womens arrest
-
డబుల్ వీసాలు.. ఏజెంట్ల మోసాలు
44 women Flying To Kuwait Were Caught At RGI : ఏజెంట్లు తప్పుదారి పట్టించడంతో రెండు వీసాలతో కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వారిని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళలు మంగళవారం తెల్లవారుజామున కువైట్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో మహిళలు ముందుగా విజిట్ వీసాలు చూపించారు. కువైట్‌కు ఎందుకు వెళ్తున్నారని అధికారులు ప్రశ్నించ గా కొందరు ఉపాధి నిమిత్తం వెళ్తున్నట్టు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు వారి వద్ద ఉన్న అన్ని పత్రాలను పరిశీలించారు. మహిళలందరి వద్ద విజిట్ వీసాలతో పాటు వర్క్ వీసాలు కూడా లభ్యమయ్యాయి. ఏజెంట్ల సాయంతో బయల్దేరి న మహిళలకు రెండు వీసాలతో వెళ్లడం నేర మని కూడా తెలియదు. ఉపాధి దొరుకుతుందన్న ఆశతో ఏజెంట్లు సమకూర్చిన రెండు వీసాలతో కువైట్‌కు బయల్దేరారు. వారంతా ఉపాధి నిమిత్తం వెళ్తున్న వారిగా నిర్ధారించుకున్న అధికారులు ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించగా దర్యాప్తు ప్రారంభించారు. వారికి తెలియకుండా.. మూడు రాష్ట్రాలకు చెందిన మహిళలందరు కూడా ఒకే విమానంలో కువైట్‌కు వెళ్లేందుకు వచ్చారు. వీరంతా ఆయా ప్రాంతాల సబ్‌ఏజెంట్లతో పాటు ప్రధాన ఏజెంట్లకు అనుసం ధానంగా వీసాలు పొందినట్లు పోలీసుల ద ర్యాప్తులో తేలింది. ప్రధాన ఏజెంట్ ముంబై కి చెందినట్టు గుర్తించారని సమాచారం. గతంలో కూడా సదరు ఏజెంట్ ద్వారా వెళ్లిన మహిళలు ఇదే తరహా మోసానికి గురయ్యా రు. ఒక్కొక్కరు సుమారు రెండు నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. వీసాల్లో ఉన్న పొరపాట్లను మహిళలకు తెలియకుండానే ఏజెంట్లు ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. విజిట్ వీసాను ఇక్కడ బయలుదేరే సమ యంలో చూపించాలని, వర్క్ వీసాలను కు వైట్‌లో చూపించాలని మహిళలకు ఏజెంట్లు చెప్పినట్లు సమాచారం. మహిళల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల వారున్నారు. రెండు వీసాలు ఎందుకు..? పదో తరగతి కన్నా తక్కువ విద్యార్హత కలిగిన వారు కొన్ని దేశాల్లో ఉపాధి నిమిత్తం వెళ్లడానికి ఇమిగ్రేషన్ చట్టం 1983 ప్రకారం ఈసీఆర్ (ఇమిగ్రేషన్ చెకింగ్ రిక్వైర్డ్)లో భాగంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ పత్రాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయకుండానే కార్మికులను పెద్ద ఎత్తున ఏజెంట్లు తరలిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వర్కింగ్ వీసాలను వాడుకునేందుకు వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏజెంట్లపై కేసు ఉపాధి నిమిత్తం వెళ్తున్న మహిళలకు ఏజెంట్లు విజిట్ వీసాలు జారీ చేశారు. వర్కింగ్ వీసాలకు ఈసీ ఆర్ లేకుండా వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే వారికి విజిట్ వీసాలతో పాటు వర్కింగ్ వీసాలు అందజేశారు. ఏజెంట్లపైనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మహిళలను బాధితులుగానే పరిగణిస్తున్నాం. – విజయ్‌కుమార్, సీఐ, ఆర్జీఐఏ అయోమయంగా ఉంది.. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఉపా ధి నిమిత్తం కువైట్ వెళ్లడానికి వచ్చాం.. మా వద్ద రెండు వీసాలున్నాయని అధికారులు నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌కు పంపారు. గతంలో లాక్డౌన్లో కూడా వీసాలు రద్దయ్యాయి. ఇప్పుడేమో ఇలా.. అంతా అయోమయంగా ఉంది. – బాధిత మహిళ -
బస్‌లో ప్రయాణించే మహిళలే వీరి టార్గెట్
సాక్షి, మిర్యాలగూడ : బస్టాండ్‌లో బస్సు ఎక్కే మహిళల దృష్టిని మరల్చి బంగారం, నగదును అపహరించే ముగ్గురు మహిళా దొంగల ముఠా సభ్యులను వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సస్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సదానాగరాజు కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన దనుగుల కవిత, కోదాడ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన సంపంగి సైదమ్మ, సంపంగి తిరుపతమ్మలు ముఠాగా ఏర్పడ్డారు. బస్టాండ్‌లో బస్సు ఎక్కే మహిళల హాండ్‌బ్యాగ్‌లు, పర్సులు, దొంగలిస్తారని తెలిపారు. ప్రధానంగా నల్లగొండ, మిర్యాలగూడ బస్టాండ్‌లో రద్దీగా ఉండే బస్సులను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలి పారు. ఇదే క్రమంలో 2017లో మిర్యాలగూడ బస్టాండ్‌లో, 2019 ఫిబ్రవరిలో డాక్టర్స్ కాలనీలో ఒక మహిలతో మాటలు కలిపి ఆమె వద్ద ఉన్న చేతి సంచిలోంచి రూ.50వేల నగదు, ఇదే ఏడాదిలో మార్చిలో బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న మహిల నుంచి బంగారు ఆభరణాలు అపహరించారని తెలిపారు. అదే విధంగా నల్లగొండ, హాలియా, సాగర్ బస్టాప్ వద్ద మహిళలు బస్సు ఎక్కుతుండగా పర్సు కొట్టేశారని తెలిపారు. మిర్యాలగూడలో దొంగిలించిన బంగారు ఆబరణాలను విక్రయించేందుకు వెళుతున్న క్రమంలో పట్టణంలోని గణేష్ మార్కెట్ వద్ద తనిఖీల్లో పట్టుకున్నామని తెలిపారు. వీరి వద్ద నుంచి 6.5 తులాల బంగారం, రూ.15వేల నగదు ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. మహిళా దొంగలను అరెస్టు చేయడంలో సహకరించిన ఎస్ఐ.రజిననీకర్, కుర్మయ్య, కానిస్టేబుల్ రవి, హోంగార్డు కిరణ్‌కుమార్‌లను అభినందించారు. -
విజయవాడలో ఉద్రిక్తత.. మహిళల అరెస్ట్
-
‘ఛలో విజయవాడ కార్యక్రమం’లో ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ : విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, మహిళా కార్మికుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్న మహిళలను పోలీసులు బలవంతగా అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మధ్యాహ్య భోజన కార్మికులు విజయవాడకు తరలివస్తున్నారు. -
ఇద్దరు మోసగత్తెల అరెస్ట్
నెల్లూరు(మినీబైపాస్): తక్కువ ధరకు బంగారం ఇస్తామని అని చెప్పి రోల్డ్‌గోల్డ్ అంటగంటే ఇద్దరు మహిళలను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీసీఎస్, రెండోనగర్ ఎస్సైలు షరీఫ్, శ్రీహరిబాబు బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బోగోలు మండలం కోవూరుపల్లికి చెందిన బచ్చు కోటీశ్వరమ్మ, కర్రెద్దుల దుర్గమ్మ తల్లికూతుళ్లు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద కోవూరు మండలం వేగురుకు చెందిన దామెర్ల వజ్రమ్మ, పడుగుపాడుకు చెందిన సిరం రమణమ్మ, రావూరుకు చెందిన చెముడుగుంట రచనలకు తల్లి కూతుళ్లు తక్కువ ధరకు బంగారం ఇస్తామని ఆశ చూపి పిచ్చి నగలు చేతిలో పెట్టారు. పోలీసులు వస్తున్నారని భయపెట్టి వీరి వద్ద నుంచి రూ.3 లక్షలు తీసుకుని ఉడాయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. సీసీఎస్ డీఎస్పీ ఎం.బాలసుందరరావు ఆధ్వర్యంలో సీఐ బాజీజాన్‌సైదా, ఎస్సై షరీఫ్, ‡రెండో నగర ఎస్సై వి.శ్రీహరిబాబు తమ సిబ్బందితో నిందితులు బుధవారం ఉదయం తూర్పు రైల్వేస్టేషన్ వద్ద ఉన్నారన్న సమాచారంతో వెళ్లి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
చోరీ ముఠాల అరెస్టు
♦ 43 మోటారు సైకిళ్లు ♦ 136గ్రాముల బంగారు నగలు ♦ రూ.20వేల నగదు స్వాధీనం విజయవాడ సిటీ : పోలీసు కమిషనరేట్‌లో చోరీలకు పాల్పడుతున్న పలు ముఠాలను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో మోటారు సైకిళ్లు, నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను శుక్రవారం కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ఎల్.కాళిదాస్ అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావుతో కలిసి వివరించారు. రెండు ముఠాల అరెస్టు వేర్వేరుగా మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న రెండు ముఠాలను అరెస్టు చేసి రూ.8.55 లక్షల విలువైన 43 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సంగోజు విజయ్ భాస్కర్, పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన లంకా విజయ కుమార్ కలిసి ఇళ్లముందు పెట్టిన మోటారు సైకిళ్లను చోరీ చేశారు. నిందితులను అరెస్టు చేసి పలు ప్రాంతాల్లో చోరీ చేసిన 22 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3.68లక్షలు ఉంటుందని డిసీపీ చెప్పారు. గుణదలకు చెందిన కంచర్ల గోపినాథ్, చల్లమల్ల హేమంత్, చాతులూరి వసంత్, తాడిపత్రి రాజ్‌కుమార్, మామిడి శివ, పక్కి వినయ్ మరో బాలుడితో కలిసి మోటారు సైకిళ్లు చోరీ చేశారు. వీటిని ఉంగుటూరు మండలం వెల్దిపాడుకు చెందిన మెకానిక్ లామ్ నవీన్ ద్వారా విక్రయిస్తున్నట్టు గుర్తించి నిందితులతో పాటు మెకానిక్‌ను కూడా అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి రూ.4.87లక్షల విలువైన 21మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మహిళల అరెస్టు వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరు మహిళలను అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నం గ్రామానికి చెందిన నల్లబోతుల నాగమణి ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు తల్లి పుల్లమ్మతో కలిసి చోరీలు ప్రారంభించింది. గత నెల 18న బెంజిసర్కిల్ సమీపంలోని ఖజానా జ్యుయలరీ, లబ్బీపేటలోని మలబార్ జ్యుయలరీ దుకాణాల్లో నగలు చూపించే సేల్స్‌మేన్ ఆదమరిచి ఉన్న సమయంలో గిల్టు నగలు పెట్టి బంగారు నగలు చోరీ చేశారు. వీరిలో పుల్లమ్మ పరారీలో ఉండగా నాగమణిని అరెస్టు చేసి 40 గ్రాముల నగలు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో చిట్టినగర్ గూడేల రాము వీధికి చెందిన కర్రి గాయత్రిని అరెస్టు చేసి 96 గ్రాముల బంగారు నానుతాడు స్వాధీనం చేసుకున్నారు. బత్తుల నాగేశ్వరరావు ఇంట్లో పని చేసే గాయత్రి గత నెల 28న యజమానురాలు అనారోగ్యంతో ఉండటాన్ని గమనించి నానుతాడు చోరీ చేసింది. జేబు దొంగల అరెస్టు రద్దీ ప్రాంతాల్లో జేబు చోరీలకు పాల్పడుతున్న కేసులో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కోండ్రుపోలుకు చెందిన ఎరసాని సుబ్బారావు, ఎరసాని అంతర్వేది, కుంభా శ్రీను, చినమర్తి శ్రీనును అరెస్టు చేశారు. గత నెల 4, 22 తేదీల్లో నిందితులు ఉయ్యూరులో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో జేబు దొంగతనాలు చేసినట్టు చెప్పారు. వీరి నుంచి రూ.20వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గట్టి నిఘా పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు అన్ని రకాల చోరీలపై గట్టి నిఘా పెట్టినట్టు డీసీపీ కాళిదాస్ తెలిపారు. పలు కేసుల్లో నిఘా పెట్టి నిందితుల అరెస్టుతో పాటు భారీగా సొత్తు స్వాధీనం చేసుకున్న సీసీఎస్ పోలీసులను సీపీ అభినందించారని, రివార్డులు కూడా అందజేయనున్నట్లు డీసీపీ చెప్పారు. -
సిండికేట్లదే గెలుపు
- 328 మద్యం షాపులకు లాటరీ - అనుకున్నది సాధించిన సిండికేట్లు - చేయి కలిపిన రియల్టర్లు, అధికారులు? - ఆందోళన చేసిన మహిళలు అరెస్ట్ సాక్షి, విశాఖపట్నం: ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించిన పాలసీ ప్రకారం సోమవారం మద్యం షాపుల కేటాయింపు జరిగింది. ఉదయం 10 గంటలకే ప్రారంభమైన లాటరీ ప్రక్రియ తెల్లవారు జాము వరకూ సాగింది. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్,జాయింట్ కలెక్టర్ జె.నివాస్, ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎక్సైజ్ డీసీ ఎం.సత్యనారాయణలు కైలాసపురంలోని డాడ్ లేబర్ బోర్డ్ కళ్యాణమండపంలో మద్యం దుకాణాలకు లాటరీ తీశారు. ప్రభుత్వ తీరకు నిరసనగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోనే గతేడాది మద్యం అమ్మకాల్లో రికార్డు సృష్టించిన విశాఖ జిల్లా కేటాయింపుల్లోనూ అదే ఒరవడి కొనసాగించింది. 406 మద్యం షాపుల్లో 39 షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించి మిగతా 367 షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే 328 షాపులకు 5835 దరఖాస్తులు దాఖలయ్యాయి. 39 షాపులకు ఒక్క దరఖాస్తు దాఖలు కాలేదు. దీంతో 328 షాపులకు సోమవారం కేటాయింపు ప్రక్రియ ప్రారంభించారు. రాత్రి 8 గంటల ప్రాంతానికి దాదాపు 200 షాపులకు లాటరీ తీశారు. అన్ని షాపులకు లాటరీ తీయడానికి అర్ధరాత్రి దాటిపోతుందని డీసీ వెల్లడించారు. రెడ్డి సీతారాం అనే వ్యక్తి గెజిట్ నెం.118,119లకు సింగిల్ టెంటర్లు వేశారు. లాటరీకి అటెండ్ కాకపోవడంతో అతనికి ఒక షాపు మాత్రమే కేటాయిస్తామని కలెక్టర్ ప్రకటించారు. సిండికేట్లు, రియల్టర్లదే హవా: మద్యం షాపులకు దరఖాస్తు చేయడం దగ్గర్నుంచి లాటరీ పూర్తయ్యే వరకూ సిండికేట్లు చక్రం తిప్పారు. అనుమానం రాకుండా వారు అనుకున్నది చేయగలిగారు. సింగిల్ టెండర్లు, డబుల్ టెండర్లు, మూడు నుంచి 10 టెండర్లు..ఇలా వచ్చిన దరఖాస్తులన్నీ సిండికేట్ల మాయాజాలమేనంటే నమ్మకతప్పదు. 59 షాపులకు సింగిల్ దరఖాస్తులు వచ్చాయి. దాదాపుగా ఇవన్నీ సిండికేట్ల కనుసన్నల్లో వచ్చినవేనంటున్నారు. గాజువాకలో 30, అనకాపల్లిలో 16, విశాఖలో 13 షాసులు సిండికేట్ల చేజిక్కిట్లేనని భావించవచ్చు. మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల మందగించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి కొందరు రియల్టర్లు, ఉన్నతాధికారులు తమ పెట్టుబడులను మద్యం దుకాణాలవైపు మళ్లించినట్లు తెలుస్తోంది. పలువురు ఉన్నతాధికారులు తాము వెనకుండి బినామీలతో దరఖాస్తులు చేయించినట్లు సమాచారం. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. గ్రామీణ, ఏజెన్సీ పరిధి లోని షాపులకోసం 4665 దరఖాస్తులు రాగా కేవలం సిటీ పరిధిలోని 60షాపులకు 1170దరఖాస్తులు రావడంతో ఆ విషయం స్పష్టమవుతోంది. సిటీని ఆనుకుని ఉన్న గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లోని షాపులకు ఇవే డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వామే వత్తాసు పలికితే ఎలా? ఐద్యా, ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేపట్టారు. మంచినీళ్లు ఇవ్వండి బాబూ, మద్యం వద్దు అంటూ నినాదాలు చేశారు. షాపింగ్ మాల్స్‌లో మద్యం అమ్మకాలు ఏంటని నిలదీశారు.డిఎల్‌బి కళ్యాణమండపంలోకి దూసుకువెళ్లి లాటరీ ప్రక్రియను అడ్డుకోవాలని ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని వారించి వెనక్కు పంపాలని చూశారు. కుదరకపోవడంతో అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. డిఎల్‌బీకి కిలో మీటరు దూరంలోనే మహిళలను అడ్డుకున్న పోలీసులు వారిని నిర్ధాక్షిణ్యంగా ఈడ్చిపాడేశారు. -
వ్యభిచార గృహంపై దాడి, యువతుల అరెస్ట్
గుంటూరు : గుంటూరు నగరంలో వ్యభిచారం చాపకింద నీరులా మారింది. ఇటీవలే పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నగరంలోని రామిరెడ్డివారి తోటలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్లో రహస్యంగా నిర్మించిన గదిలో దాగిన యువతులను అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ గంగాధరమ్ కథనం ప్రకారం... పలు ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంట్లో పోలీసులు గత రాత్రి తనిఖీలు చేశారు. అయితే ఆ సమయంలో ఇంట్లో యువతులెవరూ కనిపించకపోవటంతో అక్కడి పరిసరాల్ని పరిశీలించారు. అయితే గదిలోని గ్యాస్ స్టౌవ్ బండ వద్ద ఏర్పాటు చేసిన ఓ బండను తొలగించగా భూగర్భంలో రహస్యంగా నిర్మించిన గదిలో దాగిన నలుగురు యువతలు కనిపించారు. వారిని విచారించగా అన్నపురెడ్డి సుమంత్ అనే వ్యక్తి...ఈ యువతులను వివిధ ప్రాంతాల నుంచి రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడి అయ్యింది. గతంలోనూ సుమంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, రిమాండ్ పూర్తయి బయటకు వచ్చిన తర్వాత అతడు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సుమంత్ పరారీలో ఉండగా, యువతులను ఆధార్ హోమ్‌కు తరలించారు. -
పసికందు కిడ్నాప్, మహిళల అరెస్ట్
-
పసికందు కిడ్నాప్, మహిళల అరెస్ట్
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఓ పసికందును కిడ్నాప్ చేసి ఇద్దరు మహిళలు అడ్డంగా దొరికిపోయారు. స్థానిక జయ నర్సింగ్‌హోమ్‌లో వారం రోజుల పసికందును ఇద్దరు మహిళలు అపహరించుకు వెళ్లారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించటంతో వారు రంగంలోకి దిగారు. పోలీసుల అప్రమత్తతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని, పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు.