women conductor
-
ఉప్పల్ డిపో ఎదుట ఉద్రిక్తత
ఉప్పల్ ఆర్టీసీ డిపో ఎదుట ఉద్రిక్త పరిస్థితి నె లకొంది. అకారణంగా ఓ మహిళా కండాక్టరును బదిలీ చేశారని తోటి కార్మికులంతా ధర్నాకు దిగారు. దీంతో డిపోకు చెందిన సుమారు 70 బస్సులు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని నిరసనకారులను సర్దిచెప్పేందుకు యత్నిస్తున్నారు. ఈక్రమంలో అధికారులకు నిరసన కారులకు మధ్య వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్ మృతి
జంగారెడ్డి గూడెం: పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ సమీపంలో బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. శుక్రవారం ఉదయం పట్టిసీమ ఎల్ఎన్డీ కాలనీలో ఆర్టీసీ అధికారులు జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమకు వెళుతున్న బస్సును ఆపి తనిఖీ చేయగా జారీ చేసిన టికెట్ల కంటే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో కండక్టర్ పద్మావతి సరిగా విధులు నిర్వర్తించడం లేదంటూ రిమార్క్ రాశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె బస్సులోంచి దూకగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసింది.