టన్నులుగా ఉండడం గమనార్హం. 2009 తరహా పరిస్థితి ఖాయం... : బంగారానికి తిరిగి డిమాండ్ ఏర్పడుతుందన్న గట్టి నమ్మకం ఉంది. కోవిడ్–19 తరువాత డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నాం. ఆర్థిక సంక్షోభం నాటి రోజులను తీసుకుంటే, 2009లో పసిడి డిమాండ్ 642 టన్నులుగా ఉంది. 2010లో ఇది భారీగా 1,002 టన్నులకు చేరింది. 2011, 2012లో డిమాండ్ మరింత పెరిగింది.-సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) -
రూ.53వేలు దాటిన బంగారం
దేశీయంగా బంగారం ధర పరుగు ఆపడం లేదు. వరుసగా 10రోజూ పెరిగింది. ఈ క్రమంలో మల్టీ కమోడిటి ఎక్చ్సేంజ్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.53వేల స్థాయిని అధిగమించింది. ఈ 10రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.5,500 లాభపడింది. అంతర్జాతీయంగా బంగారం ధర పెరగడంతో గురువారం ఉదయం సెషన్లో రూ.242లు లాభపడి రూ. 53429 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ ధర పసిడికి ఎంసీఎక్స్‌లో జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఆయా దేశాల ప్రభుత్వాలు ఉద్దీపన చర్యలను ప్రకటించవచ్చనే అంచనాలతో బంగారంపై పలువురు బులియన్ విశ్లేషకులు ఇప్పటికీ బుల్లిష్ వైఖరినే కలిగి ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర దేశీయంగా 35శాతం పెరిగింది. 26ఏళ్ల కనిష్టానికి బంగారం డిమాండ్: ఈ ఏడాదిలో భారత్‌లో బంగారం డిమాండ్ 26ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకోవడంతో భారత్‌లోకి దిగుమతులు తగ్గిపోయే అవకాశం ఉందని, తద్వారా డిమాండ్ క్షీణించే అకాశం ఉందని డబ్ల్యూజీసీ తన నివేదికలో తెలిపింది. అయితే భారత్ వాణిజ్య లోటు డబ్ల్యూజీసీ చెప్పుకొచ్చింది. కరోనా ప్రేరిపిత లాక్డౌన్ నేపథ్యంలో ఈ జూన్ క్వార్టర్లో బంగారం డిమాండ్ పదేళ్ల కనిష్టస్థాయిని చవిచూసింది. ఈ తొలిక్వార్టర్లో బంగారం డిమాండ్ 70శాతం క్షీణించి 63.7 టన్నులు నమోదైనట్లు డబ్ల్యూజీసీ తెలిపింది. అలాగే ఈ ఏడాది తొలిభాగంలో వార్షిక ప్రాతిపదిక భారత్‌లో బంగారం వినియోగం 56శాతం క్షీణించినట్లు తన నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా అదే వైఖరి: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం అదే జోరును కొనసాగిస్తోంది. వరుసగా 9రోజూ లాభపడింది. ఆసియాలో ఔన్స్ పసిడి ధర నిన్నరాత్రి అమెరికాలో ముగింపు(1,953.40డాలర్లు)తో పోలిస్తే 10డాలర్ల లాభంతో 1963డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ బలహీనత, కీలక వడ్డీరేట్లపై యథాతథపాలసీకే ఫెడ్‌రిజర్వ్ కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడం, అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు, పెరుగుతున్న కోవిడ్-19 కేసులు బంగారం ర్యాలీకి మద్దతునిస్తున్నాయి. -
బంగారం ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పదిక
న్యూఢిల్లీ: బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్ మార్క్ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ నిబంధనలను కేంద్రం గురువారం నోటిఫై చేసింది. 2021 జనవరి 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఆభరణాల వర్తకులకు ఏడాది సమయాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఆభరణాలను హాల్ మార్క్ సర్టిఫికేషన్‌తోనే విక్రయించాల్సి ఉంటుంది. లేదంటే భారతీయ ప్రమాణాల చట్టం 2016 కింద చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. నమోదిత ఆభరణాల విక్రయదారులే హాల్ మార్క్ కలిగిన బంగారం కళాకృతులను విక్రయించడానికి అనుమతిస్తారు. అలాగే, నమోదిత వర్తకులు 14,18, 22 క్యారట్లతో చేసిన ఆభరణాలు, కళాకృతులనే విక్రయించాల్సి ఉంటుంది. ఆభరణాల్లో బంగారం స్వచ్ఛతను హాల్‌మార్క్ తెలియజేస్తుంది. ప్రస్తుతం ఇది స్వచ్చందంగా అమలవుతోంది. 2000 ఏప్రిల్ నుంచి హాల్‌మార్కింగ్ పథకం అమల్లో ఉంది. ప్రస్తుతానికి 40 శాతం వర్తకులు హాల్ మార్క్ ఆభరణాలను విక్రయిస్తున్నారు. వీటికి మినహాయింపు.. 2 గ్రాముల్లోపు బరువు ఉండి, ఎగుమతి చేసే వాటికి హాల్‌మార్కింగ్ తప్పనిసరి కాదు. అలాగే, వైద్యం, దంత సంబంధిత, పశువైద్యం, సైంటిఫిక్ లేదా పారిశ్రామిక అవసరాల కోసం ఉద్దేశించిన వాటికి హాల్ మార్క్ తప్పనిసరి కాదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. బీఐఎస్ మార్క్, క్యారట్లు, స్వచ్ఛతను హాల్‌మార్క్ తెలియజేస్తుంది. ఆభరణాలపై ముద్రించే ఈ మార్క్‌లో సంబంధిత జ్యుయలర్ ధ్రువీకరణ, హాల్ మార్క్ కేంద్రం ధ్రువీకరణ నంబర్లు కూడా ఉంటాయి. ‘‘హాల్‌మార్క్ ఆభరణాలనే విక్రయించేందుకు ఇచ్చిన ఏడాది సమయం, ప్రస్తుత స్టాక్‌ను విక్రయించేందుకు సరిపోతుంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే ఈ రక్షణ చర్య మంచి ముందడుగు’’ అని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) భారతీ ఎండీ సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. -
పడిపోతున్న పసిడి డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : విశ్లేషకులు ఊహించినట్టుగానే బంగారం డిమాండ్ అంతకంతకూ క్షీణిస్తోంది. భారతదేశంలో పుత్తడి వినియోగంపై డబ్యూజీసీ(వరల్డ్ గోల్డ్ కౌన్సిల్) తాజా నివేదికను మంగళవారం విడుదల చేసింది. బంగారం వినియోగంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం ఇండియాలో తాజాగా బంగారం డిమాండ్ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. దేశీ మార్కెట్లో బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తగ్గడం వంటి పలు అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. దేశంలో అత్యంత పవిత్రమైన రోజు ధంతెరాస్‌పై అమ్మకాలు కూడా గత నెలలో పడిపోయాయి, ఇది బలహీనమైన డిమాండ్‌ను మరింత సూచిస్తుందని తెలిపింది. పసిడి ధర కొత్త గరిష్ట స్థాయికి చేరడం, గ్రామీణ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు పసిడి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం పీఆర్ తెలిపారు. ఇటీవల కాలంలో కురిసిన అధిక వర్షాలు కారణంగా పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దీంతో బంగారం డిమాండ్ తగ్గొచ్చని అంచనా వేశారు. అలాగే ఈ ఏడాది బంగారం డిమాండ్ గతేడాదితో పోల్చుకుంటే 8 శాతం పడిపోయి 700 టన్నులకు చేరుకుందని, ఇది 2016 తర్వాత కనిష్ఠ స్థాయి అని డబ్యూజీసీ ఇండియా ఆపరేషన్ మేనేజింగ్ డైరక్టర్ సోమసుందరమ్ పీఆర్ అన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం వినియోగం గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే భారీగా తగ్గి 123.9 టన్నులుగా నమోదైంది. ఇండియా మార్కెట్లో బంగారం ధరలు 2019లో అంతర్జాతీయంగా ఉన్న ధర కంటే 17 శాతం పెరిగాయి. డిమాండ్ మందగించడంతో బంగారం దిగుమతులు తగ్గాయని, ఇది ద్రవ్యలోటును తగ్గించి రూపీ బలపడడంలో సహాయపడిందని విశ్లేషకులు తెలిపారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి గోల్డ్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో బంగారానికి డిమాండ్ మూడొంతులలో రెండొంతులు గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తుంది. గత 25 ఏళ్ల కాలంలో జూన్-సెప్టెంబర్ సీజన్లో వానలు అధికంగా పడ్డాయి. ఇది అక్టోబర్‌లోనూ కొనసాగింది. ఫలితంగా సిద్ధంగా ఉన్న వేసవి కాల పంటలయిన పత్తి, సోయాబీన్, చిరుధాన్యలు నాశనమయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర జీవితకాల గరిష్ఠమైన రూ. 39,885 స్థాయికి చేరుకుంది. మొత్తంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో పాటు, దేశీయ కరెన్సీ రూపాయి క్షీణించడంతో ఈ ఏడాదిలో బంగారం ధరలు 22 శాతం మేర పెరిగాయి. దేశీయంగా బంగారం ధరలు పెరగడంతో పాటు, దిగుమతి సుంకాలు అధికంగా ఉండడంతో బంగారం డిమాండ్ జులై-సెప్టెంబర్‌లో తగ్గిందని డబ్యూజీసీ పేర్కొంది. ఈ ఏడాది జులై మొదటి వారంలో ఇండియా బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. జూలై-సెప్టెంబర్ కాలంలో123.9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా. అంతకుముందు సంవత్సరం కంటే 32 శాతం క్షీణించింది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో వినియోగం 5.3 శాతం తగ్గి 496 టన్నులకు చేరుకుంది. జూలై-సెప్టెంబర్ కాలంలో నికర దిగుమతులు 66 శాతం క్షీణించి 80.5 టన్నులకు చేరుకున్నాయి. -
జీఎస్టీ ఎఫెక్ట్: 8 ఏళ్ల కనిష్టానికి పసిడి డిమాండ్
సాక్షి, ముంబై: బులియన్ వ్యాపారంపై ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలు, గ్రామీణ ప్రాంతాలనుంచి డిమాండ్ బాగా తగ్గడంతో 2017లోబంగారం డిమాండ్ భారీగా క్షీణించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 24 శాతం తగ్గి 145.9 టన్నులకు చేరిందని గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. ప్రపంచంలో చైనా తరువాత రెండవ అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్న భారత్‌లో ఈ ఏడాది గణనీయమైన క్షీణత కన్పించింది. ముఖ్యంగా 845 టన్నుల 10 సంవత్సరాల సగటుతో పోల్చుకుంటే 2017లో డిమాండ్ సగటున 650 టన్నులుగా ఉండవచ్చని డబ్ల్యుజిసి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం అంచనా వేశారు. 2016లో ఇది 666.1 టన్నులుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో, నూతనంగా ప్రవేశపెట్టిన గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ), బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు, మనీలాండరింగ్ వ్యతిరేక చట్టాలు బంగారు రీటైల్ కొనుగోళ్లను ప్రభావితం చేశాయన్నారు. భారతదేశ బంగారు డిమాండులో మూడింట రెండు వంతుల గ్రామీణ ప్రాంతాలనుంచే లభిస్తుంది. అయితే, ఈ ఏడాది దేశంలోని రుతుపవనాల ప్రభావంతో కొన్ని వ్యవసాయ ప్రాంతాల్లో ఆదాయాలు పడిపోయాయి. దీంతో రాబోయే త్రైమాసికాల్లో కూడా ఈ ప్రాంతాల్లో ఆభరణాల గిరాకీని ప్రభావితం చేసే అవకాశం ఉందని సోమసుందరం తెలిపారు. కాగా, 2017 చివరి త్రైమాసికంలో బంగారం దిగుమతులు నాలుగో వంతు పడిపోతాయని పరిశ్రమల వర్గాలు గతంలోనే అంచనా వేశాయి. ఈక్విటీ మార్కెట్లనుంచి మంచి రిటర్న్స్ వస్తుండటంతో చాలామంది ఇన్వెస్టర్లు అటు వైపు మళ్లుతున్నట్టు పేర్కొన్నాయి. -
భారతీయులకు బంగారం.. మరీ స్పెషల్!!
► ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గినా మన దగ్గర పెరుగుదల ► ఏప్రిల్ – జూన్ నెలల్లో డిమాండ్‌పై ప్రపంచ పసిడి మండలి నివేదిక ► గ్లోబల్ డిమాండ్ 10 శాతం డౌన్ ► దేశంలో 37 శాతం పెరుగుదల న్యూఢిల్లీ: బంగారంపై భారతీయులకున్న మోజు మరోసారి లెక్కలతో సహా బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) పుత్తడికి డిమాండ్ పడిపోతే... ఇక్కడ మాత్రం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కాలంలో డిమాండ్ 10 శాతం పడిపోయి 1,055.6 టన్నుల నుంచి 953 టన్నులకు చేరింది. ఇదే కాలంలో దేశంలో డిమాండ్ భారీగా 37 శాతం పెరిగి 122.1 టన్నుల నుంచి 167.4 టన్నులకు ఎగిసింది. ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) తాజాగా ‘గోల్డ్ ట్రెండ్స్’పై తన నివేదికను విడుదల చేసింది. ముఖ్యాంశాలను చూస్తే.. దేశంలో పరిస్థితి ఇదీ... ♦ భారత్‌లో పసిడి డిమాండ్ పెరగడానికి గ్రామీ ణ ఆర్థిక సెంటిమెంట్ పెరగడం ఒక కారణం. ♦ విలువ రూపంలో చూస్తే డిమాండ్ 32 శాతం ఎగిసి రూ. 33,090 కోట్ల నుంచి రూ. 43,600 కోట్లకు ఎగిసింది. ♦ రెండవ త్రైమాసికంలో పెరిగినా, ఐదేళ్ల సగటుకన్నా తక్కువ కావడం గమనార్హం. ♦ ఇక ఆభరణాలకు డిమాండ్ 41 శాతం పెరుగుదలతో 89.8 టన్నుల నుంచి రూ. 126.7 టన్నులకు చేరింది. విలువ రూపంలో ఆభరణాలకు డిమాండ్ 36 శాతం పెరిగి రూ.24,350 కోట్ల నుంచి రూ.33,000 కోట్లకు ఎగిసింది. ♦ ఇక పెట్టుబడులకు సంబంధించి డిమాండ్ 26 శాతం పెరిగి 32.3 టన్నుల నుంచి రూ.40.7 టన్నులకు చేరింది. విలువ రూపంలో 21 శాతం పెరుగుదలతో రూ. 8,740 కోట్ల నుంచి రూ.10,610 కోట్లకు ఎగిసింది. ♦ ఇక గోల్డ్ రీసైకిల్ భారత్‌లో 23.8 టన్నుల నుంచి 29.6 టన్నులకు ఎగిసింది. ♦ ప్రస్తుత సంవత్సరం మొత్తంగా డిమాండ్ 650 టన్నుల నుంచి 750 టన్నుల మధ్య నమోదవుతుందని వరల్డ్ కౌన్సిల్ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈటీఎఫ్‌ల బలహీనత ప్రపంచవ్యాప్తంగా రెండవ త్రైమాసికంలో డిమాండ్ పడిపోవడానికి ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి నిధుల మందగమనం ప్రధాన కారణం. ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 34 శాతం పడిపోయి 450 టన్నుల నుంచి 297 టన్నులకు పడిపోయింది. ఆభరణాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ మాత్రం 447 టన్నుల నుంచి 481 టన్నులకు చేరింది. సెంట్రల్ బ్యాంకుల డిమాండ్ 20 శాతం పెరిగి 78 టన్నుల నుంచి 94 టన్నులకు చేరింది. -
జీఎస్టీ నీడన తగ్గనున్న పసిడికాంతి!
♦ రానున్న కొద్దికాలంపై డబ్ల్యూజీసీ నివేదిక ♦ ఈ ఏడాది డిమాండ్ 750 టన్నులు ♦ ఐదేళ్ల సగటు 846 టన్నులకన్నా తక్కువ! న్యూఢిల్లీ: భారత్‌లో ఈ నెలారంభం నుంచీ అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)వల్ల స్వల్పకాలంలో బంగారానికి డిమాండ్ తగ్గుతుందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో తెలిపింది. 1.5 శాతంగా ఉన్న పసిడిపై రేటు జీఎస్టీ అనంతరం 3 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూజీసీ తాజా నివేదికను చూస్తే... ⇔ దీర్ఘకాలంలో మాత్రం పుత్తడి పరిశ్రమపై జీఎస్టీ సానుకూల ప్రభావం చూపే వీలుంది. పారదర్శకత పెరగడం, సరఫరా సమస్యలు తొలగిపోవడం వంటి అంశాలు ఇందుకు దోహదపడేవిగా అంచనావేసింది. ⇔ అయితే స్వల్పకాలానికి చూస్తే– ఇప్పటికే ఏడు వారాల కనిష్ట స్థాయిలో ట్రేడవుతున్న పసిడి ధరలపై జీఎస్టీ మరింత ఒత్తిడిని పెంచే వీలుంది. ⇔ జీఎస్టీతో చిన్న వృత్తి నిపుణులు, రిటైలర్లపై వివిధ స్థాయిల్లో పన్ను భారం పడే వీలుంది. ⇔ రెండు లక్షల రూపాయలపైన నగదు లావాదేవీలపై ప్రభుత్వ ఆంక్షలు గ్రామీణ ప్రాంతాల్లో పసిడి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ అంశాలు డిమాండ్‌ను తగ్గించడంతోపాటు బ్లాక్‌మార్కెటింగ్‌కు దారితీయవచ్చు. ⇔ ప్రపంచంలో పసిడి కొనుగోళ్ల విషయంలో రెండవ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌లో ఈ ఏడాది పసిడి డిమాండ్ 650 నుంచి 750 టన్నుల శ్రేణిలో ఉండే వీలుంది. ఇది గడచిన ఐదు సంవత్సరాల్లో సగటు 846 టన్నుల కన్నా తక్కువ. ⇔ ఆసియా టైగర్లుగా పిలవబడే నాలుగు దేశాలు– హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్లు 1980–1990 మధ్య భారీ వృద్ధిని సాధించాయి. ఇందుకు ప్రధాన కారణాల్లో ఆ దేశాల యువత ఒక పటిష్ట కార్మిక శక్తిగా అవతరించడం ఒకటి. ప్రస్తుతం భారత్ వృద్ధికి ఇదే అంశం ప్రధాన మద్దతుగా నిలుస్తున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ప్రపంచ డిమాండ్ తగ్గినా... భారత్‌లో బంగారం మెరుపు!
♦ జనవరి–మార్చిలో కనకం కాంతి ♦ డబ్ల్యూజీసీ నివేదిక ముంబై: బంగారానికి ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (2017 జనవరి–మార్చి) ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గినా... భారత్‌లో మాత్రం డిమాండ్ బాగుంది. ప్రపంచ పసిడి వేదిక (డబ్ల్యూజీసీ) గణాంకాలు ఈ విషయాన్ని వెల్ల డించాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... 2017 మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా 18 శాతం తగ్గి 1,034 టన్నులకు పడిపోయింది. 2016 ఇదే త్రైమాసికంలో డిమాండ్ 1,262 టన్నులు. పసిడి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి తక్కువ నిధులు రావడం, సెంట్రల్ బ్యాంకుల డిమాండ్ తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణం. భారత్ ధోరణి: ఇక భారత్‌లో మాత్రం మొదటి త్రైమాసికంలో డిమాండ్ 15 శాతం పెరిగి 107.3 టన్నుల నుంచి 123.5 టన్నులకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఎక్సైజ్ సుంకం ప్రవేశపెట్టడంపై ఆభరణ వర్తకుల సమ్మె ప్రభావం ఇండస్ట్రీపై ప్రధానంగా పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. విలువ రూపంలో చూస్తే. డిమాండ్ 18 శాతం పెరిగి రూ. 27,540 కోట్ల నుంచి రూ.32,420 కోట్లకు చేరింది. దేశంలో ఈ కాలంలో డిమాండ్ పెరగడానికి డీమోనిటైజేషన్ కూడా ఒక కారణమని డబ్ల్యూజీసీ పేర్కొంది. -
భారత్ డిమాండ్ బంగారం!
♦ 2020 నాటికి 950 టన్నులకు అప్ ♦ ప్రపంచ స్వర్ణ మండలి అంచనా ముంబై: భారత్ పసిడి డిమాండ్ 2020 నాటికి 950 టన్నులకు చేరుతుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. ఆర్థికవృద్ధి, పసిడి మార్కెట్లో పారదర్శకత పసిడికి దేశంలో డిమాండ్‌ను గణనీయంగా పెంచుతాయని డబ్ల్యూజీసీ నివేదిక బుధవారం పేర్కొంది. గత ఏడాదిగా పసిడి డిమాండ్ తగ్గుతూ వస్తున్నా... భవిష్యత్‌లో తిరిగి రికవరీ అవుతుందని వివరించింది. కరెంట్ అకౌంట్ లోటు ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకుని పసిడికి డిమాండ్‌ను తగ్గించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఆయా ప్రయత్నాలు ఫలించబోవని వివరించింది. సమాజంలో ఈ మెటల్ పట్ల ఉన్న ఆకర్షణే దీనికి కారణమని తెలిపింది. నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే... ♦ డిమాండ్ మళ్లీ పుంజుకుంటుంది. 2017లో డిమాండ్ 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకూ ఉండవచ్చు. అయితే 2020 నాటికి మాత్రం 850 టన్నుల నుంచి 950 టన్నులకు చేరే వీలుంది. ♦ ప్రస్తుతం పసిడి డిమాండ్ తగ్గడానికి డీమోనిటైజేషన్ ప్రభావం కూడా ఉంది. ♦ మేము 2016 మొదటి త్రైమాసికంలో ఒక వినియోగ సర్వే నిర్వహించాం. కరెన్సీలతో పోల్చితే, పసిడి పట్ల తమకు ఎంతో విశ్వాసం ఉందని 63 శాతం మంది భారతీయులు ఈ సర్వేలో తెలిపారు. దీర్ఘకాలంలో పసిడే తమ భరోసాకు పటిష్టమైనదని 73 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ విశ్వాసాలను డీమోనిటైజేషన్ మరింత పెంచింది. ♦ ప్రజలు ఒకసారి డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడినప్పుడు, ఈ ధోరణి పసిడి కొనుగోళ్లు పెరగడానికీ దోహదపడుతుంది. ఆర్థికవృద్ధి, పారదర్శకత అంశాలు ఇక్కడ పసిడి డిమాండ్ పెరగడానికి దోహదపడే అంశాలు. ఫిబ్రవరిలో మూడింతల దిగుమతులు.. కాగా పెళ్లిళ్ల సీజన్ పసిడి డిమాండ్ భారీగా ఉందని ఫిబ్రవరిలో ఆ మెటల్ దిగుమతులు వివరిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోల్చిచూస్తే 175 శాతం పెరిగి 96.4 మెట్రిక్ టన్నులకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకూ గడచిన 11 నెలల కాలంలో విదేశీ కొనుగోళ్లు 32 శాతం పెరుగుదలతో 595.5 టన్నులకు చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో– ఆభరణాలకు ఏప్రిల్‌లో భారీ డిమాండ్ ఉంటుందని తాము భావిస్తున్నట్లు గీతాంజలి జమ్స్ లిమిటెడ్ చైర్మన్ మెహుల్ చోక్సీ పేర్కొన్నారు. ఈ ఏడాది డిమాండ్ 725 టన్నులు: సిటీగ్రూప్ మరోవైపు, 2017లో పసిడి డిమాండ్ వార్షికంగా పుంజుకుంటుందని ఆర్థిక సేవల సంస్థ– సిటీగ్రూప్ కూడా విశ్లేషించింది. పెళ్లిళ్లు, పండుగల సీజన్‌ను దీనికి కారణంగా వివరించింది. అంతర్జాతీయంగా నెల కనిష్ట స్థాయి... అమెరికాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడినట్లు వార్తలు, దీనితో మార్చి 14–15 సమావేశాల సందర్భంగా అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేటును (ప్రస్తుతం 0.50 శాతం) పెంచుతుందన్న ఊహాగానాలు పసిడికి అంతర్జాతీయ మార్కెట్లో నైమెక్స్‌లో నెల కనిష్ట స్థాయికి చేర్చాయి. కడపటి సమాచారం అందే సరికి ఔన్స్ (31.1గ్రా)కు 1,205 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రెండు వారాల్లో పసిడి దాదాపు 40 డాలర్లు తగ్గింది. ఇక దేశీయంగా ప్రధాన స్పాట్ మార్కెట్ ముంబైలో 99.9 స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర బుధవారం రూ.29 వేల దిగువన ట్రేడవుతోంది. -
ప్రభుత్వ బంగారు కాయిన్ల పట్ల ఆకర్షణ
ముంబై: భారతీయులు బంగారు ఆభరణాల ప్రియులు అన్నది అందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బంగారం కాయిన్లు కూడా వారి మనసును గెలుచుకుంటున్నాయి. స్వచ్ఛతకు హామీ, నాణ్యతా ప్రమాణాలు, హాల్ మార్కింగ్, పైగా ప్రభుత్వం అందిస్తున్నవి కావడం సాధారణ బంగారు కాయిన్ల కంటే ‘ఇండియన్ గోల్డ్ కాయిన్’ పట్ల వినియోగదారుల్లో కొనుగోలు ఆసక్తికి కారణమని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నిర్వహించిన సర్వేలో తెలిసింది. దీపావళి సమయంలో, పుట్టిన రోజులు, పెళ్లి సందర్భాల్లో బహుమతులుగా ఇచ్చేందుకు ఎక్కువ మంది ఈ కాయిన్లను కొనుగోలు చేస్తున్నారని ఈ సర్వే పేర్కొంది. గతేడాది నవంబర్ 5న కేంద్రం ఇండియన్ గోల్డ్ కాయిన్లను విడుదల చేసింది. వీటిపై ఒకవైపు అశోకచక్ర, మరోవైపు మహాత్మాగాంధీ చిత్రాలు ఉంటాయి. వీటిలో 2, 5, 10 గ్రాములకు మంచి ఆదరణ ఉంది. వీటిని ప్రభుత్వ రంగ ఎంఎంటీసీతోపాటు విజయా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యస్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు విక్రయిస్తున్నాయి. -
ఆర్థిక వృద్ధికి పుత్తడి..
భారత్‌కు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సూచన ముంబై/న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మెరుగుపర్చేందుకు పుత్తడిని వినియోగించాలని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) సూచించింది. ఉద్యోగాల కల్పనకు, నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు, ఎగుమతులు..ఆదాయాలను పెంచుకునేందుకు దీన్ని ఉపయోగించాలని పేర్కొంది. ముంబైలో రెండో అంతర్జాతీయ బులియన్ సదస్సు సందర్భంగా పరిశ్రమపై ఆవిష్కరించిన విజన్ 2020 నివేదికలో డబ్ల్యూజీసీ ఈ విషయాలు ప్రస్తావించింది. ప్రస్తుతం దేశీయంగా ఇళ్లల్లో, గుళ్లల్లో దాదాపు 22,000 టన్నుల మేర బంగారం ఉందని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం తెలిపారు. పసిడి ఎగుమతులు అయిదు రెట్లు పెంచడం, ఉపాధి అవకాశాలను రెట్టింపు చేయడం ద్వారా భారత్‌ను ప్రపంచ జ్యువెలర్‌గా తీర్చిదిద్దడం విజన్ 2020 లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు 8 బిలియన్ డాలర్లుగా ఉన్న బంగారు ఆభరణాల ఎగుమతులు అప్పటికల్లా 40 బిలియన్ డాలర్లకు చేర్చేలా భారత్ లక్ష్యం నిర్దేశించుకోవాలని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొంది. నిర్దిష్ట ధరకు మించిన ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలని సూచించింది. అలాగే, ఈ రంగంలోని వారికి శిక్షణ కల్పించేందుకు ‘కారీగర్ సంక్షేమ పథకం’ ఏర్పాటు చేయాలని తెలిపింది. గోల్డ్ టూరిజం సర్క్యూట్‌ను కూడా ప్రారంభించే అవకాశాలు పరిశీలించాలని పేర్కొంది. -
బంగారం డిమాండ్ పరుగే..!
ముంబై: బంగారానికి 2013 నాల్గవ త్రైమాసికంలో(అక్టోబర్-డిసెంబర్, క్యూ4) డిమాండ్ కొనసాగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) అంచనావేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే డిమాండ్ 15% పెరుగుతుందని విశ్లేషించింది. 250-300 టన్నుల డిమాండ్ ఉండొచ్చని డబ్ల్యూజీసీ ఎండీ(ఇండియా) సోమసుందరం పీఆర్ మంగళవారం తెలిపారు. తగిన వర్షపాతం, పండుగల సీజన్ వంటి అంశాలు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలని విశ్లేషించారు. ప్రస్తుతం బంగారం ధరలు తగిన స్థాయిలోనే ఉన్నాయని వివరిస్తూ, కొనుగోళ్లు పెరగడానికి ఇది కూడా ఒక కారణమన్నారు. ఏడాది మొత్తంమీద ఈ డిమాండ్ 900 నుంచి 1000 టన్నుల వరకూ ఉంటుందని అంచనావేశారు. సెంటిమెంట్ దృష్ట్యా బంగారం కొనుగోళ్లను ప్రజలు కొనసాగిస్తున్నారని, డిమాం డ్కు అనుగుణంగా రిటైలర్లు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారని సోమసుందరం అన్నారు. 2012 క్యూ4లో భారత్‌లో పసిడి డిమాండ్ 260 టన్నులు. మొత్తం ఏడాదిలో ఈ డిమాండ్ 863 టన్నులు.