కివీస్ చేతిలో విండీస్ చిత్తు
టాంటన్: మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 43 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. కైషోనా నైట్ (41) టాప్ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లీ కాస్పెరెక్ (10–6–17–3) అద్భుత బౌలింగ్‌తో అదరొట్టింది. అనంతరం న్యూజిలాండ్ 18.2 ఓవర్లలోనే 2 వికెట్లకు 151 పరుగులు సాధించింది. దూకుడుగా ఆడిన రాచెల్ ప్రీస్ట్ (55 బంతుల్లో 90; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) కివీస్‌ను గెలిపించింది.