women activists
-
మీ తెగువకు నా సెల్యూట్: YS Jagan
-
YSRCP అఖండ మెజార్టీతో గెలుస్తుంది: YS జగన్
-
మొనాలిసా పెయింటింగ్‌పైకి సూప్ స్ప్రే
పారిస్: ప్రపంచ ప్రఖ్యాత మొనాలిసా పెయింటింగ్‌పైకి పర్యావరణ ఉద్యమకారులు సూప్‌ను స్ప్రే చేశారు. అయితే, పెయింటింగ్‌కు గ్లాస్ రక్షణ ఉండటంతో ఎటువంటి నష్ట వాటిల్లలేదు. 16వ శతాబ్దంలో ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ చేతుల్లో రూపుదిద్దుకున్న మొనాలిసా చిత్రం ప్రస్తుతం సెంట్రల్ పారిస్‌లోని లౌవ్రె ప్రదర్శనశాలలో ఉంది. శుక్రవారం ఉదయం ‘రిపోస్టె అలిమెంటయిర్’అనే గ్రూపునకు చెందిన ఇద్దరు మహిళా ఉద్యమకారులు గుమ్మడి సూప్‌ను మొనాలిసా పెయింటింగ్‌పైకి స్ప్రే చేశారు. అనంతరం వారు ‘కళ, ఆరోగ్యకరమైన సుస్థిరమైన ఆహార హక్కుల్లో ఏది ముఖ్యమైంది? వ్యవసాయరంగం సమస్యల్లో ఉంది. రైతులు చనిపోతున్నారు. ప్రభుత్వం స్పందించాలి’అని డిమాండ్ చేశారు. మ్యూజియం సిబ్బంది వెంటనే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పెయింటింగ్‌ను తొలగించి, శుభ్రం చేశాక గంట తర్వాత తిరిగి ప్రదర్శనకు ఉంచారు. మన వారసత్వం మాదిరిగానే ఈ పెయింటింగ్ భవిష్యత్ తరాలకు చెందాల్సిందని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యమకారుల వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఇంధన ధరలు పెరిగాయని, నియంత్రణలు ఎక్కువయ్యాయంటూ శుక్రవారం రైతులు పారిస్‌ను దిగ్బంధించారు. గతంలోనూ దెబ్బతింది ప్రదర్శనకు ఉంచిన మొనాలిసా చిత్రంపై 1950లో ఓ సందర్శకుడు యాసిడ్ పోశాడు. దీంతో, పెయింటింగ్ దెబ్బతింది. అప్పటి నుంచి పెయింటింగ్‌కు రక్షణగా గ్లాస్‌ను ఏర్పాటు చేశారు. 2019లో పారదర్శకమైన బుల్లెట్‌ప్రూఫ్ అద్దాన్ని రక్షణగా బిగించారు. 2022లో ఓ ఉద్యమకారుడు భూ గ్రహాన్ని కాపాడాలని కోరుతూ పెయింటింగ్‌పైకి కేక్‌ను విసిరేశాడు. -
ప్రభుత్వానికి క్రెడిట్ దక్కడంతో ఓర్వలేక ప్లాన్ ప్రకారం టీడీపీ గొడవ
-
వాలంటీర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ మహిళా కార్యకర్తలు
-
విజయవాడ: టీడీపీ మహిళా కార్యకర్తల ఓవరాక్షన్
సాక్షి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారి తోటలో టీడీపీ మహిళా కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. దేవినేని అవినాష్ పర్యటనలో మహిళా కార్యకర్తలు గలాటా సృష్టించారు. వాలంటీర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కడంతో టీడీపీ గొడవకు దిగింది. చిల్లర, నీచ రాజకీయాలకు టీడీపీ మహిళా కార్యకర్తలు తెరలేపారు. వారికి ఓటమి భయం పట్టుకుంది: దేవినేని అవినాష్ చంద్రబాబు, గద్దె రామ్మోహన్‌కు ఓటమి భయం పట్టుకుందని దేవినేని అవినాష్ మండిపడ్డారు. ‘‘తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వ లేకపోతున్నారు. గత ఐదేళ్లు రిటైనింగ్ వాల్ కట్టకుండా టీడీపీ టైమ్ పాస్ చేసింది. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత రిటైనింగ్ వాల్ పూర్తి చేశాం. రాణీగారితోట వాసులకు ముంపు కష్టాలు లేకుండా చేశాం. టీడీపీ కార్యకర్తల ఇళ్లలోనూ పథకాలిచ్చాం. చంద్రబాబు హయాంలో కూడా తమకు ఇంత సంక్షేమం అందలేదని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిని గద్దె రామ్మోహన్ జీర్ణించుకోలేకపోతున్నారు’’ అని అవినాష్ దుయ్యబట్టారు. చదవండి: పొత్తు పొడిస్తే.. సీటు సితారే.. ‘‘పైకి మహాత్మాగాంధీకి వారసుడినని గద్దె బిల్డప్ ఇస్తాడు. తెర వెనుక గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను తయారు చేస్తాడు. మహిళలకు డబ్బులిచ్చి మాపై ఉసిగొల్పుతున్నారు. ఇప్పటికైనా గద్దె రామ్మోహన్, టీడీపీ నేతలు తమ బుద్ధి మార్చుకోవాలి. నీచ రాజకీయాలు మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతాం’’ అని అవినాష్ హెచ్చరించారు. -
టీడీపీ కార్యాలయం ఎదుట తెలుగు మహిళల ధర్నా
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట తెలుగు మహిళ నాయకులు, కార్యకర్తలు బుధవారం ధర్నా నిర్వహించారు. టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. లోకేష్ పీఏ సాంబశివరావు బృందం టీడీపీలోని మహిళా కార్యకర్తలను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తక్షణమే న్యాయం చేయకపోతే పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పెదవడ్లపూడి గ్రామానికి చెందిన మహిళా టీడీపీ నాయకురాలు పాలేటి కృష్ణవేణి మాట్లాడుతూ.. పార్టీ కోసం తాము పనిచేస్తుంటే అకారణంగా తమను ఎందుకు సస్పెండ్ చేశారో సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం పనిచేసే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలకు తీవ్ర అన్యాయం, అవమానాలు జరుగుతున్నాయన్నారు. బడుగు బలహీనవర్గాలకు, దళితులకు టీడీపీలో సరైన ప్రాతినిధ్యం లేదని వాపోయారు. దళితులకు మంగళగిరి నియోజకవర్గంలో ఒక్కరికైనా మండల అధ్యక్ష పదవి కేటాయించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నిలబెట్టిన అభ్యర్థులను ఓడిస్తున్న పార్టీ మాజీ ఇన్చార్జి పోతినేని శ్రీనివాసరావును ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని నిలదీశారు. పార్టీలో చంద్రబాబు సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటోందని, మరే సామాజిక వర్గానికి పార్టీలో ప్రాధాన్యత ఉండటం లేదని వాపోయారు. అన్ని సామాజిక వర్గాలు గుర్తించాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తాము ఏ తప్పు చేశామో తమకు సమాధానం చెప్పాలని, లేదంటే పార్టీ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాడబోమన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు చేరుకుని రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎదుట ధర్నాలు చేయడం సమంజసం కాదన్నారు. సమస్యను రాతపూర్వకంగా తెలియజేస్తే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామనడంతో మహిళలు ఆనంద్‌బాబుకు వినతిపత్రం అందజేసి ఆందోళన విరమించారు. -
బీజేపీ ఇంత దిగజారిపోయిందా?
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు అత్యాచార బెదిరింపులకు తెగబడుతున్నారని ఆరోపిస్తూ వారి తీరును నిందిస్తూ, తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ సుమారు 175 మంది మహిళా ఉద్యమకారులు ప్రధాని నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. పౌరసత్వ సవరణ చట్టంతోపాటు, ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఉద్యమిస్తున్న మహిళలపై హింసకు పాల్పడాల్సిందిగా బీజేపీ నేతలు తమ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని, తద్వారా ఎన్నికల్లో ఒక హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆలిండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆప్ ఇండియన్ విమెన్ సంస్థలతోపాటు ఆర్థికవేత్త దేవకీ జైన్, ఉద్యమకారణి లైలా త్యాబ్జీ, మధు బాధురీ (విశ్రాంత దౌత్యవేత్త), కమలా భాసిన్ తదితరులు ఆ లేఖలో ఆరోపించారు. ఢిల్లీ మహిళలకు ప్రధాని ఇస్తున్న ఎన్నికల సందేశం ఇదేనా? బీజేపీ ఇంతటి అధమ స్థితికి దిగజారిపోయిందా? అని ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకోవాలని కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎంపీ పర్వేశ్ వర్మ తమ అనుచరులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. మహిళలపై దాడులు చేయించి ఢిల్లీ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హింసాకాండతో ఎన్నికల్లో గెలవలేరని హెచ్చరించారు. ఫిబ్రవరి 8న ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. 11న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. (చదవండి: ఇది రాజీవ్ ఫిరోజ్ ఖాన్ సర్కార్ కాదు) -
జనసేన యాక్షన్ అట్టర్ ఫ్లాప్
కాకినాడ: ప్రజల్లో సానుభూతి కోసం జనసేన మహిళా కార్యకర్తలు చేసిన ఓవరాక్షన్ బెడిసికొట్టింది. ఈ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేతలు తమపై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలో ఓ మహిళ రెండో మహిళను ‘ఊ.. స్టార్ట్ చెయ్యి.. మొదలుపెట్టు’ అనగా ఆమె ఒక్కసారిగా బోరుమంటూ ఆ మహిళ భుజాలపై వాలిపోయి ఏడవడం కనిపించింది. వెంటనే మిగిలిన మహిళలు అందుకుని ముందుగా సిద్ధం చేసుకున్న కథనాన్ని చదివేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని విమర్శించాలని, వైఎస్సార్సీపీపై బురదజల్లాలనే ఉద్దేశంతో ఆ మహిళలు తయారు చేసుకున్న వీడియోలో ఆరంభంలో ఉన్న ఆ రెండు పదాలు కూడా రికార్డయ్యాయి. ఇప్పుడు ఆ వీడియాలో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ పథకం ప్రకారం వీడియోలు తీసి, వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయాలన్న జనసేన నేతల దురాలోచన బట్టబయలైంది. ఈ వీడియోలో ఉన్న మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తపై తోటి జనసేన కార్యకర్తలతో కలిసి దాడి చేసి కొట్టిన వీడియో కూడా బయటకు వచ్చింది. అది జరిగిన 48 గంటల తర్వాత మంగళవారం సదరు మహిళ చేతికి కట్టు కట్టుకుని పవన్ కల్యాణ్ వద్దకు వచ్చి తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించడం, ఆయన పరామర్శించడాన్ని చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. -
మధులికపై జరిగిన దాడిని ఖండించిన మహిళా సంఘాలు
-
మిస్ వైజాగ్ ఫైనల్‌కి మహిళా సంఘాల సెగ
-
మిస్ వైజాగ్ ఫైనల్‌కి మహిళా సంఘాల సెగ
-
వైజాగ్ అందాలపై ఆందోళన
సాక్షి, విశాఖపట్నం : మిస్ వైజాగ్ అందాల పోటీల వివాదం తారాస్థాయికి చేరుకుంది. నేటి సాయంత్రం ఫైనల్స్ ఉన్న నేపథ్యంలో పోటీలను అడ్డుకునేందుకు మహిళా, ప్రజా సంఘాలు ఆందోళనను ఉధృతం చేశాయి. ఈ ఏడాదికి గానూ నిర్వాహకులు 26 మంది యువతులను ఎంపిక చేశారు. ఆదివారం సాయంత్రం గ్రాండ్ ఫైనల్స్ పోటీ నిర్వహించబోతున్నారు. దీనికి మంత్రి గంటా శ్రీనివాస రావు హాజరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు గంటాను కలిసి పోటీలను రద్దు చేయాలని వినతి పత్రం సమర్పించారు. అంతేకాదు పోటీలకు వెళ్లొద్దంటూ ఆయనకు విజ్ఞప్తి చేశారు. అయితే మంత్రి మాత్రం అధికారులతో మాట్లాడి నిర్ణయం చెబుతాననటం గమనార్హం. మిస్ వైజాగ్ పోటీలపై ప్రారంభం నుంచే వివాదాలు నెలకొన్నాయి. పోటీల ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో కూడా జన జాగరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు తమ ఫిర్యాదు స్వీకరించినప్పటికీ.. ఎలాంటి స్పందన లేకుండా పోయిందని మహిళా సంఘాలు వాపోతున్నాయి. అత్యాచారాలు జరిగినపుడు నిందితులను చర్యలు తీసుకోలేని ప్రభుత్వాలు, మహిళలపై నిరంకుశ విధానాలను మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన మంత్రి ఆధ్వర్యంలోనే అందాల పోటీలను నిర్వహించడం సిగ్గుచేటని వారంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్వహణను అడ్డుకుని తీరతామని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటంతో పోలీసులు అప్రమత్తమవుతున్నట్లు సమాచారం. -
లేచింది పురుషలోకం...దద్దరిల్లలేదు మహిళా ప్రపంచం!
చరిత్రలో... స్త్రీ వాదులు చీటికి మాటికి ‘ఇది పితృస్వామ్యవ్యవస్థ’ అని కళ్లెర్ర చేస్తారుగానీ, మేఘాలయలోని ఖాసి తెగ వారిలో మాత్రం ‘మాతృస్వామ్య వ్యవస్థ’ ఇప్పటికీ పదిలంగానే ఉంది. పిల్లలు తల్లి పేరును ఇంటిపేరుగా పెట్టుకుంటారు. పెళ్లి తరువాత అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది... ఇలా ఎన్నో ఉన్నాయి. పై పాట ఇక్కడ వర్కవుట్ కాకపోవచ్చుగానీ, మేఘాలయ వెళ్లి పాడితే మాత్రం కాస్తో కూస్తో ఉపయోగం ఉంటుంది. స్త్రీ వాదులు చీటికి మాటికి ‘ఇది పితృస్వామ్యవ్యవస్థ’ అని కళ్లెర్ర చేస్తారుగానీ, మేఘాలయలోని ఖాసి తెగ వారిలో మాత్రం ‘మాతృస్వామ్య వ్యవస్థ’ ఇప్పటికీ పదిలంగానే ఉంది. పిల్లలు తల్లి పేరును ఇంటిపేరుగా పెట్టుకుంటారు. పెళ్లి తరువాత అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది...ఇలా ఎన్నో ఉన్నాయి. ‘‘ప్రపంచం మొత్తం మగవాడి మాట చెల్లుబాటు అవుతుంటే మనమేమిటి? ఎక్కడ ఉన్నాం?’’ అన్నాడో ఖాసి తెగ పెద్దమనిషి. భార్య చేతిలో తాను ఎన్ని అవమానాలకు గురి అవుతున్నాడో పూస గుచ్చినట్లు చెబుతూ ఒకడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే మిత్రుడిలో ఇంత విషాదం ఉందా? అని కరిగి కన్నీరైపోయాడు పక్కవాడు. మరొకడు తన అత్త చేసే పెద్దపెద్ద దౌర్జన్యాల గురించి, చాలా చిన్న గొంతుతో చెప్పాడు. ప్రతి ఖాసి మగాడు ఏదో ఒక సమస్య చెబుతూనే ఉన్నాడు. ఇలా అయితే కుదరదనుకొని ఉద్యమం చేయాలనుకున్నారు. దానికి ‘పురుషుల విముక్తి ఉద్యమం’ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఏప్రిల్ నెల ఎండల్లో 1990వ సంవత్సరంలో ఖాసి తెగ పురుష లోకం తమ హక్కుల కోసం లేచింది. ఎండలతో సమానంగా వేడివేడిగా నినాదాలు ఇచ్చింది. అయితే వీరి ఉద్యమం చూసి ఏ ఒక్క మహిళా దద్దరిల్లలేదు. పై పెచ్చు కొందరు ఉద్యమకారులను మహిళలు చావబాదారు కూడా! నిజానికి కోసి తెగలో ఇలాంటి ఉద్యమాలు కొత్తేమీ కాదు. 1960లో కూడా ‘పురుష విముక్తి ఉద్యమం’ ఒకటి ఉవ్వెత్తున లేచింది. అప్పట్లో విషయం మరీ సీరియస్. మహిళలు ఏకంగా కత్తులతోనే దాడి చేశారు. కొందరు చనిపోయారు కూడా. రకరకాల కారణాల వల్ల ఖాసి పురుషుల విముక్తి ఉద్యమం ఇప్పుడు వెనక్కి తగ్గింది.