women victims
-
పరిహారం కోసం సీఎం ఇంటికి పాదయాత్ర..
యశవంతపుర: గర్భకోశం తొలగించిన మహిళలకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సాయం వైద్యుల అలసత్వం వల్ల ఖజానాకు తిరిగి వెళ్లిపోయింది. ఈ మహిళలకు సాయం చేయాలని హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా ఆస్పత్రికి భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. గర్భకోశం తొలగించుకున్నవారికి ఆస్పత్రిలోనే చెక్కు రూపంలో అందించాలి. కానీ వైద్యులు ఎవరికీ ఆర్థిక సాయాన్ని అందించలేదు. నిధులను వాడుకోకపోవడంతో సర్కారుకి తిరిగివెళ్లాయి. దీంతో బాధిత మహిళలు శిగ్గావిలోని సీఎం బసవరాజ్ బొమ్మై ఇంటికి పాదయాత్రగా బయల్దేరారు. 8 ఏళ్ల నుంచి 1522 మంది మహిళలకు గర్భకోశం తొలగించారు. వారందరికీ మొండిచెయ్యి చూపారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్ శాంతపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. (చదవండి: పెళ్లి చేసుకున్న టీవీ నటి రష్మీ, ఫొటోలు వైరల్) -
ప్రత్యేక టీం: మహిళలను వేధిస్తే ఇక తాట తీసుడే..
హైదరాబాద్: మహిళలపై వేధింపులు, ఎన్నారైల సమస్యలపై కృషి చేస్తున్న విమెన్ సేఫ్టీ వింగ్ మరో ముందడుగు వేసింది. గృహహింస, వరకట్న వేధింపుల్లో చిక్కుకున్న మహిళల కోసం విమెన్ విక్టిమ్స్ కాల్ సెంటర్ను త్వరలో ఏర్పాటు చేయనుంది. లక్డీకాపూల్లోని విమెన్ సేఫ్టీ వింగ్లో డొమెస్టిక్ వయొలెన్స్(డీవీసీ) కాల్ సెంటర్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అడిషనల్ డీజీ స్వాతిలక్రా ఆధ్వర్యంలో డీఐజీ సుమతి కాల్సెంటర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 200 మంది సిబ్బందితో జూలై మొదటి వారంలో కాల్సెంటర్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడుభాషల్లో టెలీకాలర్స్: లాక్డౌన్ కాలంలో గృహహింస కేసులు పెరిగిపోయాయి. ఏప్రిల్, మే నెలలో 14 వేలకుపైగా గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీనెల 1,800–2,000 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఈ కేసుల్లో బాధితులుగా ఉన్న వారికి విమెన్ విక్టిమ్ కాల్ సెంటర్ నుంచి కాల్ చేస్తారు. కేసు పురోగతి ఎలా ఉంది? దర్యాప్తు అధికారి (ఐవో) ఎలా వ్యవహరిస్తున్నారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? తదితర విషయాలు కాల్ చేసి తెలుసుకుంటారు. తెలంగాణలో అనేక భాషల వారు నివసిస్తున్న నేపథ్యంలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో టెలీకాలర్స్ను నియమించనున్నారు. ఐవో, బాధితులతో మాట్లాడి, డైలీ సిచ్యుయేషన్ రిపోర్ట్ (డీఎస్ఆర్)ను ఏరోజుకారోజు నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్, కౌన్సెలింగ్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను గుర్తిస్తారు. -
చందన.. వంచన..
మలికిపురం(రాజోలు): కేశనపల్లి సిండికేట్ బ్యాంకులో మహిళల పేర్లు, వేర్వేరు ఫొటోలతో వేరొకరికి రుణాలిచ్చేసిన లీలలు చోటు చేసుకున్నాయి. రుణాల రికవరీ కోసం బ్యాంకు అధికారులు ఇచ్చిన నోటీసులతో ఈ వ్యవహారం బయటపడింది. ఏడాదిగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని అటు బ్యాంకు అధికారులు, ఇటు డీఆర్డీఏ అధికారులు పెద్దల మధ్య తేల్చే పనిలో ఉన్నారు. మరోవైపు బ్యాంకుల నుంచి చెల్లించాలని ఒత్తిడి వస్తుండడంతో బాధిత మహిళలు బుధవారం రోడ్డెక్కారు. దీనిపై ఇప్పటికే బాధితులు మలికిపురం గ్రీవెన్స్ సెల్లో తూర్పుపాలెం గ్రామ సీఫ్ నల్లి చందన కుమారిపై ఫిర్యాదు కూడా చేశారు. మహిళలు బుధవారం మలికిపురం స్త్రీ శక్తి భవనాన్ని ముట్టడించారు. ఈ అవినీతి వ్యవహారం వెనుక ఒక బ్యాంకు ఉన్నతాధికారి హస్తం కూడా ఉన్నట్టు స్పష్టమవుతోంది. మలికిపురం మండలంలోని తూర్పుపాలెం గ్రామానికి చెందిన పలు డాక్రా సంఘాల మహిళలు సమీప గ్రామం కేశనపల్లి సిండికేట్ బ్యాంకులో రుణాలు పొందారు. అదే మహిళలకు మరలా రుణాలు వస్తాయని చెప్పిన గ్రామ సీఎఫ్ చందన కుమారి వారి నుంచి సంతకాలు, ఫొటోలు తీసుకుంది. ఇలా వేర్వేరు గ్రూపుల నుంచి కొందరిని ఎన్నుకుని కొత్త గ్రూపులను సృష్టించింది. కొన్నాళ్లకు రుణాలు రాలేదు సరి కదా బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. బ్యాంకులకు వెళ్లిన ఆ మహిళలకు షాక్ తగిలింది. ఒక్కొక్క మహిళ పేరున రూ.45 వేల రుణాలు ఉన్నాయని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో వ్యవహారం బ్యాంకు ఉన్నతాధికారులకు, డీఆర్డీఓ అధికారులకు తెలిసింది. మహిళల ఫిర్యాదుతో విచారణ చేసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. సీఎఫ్ చందన పలు గ్రూపుల పేరుతో రూ.12 లక్షలకు పైగా నగదు తీసుకుని తన సొంత అవసరాలకు వినియోగించుకున్నట్టు తెలిసింది. అలాగే స్త్రీ నిధి కూడా రూ.2.15 లక్షలను మహిళల పేరుతో సీఎఫ్ తీసుకుని వాడుకున్నట్టు డీఆర్డీఎ అధికారులు గుర్తించారు. సుమారు మూడేళ్ల క్రితం ఈ రుణాలు తీసినట్టు తెలుస్తోంది. ఓ బ్యాంకు అధికారి అండతో సీఎఫ్ ఈ రుణాలను తీసుకున్నట్టు స్పష్టమైంది. ఆ బ్యాంకు అధికారి బదిలీ కావడంతో రుణాల రికవరీ కోసం ప్రస్తుత అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఆందోళన చేస్తున్న మహిళలతో డీఆర్డీఎ ఏపీఎం ప్రభుదాసు చర్చలు జరిపారు. ఆందోళనలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సీహెచ్ రమణి, రాజోలు డివిజన్ అధ్యక్షురాలు కందికట్ల గిరిజ, వ్యవసాయకార్మిక సంఘం నాయకులు చెవ్వాకుల సూర్య ప్రకాశరావు, కందికట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. తమ ఉపాధి కూలీ డబ్బులను బ్యాంకుల్లో జమ చేసుకుంటున్నారని తూర్పుపాలెం దయ గ్రూపు సభ్యురాలు ఆకుమర్తి దుర్గా భవాని, మరియమ్మ గ్రూపు సభ్యురాలు చేట్ల పైడమ్మ వాపోతున్నారు. విచారణ చేశాం తూర్పుపాలెం సీఎఫ్ ఎన్.చందన కుమారిపై విచారణ చేశాం. రూ.12 లక్షల బ్యాంకు రుణాలు, మరో రూ.2 లక్షల స్త్రీ నిధులను మహిళల పేరుతో స్వాహా చేసినట్టు తేలింది. ఆమెను తొలగించాం, రికవరీకి ప్రయత్నిస్తున్నాం. పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించాం. – జి.ప్రభుదాసు, ఏపీఎం, డీఆర్డీఏ -
పరిచయస్తులతోనే మహిళలకు ముప్పు
రోజూ దేశంలో ఎక్కడో ఒకచోట లైంగిక దాడి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే ఇరుగుపొరుగు వాళ్లు, పరిచయస్తులే మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2015లో లైంగికదాడి బాధితులు చేసిన ఫిర్యాదుల్లో 50 శాతమందికి పైగా నిందితుల్లో ఇరుగుపొరుగువారే ఉన్నారు. ఇక గతేడాది నమోదైన మొత్తం లైంగిక దాడి కేసుల్లో 95 శాతం మంది నిందితులు పరిచయస్తులే కావడం విస్తుగొలిపే విషయం. దేశ రాజధాని ఢిల్లీ సహా హిమచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, చండీగఢ్ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మహిళలకు కుటుంబ సభ్యుల నుంచే రక్షణ లేకుండా పోతోంది. ఇంట్లో మామ, తండ్రి, ఇతర మగవాళ్ల వేధింపులకు బలైన మహిళలు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని ఓ మహిళా కార్యకర్త చెప్పారు. ఇక యుక్తవయసులో ఉన్న మహిళలకు లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో తెలియడం లేదని డీపీఎస్ బొకరా డైరెక్టర్ హేమలతా ఎస్ మోహన్ తెలిపారు. 'కుటుంబ సభ్యులు ఇలాంటి విషయాల్లో పిల్లలకు చైతన్యం కలిగించడం లేదు. స్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది' అని హేమలత చెప్పారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో తండ్రి నుంచే అక్కాచెల్లెల్లకు వందలసార్లు వేధింపులు ఎదురయ్యాయి. ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని తల్లి కూతుళ్లను వారించింది. చివరకు మహిళా కమిషన్ చొరవతో ఈ విషయం వెలుగుచూసింది. -
'దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వస్తామనుకోలేదు'
-
'దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వస్తామనుకోలేదు'
హైదరాబాద్:దుబాయ్ లో ఉద్యోగాల పేరుతో మోసపోయిన తాము తిరిగి హైదరాబాద్ కు వస్తామనుకోలేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగాలు ఆశచూపి ఓ బ్రోకర్ దుబాయ్ షేక్ లకు అమ్మేశాడని ఆ మహిళలు తెలిపారు. నగరానికి చేరుకున్నఆ ఇద్దరు మహిళలు అక్కడ మానసికంగా చాలా చిత్రహింసలకు గురైనట్లు స్పష్టం చేశారు. కనీసం తమను నమాజ్ చేసుకోవడానికి కూడా అనుమతించేవారు కాదని తెలిపారు. ఆ షేక్ ల వలలో చిక్కుకున్న తాము మళ్లీ ఇక్కడకు వస్తామనుకోలేదన్నారు. తమను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారని వారు మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసుల ఒత్తిడి కారణంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో దుబాయ్ షేక్ లు ఆ బాధిత మహిళల్ని విడిచిపెట్టడంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం నిందితుడున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విషయంలో అవసరమైతే సీఐడీతో దర్యాప్తు చేపడతామని వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.