రోడ్డు ప్రమాదంలో మహిళా ఏఎస్‌ఐకు గాయాలు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : టంగుటూరు టోల్‌ప్లాజా సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా ఏఎస్‌ఐ తీవ్రం గా గాయపడ్డారు. గుంటూరులోని నగరంపాలెం మహిళా పోలీసుస్టేషన్‌లో ఏఎస్‌ఐగా పని చేస్తున్న వి.రాజేశ్వరీదేవి గుడ్లూరు మండలం పోట్లూరులో బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై తిరిగి కారులో వెళుతోంది. టంగుటూరు టోల్‌ప్లాజా దాటిన కొద్దిసేపటికి ముం దు వెళ్తున్న ఇసుక ట్రాక్టర్‌ను ఆమె కారు అధిగమించింది. ఆ వెంటనే వెనుక నుంచి వస్తున్న లారీ.. ఏఎస్‌ఐ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ఒంగోలు వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా టంగుటూరు వైపునకు తిరిగా బోల్తా కొట్టింది. ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న రాజేశ్వరీదేవికి తీవ్రగాయాలు కాగా ముందు సీట్లో కూర్చున్న డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు దక్షిణ బైపాస్‌లో ఉన్న ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.