Woman IAS officer
-
పూజపై డిబార్ వేటు!
సాక్షి, న్యూఢిల్లీ: అధికార దర్పం ప్రదర్శించేందుకు ప్రయత్నించి వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ప్రొబెషనరీ మహిళా ఐఏఎస్ పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ విషయంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సీరియస్‌గా స్పందించింది. ç2022 సివిల్ సర్వీసెస్ పరీక్షల నిబంధనల ప్రకారం భవిష్యత్ పరీక్షలు, నియామకాల నుంచి మిమ్మల్ని ఎందుకు డిబార్ చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్ నోటీసు పంపించింది. ‘‘పరీక్ష రాసే ‘అవకాశాలు’ ఆమె గతంలోనే దాటేశారు. అయినాసరే అర్హత లేకపోయినా గుర్తింపును దాచి తప్పుడు పత్రాలు సమర్పించి సివిల్స్ రాసి అర్హత సాధించారు’’ అని యూపీఎస్సీ శుక్రవారం తెలిపింది. ‘‘పాత వివరాలతో అదనంగా ఇంకోసారి పరీక్ష రాయలేనని తెల్సుకుని ఉద్దేశపూర్వకంగా తన పూర్తి పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటోగ్రాఫ్, సంతకం, ఇ–మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, చిరునామా మార్చేసి గుర్తింపు దాచారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు మా దర్యాప్తులో తేలింది’’ అని యూపీఎస్సీ ప్రకటించింది. తర్వాత ఆమెపై క్రిమినల్ కేసు మోపి సమగ్ర దర్యాప్తు చేయాలని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫోర్జరీ, చీటింగ్, వైకల్య కోటా దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడ్డారంటూ ఐపీసీ, ఐటీ, డిజబిలిటీ చట్టాల కింద ఢిల్లీ నేరవిభాగ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తును మొదలెట్టారు. 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అయిన పూజ మహారాష్ట్రలోని పుణె జిల్లా కలెక్టరేట్లో శిక్షణలో ఉన్నపుడు అదనపు సౌకర్యాలు కావాలని, సొంత కారుకు ఎర్రబుగ్గ తగిలించుకుని తిరిగారు. దీంతో ఆమె సివిల్స్‌లో అర్హత సాధించేందుకు చేసిన నేరాలను మీడియా బహిర్గతంచేసింది. దీంతో ఆమెను పుణె నుంచి వాసిమ్ జిల్లా కలెక్టరేట్లో అసిస్టెంట్ కలెక్టర్‌గా బదిలీచేసింది. యూపీఎస్సీ షోకాజ్ నోటీసు నేపథ్యంలో శుక్రవారం ఆమె వాసిమ్ కలెక్టరేట్లో పదవిని వదిలి వెళ్లిపోయారు. యూపీఎస్సీకి వచ్చే దరఖాస్తుల పరిశీలన సమగ్రస్థాయిలో, మరింత సునిశింతంగా ఉండాలని పూజా ఉదంతం చాటుతోంది. పూజ తండ్రికి తాత్కాలిక ఉపశమనంభూ వివాదంలో తుపాకీతో బెదిరించిన కేసులో జూలై 25వ తేదీదాకా అరెస్ట్ నుంచి పూజ తండ్రి దిలీప్‌కు రక్షణ కల్పిస్తూ పుణె సెషన్స్‌కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇదే కేసులో దిలీప్ భార్య మనోరమను మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌చేసి 20వ తేదీదాకా జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు మనోరమ భార్యకు చెందిన నిర్వహణలోలేని థర్మోవెరిటా ఇండియా అనే ఇంజనీరింగ్ సంస్థను పింప్రి–ఛించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్చేశారు. రూ.2.77 లక్షల ఆస్తి పన్ను బాకీ కట్టనందుకు అధికారులు ఇలా చర్యలకు ఉపక్రమించారు. వైకల్య సర్టిఫికెట్ తీసుకునేటపుడు ఈ సంస్థ చిరునామానే పూజ తన ఇంటి అడ్రస్‌గా పేర్కొన్నారు. -
బొగ్గు కుంభకోణంలో మహిళా ఐఏఎస్ అరెస్ట్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన బొగ్గు లెవీ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం మహిళా ఐఏఎస్ అధికారి రానూ సాహూను అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖలో డైరెక్టర్‌గా ఉన్న రానూ సాహూకు అదనపు జిల్లా జడ్జి అజయ్ సింగ్ రాజ్‌పుత్ మూడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించారు. బొగ్గు కుంభకోణం కేసులో అరెస్టయిన రెండో ఐఏఎస్ అధికారి సాహు. రాయ్‌గఢ్, కోర్బా జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఆమె అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ లాయర్ సౌరభ పాండే తెలిపారు. ఆమె రూ.5.52 కోట్ల విలువైన చరాస్తులను పోగేశారని తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను సాహూ లాయర్ ఖండించారు. ఆమెను కల్పితమైన కారణాలతోనే అధికారులు అరెస్ట్ చేశారన్నారు. -
కలెక్టర్ సిక్తా పట్నాయక్ బదిలీ
సిక్తా పట్నాయక్.. రెండున్నరేళ్లు ఆదిలాబాద్: పెద్దపల్లి కలెక్టర్‌గా పనిచేస్తూ 2020 జూలై 17న ఆదిలాబాద్ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్ శ్రీదేవసేన నుంచి బాధ్యతలు స్వీకరించారు. రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు కలెక్టర్‌గా సేవలందించిన ఆమె ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు తొలి ప్రాధాన్యతనిచ్చారు. కోవిడ్ రెండో దశ తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో జిల్లాలో వైరస్ కట్టడికి ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వైరస్ కారణంగా పాలనకు ఇ బ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆఫీస్ అమలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఎక్కుమంది ఎస్సీలకు భూ పంపిణీ చేపట్టి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను ముందుంచేలా అధికా రులకు మార్గనిర్దేశం చేస్తూ వాటి ఫలితాలను రాబట్టేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. క్షేత్రస్థాయి పర్యటనలు సైతం చేపట్టి వారిని ప్రోత్సహించారు. ముఖ్యంగా 2021లో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట లు, ఆదివాసీగూడేలు, తండాలను కాలినడకన వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లి పరిశీలించారు. వారితో మమేకమై సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి అండగా నిలిచా రు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలను అందించారు. ప్రజాప్రతినిధులు, అధికారులనే తారతమ్యం లే కుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములను చేసి విజయవంతం చేశారు. వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించి రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. కొత్త కలెక్టర్‌గా రాహుల్‌రాజ్ ఆదిలాబాద్ జిల్లా కొత్త కలెక్టర్‌గా రాహుల్‌రాజ్ నియామకమయ్యారు. ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ హనుమకొండ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లనున్నారు. అలాగే ఉట్నూర్ ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డిని నిర్మల్ కలెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాహుల్‌రాజ్ జిల్లా కలెక్టర్‌గా రానున్నట్లు కొద్ది రోజులుగా ఇక్కడి ప్రజల్లో జరుగుతున్న చర్చ నిజమైంది. కుమురంభీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాహుల్‌రాజ్‌ను ఆదిలాబాద్ కలెక్టర్‌గా నియమించారు. గతేడాది కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రసూతి సెలవులకు వెళ్లిన సందర్భంలో ఈయన నెల పాటు జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా పనిచేశారు. ఆయనే జిల్లా కలెక్టర్‌గా రానుండటంతో తన పనితీరుతో ఎలాంటి ముద్ర వేస్తారనే చర్చ సాగుతోంది. ఆయన గురువారం జిల్లాలో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లుగా అధికారిక వర్గాల సమాచారం. -
దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్
తిరువనంతపురం: ‘ఓడిపోవడానికి అవకాశం ఇవ్వకండి.. ప్రయత్నాన్ని విరమించకండి. మనం చేసే కృషే మనకు కావాల్సింది సాధించి పెడుతుంది’ అంటూ దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్‌గా నియమితురాలైన ప్రంజల్ పాటిల్ (30) పిలుపునిచ్చారు. సోమవారం ఆమె తిరువనంతపురం సబ్‌కలెక్టర్‌గా, రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌కు చెందిన ఆమె ఆరేళ్ల లేత ప్రాయంలోనే చూపును కోల్పోయారు. అయితే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆశను మాత్రం కోల్పోలేదు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి డిగ్రీపట్టా పొందారు. అనంతరం 2016లో జరిగిన యూపీఎస్సీ పరీక్షలు రాసి, 773వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమెకు భారత రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్ఏఎస్)లో ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె అంధురాలని తెలియడంతో ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరించారు. పట్టు వదలని ప్రంజల్ తర్వాతి యేడు జరిగిన యూపీఎస్సీ పరీక్షలు మళ్లీ రాసి 124వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమె ఐఏఎస్‌గా ఎంపికై, యేడాది శిక్షణలో భాగంగా ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. రైల్వే ఉద్యోగం తిరస్కరణకు గురికావడంపై తానెంతో వేదనకు గురయ్యానని ఓ సందర్భంలో తెలిపారు. కళ్లకు చేసిన శస్త్రచికిత్స విఫలమైనందు వల్ల కూడా నొప్పిని అనుభవించానని తెలిపారు. తిరువనంతపురంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమంలో సామాజిక న్యాయ విభాగం సెక్రటరీ బిజు ప్రభాకర్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళా ఏఎస్ఐకు గాయాలు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : టంగుటూరు టోల్‌ప్లాజా సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా ఏఎస్ఐ తీవ్రం గా గాయపడ్డారు. గుంటూరులోని నగరంపాలెం మహిళా పోలీసుస్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్న వి.రాజేశ్వరీదేవి గుడ్లూరు మండలం పోట్లూరులో బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై తిరిగి కారులో వెళుతోంది. టంగుటూరు టోల్‌ప్లాజా దాటిన కొద్దిసేపటికి ముం దు వెళ్తున్న ఇసుక ట్రాక్టర్‌ను ఆమె కారు అధిగమించింది. ఆ వెంటనే వెనుక నుంచి వస్తున్న లారీ.. ఏఎస్ఐ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ఒంగోలు వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా టంగుటూరు వైపునకు తిరిగా బోల్తా కొట్టింది. ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న రాజేశ్వరీదేవికి తీవ్రగాయాలు కాగా ముందు సీట్లో కూర్చున్న డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు దక్షిణ బైపాస్‌లో ఉన్న ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.