Women Sessions Judge
-
’జడ్జిమెంట్ సరైనదే అని భావిస్తున్నా’
-
అది మా అమ్మ చివరి కోరిక: నాగవైష్ణవి అన్న
సాక్షి, విజయవాడ : ఎనిమిది సంవత్సరాల క్రితం 2010లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తీర్పు వెలువడింది. సుదీర్ఘ విచారణ అనంతరం విజయవాడ మహిళా సెషన్స్ జడ్జి ఈ కేసులో ముగ్గురు నిందితులకు జీవితఖైదు ఖరారు చేస్తూ తుది తీర్పు ఇచ్చారు. 79 మందిని విచారించిన న్యాయస్థానం, వెంటకరావు గౌడ్‌ను ప్రధాన దోషిగా నిర్ధారిస్తూ తీర్పువెలువరించింది. కోర్టు తీర్పుపై నాగవైష్ణవి సోదరుడు హరీష్ స్పందించారు. నాగవైష్ణవి కేసులో జడ్జిమెంట్ కరెక్ట్‌గా వచ్చిందని భావిస్తున్నానని అన్నారు. తాను ఎప్పుడు లైఫ్ అండ్ టిల్ డెత్ అనే తీర్పు వినలేదని చెప్పాడు. తీర్పు లేటుగా వచ్చిందని, రెండేళ్ళ క్రితం తీర్పు వచ్చి ఉంటే ఈ కేసు కోసం పోరాడిన తన తల్లి, బాబాయ్‌తో పాటు ఎంతో మంది సంతోషించేవారని పేర్కొన్నారు. ఇక మీదట మరొకరు ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా తీర్పు వచ్చిందన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని మా అమ్మ కోరుకునేదని హరీష్ కన్నీరు మున్నీరయ్యారు. నాగవైష్ణవి హత్య కేసులో వెలువడిన తీర్పు -
నాగవైష్ణవి హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు
-
నాగవైష్ణవి హత్య కేసులో వెలువడిన తీర్పు
సాక్షి, విజయవాడ : ఎనిమిదేళ్ల క్రితం 2010లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం విజయవాడ మహిళా సెషన్స్ జడ్జి ఈ కేసులో తుది తీర్పు ప్రకటించారు. గురువారం నిందితులకు శిక్ష ఖరారు చేసే ముందు ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు. 79 మందిని విచారించిన న్యాయస్థానం, వెంటకరావు గౌడ్‌ను ప్రధాన దోషిగా నిర్ధారిస్తూ తుది తీర్పును వెలువరించింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు అనిపించేలా ఈ తీర్పు ఉందని ప్రజలు భావిస్తున్నారు. వైష్ణవి హత్య నేపథ్యం : విజయవాడకు చెందిన బీసీ నాయకుడు పలగాని ప్రభాకర్ కుమార్తె నాగవైష్ణవి 2010 జనవరి 30న కారులో పాఠశాలకు వెళుతుండగా దుండగులు అడ్డగించి డ్రైవరును హతమార్చి వైష్ణవిని కిడ్నాప్ చేశారు. రెండు రోజుల పాటు తీవ్ర గాలింపుల అనంతరం, గుంటూరు శివార్లలోని ఆటోనగర్‌లోని ప్లాట్ నెంబరు 445లో చిన్నారి శవం లభ్యమైంది. అభం శుభం తెలియని చిన్నారిని వేధింపులకు గురిచేసి, అనంతరం బాయిలర్‌లో వేసి బాలికను కాల్చి చంపినట్లులో పోలీసులు గుర్తించారు. ప్రభాకర్‌పై కోపంతో ఆయన మొదటి భార్య వెంకటేశ్వర్వమ్మ తమ్ముడు పంది వెంకట్రావు ఈ హత్యకు కట్ర పన్నిట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా మెర్ల శ్రీనివాసరావు, ఏ2గా వెంపరాల జగదీష్, ఏ3గా పంది వెంకట్రావు అలియాస్ కృష్ణ ఏడేళ్లుగా జైలులో రిమాండ్‌లోనే ఉన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండానే కేసు విచారణ పూర్తి చేశారు. వారిపై ఐపీసీ 302, 367, 420, 201, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. వైష్ణవి హత్య వార్త తెలియడంతో బాలిక కుటుంబం షాక్‌కు గురైంది. తన గారాలపట్టి హత్యకు గురైందన్న విషయం తెలసుకొని ప్రభాకర్ పుత్రికా శోకంతో కన్నుమూశారు. దాంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆస్తి కోసం సొంతవారే చిన్నారిని దారుణంగా హతమార్చడంపై ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. నిందితలను కఠింగా శిక్షించాలంటూ ఆందోళనలు చేశారు. -
నాగవైష్ణవి హత్య కేసు నేడు తుది తీర్పు
-
నాగవైష్ణవి హత్య కేసు నేడు తుది తీర్పు
విజయవాడ: ఎనిమిదేళ్ల క్రితం 2010లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నాగవైష్ణవి హత్య కేసులో నేడు తీర్పు వెలువడనుంది. విజయవాడలో మహిళా సెషన్స్ జడ్జి గురువారం ఈ కేసులో తుది తీర్పు ఇవ్వనున్నారు. కోర్టు వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు అందాయి. విజయవాడకు చెం దిన బీసీ నాయకుడు పలగాని ప్రభాకర్ కుమార్తె నాగవైష్ణవి 2010 జనవరి 30న దారుణ హత్యకు గురైంది. హత్య జరిగే నాటికి ఆమె వయస్సు పదేళ్లు. పల్లగాని ప్రభాకర్‌పై కోపంతో ఆయన కుమార్తె వైష్ణవి స్కూల్‌కు వెళ్తుండగా నిందితులు బలవంతంగా గుంటూరు తీసుకువెళ్లి ఇనుము కరగబెట్టే నిప్పుల కొలిమిలో ఆమెను పడేసి కాల్చేశారు. నాగవైష్ణవి హ్యతకు గురికాగానే పుత్రికాశోఖంతో పల్లగాని ప్రభాకర్ కన్నుమూశారు. దాంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా మెర్ల శ్రీనివాసరావు, ఏ2గా వెంపరాల జగదీష్, ఏ3గా పంది వెంకట్రావు అలియాస్ కృష్ణ ఏడేళ్లుగా జైలులో రిమాండ్‌లోనే ఉన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండానే కేసు విచారణ పూర్తి చేశారు. పల్లగాని ప్రభాకర్ మొదటి భార్య వెంకటేశ్వర్వమ్మ తమ్ముడు పంది వెంకట్రావు ఈ కేసులో ఏ3గా ఉన్నారు. నిందితులపై పోలీసులు ఐపీసీ 302, 307, 364, 201,427, 379, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. -
ఐటమ్‌సాంగ్‌కు డ్యాన్స్ చేయమన్నారు
మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిపై మహిళా న్యాయమూర్తి ఆరోపణలు లైంగిక వేధింపులపై సీజేఐకి లేఖ రాసిన మహిళా న్యాయమూర్తి ఆరోపణలను ఖండించిన హైకోర్టు న్యాయమూర్తి నిజమని తేలితే మరణశిక్షకైనా సిద్ధమని సీజేఐకి లేఖ భోపాల్: అత్యున్నతమైన న్యాయవ్యవస్థను లైంగిక వేధింపుల ఆరోపణలు ఓ కుదుపు కుదిపాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తనను లైంగిక వేధింపులకు గురిచేశారని గ్వాలియర్‌లోని మహిళా అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి సంచలన ఆరోపణలు చేశారు. తనను ఐటమ్‌సాంగ్‌కు డ్యాన్స్ చేయమన్నారని, జడ్జి వేధింపులు భరించలేక తాను రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఆర్ఎం లోథాకు 9 పేజీల లేఖ రాశారు. అయితే మహిళా న్యాయమూర్తి ఆరోపణలను సదరు హైకోర్టు జడ్జి తోసిపుచ్చారు. తనపై ఆరోపణలు రుజువైతే మరణ శిక్షను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్లో ఓ న్యాయాధికారి భార్యతో ఫోన్ చేయించి ఓ పెళ్లి వేడుకలో తాను ఓ ఐటమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేయాలని జడ్జి చెప్పించారని, అయితే అందుకు నిరాకరించానని మహిళా న్యాయమూర్తి సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు జడ్జి ఆదేశాలపై ముగ్గురు న్యాయాధికారులూ తనను వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. తనపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తప్పుడు నివేదికలు సమర్పించారని, అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకునే దానినని పేర్కొన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా తనను గత నెలలో గిరిజన ప్రాంతానికి బదిలీ చేయించారని పేర్కొన్నారు. బదిలీపై హైకోర్టు జడ్జితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. తన కోరిక తీర్చకపోవడం వల్ల, ఒంటరిగా తన బంగళాకు రాకపోవడం వల్లే బదిలీ చేసినట్టు చెప్పారని ఆరోపించారు. బదిలీకి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి అపాయింట్మెంట్ కోరితే నిరాకరించారని, గత్యంతరం లేక ఆత్మాభిమానాన్ని, కుమార్తె కెరీర్‌ను కాపాడుకునేందుకు జూలై 15న రాజీనామా చేసినట్టు చెప్పారు. సీబీఐ విచారణకైనా సిద్ధం: హైకోర్టు జడ్జి ఈ ఆరోపణలను ఖండిస్తూ హైకోర్టు న్యాయమూర్తి మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్కులేఖ రాశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని, సీబీఐతో విచారణ చేయించవచ్చన్నారు. మహిళా జడ్జి మాత్రమే కాదు, ఏ మహిళనైనా తాను లైంగికంగా వేధించినట్టు, దూషించినట్టు రుజువైతే మరణశిక్షకూ సిద్ధమని చెప్పారు. ఈ లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐకి పంపారు. ఇది తీవ్రమైన అంశం.. సీజేఐ ఈ ఆరోపణల అంశం తీవ్రమైనదని, తగిన రీతిలో వ్యవహరిస్తామని సీజేఐ లోథా చెప్పారు. ఈ అంశం ఇంకా తన వద్దకు రాలేదని, అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. మరోవైపు మహిళా జడ్జి రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. బదిలీకి సంబంధించి జడ్జి అభ్యర్థనలను నిరాకరించామని, లైంగిక వేధింపులకు సంబంధించి ఆమె ఫిర్యాదు చేయలేదని తెలిపింది. కాగా, మహిళా జడ్జిపై వేధింపులకు పాల్పడిన న్యాయమూర్తిని తక్షణం విధుల నుంచి తప్పించాలని, మహిళా న్యాయమూర్తిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. మరోవైపు మహిళా జడ్జి ఆరోపణలకు సంబంధించి హైకోర్టు జడ్జిపై ఎఫ్ఐఆర్ నమోదు, న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.