మహిళా హోంగార్డు హల్చల్
కరీంనగర్ రామగుండం ఎన్టీపీసీలో మహిళా హోంగార్డు హల్చల్ చేసింది. భవనం పైకి ఎక్కి దూకుతానని బెదిరించడంతో స్థానికంగా కలకలం రేగింది. స్థానికంగా నివాసముంటున్న మామిడి పద్మ హోంగార్డుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ చిట్ లో తన చిట్టికి సంబంధిచి గడువు ముగిసినా డబ్బు చెల్లించడం లేదని.. మనస్తాపానికి గురై చిట్ఫండ్ భవనం పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెను కిందకు దించేందుకు యత్నిస్తున్నారు.