మంత్రి దంపతులను దోచుకున్న దొంగలు
మధురై: జబల్పూర్- నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్-లో ఓ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆయన భార్య దోపిడీకి గురయ్యారు. దోపిడీ దొంగలు మంత్రి దంపతులను తుపాకీతో బెదిరించి మరీ దోచుకున్నారు. ఈ సంఘటన రైళ్లలో ప్రయాణికుల భద్రత దుస్థితిని మరోసారి వెలుగులోకి తెచ్చింది. గురువారం మధురై జిల్లాలోని కోసికోలన్ దగ్గర జబల్పూర్- నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలోకి ఆయుధాలతో చొరబడ్డ దొంగలు మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి జయంత్ మలైయా దంపతులతో పాటు మరికొంతమంది ప్రయాణికులను కూడా దోచుకున్నారు.
అంతేకాదు ఇదే మార్గంలో వెళ్తున్న మరో రైలులో కూడా ఈ గ్యాంగ్ లూటీకి పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనతో షాకైన ఆర్థికమంత్రి జయంత్ .. దీనిపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభుని కలవనున్నారని సమాచారం. గతంలో కోసి కలన్ రైల్వేమార్గాన్ని టార్గెట్ చేసుకొని ప్రయాణికులను దోచుకున్నఘటనలు అనేకం జరిగినట్టు తెలుస్తోంది.