
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీసీఎస్, రెండో నగర్ ఎస్సైలు షరీఫ్, శ్రీహరిబాబు
నెల్లూరు(మినీబైపాస్): తక్కువ ధరకు బంగారం ఇస్తామని అని చెప్పి రోల్డ్‌గోల్డ్ అంటగంటే ఇద్దరు మహిళలను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీసీఎస్, రెండోనగర్ ఎస్సైలు షరీఫ్, శ్రీహరిబాబు బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బోగోలు మండలం కోవూరుపల్లికి చెందిన బచ్చు కోటీశ్వరమ్మ, కర్రెద్దుల దుర్గమ్మ తల్లికూతుళ్లు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద కోవూరు మండలం వేగురుకు చెందిన దామెర్ల వజ్రమ్మ, పడుగుపాడుకు చెందిన సిరం రమణమ్మ, రావూరుకు చెందిన చెముడుగుంట రచనలకు తల్లి కూతుళ్లు తక్కువ ధరకు బంగారం ఇస్తామని ఆశ చూపి పిచ్చి నగలు చేతిలో పెట్టారు. పోలీసులు వస్తున్నారని భయపెట్టి వీరి వద్ద నుంచి రూ.3 లక్షలు తీసుకుని ఉడాయించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు.. సీసీఎస్ డీఎస్పీ ఎం.బాలసుందరరావు ఆధ్వర్యంలో సీఐ బాజీజాన్‌సైదా, ఎస్సై షరీఫ్, ‡రెండో నగర ఎస్సై వి.శ్రీహరిబాబు తమ సిబ్బందితో నిందితులు బుధవారం ఉదయం తూర్పు రైల్వేస్టేషన్ వద్ద ఉన్నారన్న సమాచారంతో వెళ్లి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment