Woman IPS
-
తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ : ఈ బాలీవుడ్ నటిని గుర్తు పట్టారా?
డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన చాలామంది నటులను చూశాం. అలాగే అటునటులుగా, ఇటు డాక్టర్లుగా కొనసాగిన వారి గురించీ విన్నాం. కానీ యాక్టర్ నుంచి పోలీసు అధికారి కావడం గురించి విన్నారా? 2010 బ్యాచ్‌కి చెందిన ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌ను పరిచయం చేసుకుందాం.. రండి..! ఆకర్షణీయమైన ఎంటర్ టైన్మెంట్ రంగంనుంచి ఐపీఎస్ అధికారిగా మారింది ప్రముఖ బాలీవుడ్ నటి సిమల ప్రసాద్. సంకల్పం, పట్టుదల ఉంటే చాలా నిరూపించారు. ఐఏఎస్ అధికారి భగీరథ్ ప్రసాద్, ప్రముఖ రచయిత్రి మెహ్రున్నీసా పర్వేజ్‌ల కుమార్తె సిమల ప్రసాద్. నటిని కావాలన్న ఆశయంతో బాలీవుడ్లో నటిగా అడుగు పెట్టిన తర్వాత కూడా తన మరో లక్ష్యాన్ని మాత్రం మర్చిపోలేదు. (రణపాలతో ఆరోగ్య ప్రయోజనాలు : పేరులోనే ఉంది అంతా!) భోపాల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ చదువు, ఆ తరువాత కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నృత్యం, నటనపై ఆసక్తిని పెంచుకుంది. మరోవైపు తండ్రి ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పటికీ, సివిల్ సర్వీస్ మార్గంవైపు చూడలేదు. నటనపై ఆసక్తితో “అలిఫ్”, “నక్కష్” మూవీల్లో అవకాశాలను దక్కించుకున్నారు. ఈ క్రమంలో “అలీఫ్” సినిమాలో షమ్మీ పాత్రకు గాను విమర్శకులు ప్రశంసలు దక్కాయి. అలా నటి కావాలనే ఆమె కల నెరవేరింది. ఇలా నటనను కొనసాగిస్తూనే భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారామె. (గర్ల్ ఫ్రెండ్ కోసం, సాహసం: అతగాడి కష్టం తెలిస్తే ఔరా అనాల్సిందే!) తరువాత మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అలా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదా వరించింది. ఈ క్రమంలోనే యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ కావడం కూడా ప్రారంభించింది. ఇక్కడితో ఆమె ఆగిపోలేదు. ఈ క్రమంలోనే యూపీఎస్సీ పరీక్షపై దృష్టిపెట్టారు. అంతేకాదు తొలిప్రయత్నంలోనే ఎలాంటి కోచింగ్ లేకుండానే పరీక్షలో విజయం సాధించి ఐపిఎస్ అధికారిణి కావడం విశేషం. -
మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు: డీజీపీపై సస్పెన్షన్ వేటు
సాక్షి, చెన్నై: వారంతా పోలీస్‌శాఖలో ఉన్నతాధికారులు. అయితేనేం సాధారణ వ్యక్తుల వలె వ్యవహరించారు. డీజీపీ స్థాయి అధికారి మహిళా ఐపీఎస్‌ను లైంగిక వేధింపులకు గురిచేయగా, మరో ముగ్గురు ఐపీఎస్‌లు నిందితుడికి అండగా నిలిచారు. వీరందరిపై శాఖాపరమైన చర్యల కోసం రంగం సిద్ధం అవుతోంది. సీబీసీఐడీ అధికారుల సమాచారం ఇలా ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి భద్రతా విధులు నిర్వర్తిస్తున్న ఒక మహిళా ఎస్పీ (ఐపీఎస్ అధికారి)ని స్పెషల్ డీజీపీ తన చాంబర్‌కు పిలిపించుకున్నారు. సీఎం భద్రాతా చర్యల గురించి చర్చించాలని నమ్మబలికి తన కారులో ఎక్కించుకుని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. స్పెషల్ డీజీపీపై తమిళనాడు హోంశాఖ కార్యదర్శికి, డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు సదరు మహిళా ఎస్పీ సేలం నుంచి చెన్నైకి బయలుదేరింది. అయితే స్పెషల్ డీజీపీ తన పలుకుబడిని ఉపయోగించి ఆమెను వెళ్లకుండా ఉండేందుకు అడ్డుకునేయత్నం చేశారు. మధ్య మండల ఐజీ, మహిళా డీఐజీ, చెంగల్పట్టు ఎస్పీ సహా 50 మందికి పైగా పోలీసులు చెంగల్పట్టు చెక్‌పోస్టు వద్ద దారికాచి, కారును అడ్డగించి రాజీ చర్చలు జరిపారు. అయితే ఇందుకు ఒప్పుకోని బాధితురాలు ఫిర్యాదు ఇచ్చే తీరుతానని బయలుదేరడంతో ఆమె కారు తాళాలు లాక్కుని ఘర్షణ పడ్డారు. ఎంతో ప్రయాసపడి అనుకున్న ప్రకారం అత్యున్నతాధికారులకు ఫిర్యాదు చేయగలిగారు. ప్రిన్సిపల్ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పడి విచారణ చేపట్టగా స్పెషల్ డీజీపీ చేసిన నేరం నిర్ధారణైంది. చెంగల్పట్టు చెక్‌పోస్ట్ వద్దనున్న సీసీ కెమెరాల పుటేజ్‌ను పరిశీలించగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు కలిసి అక్కడ నడిపిన రాజీ బాగోతం బయటపడింది. దీంతో స్పెషల్ డీజీపీతోపాటు మిగిలిన ముగ్గురు పోలీస్ అధికారులపైనే కేసు నమోదైంది. స్పెషల్ డీజీపీపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులపై శాఖాపరమైన విచారణ జరగకపోగా యథావిధిగా వారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ముగ్గురిపై చార్జిషీటు దాఖలుకు వీలుగా తదుపరి చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి సీబీసీఐడీ లేఖ రాసింది. ఈ లేఖ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ సిఫార్సు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని బృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
మహిళా ఐపీఎస్‌ను చిక్కులో పడేసిన ‘ఫ్రీ బిర్యానీ ఆర్డర్’
అధికారం చేతిలో ఉందని ఓ మహిళా పోలీస్ అధికారిణి చేసిన పని చివరికి ఆమెకు తలనొప్పిని తెచ్చిపెట్టింది. మహిళా ఐపీఎస్ అధికారిణి ఉచితంగా బిర్యానీ ఆర్డర్ చేయడం, ఈ విషయం ప్రభుత్వం వరకు చేరడంతో పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయం ఆ రాష్ట్ర హోంమంత్రి వరకు వెళ్లింది. వెంటనే ఈ ఘటనపై విచారించాలని పోలీసులను ఆదేశించారు. మహారాష్ట్రలో డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో మహిళా ఐపీఎస్ అధికారిణి తన సబార్డినేట్‌తో విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ రెస్టారెంట్లో మంచి బిర్యానీ దొరుకుతుందని అడిగి తెలుసుకున్నారు. దీనికి అతను దేశీ ఘీ రెస్టారెంట్ అక్కడ ఫేమస్ అని చెప్పడంతో మటన్ బిర్యానీ తెప్పించాలని కోరింది. రెస్టారెంట్ వాళ్లు డబ్బులు అడిగితే స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్తో మాట్లాడించమని చెప్పింది. ఎందుకంటే తమ పరిధిలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందా అని మహిళా అధికారిణి అడిగింది. దీనికి సబార్డినేట్ ‘మేము ఎప్పుడు బయట నుంచి ఆహారం ఆర్డర్ చేసినా డబ్బులు చెల్లించేవాళ్లం’ అని చెప్పాడు. దీనిపై స్పందించిన మహిళా ఐపీఎస్ ‘ఇప్పుడు సమస్య ఏంటి మా పరిధిలో ఉన్న రెస్టారెంట్‌కు కూడా డబ్బులు చెల్లించాలా, అక్కడి ఇన్స్పెక్టర్ చూసుకుంటాడని తెలిపింది. అయితే దీనికి సంబంధించిన ఈ ఆడియో క్లిప్ నెట్టింట వైరల్‌గా మారడంతో ఈ విషయంపై ఐపీఎస్ అధికారిణి స్పందించింది. తన ఆడియో క్లిప్‌ను మార్ఫింగ్ చేశారని ఆరోపించింది. ఇదంతా సీనియర్ పోలీసు అధికారులను బదిలీ చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు బయటపడిందన్నారు. ‘ఇది నాపై వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర. నేను చేస్తున్న జోన్లో కొన్నేళ్లుగా కొంతమంది ఇక్కడే పనిచేస్తున్నారు. వారి ఆర్థిక ప్రయోజనాలు ఇక్కడే ఉన్నాయి. ఈ కుట్రలో కొందరు సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. నేను ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన తరువాత వారి కార్యకలాపాలు ఆగిపోయాయి. అందుకే నన్ను తొలగించాలనే అక్కసుతో ఇదంతా చేశారు’ అని తెలిపారు. దీనిపై సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించబోతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ తతాంగమంతా ఆ రాష్ట్ర హోం మంత్రికి చేరింది. ఈ విషయంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పూణే పోలీస్ కమిషనర్ని కోరారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. -
మహిళా ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులు..
సాక్షి, చెన్నై: హోం శాఖలో మరో ఖా‘కీ’చకం చర్చకు దారి తీసింది. మహిళా ఐపీఎస్‌ను డీజీపీ హోదా అధికారి వేధింపులకు గురిచేయడం రాజకీయంగా సైతం దుమారాన్ని రేపింది. దీంతో విచారణకు కమిటీ రంగంలోకి దిగింది. ఈ కమిటీని ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ పరిధిలోని పోలీసు విభాగంపై ఇటీవల కాలంగా ఆరోపణలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. ఇందులో లైంగిక వేధింపులు ఎక్కువగానే ఉన్నాయి. కొంత మంది మహిళా అధికారులు, కిందిస్థాయి సిబ్బంది ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నా, మరెందరో బయటకు చెప్పుకోలేక తమలో తాము కృంగిపోతున్నారు. ఫిర్యాదులు చేసుకున్నా ఫలితం శూన్యం. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ఎస్పీ స్థాయి అధికారినికి ఐజీ స్థాయి అధికారి వేధింపులు ఇవ్వడం, విశాఖ కమిటీ రంగంలోకి దిగినా, చివరకు ఆ విచారణ తుంగలో తొక్కబడడమే. ఈ పరిస్థితుల్లో డీజీపీ హోదా కల్గిన అధికారి ఐపీఎస్ అధికారిని తన కారులో ఎక్కమని చెప్పి, కొంత దూరం వెళ్లినానంతరం డ్రైవర్‌ను కిందకు దించేసి మరీ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు, లైంగిక వేధింపులు ఇచ్చినట్టు రెండు రోజులుగా ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తూ వచ్చింది. ఐఏఎస్ నేతృత్వంలో రంగంలోకి.. ఈ సమాచారం బుధవారం రాజకీయవివాదంగా మారింది. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడడంతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. ఆ మహిళా ఐపీఎస్ అధికారి ఇప్పటికే డీజీపీ త్రిపాఠికి ఫిర్యాదు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ వేధింపులపై విచారణకు కమిటీని నియమిస్తూ హోంశాఖ కార్యదర్శి ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి పోలీసు బాసుల నేతృత్వంలో కమిటీ రంగంలోకి దిగాల్సి ఉంది. వేధింపులు ఇచ్చిన అధికారి డీజీపీ స్థాయి వ్యక్తి కావడంతో ఐఏఎస్ అధికారి జయశ్రీ రఘునందన్ నేతృత్వంలో ఆరుగురితో కూడిన కమిటీ రంగంలోకి దించారు. ఈ కమిటీలో అదనపు డీజీపీ సీమాఅగర్వాల్, ఐజీ అరుణ్, డీఐజీ చాముండేశ్వరి, ఐపీఎస్ రమేష్‌బాబు, మహిళా స్వచ్ఛంద సేవకురాలు లోరెటా జోనా ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ స్థాయి అధికారిని వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: ఘట్కేసర్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ట్విస్ట్ మాయలేడి: ఇంత పనిచేసిందా? -
మహిళా ఐపీఎస్‌పై దాడి
సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో నగలు దోచుకెళ్లిన దుండగుడు నెల్లూరు జిల్లాలో ఘటన రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీస్ టీం నెల్లూరు(అర్బన్)/గూడూరు: సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక మహిళా ఐపీఎస్ అధికారిపైనే దాడి చేసి నగలు దోచుకెళ్లిన సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మనుబోలు ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలి తమ్ముడు మురళీకృష్ణ, నెల్లూరు రైల్వే సీఐ నరసింహరాజు కథనం ప్రకారం.. ఐపీఎస్ అధికారి ఎస్.ఎం.రత్న(సేనాని మునిరత్న) స్వస్థలం సూళ్లూరుపేట కాగా చెన్నైలో స్థిరపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తూ పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. అప్పుడప్పుడు చెన్నైలో నివసించే తమ్ముడు మురళీకృష్ణ వద్దకు వెళ్లి వచ్చేవారు. అదే క్రమంలో శుక్రవారం రాత్రి సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి ఉదయం 10 గంటలకు నెల్లూరు స్టేషన్లో దిగారు. అక్కడి నుంచి చెన్నైకు వెళ్లేందుకు ఏమైనా రైళ్లు ఉన్నాయా? అని టీసీని అడగడంతో గూడూరు జంక్షన్‌కు వెళ్లాలని సూచించారు. దీంతో ఆమె వచ్చిన సింహపురిలోనే మళ్లీ గూడూరుకు బయలుదేరారు. అయితే ఆమె అనుకోకుండా వికలాంగుల బోగీలో ఎక్కారు. ఆ బోగీలో ఆమెతో పాటు మరోవ్యక్తి మాత్రమే ఉన్నారు. మనుబోలు దాటగానే ఆమెపై బోగీలోని వ్యక్తి దాడి చేశాడు. ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఆమె తేరుకునేలోపు ఆగంతకుడు బంగారు చైను, గాజులు, రెండు ఉంగరాలు, పర్సులో ఉన్న రూ. 2వేల నగదు లాక్కున్నాడు. గూడూరు సమీపంలో రైలు నెమ్మదికాగానే దూకేసి పారిపోయాడు. తేరుకున్న రత్న గూడూరులో దిగి పోలీసులకు సమాచారమిచ్చారు. గూడూరు పోలీసులు అక్కడి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని అపోలోకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ముఖంపై తీవ్రంగా కొట్టడంతో ఆ భాగం ఉబ్బిందని వైద్యులు తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. -
తొలి ఐపీఎస్ కాకపోయినా ధీర వనితే!
న్యూఢిల్లీ: అస్సాంలో బోడో మిలిటెంట్లను తుదముట్టించడంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్న అస్సాం మహిళా ఐపీఎస్ ఆఫీసర్ సంజుక్త పరాశర్ గురించిన పలు కథనాలు సామాజిక వెబ్సైట్లలో, ప్రధాన మీడియా స్రవంతిలో గతవారం రోజులుగా కనిపిస్తూ, ఇటు వ్యూయర్స్‌ను, అటు పాఠకులను విశేషంగా ఆకర్శిస్తున్నాయి. అస్సాంలోని సోనిత్పూర్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఈ 15 నెలల కాలంలోనే, రాష్ట్రంలో కేంద్ర సీఆర్పీఎఫ్ దళాలకు స్వయంగా నాయకత్వం వహించి 16 మంది బోడో మిలిటెంట్లను హతమార్చడమే కాకుండా దాదాపు 66 మందిని అరెస్టు చేసిన పరాశర్ ధీరత్వాన్ని సామాజిక వెబ్సైట్లు ‘లైక్స్’తో కొనియాడుతున్నాయి. ఒక్క ఫేస్‌బుక్‌లోనే ఆమె లైక్స్ గురువారం నాటికి యాభై వేలను దాటాయి. 2006 బ్యాచ్‌కు చెందిన పరాశర్‌ను అస్సాం నుంచి సెలెక్టయిన తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా పేర్కొనడంలో మాత్రం ఇటు సోషల్ మీడియా, అటు ప్రధాన మీడియా తప్పులో కాలేసింది. ఇక్కడ 1977 బ్యాచ్‌కు చెందిన అస్సాం తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ యామిన్ హజారికా గురించి, ప్రస్తుతం నార్త్ ఈస్ట్ పోలీసు అకాడమీ డెరెక్టర్‌గా పని చేస్తున్న డీ. రాణి డోలే బర్మన్ (1986 బ్యాచ్ కేడర్) గురించి మరిచిపోవడం చరిత్రను విస్మరించడమే అవుతోంది. మాతృరాష్ట్రం అస్సాం నుంచి ఎంపికై, అస్సాంలోనే పనిచేస్తున్న తొలి మహిళా ఆఫీసర్‌గా పరాశర్‌ను పేర్కొనవచ్చు. అస్సాంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆమెకు అస్సాంలో పనిచేసే అవకాశం లభించింది.